గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

31, అక్టోబర్ 2014, శుక్రవారం

అదానస్య ప్రదానస్య ... మేలిమి బంగారం మన సంస్కృతి,

0 comments

జైశ్రీరామ్.
శ్లో. అదానస్య ప్రదానస్య కర్తవ్యస్యచ కర్మణః
క్షిప్ర మక్రియ మాణస్య కాలః పిబతి సంపదః.

గీ. ఇవ్వ దలచిన వెంటనే యిచ్చుట తగు.

పుచ్చుకొననెంచ వెంటనే పుచ్చుకొనుడు.
కాలహరణంబు చేసిన కాలగతిని

ధనము హరియింపఁబడవచ్చు తలచిచూడ.
భావము. తీసుకోవాలన్నా ఇవ్వాలన్నా అది వెంటనే చేసేయాలి. అలాకాక అప్పుడో ఇప్పుడో అనుకుంటే కాలం ఆ సంపదని మింగేస్తే ఆ మీదట ఇవ్వటం ఉండదు, పుచ్చుకోవడము ఉండదు. 
జైహింద్.

30, అక్టోబర్ 2014, గురువారం

రాజ్ఞ ధర్మిణి ధర్మిష్టా ... మేలిమి బంగారం మన సంస్కృతి,

0 comments

జైశ్రీరామ్.
శ్లో. రాజ్ఞ ధర్మిణి ధర్మిష్టా పాపే పాప నరాః సదా
రాజానమనువర్తన్తే యధారాజా తధా ప్రజాః

గీ. ప్రభువు మంచిగ నొప్పిన ప్రజలునటులె,

ప్రభువు చెడ్డవాఁడైనచో ప్రజలునటులె.
ప్రభువు యెటులుండు నటులనే ప్రజలునుంద్రు.
ప్రభువు మంచిగ వర్తించి వరల వలయు.
భావము. ప్రజలు ఎల్లప్పుడూపాలకుని మనస్సునే అనుసరింతురు.  రాజు ధర్మవంతుడైనచో ప్రజలు ధర్మ ప్రవర్తకులై యుందురు. రాజు పాప ప్రవర్తకుఁడైనచో ప్రజలు కూడా పాప ప్రవర్తకులుగనే యుందురు రాజెటు లుండునో ప్రజలూ అటులనే యుందురు. 
జైహింద్.

29, అక్టోబర్ 2014, బుధవారం

చంద్ర వంశపు రాజుల వంశ వృక్షము.

0 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! పరీక్షిన్నరేంద్రుని వంశ వృక్షాన్ని తిలకించండి.
జైహింద్.

28, అక్టోబర్ 2014, మంగళవారం

కార్త వీర్యార్జునో నామా ... మేలిమి బంగారం మన సంస్కృతి,

0 comments

జైశ్రీరామ్.
శ్లో. కార్త వీర్యార్జునో నామా రాజా బాహుసహస్ర భృత్
     తస్య స్మరణ మాత్రేణోర భాధా వినశ్యతి.
గీ. వేయి చేతులు కలిగిన వీరుడైన
కార్తవీర్యార్జునుడను భూభర్త పేరు
తలచువారిల్లు దొంగలు తరియ లేరు.
పద్యమియ్యది చదివిన భవ్య ఫలము.
భావము. వేయి చేతులు కలిగిన కార్తవీర్యార్జునుని నామ స్మరణ చేసినవారికి చోర భయమెన్నడును కలుగదు. ఈ పద్య పఠనము సత్ఫలమునిచ్చును.
జైహింద్.

27, అక్టోబర్ 2014, సోమవారం

మిసిమి కాంతులలో బళ్ళారి రాఘవను మసలఁ జేసిన శ్రీ గుత్తి చంద్రశేఖరులు.

