గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

29, ఫిబ్రవరి 2020, శనివారం

అభినవ నన్నయ్య మధునాపంతుల...రచన శ్రీ ముదిగొండ శివప్రసాద్‌

0 comments

జైశ్రీరామ్.
మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి శతజయంతి సందర్భముగా..
అభినవ నన్నయ్య మధునాపంతుల
రచన శ్రీ ముదిగొండ శివప్రసాద్‌
మధునాపంతుల వారి తెలుగు నుడికారము ఒజ్జబంతి. తెలుగు జాతి చరిత్రకు ‘పెద్దబాల శిక్ష’ వంటిదైన ఆ మహాకవి ఆంధ్ర పురాణము.. అష్టాదశ పురాణాల సరసన కూర్చుండ తగిన అద్భుత పురాణం అనుటలో అతిశయోక్తి లేదు. ఆనాడు వ్యాసుడు కూడా దక్షా వాటికకు వచ్చి పురాణ రచన చేసినట్లు ప్రతీతి.

సర్గం, ప్రతిసర్గం, వంశం, మన్వంతరం, వంశానుచరితం అని పురాణమును పంచలక్షణాత్మకంగా వర్ణించారు. మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి రచించిన ‘ఆంధ్ర పురాణం’, ప్రాచీన అష్టాదశ పురాణాల సరసన ‘వంశాను చరితం’ లక్షణానుసారంగా నిలుస్తుంది. సంస్కృత పంచమహాకావ్యాలు, తెలుగు పంచమహాకావ్యాలు అందరికీ తెల్సినవే. కొంతకాలం క్రితం హైదరాబాద్‌లో ఆధునిక ‘పంచ మహాకావ్యాలు’ అనే శీర్షికతో ‘ఆంధ్రపురాణం’పై ప్రసంగంతో సహా ‘ఉపన్యాస లహరి’ నిర్వహించారు.

1947కు ముందు భావ కవిత్వోద్యమకాలంలో గడియారం శేషశాస్త్రి, రాజశేఖర శతావధాని ‘ప్రబంధములు రాయడం యుగధర్మమేనా? ఉంటే ఇందలి రాణా ప్రతాపసింహుడు, గాంధీ, నేతాజీ, శివాజీలకు ప్రతీకలు. అలాగే స్వరాజ్యాన్ని, సురాజ్యంగా మార్చుకునే నిమిత్తం వీరభద్రమూర్తి ‘వందేమాతరం’ మధునాపంతుల వారి ‘ఆంధ్రపురాణం’ అవతరించాయి. మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి సాత్త్వికులు. కవిత్వ రచనలో, అక్షర రమ్యతలో ‘లోనారసికులు’ అనునట్లు రచించిన శిల్పం ఆకళింపు చేసుకొన్నవారు రాజమహేంద్రవరంలో ఉన్నప్పటికీ వీరు తిక్కనశైలిని బాగా అధ్యయనం చేశారు. నానా రుచిరార్థ సూక్తితో తాను నేర్చిన భంగి చెప్పి వరణీయుడైనాడు. ఈ ‘మధుకోశము’ (తేనెపట్టు)లో ప్రధానమైనది ‘ఆంధ్రపురాణం’. ఇది నవఖండ భూమండలాకృతి. నవధృరాసుకృతి. ఐతరేయబ్రాహ్మణము నాటి చరిత్రతో మొదలుపెట్టి, శాతవాహన కాకతీయ, విజయనగర, తంజావూరు, ఆంధ్రసామ్రాజ్య వైభవమును కావ్యగానం చేశారు. 1950 దశకంలో తొలిసారి రచించబడి ఎన్నోసార్లు పునర్ముద్రణకు నోచిన ఈ గ్రంథము తెలుగు జాతి చరిత్రకు ‘పెద్దబాల శిక్ష’ వంటిది.

‘శ్రీకారంబును జుట్టినాడ కృతినాశీర్వాదము సేయుమమ్ము కామేశ్వరీ’ అంటూ ఇలవేల్పును స్మరించి, ద్రాక్షారామం, శ్రీశైలం, కాళేశ్వరం వేలుపులను స్తుతిస్తూ సమస్త భూ మండలాన్ని స్తుతించారు. హరిశ్చంద్రుని కాలం నాటి చరిత్రను గుర్తు చేశారు. రుద్రమదేవి పౌరుషానికి నీరాజనం పలికారు.. శ్రీకృష్ణ దేవరాయలకు అక్షరాభిషేకం చేశారు. విజయనగర సామ్రాజ్యం అంతరించాక దక్షిణాంధ్ర యుగం ప్రారంభమైనది.

‘విజయనగర రాజ్య విభవంబు పూచిన పూలలో రెండింటిని తునిమి కొప్పునందు తురుముకొనుచూ తెలుగుపడతి సింహావలోకనము చేసుకున్నది అనే అందమైన భావంతో...’ మధునాపంతులవారి భావుకత అవగతమవుతున్నది. వారి తెలుగు నుడికారము ఒజ్జబంతి. వీరి ఆంధ్రపురాణము, అష్టాదశ పురాణాల సరసన కూర్చుండ తగిన అద్భుత పురాణము అనుటలో అతిశయోక్తి లేదు. ఆనాడు వ్యాసుడు కూడా దక్షా వాటికకు వచ్చి పురాణ రచన చేసినట్లు ప్రతీతి.
శ్రీవాణీ గిరిజాశ్చరాయ... అంటూ నన్నయ్య వేయి సంవత్సరాల క్రితం కావ్యరచన చేసిన ప్రదేశంలోనే వీరు రచన చేయడం యాదృచ్ఛికమే అయినా సాహితీ ప్రియులచే అభినవ నన్నయ్యగా కీర్తించబడే రచన చేసిన ఘనులు మధునాపంతులవారు.

ఆంధ్ర రచయితలు, శ్రీఖండం, తోరణాలు, బోధివృక్షం వంటి పద్యకావ్యాలు కల్యాణతార (నవల) ‘మధునాపంతుల వ్యాసాలు’ వంటి వ్యాస సంపుటాలను వెలువరించి, ‘కథా పుష్కరిణి’ పేరిట కథా సంపుటులను రచించి త్రివిక్రములుగా పద్య, గద్య, నవల రంగాలలో తనదైన శైలిలో తెలుగు భారతిని అర్చించారు. ‘ఆంధ్రకుటీరం’ పేరిట సాహితీ విద్యాలయం ద్వారా తెలుగు భాషా బోధన, ‘ఆంధ్ర’ సాహిత్య పత్రిక ద్వారా తెలుగు కవులెందరికో వేదికను కల్పించారు. రాజమహేంద్రవరంలో వీరేశలింగం పంతులు ఆస్తిక ఉన్నత పాఠశాలలో మూడు దశాబ్దాలు ఆచార్యులుగా సేవలందించారు. ‘ఆంధ్ర కల్హణ’, ‘అభినవ నన్నయ్య’, ‘కళా ప్రపూర్ణ’ బిరుదులతో సాహితీ లోకం వీరిని సత్కరించింది. 72 ఏళ్ల వయస్సులో 1992లో నవంబర్‌ 7న మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి శివైక్యం చెందారు.
జైహింద్.

మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రిని గూర్చి...పరిచయము.

0 comments

జైశ్రీరామ్.
మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి
జననం 1920 మార్చి 5
భారత ఐలెండు పోలవరం గ్రామం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
మరణం 1992 నవంబరు 7
వృత్తి ఉపాధ్యాయుడు
బిరుదులు
సాహిత్యసమ్రాట్, ఆంధ్రకల్హణ.
తండ్రి సత్యనారాయణమూర్తి
తల్లి లచ్చమ్మ
మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి (మార్చి 5, 1920 - నవంబర్ 7, 1992) తెలుగు సాహిత్యంలో ముఖ్యంగా అచ్చ తెలుఁగు సాహిత్యంలో పేరెన్నికగన్న కవులలో ప్రముఖుడు. ఆంధ్ర కల్హణ, కళా ప్రపూర్ణ బిరుదాంకితుడు.ఇతడు సిధ్ధార్థి నామ సంవత్సరం ఫాల్గుణ పౌర్ణమినాటికి సరి అయిన 1920, మార్చి 5వ తేదీన తన మాతామహుడైన ఆకొండి రామ్మూర్తిశాస్త్రి ఇంట్లో ఐలెండు పోలవరం గ్రామంలో జన్మించాడు. ఇతని తల్లి లచ్చమ్మ, తండ్రి సత్యన్నారాయణమూర్తి. ఇతని బాల్యం పల్లిపాలెం గ్రామంలో గడిచింది. మహేంద్రవాడ సుబ్బరాయశాస్త్రి, ఓలేటి వెంకటరామశాస్త్రిల వద్ద కావ్య, వ్యాకరణాలు చదివాడు. ఆంధ్ర భాషమీద ఉన్న అపారమైన ఆభిమానంతో 1939లో ఆంధ్రి అనే మాసపత్రికను ప్రారంభించాడు. ఈ పత్రిక ఆనాటి పండితుల, పరిశోధకుల అభిమానం చూరగొంది. ఈ పత్రిక సాహిత్య మాసపత్రికలలో మేల్తరమైనది, అందలి ప్రతి వ్యాసానికి, కవితలకు శాస్త్రి పుటకు దిగువ పాద గమనికలు వ్రాసేవాడు. ఈ పాద గమనికలలో వ్యాసంకాని, కవిత కాని బాగుగా ఉంటే వానిని శ్లాఘించే వాడు, లేకపోతే ఎంతటి మహాకవి రచయైన శాస్త్రి విమర్శకు లోనుకావలసిందే.ఇందులో ఆనాడు లబ్ధ ప్రతిష్ఠులైన పండితులు, కవులు, రచయితలనేకుల రచనలు ముద్రింపబడ్డాయి. ఈ పత్రిక 1941 నవంబర్ వరకు నడిచింది. ఈయన 1940లో మద్రాసు విశ్వవిద్యాలయం నుండి విద్వాన్ పరీక్ష ఉత్తీర్ణుడయ్యాడు. 1940-44ల మధ్యకాలంలో 'సూర్యరాయాంధ్ర నిఘంటువు' నిర్మాణ కార్యక్రమంలో పాల్గొన్నాడు. 1947లో ఆయన నివాసం రాజమండ్రికి మార్చి వీరేశలింగ ఆస్తికోన్నత పాఠశాలలో తెలుగు పండితుడిగా చేరి 1974 వరకు అ పాఠశాలలోనే పనిచేసి పదవీవిరమణ చేశాడు. ఈయన రచనల్లో ముఖ్యమైనది ఆంధ్ర పురాణం. ఈ కృతికిగాను ఆయనకు ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడెమీ అవార్డు లభించింది. ఆంధ్ర పురాణము, ఆంధ్ర రచయితలు ఆయన రాసిన ఇతర ప్రముఖ రచనలు.

