గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, డిసెంబర్ 2011, మంగళవారం

డా.దేవగుప్తాపు చిత్ర కవితాభిరామము43. మయూర బంధము.

ప్రియ ఆంధ్రామృతాభిమాన పాఠక మిత్రులారా!
డా. దేవగుప్తాపు సూర్య గణపతి రావు గారు వ్రాసిన చిత్ర కవితలు అర్థవంతంగా ఔచిత్యంతో ఒప్పారుతూ ఉంటాయి.
ఈ చిత్ర కవి చేసిన మయూర   బంధము చూడండి.
చూచారుకదా!
ఇంతటి చక్కని రచనా పాటవం కల కవిగారికి అభినందనలు తెలియజేస్తున్నాను.
మీరూ చిత్రకవితాసక్తిని పొంది ప్రయత్నించి చిత్ర కవితను వెలయించి తెలుగును ఒక వెలుగు వెలిగించండి.
జైశ్రీరాం.
జైహింద్.
Print this post

4 comments:

శ్రీపతిశాస్త్రి చెప్పారు...

గురువుగారికి నమస్సులు.

మీరు పరిచయం చేస్తున్న ఈ బంధకవిత్వం లో ఏ ఛందస్సును అనుసరిస్తారో తెలియజేయ ప్రార్థన. వీలు కలిగిన వేళలో వీటిని అర్థం చేసుకొనే ప్రయత్నం చేస్తున్నాను. కానీ రసాయనికశాస్త్రము లోని రసాయనిక బంధాలు
(Chemical Bonding)వలె ఈ పద్యబంధాలూ అర్థం కావటం లేదు. గురువుగారు మన్నింప ప్రార్థన.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

శ్రీపతి శాస్త్రి గారూ!
ఈ బంధ కవితలన్నీ పరిచయం చేసిన తరువాత వాటిపై మనం సాధన చేద్దాము.
అప్పుడు వివరంగా చర్చించుకుంటూ వ్రాద్దాము.
మీ చిఱునామా మీరు నాకు ఇవ్వ గలిగితే మీకు ఆ పద్మ వ్యూహం పుస్తకం పంపేలాగ చేయ కలను.
శుభమస్తు.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు.
మయూరి చిత్రం ఎంత సొగసుగా ఉందో ? వారి చిరంజీవుల చిత్రీ కరణ అద్భుతం. చిత్రాలను మించిన కవిత్వం , వర్ణించ డానికి నా వంటి చిన్న కాలాలకి అంత బలం లేదు. వారందరూ బహు ప్రశంస నీయులు.

శ్రీపతిశాస్త్రి చెప్పారు...

ఆచార్యదేవోభవ

నా చిరునామ

P.Sreepathi Sastry,
20-3-131/A2,
Sivajyothi Nagar,
K.T.Bi-Pass Road,
TIRUPATI - 517501.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.