జైశ్రీరామ్.
శ్లో. ఉదయే సవితా రక్తో రక్తశ్చాస్తమయే తథాసంపత్తే చ విపత్తే చ మహతామేక రూపతా.
గీ. మహితు లొకరీతినే యుంద్రు మహిని తాము
సంపదలలోన యాపన్న సమయమునను.
సూర్యుఁడుదయాస్తమయములఁ జూ డ నెఱుపు
వర్ణమునె యొప్పుచుండును భ్రమణమందు.
భావము. సూర్యుడు ఉదయించే సమయంలోనూ ఎఱ్ఱగానే ఉంటాడు. అస్తమయ సమయంలోనూ ఎఱ్ఱగానే ఉంటాడు. అలాగే మహాత్ములు సంపదలలోనూ, ఆపదలలోనూ ఒకే విధంగా ఉంటారు.
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.