గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

3, ఫిబ్రవరి 2016, బుధవారం

శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య కళాశాల, తిరుపతిలో సత్కృతి, నా ప్రతిస్పందన.

జైశ్రీరామ్.
ఆర్యులారా! తిరుపతి శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య కళాశాల, తిరుపతి వారు 
అవ్యాజానురాగంతో నన్ను తే.29-01-2016 న  సన్మానించిరి. వారు చేసిన సత్కృతికి నా ప్రతిస్పందనను నేను అక్షర రూపమున వారికి  తెలియఁజేసితిని. 
ఈ కార్యక్రమమును ఏర్పాటు చేసి నాపై అమితమైన గౌరవమును నిలిపిన 
కళాశాల సంస్కృత శాఖాధ్యక్షులైన అవధాని డా.మాడుగుల అనిల్ కుమార్ గారికి, 
సహృదయులైన ఉపన్యాసక వర్గానికి, ఇతర ఆహుతులందరికీ 
నా నమోవాకములు.
వారి సన్మానమునకు నా ప్రతిస్పందన.
     శ్రీరస్తు     
శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య కళాశాల, తిరుపతిలో అవ్యాజానురాగముతో నన్ను సత్కరించిన, విద్యార్థినీ విద్యార్థులకు ఆశీస్సులు తెలియఁ జేయుచు, 
అధ్యాపక బృందమునకు, 
మీ అభిమాన పాత్రుఁడు చింతా రామకృష్ణా రావు తెలియఁ జేసుకొనుచున్న 
కృతజ్ఞతాభివందనములు. 
పూజ్య మహోదయులారా! మీకందరికీ నా హృదయ పూర్వక నమస్సులు. 
మీ ఆదరాభిమానములకు కృతజ్ఞతలు.

శా. శ్రీవాణీ కరుణా కటాక్షములచే శ్రీవారి శ్రీ సన్నిధిన్
సేవా భాగ్యము, దర్శనంబు, గుణ సచ్ఛీలప్రభా మూర్తులన్, 
దైవాంశోద్భవ సంస్కృతాంధ్ర నిధులన్, దర్శించు భాగ్యంబు, నే
నీవేళం గని పొందుచుంటి. మహితన్ హేమాదృలీరందరున్. 1.

చ. అసదృశ పాండితీ గరిమనందరుబోధకులొప్పియుండి, స
ద్విషయ వివేచనాగరిమ వేల్పులతో సరి తూగుచుండియున్,
సుసర వచో విలాసమున శోభిలఁ జేసితిరయ్య నన్నుమీ
రసదృశ రీతితో, సుజన రంజన సత్కళ  మీ వశంబయెన్. 2.

"శ్రీచక్ర బంధ తేటగీత్య"వసాన  "చంపక" - "బహువిధ కంద" - "గీత"  గర్భ  సీసము.
గుణ గణనంబులో గణుతిఁ గొన్న నయోజ్వ - లక్రాంతి మీరు నాన్ డంబమలర.
గుణ గణులై మహిన్, వినయ గుంభన సద్బ - హువ్రీహి మీరవన్ హొయలు మీర,
ముని జనులైరి, సద్  ప్రణుతి పూజ్య నరాళి - కి బ్రహ్మ లైరి, సాకిరి సుజనుల.
ధన ఘనులైరి సత్ ప్రణవ వాగ్ధన సార్థ - క  బ్రౌణ్య  మీరెగా! జ్ఞానులార! 
శ్రీచక్ర బంధతేటగీతి. 
రమ్య రమణుని శ్రీపద రాజిపై న - నిలిపి చిత్తము శ్రీ దేవినే తలంచ
చిత్ర కవినంచు శ్రీభావ చిన్మనోజ్ఞు - రహిని జూచిరి నన్గాంచి ప్రాజ్ఞు లార. 3.

చ. ధనమును ఖర్చు చేసి బహుధా విలసత్కృత సత్కృతీ విధిన్
ఘనులు గణింపఁ జేసిరిల గౌరవమిచ్చుచు నాకు. మీ మహ
ద్వినుత విశేష సత్కృతికి వేల్పులు సాక్షిగ సంతసించితిన్.
వినయముతోడ తెల్పెదను, విజ్ఞులు మీకభివందనావళుల్. 4.

ఉ. మంగళ మౌత శ్రీహరికి. మంగళముల్ మన మంగ తల్లికిన్.
మంగళమౌత భారతికి, మంగళముల్ కవి పండితాళికిన్.
మంగళమౌత శిష్యులకు, మంగళముల్ పుర సత్ ప్రజాళికిన్,
మంగళమౌత మాడ్గులకు, మాన్య మహోదయులైన మీకునున్. 5. 
స్వస్తి.
భాగ్యనగరము.
తేదీ. ౨౯-౦౧-౨౦౧౬.
జైహింద్.
Print this post

15 comments:

కంది శంకరయ్య చెప్పారు...

