గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

18, నవంబర్ 2013, సోమవారం

శంకరాభరణం బ్లాగులో ఇచ్చిన నాకు నచ్చిన సమస్య - దానికి నా పూరణము.

జైశ్రీరామ్.
ఆర్యులారా! శంకరాభరణం బ్లాగుhttp://kandishankaraiah.blogspot.in/ నిర్వాహకులు శ్రీ కంది శంకరయ్య గారు రచయితలలో పద్య కవితాసక్తిని పెంపొందించే సదుద్దేశ్యంతో అకుంఠిత దీక్షతో నిరంతరాయంగా పూరణముల కొఱకై రోజుకొక సమస్యను మనముందుంచడం, ఆసక్తిగల కవులు తమ ఆలోచనకు పదును పెట్టుతూ ఆ సమస్యలకు పద్యరూపంలో పూరణ చేయడం తెలుగు భాషాభిమానులందరికీ ఆనందం కలిగిస్తోంది. ఈ విధంగా శ్రమిస్తూ కవులనుత్తేజపరుస్తున్న శ్రీ శంకరయ్య గారిని మనసారా అభినందిస్తూ సమస్యా పూరణములు చేయుచున్న మిత్రులందరికీకూడా మనస్పూర్తిగా అభినందనలు తెలియ జేస్తున్నాను.ఈ రచయితల సంఖ్య ఇప్పుడు పదులుదాకా వచ్చొంది. ఇదిఇంకా ఇంకా పెరిగి వందలు దాటాలని మనసారా కోరుకొంటున్నాను. శంకరాభరణం ఆంధ్రమాతకు అపురూపమైన అలంకారంగా వర్ధిల్లునుగాక.
శంకరాభరణం బ్లాగులో ఇచ్చిన
కమలాప్తుని రశ్మి సోఁకి కలువలు విచ్చెన్. 
అనే సమస్య నాకు బాగా నచ్చింది. 
దానికి నా పూరణము తిలకించండి.
కమలాప్తనేత్రఁడౌ హరి
కమలాసనవైపు చూడ కలువలకన్నుల్
ప్రముదమున విచ్చి రమ నె.
కమలాప్తుని రశ్మి సోఁకి కలువలు విచ్చెన్. నవంబర్ 16, 2013.
మీరు కూడా శంకరాభరణం చదువుతూ సమస్యలను పూరించడంలో కవుల ప్రతిభా పాండిత్యాలను గాంచి, మీ ప్రశంసలను కూడా అందఁ జేయ వచ్చుచును.
జైహింద్.
Print this post

3 comments:

కంది శంకరయ్య చెప్పారు...

చింతా వారూ,
ధన్యవాదాలు.
మీ వంటి సాహితీమూర్తుల సహకారం, ప్రోత్సాహం, ఆశీస్సులు ఇలాగే కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాను.
ఆంధ్రకవిత రుచుల నాంధ్రామృతము బ్లాగు
నందు మొదటఁ జూపినట్టి ఘనులు;
నడుచుచుంటి మీరు నడిపించు దారిలో
పట్టినట్టి చేయి వదలవలదు.

anantha krishna n.v. చెప్పారు...

కవులిద్దరి కబురులలో
కవితలె దొర్లేను గాని కాకర యౌనా
కవిమిత్రులొక్కరుండిన
కవితగ జీవిక నడచును ఘనసంపన్నా

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
పాండితీ స్రష్ట లిద్దరికీ హృదయ పూర్వక శుభాభి నందనలు
ఓ పరమాణువు మాకు లభిస్తే కృతజ్ఞులము

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.