ఆంధ్ర దేశంలో ప్రాచీన కాలం నుండి చారిత్రక ఇతివృత్తంతో కవులు కావ్యాలు వ్రాయడం పరిపాటి. శాస్త్రి ఆంధ్రుల చరిత్రను తొమ్మిది పర్వాలుగా ఉదయ పర్వం నుండి నాయక రాజుల చరిత్ర వరకు వ్రాశారు. ఇది ఇరవయ్యవ శతాబ్దంలో ఉద్భవించిన చారిత్రక పంచకావ్యాలలో ఒకటి. మిగిలినవి పింగళి-కాటూరి కవుల సౌందరనందము, దుర్భాక రాజశేఖర శతావధాని రాణా ప్రతాప సింహచరిత్ర, శతావధాని గడియారం వేంకట శేషశాస్త్రి శ్రీ శివభారతము, తుమ్మల సీతారామమూర్తి బాపూజీ ఆత్మకథ అనేవి. శాస్త్రి రచించిన ‘‘ఆంధ్ర పురాణము’’ చరిత్ర కావ్యమైనా సాహితీ విలువలు కలిగిన కావ్యం.

ఆంధ్ర రచయితలు శాస్త్రి ప్రసిద్ధ రచనలలో ఒకటి. ఇందులో నీతి చంత్రిక, బాల వ్యాకరణం రచించిన చిన్నయసూరి నుండి తుమ్మల సీతారామమూర్తి చౌదరి వరకు నూరుగురి మహా రచయితలను గూర్చి సద్విమర్శతో వ్రాయబడిన గ్రంథం. 2012 డిసెంబరులో ఈ గ్రంథాన్ని శాస్త్రి కుమారులు మధునామూర్తి సవరణలు చేసి నూతనంగా పదముగ్గురు రచయితలను చేర్చి తిరిగి ముద్రించి తిరుపతిలో ప్రపంచ తెలుగు మహాసభలలోను, మరల హైదరాబాదులోను ఆ గ్రంథాన్ని ఆవిష్కరింపజేశాడు.

చరిత్ర ధన్యులు చరిత్రలో వివిధ రంగాల్లో ప్రసిద్ధి పొందిన వారి గురించి మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి రాసిన పుస్తకం.

ఇందులో శాస్త్రి శాలివాహనుడు, మాధవ వర్మ, గొంకరాజు, అన్నమయ్య జీవితాలను చిత్రించాడు. శాలివాహనుడి సాహిత్య కృషిని, మాధవ వర్మ రాజకీయ చతురత, గొంకరాజు ప్రభుభక్తి పరాయణత్వం, అన్నమయ్య ఆధ్యాత్మిక తత్వం ఇందులో ప్రధానంగా పొందుపరచబడ్డాయి.[1]

చారిత్రక విషయాలకు తగినంతమేర నాటకీయత జోడించి చదువరులను ఆకట్టుకునేలా ఈ పుస్తకం రాయబడింది. శాస్త్రి రచించి ప్రచురించిన ఖండకావ్యాలు - (1) తోరణములు (2) శ్రీ ఖండములు (3) చైత్రరథం (4) కేళాకుళి అనునవి ఉన్నాయి. శాస్త్రి పిన్ననాటనే అంటే 10 సంవత్సరాల వయస్సులో పద్యాలు వ్రాయడం మొదలుపెట్టారు. 1938లో వారి తొలి ఖండ కావ్యం ‘తోరణము’ వెలువడింది. దానికి విశ్వనాథ సత్యనారాయణ పీఠిక వ్రాస్తూ శాస్త్రి మహాకవి యయ్యే సూచనలు ఈ పద్యంలో గోచరిస్తున్నాయని ఈ దిగువ పద్యం ఉదహరించాడు.

తే॥ నొడువ జాలని యిడుమల గుడిచి బడలి
చిక్కి జీర్ణించి నిజదేశ సేవ చేసి
తుదకు స్మరణీయులైన యాంధ్రుల దలంప
గాజు కన్నైన నొక యశ్రుకణము రాల్చు’’

శాస్త్రి నవలలు, కథలు, చరిత్రలు, నాటకానువాదాలు, వ్యాసాలు మొదలైన సాహిత్య శాఖలలో రచనలు సాగించారు. బోధి వృక్షము - బుద్ధుని చరిత్ర ఇతివృతంగా వ్రాయబడిన నవల. కళ్యాణతార మరియొక నవల. ఇందు శ్రీకృష్ణదేవరాలు కొండపల్లి ముట్టడిని గూర్చిన ఇతివృత్తమున్నది. శాస్త్రి పతంజలి చరిత్ర, ధన్వంతరి చరిత్ర, షడ్దర్శన సంగ్రహం వారి రచనలో నొకటి.
జైహింద్.

28, ఫిబ్రవరి 2020, శుక్రవారం

గవాక్ష బంధ కందము....రచన. శ్రీ గోరుగంతు రామచంద్రం.

0 comments

 జైశ్రీరామ్.

జైహింద్.

27, ఫిబ్రవరి 2020, గురువారం

గవాక్ష బంధ తేట గీతి....రచన.శ్రీమతి భమిడిపాటి అరుణమణి.

0 comments

 జైశ్రీరామ్.

జైహింద్.

26, ఫిబ్రవరి 2020, బుధవారం

తేనియల్ చిందు నా భాష తెలుగు భాష. డా. నలవోలు నరసింహా రెడ్డి తెలుఁగు సాహితీ పీఠము

0 comments

జైశ్రీరామ్.
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష.
  డా. నలవోలు నరసింహా రెడ్డి 
తెలుఁగు సాహితీ పీఠము
గీ. విశ్వమందు నజంతమై వెలుగు లీని
తనరు పదగతుల ప్రమోదంబు నింపి
నవ నవోన్మేష సచ్చిదానంద మగుచు
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష       1

గీ. ప్రబల ఛందో నియతి గల్గి, ప్రాస గలిగి,
యతులు గలిగి, సుందర పద గతులు గలిగి,
యలర నెడద లూపు రస పద్యములు   గలిగి,
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష       2

గీ. పద్య, వచన, గేయ, కవిత,  ప్రక్రియలుగ
సుందరంబైన రస భావ సుధలు గురిసి
ముగ్ధ మోహన పదబంధ ముద్దు లొలికి
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష      3

గీ. మంజుల రస ఝరుల్ మృదు మధురమైన
పద్య శిల్పము దివ్యాను ప్రాస గలిగి
యింపు లయల తోడ హొయలు నింపి హృదికి
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష      4

గీ. మంజు మంజుల మంజీర శింజితముల
కింకిణీ క్వాణ విన్యాస కిన్నెరగుచు
పద సుశోభిత ధ్వానమ్ము పరిఢవిల్లి
తేనియల్ చిందు నా  భాష  తెలుగు భాష     5

గీ. మాండలికములు, సూక్తులు మార్దవంపు
పలుకు బడులు, ధ్వనులు, శబ్ద పల్లవములు
మిగుల సుందరమైన సామెతలు గలిగి
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష      6

గీ. కమ్రపు  చలోక్తులు, పొడుపు కతలు నిండి
గేయ కతలు, జాతీయాల  కెంపు లుండి
రమ్య భరిత మైన నుడికారములు పండి
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష       7

గీ. వన్నె దరుగని సొమ్ములై చెన్ను మీరి
సొంపు గూర్చెడు శబ్దార్థ శోభ లలర
యిమ్ముగా నలంకారము లింపు గూర్ప
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష      8

గీ. ఆది కవి నన్నయార్యుచే నవతరించి
యిల "మహా భారతము'' పేర వెలిగి పోయి
ఉరు పంచమ వేదమై యుప్పతిల్లి
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష -  9

గీ. రమ్య మైన నానా రుచిరార్థ సూక్తి
తా  ప్రసన్న కథా కలితార్థ యుక్తి
సొబగు నక్షర రమ్యత సోంపు నింపి
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష - 10
జైహింద్.

25, ఫిబ్రవరి 2020, మంగళవారం

జపం, జపమాలలు ఎన్నిరకాలు? .. .. .. బ్రహ్మశ్రీ చొప్పకట్ల సత్యనారాయణ..