0 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! సుప్రసిద్ధ నటులు బళ్ళారి రాఘవను మిసిమి కాంతులలో మెఱయ జేసిన మన గుత్తి(జోళదరాశి)చంద్రశేఖర రెడ్డి గారి వ్యాసం మనకు రాఘవ ప్రాశస్త్యాన్ని మరొక్కమారు గుర్తుకు తెస్తుంది. చదవండి.
మిసిమి పత్రికకు, సాహితీమిత్రులు చంద్రశేఖరరెడ్డిగారికి ఆంధ్రామృతం అభినందనలు తెలియఁ జేస్తోంది.
జైహింద్.

26, అక్టోబర్ 2014, ఆదివారం

మంచి భార్య కోరుకొనువారు చేయు దుర్గాప్రార్థన. పత్నీం మనోరమాం దేహి...మేలిమి బంగారం మన సంస్కృతి,

0 comments

జైశ్రీరామ్.
శ్లో. పత్నీం మనోరమాం దేహి మనోవృత్తానుసారిణీం,
తారిణీం దుర్గ సంసార సాగరస్య కులోద్భవామ్.

గీ. మనసు రమియింప చేసెడి, మనసు నెఱిగి 
మెలగి, నన్ దరియింపఁ జేయు, కులము నిలుపు
పుత్రునొసగెడి భార్యను బ్రోవ నన్ను
నాకొసంగుమ దుర్గాంబ! సాకుము నను.
భావము. ఓ దుర్గామాతా! నా మనస్సును రమింపఁ జేయునట్టిదియు, నా మనసుననుసరించి వ్యవహరించునట్టిదియును, నన్ను తరింప జేయునట్టిదియును, సంసార సాగరమునుండి నన్ను తరింపఁ జేయ సమర్ధుఁడైన కులోద్ధారకుఁడైన పుత్రునొసంగునట్టిదియును అగు భార్యను నాకు ప్రసాదించుము. 
జైహింద్.

25, అక్టోబర్ 2014, శనివారం

నరస్యాభరణం రూపం ... మేలిమి బంగారం మన సంస్కృతి,

0 comments

జైశ్రీరామ్.
శ్లో. నరస్యాభరణం రూపం ,రూపస్యాభరణం గుణః
గుణస్యాభరణం జ్ఞానం , జ్ఞానస్యాభరణం క్షమా.
గీ. మనుజునకు రూపమే యాభరణము తలప.
గుణమె రూపంబునకునాభరణము కనగ.
గుణమునకుజ్ఞానమే యాభరణము తెలియ.
క్షమయె యాభరణంబు సు జ్ఞానమునకు.
భావము. మానవునకు రూపమే ఆభరణం.ఆ రూపానికి గుణం ఆభరణం. గుణానికి జ్ఞానమే ఆభరణం .జ్ఞానానికి క్షమాశీలం ఆభరణం. 
జైహింద్.

24, అక్టోబర్ 2014, శుక్రవారం

ఉదయే సవితా రక్తో ... మేలిమి బంగారం మన సంస్కృతి,

0 comments

జైశ్రీరామ్.
శ్లో. ఉదయే సవితా రక్తో రక్తశ్చాస్తమయే తథా
సంపత్తే చ విపత్తే చ మహతామేక రూపతా.
గీ. మహితు లొకరీతినే యుంద్రు మహిని తాము
సంపదలలోన యాపన్న సమయమునను.
సూర్యుఁడుదయాస్తమయములఁ జూ డ నెఱుపు
వర్ణమునె యొప్పుచుండును భ్రమణమందు.
భావము. సూర్యుడు ఉదయించే సమయంలోనూ ఎఱ్ఱగానే ఉంటాడు. అస్తమయ సమయంలోనూ ఎఱ్ఱగానే ఉంటాడు. అలాగే మహాత్ములు సంపదలలోనూ, ఆపదలలోనూ ఒకే విధంగా ఉంటారు. 
జైహింద్.

23, అక్టోబర్ 2014, గురువారం

ఈ రోజు పరమోత్కృష్టమైన దీపావళి పండుగ సందర్భముగా ఆంధ్రామృత పాఠకులకు శుభాకాంక్షలు.

