గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

6, ఫిబ్రవరి 2016, శనివారం

ఋగ్వేదము మండలము 1.

జైశ్రీరామ్.
 జింకపై స్వారీ చేయుచున్న వాయుదేవుఁడు.
ఋగ్వేదం యొక్కమొదటి మండల పరిచ్ఛేదం లో 191 శ్లోకాలు ఉన్నాయి. విదేశీయుల ప్రకారము 3,500 సం.లు పూర్వం ఈ ఋక్సంహిత రచింప బడినదని అభిప్రాయము. కానీ భారతీయుల సంప్రదాయము అనుసరించి, నిత్యము, సత్యము అయిన ఈ శబ్దరాశి మంత్రద్రష్ట లయిన మహర్షులకు దృగ్గోచరమయినది మాత్రమే కాని వారు మంత్ర రచయితలుగా రచించినది మాత్రము కాదు.
ఈ ఋక్సంహిత అగ్నిమీడే పురోహితం అను అగ్ని సూక్తం తో ప్రారంభ మవుతుంది మరియు సమానీవ ఆకూతి: అనే సంజ్ఞాన మంత్రముతో పూర్తి అవుతుంది. మిగిలినవి స్తుతి ప్రధానంగా ఆగ్ని మరియు ఇంద్రుడు చిరునామాలు ప్రధానముగా కలిగి ఉంటాయి.
ఒక్కొక్క ఋషి దర్శించిన సూక్తాలను ఒక్క సముదాయముగా మొదటి మండలములో 14 సూక్త సముదాయములు కూర్చబడ్డాయి. ఈ సూక్త సముదాయములలో సూక్తాలను అమర్చడం కూడా ఆయా సూక్తాల్లో స్తుతింపబడే దేవతలననుసరించే చేయబడింది.
మొదటి సూక్త సముదాయము నందు 11 సూక్తాలు ఉన్నాయి. 
మొదటి సూక్తం అగ్నిని, 
రెండవ సూక్తం వాయువు ని, 
మూడవది అశ్వినీదేవతలును, 
నాలుగవ సూక్తం నుండి 11వ సూక్తం వరకు ఇంద్రుడులను స్తుతిస్తున్నాయి.
అందరికీ వందనములు.
నమో మహద్భ్యో నమో అర్భకేభ్యో నమో యువభ్యో నమ ఆశినేభ్యః |
యజామ దేవాన్ యది శక్నవామ మా జ్యాయసః శంసమ్ ఆ వృక్షి దేవాః || (1-027-13)
భావము. పెద్దలకు, పిన్నలకు, యువకులకు, వృద్ధులకు నమస్కారము.యజ్ఞములచేత దేవతలకు ప్రీతి కలిగించి నప్పటికీ,పెద్దలకు, మనకన్నా గొప్పవారికి గౌరవాన్ని ఇవ్వడంలో మాత్రము ఏమరుపాటు లేకుండా ఉందాం.
అందరికీ ఆహ్వానము
సుగః పన్థా అనృక్షర ఆదిత్యాస ఋతం యతే |
నాత్రావఖాదో అస్తి వః || (1-041-04 )
భావము. ఈశ్వరుని అన్వేషించడానికి ముళ్ళు, ఎత్తుపల్లాలు లేని రాజమార్గం ఓ! అన్వేషులారా ఈ వైదికవిజ్ఞాన మార్గములోకి రండి.
అందరికీ తండ్రి
ఉద్ యంయమీతి సవితేవ బాహూ ఉభే సిచౌ యతతే భీమ ఋఞ్జన్ |
ఉచ్ ఛుక్రమ్ అత్కమ్ అజతే సిమస్మాన్ నవా మాటృభ్యో వసనా జహాతి || (1-095-07 )
భావము. ఈశ్వరుడు భూలోకద్యులోకాలలో ఉండే సమస్త ప్రాణులను తండ్రిలా ఉద్దరించడానికి రెండు చేతులనూ చాచుతున్నాడు ఈ రెండు లోకాలను కాపాడటమే అతని ధ్యేయం, ఎవరు ఎలా భావిస్తే అతను అలాగే కనిపిస్తాడు.
కాలచక్రం
ద్వాదశారం నహి తజ్ జరాయ వర్వర్తి చక్రమ్ పరి ద్యామ్ ఋతస్య |
ఆ పుత్రా అగ్నే మిథునాసో అత్ర సప్త శతాని వింశతిశ్ చ తస్థుః || (1-164-11)
భావము. కాలమనే నిత్యమైన చక్రానికి పన్నెండు ఆకులు (నెలలు) ఉన్నాయి.నిరంతరం తిరుగుతూ ఉన్న ఈ చక్రానికిఏడువందలఇరవై మంది కుమారులు
(360 (పగళ్ళు) + 360 (రాత్రులు)=720) ఉన్నారు.
దేవుడు - జీవుడు
ద్వా సుపర్ణా సయుజా సఖాయా సమానం వృక్షమ్ పరి షస్వజాతే |
తయోర్ అన్యః పిప్పలం స్వాద్వ్ అత్త్య్ అనశ్నన్న్ అన్యో అభి చాకశీతి || (1-164-20)
భావము. రెండు పక్షులు (జీవాత్మ మరియు పరమాత్మ) ఎల్లప్పుడూ ప్రేమగా ఒక చోటనే ఒక చెట్టు (దేహము)నే ఆశ్రయించి నివశిస్తున్నాయి. ఒకటి ఆ చెట్టున కాసిన ఫలాన్ని (కర్మఫలాన్ని) ఆస్వాదిస్తే మరియొకటి (పరమాత్మ) తినకుండానే (కర్మఫలం అనుభవము లేకుండానే) స్వప్రకాశమై భాసిస్తున్నద.
ఆత్మతత్వం
ఋచో అక్షరే పరమే వ్యోమన్ యస్మిన్ దేవా అధి విశ్వే నిషేదుః |
యస్ తన్ న వేద కిమ్ ఋచా కరిష్యతి య ఇత్ తద్ విదుస్ త ఇమే సమ్ ఆసతే || (1-164-39 )
భావము. ఆత్మతత్వం నుంచే విశ్వంలోని దేవతలు, సమస్తము పుడుతున్నారు. ఆత్మతత్వం తెలియని వారికి ఋగ్వేదం వల్ల ప్రయోజనమేమి ? ఆత్మతత్వం తెలిసిన వారికే నిజమైన ఆనందం.
శృతి
గౌరీర్ మిమాయ సలిలాని తక్షత్య్ ఏకపదీ ద్విపదీ సా చతుష్పదీ |
అష్టాపదీ నవపదీ బభూవుషీ సహస్రాక్షరా పరమే వ్యోమన్ || (1-164-41)
తస్యాః సముద్రా అధి వి క్షరన్తి తేన జీవన్తి ప్రదిశశ్ చతస్రః |
తతః క్షరత్య్ అక్షరం తద్ విశ్వమ్ ఉప జీవతి || (1-164-42)
భావము. ఈశ్వరుడు అన్ని చోట్ల వ్యాపించినట్లు ఒకటి మొదలు అనంతములైన శబ్దాలున్న శ్రుతినించే సమస్త పవిత్ర గ్రంథాలుద్భవించాయి. శృతివల్లనే నాలుగు దిక్కులు ప్రకాశవంతమై సమస్తజగత్తుకు కారణభూతుడైన ఈశ్వరుడు ఏర్పడుతున్నాడు.ఈ జగత్తు అంతా శ్రుతివల్లననే జీవిస్తున్నది.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
వాయు సూక్తమును చక్కగా వివరించి నందులకు ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.