1 comments

జైశ్రీరామ్.
జపం, జపమాలలు ఎన్నిరకాలు? బ్రహ్మశ్రీ చొప్పకట్ల సత్యనారాయణ..
వాటి ఫలితాలు ఏమిటి?
జకారో జన్మ విచ్చేద:
పకారో పాపనాశక:
జన్మపాప వినాశిత్వాత్
జప ఇత్యభిదీయతే
జపంలోని ‘జా – జన్మవిఛ్చేదనం చేసేది. ‘;పా అంటె పాపాన్ని నశింపచేసేదని అర్థం. యోగానికి జపం ఒక ముఖ్యాంశము. అందుచేతనే భగవద్గీతలో శ్రీక్ర్ష్ణపరమాత్మ అర్జునినితో, ‘యజ్ణ్జానాం జప యజ్ణ్జోస్మీ అని చెప్పడం జరిగింది. అంటె, యజ్ణ్జాలన్నింటిలో నేను జపయజ్ణ్జాన్ని! అని చెప్పాడు. జపం చేస్తున్నప్పుడు భగవన్నామాన్ని లేక కొన్ని మంత్రాలనుగానీ పఠించడం జరుగుతుంది. మనసు అనేక సమస్యలతో సతమతమవుతున్నప్పుడు, జపం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
సాధారణంగా జపం మూడు విధాలుగా ఉంటుంది.
1. వాచింకం: మంత్రబీజాక్షరాలను తన చుట్టూ ఉన్నవారికి వినిపించేటట్లు పలుకుతూ జపం చేయడం వాచికం అనబడుతుంది.
2. ఉపాంశువు: తనకు అత్యంత సమీపంలో ఉన్నవారికి మాత్రమే వినిపించేటట్లు పెదవులను కదుపుతూ జపం చేయడం ఉపాంశువు అని పిలువబడుతుంది.
3. మానసికం: మనస్సులోనే మంత్రాన్ని జపించడం.
వాచిక జపం కంటె ఉపాంశు జపం వంద రెట్లు ఫలితాన్ని కలిగిస్తూ ఉండగా, ఉపాంశుజపం కంటే మానసిక జపం వెయ్యిరెట్లు ఫలితాన్ని కలిగిస్తుంటుంది. అయితే, జపం చేసేటప్పుడు అక్షరం, అక్షరం విడివిడిగా వల్లించుకుంటూ జపం చేయకూడదు. అలాగని మరింత వేగంగా కూడ చేయకూడదు. మంత్రాన్ని స్పష్టంగా ఉచ్చరించాలి. జపంలో ఉఛ్చారణ చేస్తున్నప్పుడు బీజాక్షరాలు లోపించకూడదు. జపానికి ముందుగానీ, తరువాత గానీ ఇష్టదేవతాపుజ తప్పకుండా చేయాలి. పూజ చేయని జపం ఫలితాన్ని ఇవ్వదనేది శాస్త్రం. జపం చేసేందుకై కొంతమంది భక్తులు జపమాలలను ఉపయోగిస్తుంటారు.
జపమాలలు మూడు రకాలు.
1. కరమాల: అనామిక మధ్య కణుపు నుంచి ప్రారంభించి కనిష్టాదిగా తర్జనీమూలము వరకు గల పది కణుపులలో ప్రదిక్షిణంగా జపించితే కరమాలతో జపించినట్లువుతుంది.
2. అక్షమాల: ‘ఆ నుంచి ‘క్షా వరకు గల 54 అక్షరాలతో జపించడమే అక్షమాల. ‘ఆ అనంతఫలితాన్ని కలిగిస్తుండగా ’క్షా కల్మషాలను తోలిగిస్తుంది.
3. మణిమాలలు: రుద్రాక్షలు, ముత్యాలు, స్పటికాలు, శంఖాలు, పగడాలు, సువర్ణమాలలు, రజితమాలలు తులసిపూసలు, కుశదర్భమాలలు, పద్మబీజాలు, పుత్రజీవాలు ఉపయోగించి చేయబడిన మాలలను మణిమాలలని అంటారు.
రేఖాజపం దశగుణాన్ని, శంఖమాలజపం శతగుణాన్ని, పగడాలమాల జపం సహస్రగుణాన్ని, స్ఫటికమాల జపం దశసహస్రగుణాన్ని, ముత్యపు మాలజపం లక్ష గుణాన్ని, తామరపూసల మాలాజపం దశ లక్షగుణాన్ని, బంగారుమాల జపం కోటిగుణాన్ని, తులసిమాల జపం అనంతకోటి గుణాన్ని, రుద్రాక్షమాల జపం అనంతఫలితాన్ని ఇస్తుంటాయి. పగడాల మాలలతో జపం చేయడం వలన ఐశ్వర్య వృద్ధి, ముత్యపుమాలతో జపం చేస్తే సర్వమంగళం, తులసిమాలతో చేస్తే సమస్తమైన ఫలాలు, రుద్రాక్షమాలతో జపం చేస్తే ఆత్మజ్ఞానం కలిగి మోక్షం కలుగుతుంది.
అన్ని యజ్ఞాలకన్నా జపయజ్ఞం గొప్పదని మనుస్మృతి చెబుతోంది. తూర్పుముఖంగా కానీ, ఉత్తరముఖంగా కాని కూర్చుని జపం చేయాలి. జపం చేయడానికి కాలం గురించి పట్టింపులేదు. జపం చేసే ముందు జపమాలను నీటిలో శుభ్రపరచి, అనంతరం పంచగవ్యాలతో శుభ్రపరచి, అనంతరం మంచి గంధంతో శుభ్రపరచాలి. ఏ మంత్రాన్ని జపించేందుకు ఆ మాలను ఉపయోగించదలచుకున్నారో, ఆ మంత్రంతోనే ఆ జపమాలను పూజించాలి. ఆ తరువాత జపమాలకు ఈ క్రింది ధ్యానాన్ని చేసి ధూపం వేయాలి.
త్వం మాలే సదేవతా నాం సర్వసిద్ధి ప్రదాయతా
తేన సత్యేన మేసిద్ధిం మాతర్దేహి నమోస్తుతే
అనంతరం పద్మాసనంలో కూర్చుని, జపమాలను కుడిచేతిలో ఉంచుకుని, మధ్య, అనామిక, కనిష్ఠవ్రేళ్ళపై ఉంచి, చేతి బోటనివేలితో, మధ్యవేలిపై నొక్కి జపమాలను తిప్పాలి. జపమాలను ఇతరులు చూడకూడదు. కాబట్టి ఒక గుడ్డ సంచిలో పెట్టి జపం చేయాలి. వెదురుకర్రల మీద జపం చేస్తే దారిద్ర్యం, రాతిమీద రోగం, నేలమీద దు:ఖం, గడ్దిపరకలమీద యశస్సు తగ్గడం, చిగుళ్ళు పరచిన ఆసనం మీద మనస్సు చంచలంగా ఉండడం, కృష్ణాజినం మీద జ్ణ్జానం కలుగుతుంది. కృష్ణాజినం వేదస్వరూపమేనని వేదంలో ఉంది. దేవతలు యజ్ఞం చేస్తూ ఉండగా ౠక్కు, సామవేదాలు లేడిరూపం ధరించి ప్రక్కకు తప్పుకొన్నాయని, మరల దేవతలు ప్రార్థించగా తిరిగి వచ్చాయని, ౠగ్వేదం యొక్క వర్ణం తెలుపని, సామవేదం రంగు నలుపని, అవే పగలు రాత్రులని, ఆ రెంటి రంగులను విడిచిపెట్టి ఆ వేదాలు తిరిగి వచ్చాయని కనుక కృష్ణాజినం ౠక్ , సామవేదములకు ప్రతినిధియని వేదంలోని కథ.
దీనిమీద కూర్చొని చేస్తే కుష్ఠు, క్షయ మొదలైన రోగాలు పోతాయని వేద వేత్తలు అంటుంటారు. ఓషధులసారమే దర్భలని అలాంటి ఆసనం మంచిదని వేదం, ముందు దర్భాసనం వేసుకొని, దానిమీద కృష్ణాజినం వేసుకొని, దానిమీద బట్టపరచి చేయాలని భగవద్గీత చెబుతోంది. ఇది యోగుల విషయమని గీతా వ్యాఖ్యానమైన శంకరానందీయంలో ఉంది.
గృహస్థులందు దర్భాసనం వేసుకొనిగాని, చిత్రాసనం మీదగాని చేయవచ్చు. జపం చేయడానికి కాలనియమం లేదని, దీక్ష, హొమాలతో కూడా పనిలేదని బ్రహ్మోత్తర ఖండంలో ఉంది. అందరూ దీనికి అధికారులేనని అగస్త్యసంహితలో ఉంది. అలాగే జపమాలలో 108 లేక 54 లేక 27 పూసలు ఉంటుంటాయి. దీనివెనుక ఓ అర్థం ఉంది. మన శరీరంలో 72000 నాడులున్నాయి. వాటిలో హృదయానికి సంబంధించినవి 108. అందుకనే 108 జపసంఖ్యగా అమలులోకి వచ్చింది. మాలలో ఒక పెద్దపూసను మేరువు పూసగా ఉంచుకోవాలి. ఈ మేరువు పూస లెక్కలోకి రాదు. చివరగా, కర్మలు, యజ్ఞాలు, వ్రతాలు, దానాలు, తపస్సులు ఎన్ని చేసినప్పటికి జపానికి సరికావన్నది పెద్దల వాక్కు. అందుకనే జపాన్ని ఒక యోగం అన్న మన పెద్దలు, దానికి పెద్దపీటను వేసారు.
 స్వస్తి.
చొప్పకట్ల సత్యనారాయణ.
శ్రీమా చొప్పకట్ల సత్యనారాయణ గారికి ధన్యవాదములు.
జైహింద్.

24, ఫిబ్రవరి 2020, సోమవారం

డా.నలవోలు నరసింహారెడ్డి కృత ముద్దుబాల శతకము - 2. ఆవిష్కరణ మహోత్సవమునకు స్వాగతమ్.

0 comments

 జైశ్రీరామ్
జైహింద్.

23, ఫిబ్రవరి 2020, ఆదివారం

అష్టాక్షరీ శక్తి అమోఘం. వివరణ - బ్రహ్మశ్రీ చొప్పకట్ల సత్యనారాయణ.

