గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

17, అక్టోబర్ 2010, ఆదివారం

చెప్పుకోండి చూద్దాం 38.

పాఠకులార! చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా? ఐతే ఇదిగో చూడండి ఈ క్రింది పద్యం.
ఆ.వెll
ఒడలి నిండ కన్నులుండు నింద్రుడు కాడు; 
కంఠమందు నలుపు. కాడు శివుడు !
ఫణుల బట్టి చంపు. పక్షీంద్రు డా? కాదు.
దీని భావ మేమి తెలిసి కొనుడు
.

చూచారు కదా! మరింకెందుకాలస్యం? చెప్పుకోండ్శి చూద్దాం?
జై శ్రీరామ్.
జైహింద్. Print this post

4 comments:

జ్యోతి చెప్పారు...

మయూరం కదా? అవునూ మీరేంటి ఈ బొమ్మ పెట్టారు. దానికి ఈ టపాకు సంబంధం ఉంధా???

SRRao చెప్పారు...

ఈ విజయదశమికి ఆ జగజ్జనని మిత్రులందరికీ సకల శుభాలు అందించాలని కోరుకుంటూ............

- SRRao

శిరాకదంబం

కథా మంజరి చెప్పారు...

నెమలి. జ్యోతి గారన్నట్టు, బొమ్మ సరదాగా ఉంది కానీ, దానికీ మీ టపాకీ లింక్ ఏమిటో తెలీడం లేదండీ.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

బ్రహ్మానందంగా మీ సమాధానానికై బ్రహ్మానందం ఆహ్వానిస్తున్నట్టుగా ఆచిత్రం లో నాకనిపించి ఉంచానండి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.