గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

3, డిసెంబర్ 2011, శనివారం

డా.దేవగుప్తాపు చిత్ర కవితాభిరామము15. పాశ బంధము.

ప్రియ ఆంధ్రామృతాభిమాన పాఠక మిత్రులారా!
డా. దేవగుప్తాపు సూర్య గణపతి రావు గారు వ్రాసిన చిత్ర కవితలు అర్థవంతంగా ఔచిత్యంతో ఒప్పారుతూ ఉంటాయి.
శివాయత నాట్య రమ్య సంచలిత తన హృదయమున నిల్చి సత్కవితాసుధలు ఇచ్చి కాపాడాలని పాశ బంధ చంపకాన్ని సమర్పించి ఆశించిన విధము చూడండి.
 చూచారుకదా!
ఇంతటి చక్కని రచనా పాటవం కల కవిగారికి అభినందనలు తెలియజేస్తున్నాను.
మీరూ చిత్రకవితాసక్తిని పొంది ప్రయత్నించి చిత్ర కవితను వెలయించి తెలుగును ఒక వెలుగు వెలిగించండి.
జైశ్రీరాం.
జైహింద్.
Print this post

3 comments:

Pandita Nemani చెప్పారు...

అయ్యా! డా. గణపతిరావు గారు మంచి కవి. వారి రచనలన్నీ నేను చూచేను. వారు కొన్ని శతకములు కూడా రచించేరు. భావ వైచిత్రి వారికి వెన్నతో బెట్టిన విద్య. చిత్ర కవిత్వము, బంధ కవిత్వములలో వారి కృషి అమోఘము. బంధ కవిత్వమును భావసమన్వితముగా చేయడము సామాన్య విషయము కాదు. అందులో వారు చాల ముందుకి వెళ్ళేరు. ఒక భక్తి ప్రధానమైన రచననే కావించేరు కృత కృత్యులయ్యేరు. వారికి అభినందనలు తెల్పుటకి నా పదజాలము సరిపోదు. ఈ నాటి బంధకవులలో వారే అగ్రగణ్యులు. స్వస్తి.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు.
చిత్ర విచిత్ర మైన బంధాలను అందంగా చిత్రీకరించి భక్తి రస కావ్యాలను కలంలో కుమ్మరించి , పరవసింప జేయగల భాగ్య వంతులు , గణపతుల వారికి శిరసాభి వందనములు.
నిజంగా " శంఖం " చిత్రం ఏ చిత్ర కారుని కుంచెదో? " అన్నంత అనుభూతి. చింతా వారి అభిరుచి శ్లాఘ నీయం .

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు.
పలు విధముల బంధ కవిత్వముతో సాహితీ ప్రియులను బంధించ గల నిపుణత కొని యాడ దగినది. భాష సరిపోదు. అభి వందనములు.
తమ్ముని కృషి అనన్యం. ధన్యోస్మి .

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.