0 comments

జైశ్రీరామ్.
అష్టాక్షరీ శక్తి అమోఘం.  వివరణ - బ్రహ్మశ్రీ చొప్పకట్ల సత్యనారాయణ.
అత్యంత శక్తిమంతమైన అష్టాక్షరీ మంత్రాన్ని ఎన్ని సార్లు జపించాలి? జపమాల త్రిప్పేటప్పుడు ఏం చదవాలి? వంటి సందేహాలు అనేకం కలుగుతూ ఉంటాయి. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం..
అష్టాక్షరీ మంత్రం శబ్దశక్తి.. అర్థశక్తి.. అర్థపూర్తి కలిగిన మంత్రం. ఇటీవల కాలంలో మనుషుల పేర్లతో కూడా మంత్రాలను కల్పిస్తున్నారు కానీ మంత్రం అనే ప్రక్రియకు చాలా శక్తి ఉంది. కేవలం అక్షర సంపుటి మాత్రమే కాదు. దీని ద్వారా అపరిమితమైన శక్తి ఉత్పన్నం అవుతుంది. దీనిని 108 సార్లు, వెయ్యి సార్లు, లక్షసార్లు- ఇలా రకరకాలుగా జపిస్తూ ఉంటారు.
ఈ అష్టాక్షరీ మంత్రంలోని అర్ధాన్ని ఆచార్యుల ద్వారా తెలుసుకోవాలి. ఇక మన శాస్త్రాల ప్రకారం చూస్తే- అష్టాక్షరీ వల్ల అజామిళుడు అవతరించాడు. ఈ మంత్రాన్ని జపం చేయాలంటే బాహ్యంగ ఆహారం తీసుకోవటానికి ముందు నియమంగా ఉపదేశం పొంది చేయాలి. కానీ దాని అర్థాన్ని మాత్రం ఎల్లవేళలా, శుచి.. అశుచి సమయాల్లోనైనా తలచుకుంటూ ఉండవచ్చు. మనస్సులో సదా స్మరిస్తూ ఉండవచ్చు. ఇక జపం చేయటానికి వెనకున్న నియమాలు తెలుసుకుందాం. శుచి, అశుచి అనేవి కేవలం శరీరానికి సంబంధించినవే.
అయితే మంత్రార్థం తెలుసుకున్న తర్వాతే జపాన్ని ప్రారంభించాలి. అప్పుడు మంత్రం స్మరిస్తున్న సమయంలో అర్థబావన కలుగుతూ ఉంటుంది. ఆ సమయంలో మనస్సు పూర్తిగా భావంపైనే ఉండాలి. లేకపోతే ఒక వైపు మాల తిరుగుతూనే ఉంటుంది. మనస్సు అంకెలపైనే ఉంటుంది. సంఖ్య పూర్తై ఎప్పుడు బయటపడదామా అనిపిస్తుంది. అంతే కాకుండా మాల తిప్పే విధానాన్ని కూడా మన పూర్వీకులు ఏర్పరిచారు. ముందు మాలను శుద్ధి చేయాలి. మాల కుడిచేత్తో చూపుడువేలుకు తగలకుండా మధ్యవేలిపై బ్రొటన వేలివైపు నుంచి ముందువైపునకు గడియారము తిరిగినట్లు తిరగాలి.
దీనితో పాటుగా ఏఏ రకం మాలలను వాడితే ఏమవుతుంది? ఏ రంగు పూసలు ఉంటే ఎలాంటి ఫలితాలు వస్తాయి? మొదలైన విషయాలను కూడా తెలుసుకోవటం మంచిది. లేకపోతే మాలను తిప్పి ప్రయోజనం ఉండదు. అందువల్ల మనవారు మాలతో త్రిప్పి లెక్కించే జపాలు వద్దన్నారు. లక్ష్మీనారాయణుడికి సేవ చేస్తున్నట్లుగా భావించి ఎంత సేపు వీలైతే అంత సేపు జపం చేయాలి. ఎప్పుడైనా జపం చేయడంపై మనసు నిలకడ లేకపోతే అప్పటికి దానిని వదిలేయటం మంచిది.
-త్రిదండి చిన జీయర్‌ స్వామి
××××××××××
అష్టాక్షరీ మహామంత్ర విశిష్టత
అర్థం మీకుతెలుసా?
“ఒమ్ నమో నారాయణాయ”
అనే అష్టాక్షరీ మంత్రంలో
“ఒమ్” – ఆత్మ స్వరూపాన్ని,
“నమః” – అనే అక్షరాలు – బుద్ధిని, మనస్సుని,
“నారాయణాయ” – అనే అక్షరాలు పంచేంద్రియాలను
“జీవుని” తెలియజేస్తున్నాయి.
అష్టాక్షరీ మంత్రం ‘వ్యాపక మంత్రం’. ఆకాశతత్త్వంపై ఆధారపడి ఉంది. ఆ కారణంగా ఈ మంత్రాన్ని జపించేతప్పుడు, ఉపాసకుని మనస్సంతా ఈ మంత్రమే వ్యాపించి ఏకాగ్రతను కలిగిస్తుంది
జలాలకు నారములని పేరు. పరమాత్మ ఆ ‘అనంతజలరాశి’లో శయనిస్తాడు కనుక ఆయనకు ‘నారాయణ’ అనే నామం వచ్చింది. ఇంకా,
“న” కార పదోచ్చారణ మాత్రేనైవ నాకాధిప భోగం లభతే
“ర” కార పదోచ్ఛారణేవ రామరాజ్య భోగం లభతే
“య” కార పదోచ్ఛారణేవ కుబేరవత్ ప్రకాశతే
“ణ” కార పదోచ్చారణేవ వైరాగ్యం లభతే
“న” అను అక్షరాన్ని ఉచ్చరించటం చేత ఇంద్ర భోగాలు లభిస్తాయి. “ర” అనే అక్షరాన్ని ఉచ్చరించటం చేత రామరాజ్యంలోనున్న భోగాలు లభిస్తాయి. “య” అను అక్షరాన్ని ఉచ్చరించటం చేత కుబేరునివలె సర్వసంపదలతో ప్రకాశిస్తారు. “ణ” అను అక్షరాన్ని ఉచ్చరించటం చేత ఐహిక సుఖాల పట్ల విముఖత కల్గి, దైవచింతన పట్ల ఆసక్తి కల్గి, మోక్షాన్ని పొందేందుకై మార్గం లభిస్తుంది. ఇంతటి శక్తివంతమైన “నారాయణ” అను శబ్దానికి ‘ఒమ్ నమో నారాయణాయ’ (అష్టాక్షరీ మహా మంత్రం)ను జపించాతంచే ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవచ్చు. ఈ మహా మంత్రంలో, మహోన్నతమైన శక్తి ఉంది
ధ్యాయేన్నారాయణందేవం
స్నానాదిఘ చ కర్మసు,
ప్రాయశ్చిత్తం హి సర్వస్వ
దుష్కృత స్వేతివైశ్రుతిః!
స్నానపానాదిగల సమస్తకర్మలలో “నారాయణుని” స్మరించు కొన్నట్లయితే, సమస్త పాపాలకు ప్రాయశ్చిత్తం జరిగి మంచి మార్గంలో పయనించడానికి వీలవుతుంది.
ఆలోక్య సర్వ శాస్త్రాణీ విచార్యచ పునః పునః
ఇదామేకం సునిప్పన్నం ధ్యేయో నారాయణ సదా!!
సమస్తములైన శాస్త్రాలను క్షుణ్ణంగా పరిశీలించి చూడగా, నిరంతర ‘నారాయణ’ ధ్యానమొక్కటే, సర్వదా, ధ్యేయంగా కనబడుతోంది.
ఆమ్నా యాభ్య సనాన్యారణ్య రుదితం వేదవ్రతా న్యవ్వహాం
మేద శ్ఛేద ఫలాని పూర్తవిధయస్సర్వే హుతం భస్మని
తీర్థా నామవగాహనాని చ గజస్నానం వినా యతృద
ద్వంద్వామ్భోరుహ సంస్మృతీర్విజయతేదేవస్స నారాయణః
‘శ్రీ మన్నారాయణుని’ స్మరించకుండా చేసిన వేదాభ్యాసం అరణ్యరోదన వంటిది. ఎన్ని ధర్మ కార్యాలను చేసినా బూడిదలో పోసిన పన్నీరువలె వ్యర్థమవుతుంది, ఎన్ని తీర్థసేవనలు చేసినా గజస్నానమే అవుతుంది (వ్యర్ధమే).
శ్రీమన్నామ ప్రోచ్చ్యనారాయణాఖ్యం
కేన ప్రాపుర్వాం ఛితం పాపినోపి,
హనః పూర్వం వాక్రు వృత్తాన తస్మిన్
తేన ప్రాప్తం గర్భవాసాది దుఃఖమ్
‘శ్రీమన్నారాయణ’ నామాన్ని ఉచ్చరించువాడు ఎంతటి పాపి అయినా, దైవకృపతో మోక్షాన్ని పొందుతాడు. అంతటి పుణ్యకార్యాన్ని (నామస్మరణం) గతజన్మలో చేయకపోవడం వలెనే, ఇప్పుడు ‘ఈ దుఃఖభాజకమైన జన్మ’ కలిగింది.
స్వస్తి.
చొప్పకట్ల సత్యనారాయణ.
బ్రహ్మశ్రీ చొప్పకట్ల సత్యనారాయణగారికి అభ్గినందన పూర్వక ధన్యవాదములు.
జైహింద్.

22, ఫిబ్రవరి 2020, శనివారం

శ్రీ రుద్రము విశిష్టత. .. .. .. బ్రహ్మశ్రీ చొప్పకట్ల సత్యనారాయణ గారి వివరణ.

