గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

23, అక్టోబర్ 2014, గురువారం

ఈ రోజు పరమోత్కృష్టమైన దీపావళి పండుగ సందర్భముగా ఆంధ్రామృత పాఠకులకు శుభాకాంక్షలు.

జైశ్రీరామ్
ఆర్యులారా!
ఈ రోజు పరమోత్కృష్టమైన దీపావళి పండుగ సందర్భముగా ఆంధ్రామృత పాఠకులకు శుభాకాంక్షలు. 
జ్ఞానజ్యోతులు వెల్గు గాత మదులన్. కల్యాణ భాగ్యోల్లసత్
స్థానంబుల్ మిము పొందుగాత! ధన్యాత్ములెల్లన్ మిమున్
ప్రాణంబట్టుల చూచి కొల్చుత సదా. దీపావళిన్ వెల్గు సు
జ్ఞానోద్భాసిత లక్ష్మి మిమ్ము కనుతన్, కాంక్షల్ తీర్చుతన్ బ్రేమతో.
జైహింద్.
Print this post

1 comments:

కంది శంకరయ్య చెప్పారు...

చింతా వారూ,
మీకు, మీ కుటుంబ సభ్యులకు, మీ ఆంధ్రామృతాన్ని ఆస్వాదించే బ్లాగు మిత్రులకు దీపావళి పర్వదిన శుభాకాంక్షలు!

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.