1 comments

జైశ్రీరామ్
ఆర్యులారా!
ఈ రోజు పరమోత్కృష్టమైన దీపావళి పండుగ సందర్భముగా ఆంధ్రామృత పాఠకులకు శుభాకాంక్షలు. 
జ్ఞానజ్యోతులు వెల్గు గాత మదులన్. కల్యాణ భాగ్యోల్లసత్
స్థానంబుల్ మిము పొందుగాత! ధన్యాత్ములెల్లన్ మిమున్
ప్రాణంబట్టుల చూచి కొల్చుత సదా. దీపావళిన్ వెల్గు సు
జ్ఞానోద్భాసిత లక్ష్మి మిమ్ము కనుతన్, కాంక్షల్ తీర్చుతన్ బ్రేమతో.
జైహింద్.

22, అక్టోబర్ 2014, బుధవారం

రేపు దీపావళి సందర్భంగా శ్రీ అయ్యగారి సూర్య నాగేంద్ర కుమార్ శర్మ ఏమంటున్నారో చూడండి.

0 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! నేడు నరక చతుర్దశి, రేపు దీపావళి. ఈ సందర్భంగా మీ అందరికీ నా హృదయ పూర్వక శుభాకాంక్షలు. 
దీపావళి ప్రాశస్త్యాన్ని, జరుపుకొనే విధానమును శ్రీ అయ్యగారి సూర్య నాగేంద్ర కుమార్ శర్మ వివరించారు. చూడండి.
దీపావళి - విధులు - ఆచార వ్యవహారాలు
శ్రీ గురుభ్యోనమః
మీ అందరికీ ముందస్తుగా దీపావళి పర్వదిన శుభాకాంక్షలు!

అందరూ దీపావళి పండుగను చక్కగా అందంగాఆనందంగా ప్రమాదరహితంగా జరుపుకోవాలని కోరుకుంటూదీపావళి గూర్చి  చిన్న వివరాన్ని  రోజు చేయవలసినవిధులు అందరికీ ఉపయోగపడతాయని పొందుపరిచాను.

"ప్రాతః స్నానంతు యఃకుర్యాత్ యమలోకం నపశ్యతి"విధిగా నిత్యమూ వేకువ ఝామునే స్నానం చేసినవానికియమలోక దర్శనముండదని చెప్తారు పెద్దలుస్నానం యొక్కపవిత్రత అదిఎప్పుడోఅప్పుడు ఎలాగో అలాగ ఒళ్ళుకడుక్కోవడంస్నానం కాదు నియమంగా నియమిత వేళలోనియమిత విధిలోస్నానం చేయాలి అది బాహ్యాంతరశ్శుచిని వృద్ధిని కలిగిస్తుంది.

ఆశ్వయుజ బహుళ చతుర్దశ్యాం సూర్యోదయాత్పురా
యామినీ పశ్చిమే భాగే తైలాభ్యంగో విధీయతే

నరక చతుర్దశినాడు సూర్యోదయాత్ పూర్వంనువ్వులనూనెతో తైలాభ్యంగన స్నానమాచరించాలిదీనివలనకలిగే ఫలితం కేవలం ఋష్యాదులు మాత్రమే దర్శించగలరు దానిఫలితం ఇంత అని మానవ మాత్రులు దర్శించలేరుయతులతోసహా అందరూ ఇలాగే  రోజు స్నానం చేయాలని శాస్త్రవాక్కు.

