గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

6, అక్టోబర్ 2014, సోమవారం

సాహితీ ప్రియులైన మీకు ఒక శుభవార్త.

జైశ్రీరామ్.
ఆర్యులారా! 
సాహితీ ప్రియులైన మీకు ఒక శుభవార్త.
హైద్రాబాద్ అవధాన సరస్వతి పీఠాధిపతి 
బ్రహ్మశ్రీ డాక్టర్ మాడుగుల నాగఫణిశర్మ ఆధ్వర్యంలో 
నవంబర్ 2 నుంచి 9 వరకు 
ఢిల్లీలో 
అవధాన రాజధాని పేరుతో 
అవధాన ప్రక్రియ నిర్వహించబడుతోంది. 
ఈ అవధానం సంస్కృతం, తెలుగు, హిందీ భాషల్లో 
ఏకకాలంలో నిర్వహించబడుతుంది. 
పృచ్ఛకులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయా భాషల్లో సమాధానం ఇవ్వడం జరుగుతుంది. 
దత్తపది, సమస్యాపూరణం, నృత్యపది, స్వరపది అంశాలతో పాటు 
ఈప్రక్రియలో నూతనంగా చిత్రపది, క్రీడాపదిని ప్రవేశపెట్టుచున్నారు. 
చిత్రాల ద్వారా, క్రీడా అంశాల ద్వారా అవధానం చేయడమనే నూతన ప్రక్రియను 
అవధాని నాగఫణిశర్మ చేయనున్నారు.  
ఆసక్తి కలవారు అవకాశమున్నవారు ఈ సదవకాశమును తప్పక వినియోగించుకొనేటందుకు వీలుగా ఈ వర్తమానం మీ ముందుంచినాను.
ఈ కార్యక్రమం అవధానిగారి మేధా సంపత్తికి గీటురాయి కాగలదు. యావత్ భారతీయులకు మన ఆంధ్రభాష, సంస్కృతి, సంప్రదాయము, ఆంధ్ర కవులకుండే ప్రతిభావ్యుత్పత్తులు స్పష్టమగునని చెప్పుట అతిశయోక్తి కానేరదు.
ఈ కార్యక్రమము నిర్విఘ్నముగా శుభప్రదముగా నిర్వహింపబడుగాక.
జైహింద్.
Print this post

2 comments:

అజ్ఞాత చెప్పారు...

కార్యక్రమంలో పాల్గొనాలంటే ఎవరిని సంప్రదించాలి. దయచేసి వివరాలు తెలుపగలరు

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

అజ్ఞాత గారూ! ఈ కార్యక్రమ వివరాల కొఱకు మీరు శ్రీమాన్ సత్యప్రసాద్ గార్ని 9849592738 అనే సంఖ్య గల చరవాణి ద్వారా సంప్రదించవచ్చును.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.