0 comments

జైశ్రీరామ్.
శ్రీ రుద్రం విశిష్టత :ను గూర్చి బ్రహ్మశ్రీ చొప్పకట్ల సత్యనారాయణ గారి వివరణ్ చూడండి.
శత రుద్రీయం యజుర్వేదంలో భాగం. ఇది మరణాన్ని సహితం అధిగమించగల్గిన సాధనం. జన్మకు మృత్యువుకు అతీతంగా ఉండే తత్వాన్ని సూచిస్తుంది. మనిషిలో శ్వాస నింపేది మరల దానిని తీసుకుపోయేది కూడా ఆ పరమాత్మే నని తెలియజేస్తుంది. శ్రీ రుద్రాన్ని రుద్రాప్రస్న అని కూడా అంటారు. వేద మంత్రాలలో ఏంటో ఉత్కృష్టమైనది. శ్రీ రుద్రం రెండు భాగాలలో ఉంటుంది. “నమో” పదం వచ్చే మొదటి భాగం, యజుర్వేదంలో ౧౬వ అధ్యాయంలో ఉంటుంది. దీనిని నమకం అంటారు. రెండవ భాగంలో “చమే” అన్న పదం మరల మరల రావటం వాళ్ళ దీనిని చమకం అంటారు. ఇది ౧౮వ అధ్యాయంలోఉంది.
చమకం నమకం చైవ పురుష సూక్తం తథైవ చ |
నిత్యం త్రయం ప్రాయునజనో బ్రహ్మలోకే మహియతే ||
నమకం చమకం ఎవరైతే మూడు మార్లు పురుష సూక్తంతో ప్రతీ దినం చదువుతారో వాళ్లకు బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది.
నమకం విశిష్టత :
నమకం, చమకం 11 భాగాలు ఉంటాయి. ఒకొక్క భాగాన్ని “అనువాకం” అంటారు. మొదటి అనువాకంలో పరమశివుడిని తన రౌద్ర రూపాన్ని చలించి, తన అనుచరులను, ఆయిదాలను త్యజించమని ప్రసన్నము చేసుకుంటూ ప్రార్ధించేది. శాంతించిన స్వామిని దయతల్చమని ప్రార్ధించు భావం ఉంది. ఈ పంక్తులలో ఎన్నో నిగూఢమైన రహస్యాలు దాగి ఉన్నాయి. కొన్ని ఆయుర్వేద మందులు తయారుచేయు విధానాలు కూడా కనిపిస్తాయి.
అనువాకం – 1:
తమ పాపాలను పోగొట్టి, ఆధిపత్యాన్ని, దైవం యొక్క ఆశీర్వచనం పొందేట్టుగా, చేసి, క్షామం, భయం పోవునట్టు చేసి, ఆహార, గోసంపద సమృద్ధి గావించి, గోసంపదను చావునుండి, ఇతర జంతువులనుండి, జబ్బులనుండికాపాడుతుంది. జ్వర బాధ, జబ్బులు, పిండ-మరణాలు, చెడు కర్మ, నక్షత్ర చెడు ప్రభావాలను తప్పించి, కోర్కెలు తీర్చి, సకాలంలో వానలు కురిపించి, కుటుంబాన్ని పరిరక్షించి, సంతానాన్ని ఆశీర్వదించి, ఐహిక సుఖాలను ప్రసాదించి, శత్రువులను నాశనంచేస్తుంది.
అనువాకం – 2 :
ప్రకృతిలో, సర్వ ఔషధములలో సర్వాంతర్యామి అయిన రుద్రుడికి సంసార బంధాలను సడలించమని ప్రార్ధన.. శత్రు వినాశనానికి, సంపద మరియు రాజ్యప్రాప్తికి, జ్ఞాన సాధనకు ఈ అనువాకాన్ని చదువుతారు.
అనువాకం – 3:
ఈ అనువాకంలో రుద్రుడిని ఒక చోరునిగా వర్ణిస్తుంది. అతడు సర్వాత్మ. ఈ విషయంలో మనిషి ఆ మహాస్వరూపాన్ని అర్ధం చేసుకోక నిమిత్త బుద్ధిని అలవార్చుకున్టాము, ఈ అజ్ఞానాన్ని చౌర్యం చేసి జ్ఞానం అనే వెలుగును మనలో ప్రతిష్టించుతాడు. ఈ అనువాకం వ్యాధి నివారనంకు కూడా చదువుతారు.
అనువాకం – 4:
ఇందులో రుద్రుడు సృష్టి కర్త. కారకుడు. చిన్న పెద్దా ప్రతీది అతడు చేసిన సృష్టే, ఈ అనువాకాన్ని క్షయ, మధుమేహం, కుష్టు వ్యాధి నివారణకై చదువుతారు.:
అనువాకం – 5:
ఈ అనువాకంలో రుద్రుడు పారు నీట ఉండే రూపంగా కొనియాడబడుతాడు. అతడి పంచ తత్వాలు వర్ణించబడతాయి అనగా – సృషి జరపడం, పరిరక్షించడం, నశించడం, అజ్ఞానంలో బంధింపబడడం మరియు మోక్షప్రదానం.
అనువాకం – 6:
ఇందులో రుద్రుడు కాలరూపుడు. అతడు అన్ని లోకాల కారణం, వేద రూపం మరియు వేదాంత సారం.
ఐదు ఆరు అనువాకాలు ఆస్తులు పెంపుకు, శత్రువులమీద విజయానికి, రుద్రుని వంటి పుత్రుడిని కోరుకుంటూ, గర్భస్రావం నివారించడానికి, సుఖ ప్రసవానికి , జ్యోతిష పరమైన ఇబ్బందులను నివారించడానికి, పుత్రుల పరిరక్షనకు కూడా చదువుతారు.
అనువాకం – 7:
నీటిలో, వానలో, మేఘాలలో, ఇలా అన్ని రూపాలలో ఉన్న ర్ద్రుని వర్ణిస్తుంది. ఈ అనువాకాన్ని తెలివితేటలకు, ఆరోగ్యానికి, ఆస్తిని , వారసులను పొందడానికి పశుసంపద, వస్తాలు, భూములు, ఆయుష్షు, మొక్షంకోసం కూడా చదువుతారు.
అనువాకం – 8:
ఇందులో శివుడు ఇతర దేవతలా కారకుడుగాను, వారికీ శక్తి ప్రదాతగాను వర్ణింపబడ్డాడు. యితడు అన్ని పుణ్య నదులలో ఉన్నవాడు, అన్ని పాపాలను పోగొట్టేవాడు. శత్రువులను నాశము చేసి, సామ్రాయ్జ్యాన్ని సాధించడానికి ఈ అనువాకాన్ని చదువుతారు.
అనువాకం –9:
ఈ అనువకంలో రుద్రుని శక్తి, ప్రకాశం సకల దేవతలకు శక్తిని ఇచ్చేవిగా ప్రస్తుతించబడ్డాయి. సృష్టిలో సర్వ శక్తులను శాసించే శివ స్కక్తిని మించి ఇంకొకటి లేదు. ఈ అనువాకాన్ని బంగారముకోసం, మంచి సహచారికోసం, ఉద్యోగం, ఈశ్వర భక్తుడైన పుత్రుని కోసం చేస్తారు.
అనువాకం – 10:
ఈ అనువాకంలో మల్ల రుద్రుడిని తన ఘోర రూపాన్ని ఉపసమించి, పినాకధారియైనా, అమ్బులను విడిచిపెట్టి, వ్యాఘ్ర జీనాంబరధారియై ప్రసన్నవదనంతో, దర్శనమివ్వవలసిందిగా ప్రార్ధన ఉంటుంది. ఈ అనువాకాన్ని ఐశ్వర్యం కోసం , వ్యాధినివృత్తికై, శక్తిమంతులతో వైరం పోగొట్టుటకు, భైరవ దర్శనార్ధమై, అన్నిరకముల భయములను పోగొట్టుటకు, అన్ని పాపాలను పోగొట్టుటకు చదువుతారు.
అనువాకం – 11:
ఈ అనువాకంలో రుద్రుని గొప్పతనాన్ని ప్రస్తుతించి, అతని కరుణా ప్రాప్తికై నిర్బంధమైన నమస్సులు అర్పించబడుతాయి. ఈ అనువాకాన్ని తమ సంతాన సౌఖ్యంకోసం, ఆయురారోగ్యవృద్ధి కోసం, పుణ్య తీర్తి దర్శన ఆకాంక్షతో, పూర్వ, ప్రస్తుత, వచ్చేకాలం యొక్క జ్ఞానానికి చదువుతారు.

*చమకం విశిష్టత:*
నమకం చదివిన తర్వాత, భక్తుడు తనే శివ రూపంగా భావించి దేవదేవుడిని తనకు సర్వం ప్రసాదించమని ప్రార్ధన చేసేది చమకం. ఇది ప్రతీ ఒక్కరికి పనికి వచ్చేది.
జ్ఞానం నుండి మోక్షం కలిగే మార్గములో ప్రతీ పనిని మనిషి ఆస్వాదించి, చివరకు అంతులేని ఆనందం కలగచేసే మంత్రం.
సృష్టి కర్తకు ఒక ప్రాణి నుండి ఇంకో ప్రాణికి విభేదం లేడు. సమస్తం అతనినుంది ఉద్భవించినది కనుక, మోక్ష కాంక్ష దైవత్వమునకు సూచనే.
స్వస్తి.
బ్రహ్మశ్రీ చొప్పకట్ల సత్యనారాయణ గారికి కృతజ్ఞతలు.
జైహింద్..

21, ఫిబ్రవరి 2020, శుక్రవారం

మహాశివరాత్రి మరియు మాతృభాషాదినోత్సవ శుభాకాంక్షలు.

0 comments

జైశ్రీరామ్.
🙏🏻ఓం నమశ్శివాయ🙏🏻

యావదాంధ్రులకు
శివరాత్రిపర్వ దినోత్సవముతో పాటూ
మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు.💐

శా. వాగర్థంబుల మేళవింపె మనకీ భాస్వన్మహాలింగమై

యోగం బీయఁగ నుద్భవించు, మది నోహోయంచు మెచ్చంగ, శో

భాగాంభీర్యము లద్భుతంబు గొలుపన్ ప్రఖ్యాత భాషాధృతిన్

జాగృన్మార్గము నుంచగా మనల, ధీశాళిన్ కృపన్ బ్రోవగన్.