అలానే దీపావళినాడు నూనెతో తైలాభ్యంగన స్నానమాచరించాలి
తైలే లక్ష్మీ ర్జలే గంగా దీపావళి తిథౌ వసేత్
అలక్ష్మీపరిహారార్థం తైలాభ్యంగో విధీయతే


దీపావళినాడు సూర్యోదయాత్ పూర్వం రాత్రి చివరిఝాములో లేదా సోర్యోదయానికి 4ఘడియలముందుగా(అంటేకనీసం4, 4:30 మధ్యకాలం అనుక్కోండినువ్వుల నూనె తోతలంటుకుని స్నానం చేయాలిదీపావళినాడు  సమయంలోఎక్కడెక్కడున్న నువ్వులనూనెలోనూ లక్ష్మీదేవిఅలాగే అన్నినీటి స్థానాలలోనూ గంగాదేవి నివసించి ఉంటారుకనుక సమయంలో నువ్వులనూనె వంటికి రాసుకునితలంటుకొనిస్నానం చేసినవారికి అలక్ష్మి పరిహరింపబడుతుందిఅలాగేగంగా స్నాన ఫలితం దక్కుతుందిస్నానం చేసేటప్పుడుపైశ్లోకాన్ని ఒక్కసారి పఠించి నమస్కరించి స్నానం చేయడంమంచిది.  అలాగే ఇలా సూర్యోదయానికి ముందు అరుణోదయసమయంలో (అంటే సూర్యోదయానికి 4 ఘడియలపూర్వంరమారమి 4,4:30 మధ్యలో ప్రకారం స్నానం చేసినవారికియమ లోకము కనపడదు

అపామార్గం మథౌతుంబీం ప్రపున్నాట మథాపరం
భ్రామయేత్ స్నానమధ్యేతు నారకస్య క్షయాయవై

 స్నానం మధ్యలో ఉత్తరేణిఆనప లేదా ప్రపున్నాటమొక్కను తల చుట్టూ మూడు సార్లు తిప్పుతూ స్నానం చేయాలి.అలాచేస్తే నరక ప్రాప్తి లేదుఅకాల మృత్యువు రాదు అని శాస్త్రంపెద్దల వాక్కుఉత్తరేణి లేదా అపామార్గ చాలా విరివిగాదొరుకుతుందిలేకపోయినా ఆనపప్రపున్నాట మొక్కలనువాడవచ్చుఇలా స్నాన మధ్యంలో  మొక్కలను తల చుట్టూతిప్పుతూ ఉన్నప్పుడూ  క్రింది ప్రార్థనా శ్లోకం / మంత్రంచెప్పుకోవాలి

శీతలోష్ఠ సమాయుక్త సకంటక దళాన్విత
హరపాప మపామార్గ భ్రామ్యమాణః పునః పునః

తా: దున్నిన మట్టి పెళ్ళలతో కలిసినదిముళ్ళతో ఉండే ఆకులుగలదీ అగు  అపామార్గమానిన్ను నాచుట్టూ తిప్పుతున్నాను.మళ్ళీ మళ్ళీ తిప్పడం వల్ల నువ్వు నాపాపాన్ని హరించు అనిచెప్తూ చేయాలి.

ఒకవేళ అటువంటి అవకాశం లేకపోతే దక్షిణానికి నిర్భయంగాతిరిగి యమునికి మూడు సార్లు నమస్కరించమని పెద్దలుచెప్తారు.తరవాత నిత్యవిధులైన సంధ్యాదులు అయ్యింతరవాత యమధర్మరాజుగారికి నమస్కరిస్తూ  క్రింది శ్లోకం చెప్పిమూడు మార్లు తర్పణం ఇవ్వాలి

యమాయ ధర్మరాజాయ మృత్యవేచాంతకాయచ
వైవస్వతాయ కాలాయ  సర్వభూత క్షయాయచ!
ఔదుంబరాయ  ధర్మాయ నీలాయ పరమేష్ఠినే
మహోదరాయ చిత్రాయ చిత్రగుప్తాయతే నమః!!
యమం తర్పయామి! యమం తర్పయామి !యమం తర్పయామి !
(అని నువ్వులతో మూడు మార్లు తర్పణలు వదలాలి.)

