గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

28, డిసెంబర్ 2011, బుధవారం

భగవద్గీతను సమర్ధిస్తూ రష్యా కోర్టు తీర్పు

శ్రీమద్భగవద్గీతను నిషేధించాలంటూ రష్యా  కోర్టులో కొందరు రష్యన్లు వేసిన వ్యాజ్యాన్ని ఆ కోర్టు కొట్టివేసినది. న్యాయాన్ని నిర్ద్వంద్వంగా ప్రకటించిన రష్యా న్యాయస్థానాన్ని ఆంధ్రామృతం  అభినందిస్తోంది. 
ధర్మో రక్షతి రక్షితః అన్నదానికి ఈ తీర్పే  నిదర్సనం. 
సృష్టి కర్త ఐన ఆ శ్రీ కృష్ణ పరమాత్మ ఏ విధమైన పరమ ప్రయోజన్నాని ఉద్దేసించి గీత ఉపదేశించాడో ఆ పరమ ప్రయోజనం తప్పక నెరవేరుతుంది. దీనికి ఎందరు అడ్డు తగులుదామని ప్రయత్నించినా అది వ్యర్ధ   ప్రయత్నమే ఔతుంది  అని ఈ తీర్పు వ్యక్తం చేసింది. 
ఈ సందర్భంగా గీతామృత పాన లోలూర ఆనందానికి అవధులు ఉండవు. ఈ తీర్పు ద్వారా అట్టి ఆనందాన్ని అందింఛిన  
ఆ పరమాత్మ లీల అమోఘము.  
ఈ సందర్భంగా ఇట్టి తీర్పును ఆకాంక్షించిన వారందరికి హృదయ పూర్వక అభినందనలు.  
జై శ్రీరాం 
జై హింద్. 
Print this post

9 comments:

వసంతం.నెట్ చెప్పారు...

మీతో 100% ఏకీభవిస్తున్నాము.సైబీరియా న్యాయస్థానం సరిఅయిన తీర్పు ఇచ్చి తనను తను గౌరవించుకుంది !!!

అజ్ఞాత చెప్పారు...

ఇది అందరు భారతీయులు స్వాగతించాల్సిన విషయం.భారత జాతికి ఎంతో ముఖ్య మయిన గీతను వారు గౌరవించక తప్పదుగ, అయిన గీత చదివినందువలన నాకు తెలిసి ఎవరు చెడి పోలేదు. అంతే కాక సంస్కార వంతులయ్యారు. kiran

subbarao చెప్పారు...

గీత యనిననే డు భగవ ద్గీత సుమ్ము
గీత ప్రజలను శాసించు ,నూత నిచ్చు
మాన వత్వంబు నేర్పును మనిషి జేయు
గీత మార్చును మానవ గీత నెపుడు

Saahitya Abhimaani చెప్పారు...

మంచి పని జరిగింది. సంతోషం.

కంది శంకరయ్య చెప్పారు...

భగవద్గీతా ప్రాశ
శ్త్య గురుత్వము లెంచి భక్తి తాత్పర్యములన్
దగఁ దద్బోధామృత సా
ర గురుజ్ఞానాబ్ధి మునిఁగి రక్షణఁ గందున్.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

రాజేశ్వరి నేదునూరి blogger.bounces.google.com ద్వారా కి నాకు
వివరాలను చూపించు 10:56 సా (10 గంటల క్రితం)
మీ "భగవద్గీతను సమర్ధిస్తూ రష్యా కోర్టు తీర్పు" పోస్ట్‌పై రాజేశ్వరి నేదునూరి క్రొత్త వ్యాఖ్యను ఉంచారు:

చక్కని విషయాన్ని అందించిన చింతా వారికి అభినందనలు. భగవంతుని నమ్మిన వారు ఎన్నటికీ చెడి పోరు. అందరు ఆనందించ వలసిన విషయం. ధన్య వాదములు

Pandita Nemani చెప్పారు...

విజయోస్తు విజయోస్తు వేదాంత సారమా!
విజయోస్తు విజయోస్తు విజ్ఞానదీపమా!
విజయోస్తు విజయోస్తు గీతా సుగీతా!
విజయోస్తు విజయోస్తు మాతా! సుజాతా!

శ్రీపతిశాస్త్రి చెప్పారు...

గురువర్యులు శ్రీ చింతా రామక్రిష్ణారావుగారికి, శ్రీ కంది శంకరయ్యగారికి, శ్రీ పండిత నేమానిగారికి, కవులు,పండితులు,మిత్రులందరకు 2012 నూతన సంవత్సర శుభాకాంక్షలు.

శ్రీపతిశాస్త్రి చెప్పారు...

గురువర్యులు శ్రీ చింతా రామక్రిష్ణారావుగారికి, శ్రీ కంది శంకరయ్యగారికి, శ్రీ పండిత నేమానిగారికి, కవులు,పండితులు,మిత్రులందరకు 2012 నూతన సంవత్సర శుభాకాంక్షలు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.