గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

14, ఆగస్టు 2014, గురువారం

ఉత్సాహసంపన్నమదీర్ఘసూత్రం....మేలిమి బంగారం మన సంస్కృతి,

జైశ్రీరామ్.
శ్లో. ఉత్సాహసంపన్నమదీర్ఘసూత్రం
క్రియావిధిజ్ఞం వ్యసనేష్వసక్తం 
శూరం కృతజ్ఞం దృఢసౌహృదం చ
సిద్ధిః స్వయం గచ్ఛతి వాసహేతోః. 
గీ. కనఁగ నౌత్సాహి, నేర్పరి, ఘన సుగుణుఁడు,
సత్ కృతజ్ఞుఁడు, శౌర్యుఁడు, సమత, స్నేహ 
కలితుఁడైనట్టి వానికి కలుగు జయము. 
కార్య సంసిద్ధి యాతని ఘనత ఫలము.
భావము. ఉత్సాహవంతుడు, పనులలో ఆలస్యం చేయనివాడు, పనిసాధించే పద్ధతి తెలిసినవాడు, చెడు అలవాట్లయందు ఆసక్తి లేనివాడు, శూరుడు, కృతజ్ఞతా బుద్ధికలవాడు, దృఢమైన స్నేహస్వభావం కలవాడు అయితే, అతనికి కార్యసిద్ధి తనంతట తానే కలుగుతుంది. 
జైహింద్.
Print this post

1 comments:

కథా మంజరి చెప్పారు...

మిత్రమా, చాలా రోజులపాటు అంతర్జాల విహారం మానేసి. తిరిగి ఇప్పుడే తొంగి చూస్తున్నాను. నువ్వు కనిపించావు.చాలా సంతోషం. ఉండీ ఉడిగీ ఏదో ఒకటి రాస్తున్నావు కదా. నేనూ రాయాలి. రాస్తాను.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.