ఆత్మలింగోద్భవాద్భుతానుభూతినొందనున్న మహనీయులైన మీ అందరికీ నా వందనములు.
శివోఽహమ్.
చింతా రామకృష్ణారావు.🙏🏻
జైహింద్.

శ్రీ శివాష్టోత్తరశత పంచచామరావళి (శివ శతకము)

1 comments

 జైశ్రీరామ్.
ఓం నమశ్శివాయ.
జైహింద్.

శివరాత్రి సందర్భముగా శుభాకాంక్షలు.

0 comments

జైశ్రీరామ్.
  
ఓమ్ నమశ్శివాయ.
ఈ రోజు సదాశివుఁడు మనలననుగ్రహించే పరమ పవిత్రమైన శివరాత్రి.
ఈ సందర్భముగా మీ అందరికీ ఆ పరమేశ్వరానుగ్రహము ప్రాప్తించాలని మనసారా కోరుకొంటూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియఁజేసుకొంటున్నాను.
జైహింద్.

20, ఫిబ్రవరి 2020, గురువారం

మామామ మా మమేమామా .. .. ఏకాక్షర పద విన్యాసము (శ్రీ శ్రీభాష్యం విజయసారథి గారి ‘ప్రహేళికలు’ సంకలనం నుండి)

0 comments

 జైశ్రీరామ్.
ఏకాక్షర (ఏకవ్యంజన) శ్లోకం
మామామ మా మమేమామా మామూమామేమమేమమే | 
మామామేమిమిమేమామ మమోమామామమామమీ ||
పదవిభాగం - మామ్, ఆమ, మా, మమ, ఇమాం, ఆమామూమ, అమేం, అమ, ఈం, అమే, అమామ్, అమః, మేమి (మా + ఏమి), మిమే, మామం (మా + అమం), అమః, మామామ (మా + అమామ), మామ్, అమీ. అన్వయం - మమ, మా, ఇమాం, మామ్, ఆమ, అమేం (అమా + ఈం), ఈం, అమ్, ఆమామూమ, అమే, మే, అమ, అమామ్, మేమి (మా + ఏమి), అమః, మామం (మా + అమం), మిమే, అమీ, మామ్, మామామ (మా + అమామ).
ప్రతిపదార్థము.
మమ = నా యొక్క
మా = బుద్ధి
ఇమాం మామ్ = ఈ లక్ష్మిని
ఆమ = పొందెను.
అమేం - అమా = సహితురాలైన
ఈం = లక్ష్మి గల
అమ్ = నీ పాదాన్ని
ఆమామూము = ఆశ్రయించాము.
అమే = ఓ దుర్బుద్ధీ (జ్యేష్ఠాదేవీ)!
మే = నాకు
అమ = దూరంగా వెళ్ళు.
అమామ్ = లక్ష్మికంటె వేరైన దేవతను
మా + ఏమి = పొందను.
అమః = బంధరహితుడనై
మా = లక్ష్మి యొక్క
అమమ్ = ప్రాపును
మిమే = అపేక్షిస్తాను.
అమీ = ఈ మేము
మామ్ = ప్రమాణమైన శాస్త్రాన్ని
మా + అమామ = అతిక్రమింపము.
జైహింద్.

19, ఫిబ్రవరి 2020, బుధవారం

శ్రీ మహర్షి మహేష్ యోగి జీవిత చరిత్ర....రచన...శ్రీ పెడసనగంటి సీతారామ మూర్తి శర్మ అవధాని.

0 comments

జైశ్రీరామ్.

జైహింద్.

18, ఫిబ్రవరి 2020, మంగళవారం

పాండురంగ మాహాత్మ్యములోని ఖడ్గబంధము.డా. వివరణము. దేవగుప్తాపు సూర్య గణపతిరావు కవి

0 comments



జైశ్రీరామ్.
ఆర్యులారా! 
డా. దేవగుప్తాపు సూర్య గణపతిరావు కవి 
విశదీకరించిన 
పాండురంగ మహత్యములోని ఖడ్గబంధము.
తెనాలి రామకృష్దుని కవితాఝరి.......
జయ విజయ పూర్వవిభవ! వి
జయ జయ కల్పనధురీణ! సమదదనుజరా
డ్జయ! సంరక్షిత భువనా!
జయజయ! సుగుణా!గుణాత్మ! జయ
శార్ఙ్గధరా!
పాం.మ. 4 -91

విజయపూర్వకమగు సంపద కలవాడా! ( నీకెచ్చట విజయము కలిగిననూ తోడనే సంపద లభించుననుట)
విజయ కల్పనముచేయుటలో నిపుణుడా!
మదించిన రాక్షసరాజులను జయించినవాడా!
రక్షింపబడిన భువనములు కలవాడా!
చక్కనిగుణములు కలిగినవాడా!
ఓ శార్ఞ్గమును ధరించినవాడా!
నీకు జయము! జయమగుగాక!
ఈ పద్యమున ఒక "చిత్ర" మున్నది. ఈ విషయము ఇప్పటివరకూ ఎవ్వరూ చూపి యుండలేదు. ఆ అదృష్టము నాకు దక్కవలసియున్నది కాబోలును.
ఈ పద్యము "ఖఢ్గబంధము" నందు ఇముడును. ఒక కవి బంధకవిత్వము వ్రాసినచో దానిని సూచింపవలెను. లేనిచో గుర్తించుట సాధ్యము కాదు.
నాకు బంధకవిత్వముతో చిరుపరిచయముండుటచే నేనీ విషయము గుర్తించితిని.
ఈ క్రింద పద్యమును బంధమునందిమిడ్చి చిత్రము పొందుపరచుచున్నాను.
ఈ బంధమును గురించి *రెండుమాటలు*
రామకృష్ణుడు ఈ బంధము పనిగట్టుకుని వ్రాసినాడా? అన్నది ప్రశ్న.
వ్రాసి యుండడనే నా నమ్మకము. కారణములు వివరింతును. దీనికి 2 కారణములు చెప్పవచ్చును.
1. పద్యము శార్ఙ్గధరా అని ముగించుట. శార్ఙ్గము విష్ణువుయొక్క విల్లు. నిజమునకు ఆతడు ఖడ్గబంధమే చెయ్యబూనిన పద్యము "నందకధరా" అని ముగించియుండెడివాడు. ఎవరేని నందకధరా అనుపదము కందమున చివర ఇముడజాలదందురేని ఖడ్గధరా అనియో తత్ప్రత్యామ్నాయమో వాడియుండెడి వాడు.
2. కత్తి అంచుల వెంబడి అక్షరముల సంఖ్య సమానముగా ఉండునట్లు చెప్పుట సాధారణము. అప్పుడే బంధమునకు సౌష్ఠవము కలుగును.
కత్తి పై అంచు వెంబడి (నా - డ్జ) 9 అక్షరములు, కత్తి క్రింది అంచు వెంబడి
(సు - ధ) 11 అక్షరములూ వచ్చెను. ఇట్టివి బంధకవిత్వారంభకులు చేయు పొరపాట్లు.
ఇట్టి పొరపాటు రామకృష్ణుని వంటి వాడు సేయడు.
అయిననూ చిత్రముగా ఈ పద్యము ఖడ్గబంధమున ఇమిడినది. ఇది యాదృచ్చకమే యని నా నమ్మకము.
మిగిలిన స్తుతిపద్యములలో కూడ ఏవేని బంధములు ఉన్నవా? యనునది పరిశీలనార్హము.
 స్వస్తి.
డా. దేవగుప్తాపు సూర్య గణపతిరావు కవికి అభినందన పూర్వక ధన్యవాదములు.
జైహింద్.

17, ఫిబ్రవరి 2020, సోమవారం

కోహిర్ లో అష్టావధానానికి స్వాగతమ్.

0 comments

 జైశ్రీరామ్.
జైహింద్.

16, ఫిబ్రవరి 2020, ఆదివారం

కవిత ధ్వనిపూర్వకంగా ఉండాలి. .. .. .. శ్రీ బిక్కి కృష్ణ. వ్యాసము ఆంధ్రప్రభ దిన పత్రికలో.

0 comments

 జైశ్రీరామ్.

జైహింద్.

15, ఫిబ్రవరి 2020, శనివారం

కాశీ మాహాత్మ్యము.

0 comments

జై శ్రీరామ్.
🙏🙏వారణాసి (కాశీి) గురించి తెలియని కొన్ని విషయాలు
కాశీ వైభవాన్ని పూర్తిగా తెలపడం దేవతలకు కూడా సాధ్యం కాదు. సముద్రం నుండి నీటి బిందువు లాంటి సంక్షిప్త సమాచారం:

1.  కాశీ పట్టణం గొడుగు లాంటి పంచ క్రోశాల పరిధి లో ఏర్పడ్డ భూభాగం. ఇది లింగం లాంటి పరమేశ్వర స్వరూపం కలిగి ధనుస్సాకారం లో ఉంటుంది. కాశీ బ్రహ్మ దేవుని సృష్టి లోనిది కాదు.

2.  విష్ణు మూర్తి హృదయం నుండి వెలువడి, సృష్టి ఆరంభంలో శివుడు నిర్మించుకున్న ప్రత్యేక స్థలం.

3. ప్రపంచానికి ఆధ్యాత్మిక రాజధాని. ప్రపంచ సాంస్కృతిక నగరం.
4. స్వయంగా శివుడు నివాసముండె నగరం.

5. ప్రళయ కాలంలో మునుగని అతి ప్రాచీన పట్టణం. శివుడు ప్రళయ కాలంలో తన త్రిశూలంతో కాశీని పైకెత్తి కాపాడతాడు.
6. కాశీ భువి పైన సప్త మోక్ష ద్వారాలలో ఒకటి, కాశీ పన్నెందు జోతిర్లింగాలలో కెల్లా శ్రేష్ఠమైనది.

7. పద్నాలుగు భువన భాండాలలో విశేషమైన స్థలం.

