గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

7, నవంబర్ 2011, సోమవారం

డా.దేవగుప్తాపు చిత్ర కవితాభిరామము 2.

ప్రియ ఆంధ్రాంమృతాభిమాన పాఠక మిత్రులారా!
డా. దేవగుప్తాపు సూర్య గణపతి రావు గారు వ్రాసిన చిత్ర కవితలు అర్థవంతంగా ఔచిత్యంతో ఒప్పారుతూ ఉంటాయి.
గజముఖుని స్తుతిని గజచిత్ర బంధంలో వ్రాయడంలో కవియొక్క ఉత్కృష్టత మనకు ద్యోతకమౌతోంది.
మీరూ గమనించండి ఈ క్రింది గజ బంధాన్ని.
చూచారు కదా! మీరూ వ్రాసే ప్రయత్నం ఎందుకు చేయకూడదు? ఆసక్తితో  తప్పక ప్రయత్నించి మీరు సఫలీకృతులవాలని ఆకాంక్షిస్తున్నాను.
జైశ్రీరాం.
జైహింద్.
Print this post

4 comments:

భాస్కర రామిరెడ్డి చెప్పారు...

ఆర్యా చాలారోజులకు ఒక మంచి వివరణ నిచారు. దీనర్థం ఇంతకు మ్నుపు పోస్టులు బాగాలేవనా కాదు. ఇంతకు నుందు వ్రాసిన వ్యాసాల్లో వివిధ రకాల బంధపద్యాలను వివరిస్తూ వచ్చారే కానీ ఆ బంధ పద్యాల లక్షణాలను వివరించనందుచేత పెద్దగా నాకు ఉపయోగపడలేదనే చెప్పాలి. అధిక ప్రసంగమైంతే మన్నించమని మనవి.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ప్రియమైన భాస్కరా!
మీకు నచ్చినందుకు సంతోషం.
మిది అధిక ప్రసంగం కాదు. మనోభావాన్ని ఇన్నాళ్ళకు చెప్పారంటే.
ఈ విషయం ఇంతకు ముందే మీరు సూచించి ఉంటే మీ సూచనననుసరించేందుకు యత్నించే వాడిని. మీ మంచి సూచనకు ధన్యవాదాలు.

మిస్సన్న చెప్పారు...

ఆర్యా! అనుష్టుప్ ను తెలుగు పద్యాలకు వాడవచ్చునా?

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఆర్యా!
అనుష్టుప్ సంస్కృతమున వాడుట కద్దు. డా. గణపతిరావు గారు ప్రయోగించిన ఈ ప్రయోగాలను శ్రీమాన్ బేతవోలు రామ బ్రహ్మం గారు అభినందించినందున మనకు గ్రాహ్యమని గ్రహింప వలసి యున్నది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.