గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

19, జనవరి 2012, గురువారం

శ్రీ రామ కృష్ణ పరమ హంసకు స్మృత్యంజలి.

జైశ్రీరాం.
శ్రీ రామ కృష్ణ పరమహంస అసలు పేరు  గదాధర్ ఛటోపాధ్యాయ.తే.౧౮ - ౦౨ - ౧౮౩౬ న పశ్చిమ బెంగాల్ లో హుగ్లీ జిల్లాలో కామార్పుకూర్ గ్రామంలో చంద్రమణి దేవి, క్షుదీరాం దంపతులకు జన్మించారు. రాణీ రాషమొణి అనే ధనికురాలు దక్షిణేశ్వర్ కాళీ మాత గుడి కట్టించి, గదాధరుని అన్న రామ్ కుమార్ ను పూజారిగా నియమించెను.అన్న తరువాత గదాధర్ ఆ బాధ్యతలు స్వీకరించెను.అతని ఏకాగ్రతకు మెచ్చి కాళికా మాత అతనికి ప్రత్యక్షమయింది. నాటినుండి ఆమెను ప్రత్యక్షంగా సేవించేవాఁ గదాధరుఁడు.
అతని జ్ఞానజ్యోతి ప్రపంచవ్యాప్తం కాగా మతాతీతంగా అనేకమంది అతని శిష్యులై అతడు చూపిన జ్ఞాన మర్గాన్ని అనుసరించారు.
శ్రీ స్వామీ వివేకానంద, బ్రహ్మానంద, ప్రేమానంద, శివానంద, త్రిగుణాతీతానంద, అభేదానంద, శారదానంద, అద్భుతానంద, అద్వైతానంద, సుబోధానంద, విజ్ఞానానంద, రామకృష్ణానంద, అఖండానంద, యోగానంద, నిర్గుణానంద, మున్నగు సన్యాస శిష్య్లులు, నాగమహాశయులు, మహేంద్రనాధ గుప్తా, పూర్ణూఁడు, గిరీష ఘోష్, మున్నగు గృహస్థులు వీరి శిష్యులే. రామకృష్ణ మిషన్ వీరి ద్వారానే స్తాపింప బడి విస్తరింపబడి నేటికీ ఆధ్యాత్మిక కేంద్రాలై భక్తితత్వాన్ని చాటుతున్నాయి.
సృష్టిలో ఏకత్వము, 
అన్ని జీవులలొదైవత్వము,
దేవుఁడొక్కడే, అన్ని మతముల సారము ఒక్కటే, 
కామము, స్వార్థము మానవ జీవుతంలో దాస్య కారకాలు,
ఈ రెండూ విడిచినట్లైతే భగవంతుణ్ణి పొంద వచ్చు.
ఒక గమ్యాన్ని చేరడానికి అనేక మార్గాలు ఎలాగో అలాగే భగవంతుని చేరడానికి అనేక మార్గాలు.
ఇవి రామకృష్ణుని బోధనలో ముఖ్యాంసాలు.
మానవ సేవయే మాధవ సేవగా ఇతని బోధనల వలన ప్రజలు గ్రహించిరి.
హిందూమతముపై రామ కృష్ణుని  ఆలోచనలను సహేతుకముగనున్నందున క్రిఫ్టోఫర్ ఇషర్వుడ్ మున్నగు పాశ్చాత్యులు అనేకులు మతములు మార్చుకొని, హిందూధర్మానువర్తులయ్యారు.
జైహింద్.
Print this post

4 comments:

Zilebi చెప్పారు...

హంస హంసాయ విద్మహే
పరమ హంసాయ ధీమహీ
తన్నో హంసః ప్రచోదయాత్


జిలేబి.

anrd చెప్పారు...

శ్రీ రామకృష్ణ పరమహంస గారి గురించి చక్కటి పోస్ట్ అందించినందుకు కృతజ్ఞతలండి.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శ్రీ రామకృష్ణ పరమ హంస గురించి తెలుసు కోవలసిన మంచి విషయాలను అందించారు . ధన్య వాదములు

శ్రీపతిశాస్త్రి చెప్పారు...

శ్రీగురుభ్యోనమ:
శ్రీరమకృష్ణపరమహంస గురించిన మంచి విషయములనందించిన గురువుగారికి ధన్యవాదములు. వివేకానందస్వామివారి శరీరమునకు రామకృష్ణపరమహంస ఆత్మ,పరమాత్మ

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.