8. కాశీలో గంగా స్నానం,బిందు మాధవ దర్శనం, అనంతరం మొదట డిండి వినాయకుడు, విశ్వనాథుడు,విశాలాక్షి, కాలభైరవ దర్శనము అతి ముఖ్యం....

9. ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప క్షేత్ర పాలకుడు బైరవుడు జీవిని కాశీ లోనికి అనుమతించడు.

10. కాశీలో మరణించిన వారికీ యమ బాధ పునర్ జన్మ ఉండదు.

11. కాశీ ప్రవేశించిన జీవి యొక్క చిట్టా చిత్రాగుప్తుని నుండి మాయం అయి కాలభైరవుని వద్దకు చేరుతుంది....

12. డిండి గణపతి, కాల భైరవుడు పరిశీలించి యమ యాతన కంటే 32 రేట్లు అధిక శిక్షలు విధించి మరు జన్మ లేకుండా చేస్తాడు ...

13. కాబట్టే కాశీలో కాల భైరవ దర్శనం తరవాత పూజారులు వీపు పై కర్రతో కొట్టి దర్శించిన వారు కాశీ దాటి వెళ్లి పోయినా పాపాలు అంటకుండా రక్ష నల్లని కాశి దారం కడతారు.

14. కాశీ వాసం చేసే వారికి సమస్త యాగాలు, తపస్సులు చేసిన పుణ్యం తో పాటు అన్ని చక్రాలు ఉత్తేజితమైతాయి.

15. కాశీలో మరణించిన ప్రతి జీవికి శివుడు దర్శనమిచ్చి వారి కుడి చెవిలో తారక మంత్రం పలికి మోక్షం ప్రసాదిస్తాడు.

16. అందుకే కాశ్యాన్తు మరణాన్ ముక్తి అని శాస్త్ర వచనం కాబట్టే చివరి జీవితం చాలా మంది కాశీలో గడుపుతారు.

17. మరణించిన వారి ఆస్తికలు కాశి గంగలో కలిపితే గతించిన వారు మళ్ళీ కాశీలో జన్మించి స్వయంగా విశ్వనాథునిచే ఉద్దరింప బడతారు.

18. గోముఖం నుండి బయలుదేరే గంగమ్మ విచిత్రంగా దారి మళ్లి దక్షిణ దిశగా ప్రవహించి దన్నుసాకారపు కాశీి పట్టణాన్ని చుట్టి తిరిగి తన దారిలో ప్రవహిస్తుంది

19. ఎంత కరువు వచ్చినా గంగమ్మ కాశీ ఘాట్లను వదిలి దూరం జరగలేదు.

 శివుని కాశీలోని కొన్ని వింతలు......

1. కాశీలో గ్రద్దలు ఎగరవు, గోవులు పొడవవు, బల్లులు అరవవు, శవాలు వాసన పట్టవు, కాశీలో మరణించిన ప్రతి జీవి కుడి చెవి పైకి లేచి ఉంటుంది.

2. కాశీలో మందిరం చుట్టూ అనేక చిన్న తోవ సందులు కలిగి అట్టి సందులు అనేక వలయాకారాల్లో చుట్టినట్టు ఉండి ఒక పద్మవ్యూహం లాగా కొత్త వారికీ జాడ దొరకకుండా ఉంటుంది.

3. కానీ పూర్వం ఇక్కడ అనేక సుందర వనాలు, పూలచెట్ల మధ్య ఉన్న మందిరాన్ని విదేశీ దండ యాత్రికుల దాడుల నుండి కాపాడుకోవడానికి ప్రజలంతా గుడి చుట్టూ పెద్ద పెద్ద బంగళాలు కట్టి శత్రు సైనికులకు దారి లేకుండా చేసినారు.

4. అనేక దేశాల నుండి పెద్ద పెద్ద శాస్త్ర వేత్తలు వచ్చి కాశీి లో అనేక రీసెర్చ్ లు జరిపి ఆశ్చర్య పోయ్యారు.

5. అస్సలు ఈ కాస్మోర్స్ ఎక్కడి నిండి వస్తున్నాయి?

6. అప్పటి పూర్వికులు శక్తి చలనం వున్న చోటల్లా మందిరాలు నిర్మించారు

7. అంత పరిజ్ఞానం ఆ రోజుల్లో వారికీ ఎక్కడిది అని ఆశ్చర్యానికి గురైనారు.

8. కాశీి విశ్వేశ్వరునికి శవ భస్మ లేపనం తో పూజ ప్రారంభిస్తారు .

9. కాశీలోని పరాన్న భుక్తేశ్వరుణ్ణి దర్శిస్తే జీవికి పరుల అన్నం తిన్న ఋణం నుండి ముక్తి లభిస్తుంది.

10. కాశీ క్షేత్రంలో పుణ్యం చేస్తే కోటి రెట్ల ఫలితం ఉంటుంది; పాపం చేసినా కోటి రెట్ల పాపం అంటుతుంది.

11. విశ్వనాథుణ్ణి అభిషేకించిన తరవాత చేతి రేఖలు మారిపోతాయి.

12. ఇక్కడి శక్తి పీఠం విశాలాక్షి అమ్మవారు జగత్ అంతటికీ అన్నం పెట్టే అన్నపూర్ణ దేవి నివాస స్థలం కాశి.

13.  ప్రపంచంలోని అన్ని భాషలకు తల్లి అయిన అతి ప్రాచీన సంస్కృత పీఠం కాశీిలోనే వున్నది.

కాశీలో గంగమ్మ తీరాన 84 ఘాట్లు వున్నాయి......

ఇందులో దేవతలు, ఋషులు, రాజుల తో పాటు ఎందరో తమ తపశ్శక్తితో నిర్మించినవి ఎన్నో వున్నాయి. అందులో కొన్ని :

1) దశాశ్వమేధ ఘాట్:
బ్రహ్మ దేవుడు 10 సార్లు అశ్వమేధ యాగం చేసినది ఇక్కడే. రోజూ సాయకాలం విశేషమైన గంగా హారతి జరుగుతున్నది.

2) ప్రయాగ్ ఘాట్:
ఇక్కడ భూగర్భంలో గంగతో యమునా,సరస్వతిలు కలుస్తాయి.

3) సోమేశ్వర్ ఘాట్:
చంద్రుని చేత నిర్మితమైనది.

4) మీర్ ఘాట్:
సతీదేవీ కన్ను పడిన స్థలం. విశాలాక్షి దేవి శక్తి పీఠం.
ఇక్కడే యముడు ప్రతిష్టించిన లింగం ఉంటుంది.

5) నేపాలీ ఘాట్:
పశుపతి నాథ్ మందిరం బంగారు కలశంతో నేపాల్ రాజు కట్టినాడు.

6) మణి కర్ణికా ఘాట్:
ఇది కాశీలో మొట్ట మొదటిది. దీనిని విష్ణు దేవుడు స్వయంగా సుదర్శన చక్రంతో తవ్వి నిర్మించాడు. ఇక్కడ సకల దేవతలు స్నానం చేస్తారు ఇక్కడ గంగ నిర్మలంగా పారుతుంది. ఇక్కడ మధ్యాహ్నం సమయంలో ఎవరైనా సుచేల స్నానం చేస్తే వారికి జన్మ జన్మల పాపాలు తొలిగి పోతాయి. జీవికి ఎంత పుణ్యం ప్రాప్తిస్తుందో చతుర్ ముఖ బ్రహ్మ దేవుడు కూడా వర్ణించలేడట.

7) విష్వేవర్ ఘాట్:
ఇప్పుడు సింధియా ఘాట్ అంటారు. ఇక్కడే అహల్యా బాయి తప్పసు చేసింది. ఇక్కడ స్నానం చేసే బిందు మాధవుణ్ణి దర్శిస్తారు.

8) పంచ గంగా ఘాట్:
ఇక్కడే భూగర్భం నుండి గంగలో 5 నదులు కలుస్తాయి.

9) గాయ్ ఘాట్:
గోపూజ జరుగుతున్నది.

10) తులసి ఘాట్:
తులసి దాస్ సాధన చేసి రామాచరిత మానస్ లిఖించమని శివుని ఆదేశం పొందినది.

11) హనుమాన్ ఘాట్:
ఇక్కడ జరిగే రామ కథ వినడానికి హనుమంతుడు వస్తుంటాడు. ఇక్కడే సూర్యుడు తపస్సు చేసి అనేక శక్తులు పొందిన లోలార్క్ కుండం వున్నది
ఇక్కడే శ్రీ వల్లభాచార్యులు జన్మించారు.

12) అస్సి ఘాట్:
పూర్వం దుర్గా దేవి శుంభ, నిశుంభ అను రాక్షసులను చంపి అట్టి ఖడ్గంను వెయ్యడం వల్ల ఇక్కడ ఒక తీర్థం ఉద్బవించింది.

13) హరిశ్చంద్ర ఘాట్:
సర్వం పోగొట్టుకొని హరిశ్చంద్రుడు ఇక్కడ శవ దహన కూలీగా పని చేసి దైవ పరీక్షలో నెగ్గి తన రాజ్యాన్ని పొందినాడు. నేటికి ఇక్కడ నిత్యం చితి కాలుతూ ఉంటుంది...

14) మానస సరోవర్ ఘాట్:
ఇక్కడ కైలాసపర్వతం నుండి భూగర్భ జలధార కలుస్తున్నది.
ఇక్కడ స్నానం చేస్తే కైలాస పర్వతం చుట్టిన పుణ్యం లభిస్తున్నది.

15) నారద ఘాట్:
నారదుడు లింగం స్థాపించాడు.

16)చౌతస్సి ఘాట్:
ఇక్కడే స్కంధపురాణం ప్రకారం ఇక్కడ 64 యోగినిలు తపస్సు చేసినారు.
ఇది దత్తాత్రేయునికి ప్రీతి గల స్థలం... ఇక్కడ స్నానం చేస్తే పాపాలు తొలిగి 64 యోగినుల శక్తులు ప్రాప్తిస్తాయి.

