జైశ్రీరామ్.
శ్లో.
యయా
ధర్మమధర్మం చ
కార్యం
చాకార్యమేవ చ|
అయథావత్ప్రజానాతి బుద్ధిః సా
పార్థ
రాజసీ.
|| 18-31 ||
తే.గీ. ధర్మమును, దురితంపు నధర్మము నిఁక
కార్యమును మరియు
కడు
నకార్యమునిల
సరిగ
కానఁగ
లేకుంట
జగతిలోన
రాజసికమని దలచుము
ప్రస్ఫుటముగ.
భావము.
పార్ధా!
ధర్మాధర్మాలను, కార్యాకార్యాలను సరిగా
నిర్ణయించ లేని
బుద్ధి రాజసికమైనది.
శ్లో. అధర్మం
ధర్మమితి యా
మన్యతే
తమసావృతా|
సర్వార్థాన్విపరీతాంశ్చ బుద్ధిః సా
పార్థ
తామసీ.
|| 18-32 ||
తే.గీ. కప్పబడియుండి మాయచేఁ
గనగ
లేక
ధర్మమని గాంచుచుండి యధర్మము నిల,
వక్రగతి చింతనముచేయు సక్రమమును
కనగ
తామసికమదియె, కనుము
పార్థ!
భావము.
అజ్ఞానంతో కప్పబడి అధర్మాన్ని ధర్మంగా, అన్ని విషయాలను విపరీతంగా
ఎంచే
బుద్ధి
తామసిక
మైనది.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.