గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

28, ఫిబ్రవరి 2014, శుక్రవారం

ఆత్మాపరాధ వృక్షస్య ఫలాన్యేతాని - మేలిమి బంగారం మన సంస్కృతి 160.

జైశ్రీరాం.
శ్లో. ఆత్మాపరాధ వృక్షస్య ఫలాన్యేతాని దేహినాం
దారిద్ర్య దుఃఖ రోగాణి బంధన వ్యసనాని చ.
గీ. దేహికపరాధతరులబ్ధ దీన ఫలము
లిలను దారిద్ర్య దుఃఖములేల్చు రోగ
బంధనములువ్యసనములుబాధఁ గొలుపు.
దేహి యపరాధ దూరుడై తిరుగ వలయు.
భావము. జీవులయొక్క "స్వయం కృతాపరాధం" అనే వృక్షానికి - దారిద్ర్యం,దుఃఖం , రోగాలు , బంధన ప్రాప్తి , వ్యసనాలు అనేవి ఫలాలు.

జైహింద్
Print this post

2 comments:

కందుల వర ప్రసాద్ చెప్పారు...

శ్రీ చింతా రామ కృష్ణా రావు గురుదేవులకు పాదాభి వందనములతో ...
చాలా మంచి విషయము గురువుగారు, జనులు స్వయం కృతాపరాధం తోడన్ని రోగములు "కొని" దెచ్చు కుంటున్నారు. ఆపై వ్యసనములు సరేసరి..

మన విశిష్ట సంస్కృతిలోని మర్మములు తెలియ జేయు చున్న మీకు ధన్యవాద శతము.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
అవును తెలిసి తెలిసి చేసే పనులకు నిష్కృతి లేదు .చేతులు కాలాక ఆకులు పట్టు కోవడమే . చక్కని విషయాన్ని చెప్పారు ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.