జైశ్రీరామ్.
శ్లో. అరాజకే హి లోకే உస్మిన్ సర్వతో విద్రుతే భయాత్రక్షార్థ మస్య సర్వస్య రాజాన మసృజత్ప్రభుః.
గీ. రాజు లేనట్టి రాజ్యాన ప్రజలు జడుచు
కాన రాజ్యంబుఁ గావగ జ్ఞాన భరితు
రాజుగా చేసె రక్షింప ప్రజలనెల్ల.
ఎంత దయనీయుడోకదా యీశ్వరుండు!
భావము. రాజ్యంలో రాజు లేకపోతే ప్రజలు అన్నివిధాలా భయంతో విచలితులౌతారు. అందుకే లోకమంతటినీ రక్షించటానికి దైవం రాజును సృష్టించాడు.
జైహింద్.