గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

11, జనవరి 2012, బుధవారం

ఎవరీసుందరి? ( నామ గోపన చిత్రము )

భ్యత పొడ చూపు సద్వేష ధారణ - సధ్బావ మొలికించు సౌమ్యతయును,
చిన్‌ని నగవు మోము వన్నెలు పెంచగా - గంభీరమును చాటు కనుల కాంతి. 
టెంకి యెద్దియొ? పుత్తడిని పోలి కనిపించు -  దివ్య విగ్రహ తేజ మవ్యయమది.
డుల్‌లు నాత్మ స్థైర్య మెల్లయు చూచిన. - కల కాదు నిజమిది కలయ జూడ.
కర్‌కమును గాంచి బ్రహ్మయు గాంచు మరల 
నుత్పలాక్షి మహర్దశ నొనరు కీర్తి
చూచి సృష్టియే వెరఁగన్దె.చూచి చెప్పు
డు.వనిత యెవరు? పాఠకా! భవుని సతియ?
జైశ్రీరాం.
జైహింద్.
Print this post

3 comments:

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

ఆర్యా! సచిన్ తెండుల్ కరుని సీస(౦)లో చక్కగా నిలిపారు.
ఇంతకూ సుందరి ఎవరో...అంతు పట్టుట లేదు.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

అన్వేషి
"ఆ కాంత ఏ కాంతయో?" పోస్ట్‌పై క్రొత్త వ్యాఖ్యను ఉంచారు:

అంతటి మహకవులు సైతము "వెలజెప్ప" శక్యము కాదన్నారు గనుక "వెలకాంత" కానేరదు, "కులకాంత" కాబోదు కాబట్టి ఆమె అయితే "కవితా" కాంత కావలె లేక "కీర్తి" కాంత కావలె.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

సదాన్వేషీ!
మీరు చ్చూచినప్పుడు చిత్రం కనిపించిందో? లేదో?
ఇప్పుడు కనిపిస్తుంది. చూడండి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.