చింతా రామకృష్ణారావు గారూ,
చిత్రకవితా భారతికి ఎత్తిన నీరాజనం మీకు జరిగిన సన్మానం. సన్మాన పద్యాలు, వాటికి సమాధానంగా మీరు చెప్పిన గర్భకవిత్వం, బంధకవిత్వం మీ ప్రజ్ఞాపాటవాలకు నిదర్శనాలు. చాల సంతోషం!

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

సహృదయా! శంకరార్యా! మీ అభిమాన పూర్వక హృదయావిష్కరణకు ధన్యవాదములు.

A.Satyanarayana Reddy చెప్పారు...

గురువర్యులకు అభినందనలు.

A.Satyanarayana Reddy చెప్పారు...

గురువర్యులకు అభినందనలు.

అజ్ఞాత చెప్పారు...

శ్రీమాన్ గన్నవరపు నరసింహమూర్తి మిత్రులు ఇలా అన్నారు.
శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య కళాశాల విద్యార్థులకు మనఃపూర్వకాభినందనలు. చిత్రకవితా విశేష ప్రతిభావంతులు మాన్యమిత్రులు శ్రీ చింతా రామకృష్ణారావు గారికి హృదయపూర్వకాభినందనలు.

అజ్ఞాత చెప్పారు...

dear ramakrishna,
namaskarms
congratulations - nuvvu chala adrustavantuduvi.
nee
nemani abhiramudu.

అజ్ఞాత చెప్పారు...

చింతా వారికి
వందనాలు.

మీకు జరిగిన సన్మానానికి అభినందనలు.
మీ స్పందన అద్భతంగా ఉంది.

భవదీయుడు
రమణ బాలాంత్రపు

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
చాలా సంతోషము గానున్నది .అభినందన మందారములు

కందుల వర ప్రసాద్ చెప్పారు...

శ్రీ చింతా రామ కృష్ణారావు గురుదేవులకు పాదాభివందనములు.

ముందుగా శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య కళాశాల వారికి మనఃపూర్వకాభినందనలు. చిత్రకవితా విశేష ప్రతిభావంతులు మాన్య శ్రీ చింతా రామకృష్ణారావు గారికి హృదయపూర్వకాభినందనలు.

అజ్ఞాత చెప్పారు...

Ayya, Gananeeyamy na padyalu, Gananeeyamyna Sahitya Seva , Kavitha amrutamyna hridayam, Mimmalni Evidham ga prasamsinchali? Adbhutam., Mee sthayiki9 memu cherukovalante, ee janma saripodemo?Tirupathi lo meeku jarigina
sanmanam. maa vanti Bhasha priylulaka

amitha myna anandanni kaligistondi.abhinandanalu.. Kavi Mitra V.V.Satya Prasd.

అజ్ఞాత చెప్పారు...

శ్రీ చింతా రామ కృష్ణారావు గురుదేవులకు పాదాభివందనములతో...

మీ దయవల్ల బాగున్నాను గురుదేవ ! వ్యస్తుడనై పద్య రచనకు దూరమైతి నండి ..

శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య కళాశాల వారికి మనఃపూర్వకాభినందనలు. చిత్రకవితా విశేష ప్రతిభావంతులు మాన్య శ్రీ చింతా రామకృష్ణారావు గారికి హృదయపూర్వకాభినందనలు.

గర్భ చిత్ర కవితలకు గౌరవమ్ము
రామ కృష్ణ కవికి మేటి రత్నమాల
చింత వంశాబ్ది చంద్రమా! సేతు మీకు
వినయమలరఁగ ప్రణతులన్ విరివి గాను

మీ శిష్యపరమాణువు
వరప్రసాదు

అజ్ఞాత చెప్పారు...

మా రామకృష్ణులవారు సదా వందనీయులు. వారికి సన్మానము మాకు అత్యంత ఆనంద దాయకము. వారి మనసంతా నవనీతము,
వారికి మా నమస్సుమాంజలి.
రామో

అజ్ఞాత చెప్పారు...

అభినందనలు మిత్రమా
పంతుల జోగారావు.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

మిత్రులు డా గన్నవరపు నరసింహ మూర్తిగారికి,
శ్రీ నేమామి అభిరాముఁడు గారికి,
శ్రీ బాలాంత్రపు రమణ గారికి,
శ్రీమతి రాజేశ్వరక్కయ్యకు,
శ్రీకందుల వర ప్రసాద్,
శ్రీమాన్ వివి సత్య ప్రసాద్ గారికి,
శ్రీమాన్ రామ మోహన్ గారికి,
శ్రీమాన్ పంతుల జోగారావు గారికి.
నా ధన్యవాదములు.

P.suryanarayana rao చెప్పారు...

సోదరా!
జన్మ ధన్యమయ్యె జదువగ మీవాణి
మాటలేల పొగడ మాన్య చరిత!
మీదు మైత్రి మాకు మీరిన ధనమగు
పంచు చుండుమయ్య పరమ యశుడ!

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.