గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

30, ఆగస్టు 2008, శనివారం

అవునంటారా........కాదంటారా........

శ్రీమదాంధ్ర భాషాభిమానులకు గిడుగు వెంకట రామమూర్తి గారి జన్మ దినము ఒక పర్వ దినము. 29-8- 2008 వ తేదేని ఈ విషయాలను మనం అవకాశానుగుణంగా ఆ రోజున చర్చించుకొని ఉంటాం. ఆ పండుగ సంబరం ఆరోజుతో వదిలేస్తే ఆంధ్రులు ఆరంభశూరులు అనే అపప్రధ నిజం చేసినవారిమవతాం. 29-8-2009 వ తేదీన మనం సింహావలోకనం చేసుకొందాం. అందుకు సరయిన ప్రణాళిక ఇప్పుడే నిర్మించుకోవాలి. మనకు ఆంగ్లం మాటలాడడం అత్యవసరం అనుకున్నప్పుడు రోజులో కనీసం కొన్ని గంటలయనా స్వచ్ఛమయిన తెలుగు మాటలాడే ప్రయత్నం చేయగలిగితే మన ఆంద్ర భారతి మనకు దూరం కాదు. అవునంటారా.................కాదంటారా..........?


క:-దినమునకొక గంటైనను
మనమంతా తెలుగుపలికి దివ్యత్వమునీ
తెనుగుకు గొలుపగ నేర్చిన
మన భాషకు గుర్తు కలిగి మన్ననలందున్.

ఇదీ నా అభిప్రాయం. మరి మీరేమంటారు? వీలయితే మీరు ఛందోబద్ధంగా చెప్పండి.

చింతా రామకృష్ణా రావు Print this post

1 comments:

శరత్ కాలమ్ చెప్పారు...

మీ బ్లాగ్ పేరు భలే నచ్చింది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.