గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

24, అక్టోబర్ 2010, ఆదివారం

ఆ కాంత ఏ కాంతయో?

తమ 'శ్రవణానందం ' కావ్యంలో ఒక స్త్రీకి  తిరుపతి వేంకట కవులు  ఎంత విలువ కట్టారో చూడండి.
సీllపలుకొక్కటియే సేయు పదివందల వరాలు
వాలు చూపులు రెండు వేలు సేయు
నగవొక్కటియెసేయు నాల్గువేల వరాలు
విర్రవీగుట లారువేలు సేయు
పదమొక్కటియె సేయు పదివేల వరహాలు
లావణ్యమది యొక లక్ష సేయు
బలుసోయగమె సేయు పది లక్షల వరాలు
కులుకు నడక తీరు కోటి సేయు
ముద్దు గుల్కెడు నెమ్మోము మూడుకోట్లు
నాస సొబగెన్న డెబ్బది నాల్గు కోట్లు
నుదుటి సింధూర నామమ్ము నూరు కోట్లు
నీకు వెల జెప్ప శక్యమే నీలవేణి!!

అసాధారణ కవితావేశ సంపన్నులైన శ్రీ తిరుపతి వేంకట కవులిరువురూ ఒకే కాంతను ఇంతగా మెచ్చుకున్నారూ అంటే ఆ కాంత ఏ కాంతయో?
జైశ్రీరాం.
జైహింద్. Print this post

3 comments:

కొత్త పాళీ చెప్పారు...

వందల నించి కోట్లకి పడగెత్తించారు .. బాగు బాగు

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

" అవునూ ! ఇంతకీ ఆ కాంత ఏ కాంతయొ ? మరి మాకు తెలియాలి కదా ? "

అన్వేషి చెప్పారు...

అంతటి మహకవులు సైతము "వెలజెప్ప" శక్యము కాదన్నారు గనుక "వెలకాంత" కానేరదు, "కులకాంత" కాబోదు కాబట్టి ఆమె అయితే "కవితా" కాంత కావలె లేక "కీర్తి" కాంత కావలె.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.