యమధర్మరాజుగార్కి పితృత్వం దైవత్వం రెండూ ఉన్నాయి దక్షిణాభిముఖంగా నిర్భయంగా తిరిగి ప్రాచీనావీతిగానూ,నివీతిగానూ తర్పణం ఇవ్వవచ్చుతల్లి దండ్రులున్నవారు మాత్రం నివీతిగానే చేయాలి అని పరమాచార్య చంద్రశేఖరేంద్రసరస్వతీ స్వామివారి వాక్కు.

మాషపత్రస్య శాకేన భుక్త్వాతత్ర దినే నరః
ప్రేతాఖ్యాయాంచతుర్దశ్యాం సర్వపాపైః ప్రముచ్యతే.

ఈనాడుతప్పకుండామినపఆకుకూరతినాలి.(మినపాకు ఎక్కడ దొరుకుతుందీ అన్న సందేహం వద్దుమినుములునానేసుకొంటే మొలకలొస్తాయిగా (అదే స్ప్రౌట్స్వాటినే కొద్దిగా కూర లాగ చేసుకుని తినవచ్చు .. )

సాయంకాలం ఇళ్ళలోనూగుళ్ళలోనూ అన్ని ప్రదేశాలలోనూ దీపాలు పెట్టాలినువ్వులనూనెతో పెట్టమని శాస్త్రం.దీపదానం చేయటం కూడా కద్దుఇక్కడ్నుంచి కార్తీక మాసమంతా దీపదానందీపతోరణాలుఆకాశ దీపోత్సవాలే.

దీపావళి సాయంత్రం దక్షిణం వైపు తిరిగి పితృదేవతలకి మార్గం చూపడానికి మగపిల్లలు దివిటీలను (ఉల్కాదానం)చూపాలి,  తరవాత కాళ్ళూ చేతులూ కడుక్కుని ఏదైనా మధుర పదార్థం తినాలి.దివిటీలనుగోగుకర్ర,చెఱకుగడ,బొబ్బాస ఆకుఆముదం ఆకుగోంగూర చెట్టు వంటి వాటికి కట్టి వెలిగిస్తారు.

ముఖ్యంగా  దీపావళి లక్ష్మీ పూజకి ప్రసిద్ధి ముందురోజైన నరక చతుర్దశి నుండి బలి పాడ్యమి వరకు బలి చక్రవర్తిభూమిమీదకు వచ్చి తన అధికారం చేసేటట్లు రోజుల్లో లక్ష్మీ పూజ చేసేవారి ఇంట లక్ష్మి సుస్థిర నివాసంఏర్పరచుకునేటట్లు వరం కోరుకున్నాడు కాబట్టి  మూడు రోజులు లక్ష్మీ పూజతో పాటు భగవత్సంకీర్తనం జాగరణం చేసేఆచారం ఉంది.

దీపావళినాడు దీపంలోనే లక్ష్మీదేవిని ఆవాహనం చేసి పూజించాలిఅలక్ష్మిని పంపేయటానికి ఢక్కాలు వాయించడం,దివిటీలు వెలిగించడంటపాసులు పేల్చి చప్పుడు చేయడంఆచారమైందిఇంతకు ముందు ఋతువులో పుట్టిన క్రిమికీటకాదులు దేవతాహ్వానం చేయబడిన  దీపాదులు బాణాసంచాదులలో పడి జన్మ నుండి విముక్తిని పొందుతాయిఉత్తరజన్మలకు వెళతాయిఅంతే కాని లేని పోని ఆడంబరాలు లేక వాతావరణ కాలుష్యం కోసం కాదుఇంత గొప్పసాంప్రదాయం మనది.

జ్ఞాత్వా కర్మాణి కుర్వీత -  తెలిసి చేసినా తెలియక చేసినా పుణ్య కార్యానికి ఫలం ఉంటుందితెలిసి చేస్తే మరింతజాగురూకతతో చక్కగా చేయవచ్చు అని పరమాచార్య ఉద్భోధ.


మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు
శ్రీ అయ్యగారి సూర్య నాగేంద్ర కుమార్ శర్మ
జైహింద్.