స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విరోధి నామ సంవత్సర ఆశ్వయుజ బహుళ అమావాశ్య పర్వ దినమున నిత్య నూతన కాంతులు విరజిమ్ముతూ వచ్చిన ఈ నాటి దీపావళి సందర్భంగా మీ అందరికీ నా తరపున మన సుహృన్మిత్రుల తరపున హృదయ పూర్వక శుభాకాంక్షలు.
ఉ:-
ఆంధ్రుల కీర్తి చంద్రికలు హాయిగ నెల్లలఁ దాటిపోవ నీయాంధ్రులు జ్ఞాన తేజము నయాచిత రీతిని పంచు నెల్లెడన్.
Print this post
ఆంధ్రులదెచ్చటైనను మహాద్భుత రీతిని వృద్ధి గాంచు. ఓ
యాంధ్రుడ జ్ఞాన దీపసుమహాద్భుత పంక్తులు మీకు మేలనెన్.
శా:-
జ్ఞాన జ్యోతుల పంక్తు లెల్లెడల నజ్ఞానంబు పోకార్ప, సు
జ్ఞానంబీయగ యింటి ముంగిటకు తా కాంతుల్ ప్రకల్పించుచున్
నీ, నా భేదము లేక వచ్చె.కనితే? నెయ్యంబునో యాంధ్రుడా!
జ్ఞానాంధ్రామృత పానలోలుడ! లసత్ కల్యాణ సద్భాగ్యుడా!
శా:-
దీపాలంకృతమై వెలుంగుత సదా దేదీప్యమానంబుగా
ప్రాపై నిల్చుత మీ గృహాళి కృపతో భవ్యాత్ములన్ గాచుతన్.
పాపాళిన్ బరిమార్చుచుండి విలసత్ భాగ్యాళి చేకూర్చుతన్.
దీపాలన్ వెలుగొందు లక్ష్మి మిములన్ దివ్యాత్ములంజేయుతన్.
మీ గృహం నిత్య కల్యాణ కాంతులతో విరాజిల్లుతూ, నిత్య సంతోష నిలయం కావాలని ఆకాంక్షిస్తున్నాను.
జైహింద్.
4 comments:
ఆచార్యులవారి కుటుంబానికి కూడా మా దీపావళి శుభాకాంక్షలు
మీకూ మీకుటుంబానికీ దీపావళి శుభాకాంక్షలు !
దీపావళి శుభాకాంక్షలు.
మీకు మీ కుటుంబసభ్యులకు దీపావళి శుభాకాంక్షలు .
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.