17) రానా మహల్ ఘాట్:
ఇక్కడే పూర్వం బ్రహ్మ దేవుడు సృష్టి కార్యంలో కలిగే విఘ్నాలను తొలగించమని వక్రతుండ వినాయకుణ్ణి తపస్సు చేసి ప్రసన్నుణ్ణి చేసుకున్నాడు.

18)అహిల్యా బాయి ఘాట్

ఈమె కారణంగానే మనం ఈరోజు కాశీ
విశ్వనాథుణ్ణి దర్శిస్తున్నాము.

కాశీలోని గంగా నది ప్రవాహంలో అనేక ఘాట్ల దగ్గర ఉద్భవించే తీర్థాలు కలిసి ఉంటాయి.

పూర్వం కాశీలో దేవతలు ఋషులు రాజులూ నిర్మించిన అనేక మందిరాలు కట్టడాలు వనాల మధ్య విశ్వనాథుని మందిరం ఎంతో వైభవోపేతంగా వెలుగొందింది.

కానీ మహమ్మదీయ దండ యాత్రికులు కాశీని లక్ష్యంగా చేసుకొని దాడులు చేసి ధ్వంసం చేసిన తరవాతి కాశిని మనం చూస్తున్నాము.

విశ్వనాథ, బిందు మాధవ తో పాటు ఎన్నో అనేక మందిరాలను కూల్చి మసీదులు కట్టినారు.

నేటికీ విశ్వనాథ మందిరంలో నంది, మసీదు వైపు గల కూల్చ బడ్డ మందిరం వైపు చూస్తోంది.

అక్కడే శివుడు త్రిశూలం తో త్రవ్విన జ్ఞానవాపి తీర్థం బావి ఉంటుంది.

ఈరోజు మనం దర్శించే విశ్వనాథ మందిర అసలు మందిరానికి పక్కన ఇండోర్ రాణి శ్రీ అహల్యా బాయి హోల్కర్ గారు కట్టించారు

కాశీ స్మరణం మోక్షకారకం!

కాశీ విశ్వనాధాష్టకం

గంగాతరంగ రమణీయ జటా కలాపం,
గౌరీ నిరంతర విభూషిత వామ భాగం;
నారాయనః ప్రియ మదంగ మదాప హారం,
వారాణసి పురఃపతిం భజ విశ్వనాథం.||1||

వాచామ గోచర మనేక గుణ స్వరూపం,
వాగీశ విష్ణు సుర సేవిత పాద పీఠం;
వామేన విగ్రహవరేణ కళత్ర వంతం,
వారాణసి పురఃపతిం భజ విశ్వనాథం.||2||

భూతాదిపం భుజగ భూషణ భూషితాంగం,
వ్యాగ్రాజిలాం భరధరం జటిలం త్రినేత్రం;
పాశాంకుసాభయ వర ప్రద శూల పాణిం,
వారాణసి పురఃపతిం భజ విశ్వనాథం.||3||

సితాంసుశోభిత కిరీట విరాజ మానం,
పాలేక్షణానల విశోసిత పంచ భానం;
నాగాధిపారచిత భాసుర కర్ణ పూరం,
వారాణసి పురఃపతిం భజ విశ్వనాథం.||4||

పంచానలం దురిత మత్త మతంగ జానాం,
నాగాంతకం దనుజ పుంగవ పన్న గానాం;
దావానలం మరణ శోక జరాట వీణా,
వారాణసి పురఃపతిం భజ విశ్వనాథం.||5||

తేజోమయం సగుణ నిర్గుణ మద్వితీయం,
ఆనంద కంద మపిరాజిత మప్రమేయం;
నాగాత్మకం సకల నిష్కలమాత్మ రూపం,
వారాణసి పురఃపతిం భజ విశ్వనాథం.||6||

ఆశాం విహాయ పరిహృత్య పరస్యనింత,
ఉపేరతించ సునివార్య మనఃసమాదౌ;
ఆదాయ హృత్కమల మధ్య గతం ప్రదేశం,
వారాణసి పురఃపతిం భజ విశ్వనాథం.||7||

నాగాధి దోష రహిత స్వజనానురాగం,
వైరాగ్య శాంతి నిలయం గిరిజా సహాయం;
మాధుర్య ధైర్య సుభగం గరళాభిరామం,
వారాణసి పురఃపతిం భజ విశ్వనాథం.||8||

వారాణసీ పురపతేః స్థవనం శివస్య,
వ్యాసోత్త మిష్ఠక మిదం పఠితా మనుష్య;
విద్యాం శ్రియం విపుల సౌక్య మనంత కీర్తిం,
సంప్రాప్య దేహ నిలయే లభతేచ మోక్షం.||9||

విశ్వనాధాష్టక మిదం యః పఠేచిత శివ సన్నిదౌ,
శివలోక మవాప్నోతి శివేన సహమోదతే.
జైహింద్.

14, ఫిబ్రవరి 2020, శుక్రవారం

శ్రీశ్రీశ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారికి గురుపూజోత్సవము // కొప్పరపు పురస్కారాలు 201

1 comments

జైశ్రీరామ్.
శ్రీశ్రీశ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారికి గురుపూజోత్సవము // కొప్పరపు పురస్కారాలు 2019.
జైహింద్.

13, ఫిబ్రవరి 2020, గురువారం

జ్ఞానము కర్మ....డా.ధూళిపాళ మహదేవమణి.

0 comments

 జైశ్రీరామ్.

జైహింద్.

12, ఫిబ్రవరి 2020, బుధవారం

బ్రహ్మశ్రీ బాబూ దేవీదాసు రావు గారికి ధన్యవాదములు.

0 comments

 జైశ్రీరామ్
ఆర్యులకు నమస్సులు.
గత ఆదివారం తే.09 . 02 . 2020ని
బ్రహ్మశ్రీ బాబూ దేవీదాసురావు గారు అవ్యాజ అనురాగముతో మా ఇంటికి వచ్చి మాకెంతో ఆనందం కలుగ జేశారు.
వారిని సత్కరించుకొనే భాగ్యం మాకు ఆ పరమాత్మ ఇచ్చాడు. మాకెంతో సంతోషం కలిగింది.
అభిమానంగా మా యింటికి వచ్చినందులకు వీరికి మా కుటుంబీకులం ధన్యవాదాలు తెలుపుకొంటున్నాము. 

జైహింద్.

11, ఫిబ్రవరి 2020, మంగళవారం

లలితాదిత్య శతావధాన దృశ్యమ్

0 comments

జైశ్రీరామ్.
అమెరికా అబ్బాయి లలితాదిత్య శతావధానం.
తే.29/30/31/December2019.
జైహింద్.

10, ఫిబ్రవరి 2020, సోమవారం

మేడసానివారి ప్రతిభ. దత్త పది.

1 comments

జైశ్రీరామ్.
జైహింద్.

9, ఫిబ్రవరి 2020, ఆదివారం

సరస్వతీ సూక్తము.

1 comments

 జైశ్రీరామ్.
జైహింద్.

8, ఫిబ్రవరి 2020, శనివారం

దర్శనం ఆధ్యాత్మిక వార్తా మాసపత్రికలో శ్రీ లలితాదిత్య అవధాన వైభవమ్..... రచన చింతా రామకృష్ణారావు.

1 comments

జైశ్రీరామ్.

జైహింద్.


7, ఫిబ్రవరి 2020, శుక్రవారం

అనంతసాగరం సరస్వతీ ప్రభ

0 comments

 జైశ్రీరామ్.
అనంతసాగరం సరస్వతీ ప్రభ.
జైహింద్.

6, ఫిబ్రవరి 2020, గురువారం

అనంతసాగరం సరస్వతీ ప్రభ

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

5, ఫిబ్రవరి 2020, బుధవారం

రాఘవ పాండవీయము 4 వ భాగము డా.రేవూరి అనంత పద్మనాభరావు.

0 comments

 జైశ్రీరామ్.
జైహింద్.

4, ఫిబ్రవరి 2020, మంగళవారం

రాఘవ పాండవీయము 3 వ భాగము. డా.రేవూరి అనంత పద్మనాభరావు.

0 comments

 జైశ్రీరామ్.
జైహింద్.

3, ఫిబ్రవరి 2020, సోమవారం

రాఘవ పాండవీయము 2 వ భాగము. డా.రేవూరి అనంత పద్మనాభరావు.

0 comments

 జైశ్రీరామ్.
జైహింద్.

2, ఫిబ్రవరి 2020, ఆదివారం

రాఘవ పాండవీయము. 1 వ భాగము. డా. రేవూరి అనంత పద్మనాభరావు.

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

1, ఫిబ్రవరి 2020, శనివారం

రథసప్తమి శుభాకాంక్షలు.

0 comments

🙏🏻ఓం నమో నారాయణాయ🙏🏻

ఆర్యఆర్యులారా!
శుభోదయమ్.💐

రథసప్తమీ పర్వదినమయిన నేడు మీరు మంచి సంకల్పముతో చేయు పూజలు ఫలించునుగాక.

మీకందరికీ నా శుభాకాంక్షలు.💐

శా. సప్తాశ్వాద్భుత సద్రథాన రవి తా సంచారమున్ చేయుచున్

ప్రాప్తింపంగను జేయఁగన్ శుభములన్ వచ్చెన్ బృహత్ సప్తమిన్.

సప్తమ్యాం, స్థిరవాసరే, యనుచు సత్ సంకల్పము చేయుడీ.

ప్రాప్తించున్ శుభ సంహతుల్ తమకు సంవర్ధిల్లఁ జేయున్ మిమున్.

🙏🏻జైశ్రీమన్నారారణ🙏🏻
చింతా రామకృష్ణారావు.
జైహింద్.

డా.ఆశావాది ప్రకాశరావుగారికి అవధాన పురస్కార సమర్చన.

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.