గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

25, ఫిబ్రవరి 2017, శనివారం

నేను రచించిన నవాక్షర సమ వృత్త (నీలోత్పల) - కంద త్రయ, - మణిగణనికర(శశికళా)వృత్త - గర్భిత సరసిజ వృత్తము:

జైశ్రీరామ్.
సరసిజ
నవాక్షర సమ వృత్త (నీలోత్పల) - కంద త్రయ, - మణిగణనికర(శశికళా)వృత్త - గర్భిత సరసిజ వృత్తము: *
[లక్షణము: మ - - - - - - - స... గణములుండును.
యతి:1-10-18 యక్షరములకు... ప్రాసపాటింపఁబడును]
భావావేశోద్భాప్రభావా! భవ నుత వర నిను వని గను దివిజుల్!
దేవీ! దుర్గా దేవత ధీవై, దివిజుగ ననుగను తిరముగ తెలియన్.
నీ వానిన్, నే నీవెగ! నీవే నివసన మొసగుమ నిరుపమ. కవితై
కావన్ వచ్చే కావలి కావా? కవిగను నిలుపుమ కరుణను భువిపై.
1. సరసిజ వృత్త గర్భిత నవాక్షరసమ (నీలోత్పల) వృత్తము : - గణములు
యతి 1- 5
భావావేశోద్భాప్రభావా
దేవీ! దుర్గా దేవత ధీవై,
నీ వానిన్, నే నీవెగ! నీవే 
కావన్ వచ్చే కావలి కావా?
2. సరసిజ వృత్త గర్భిత కందము(1)
భావావేశోద్భాప్ర
భావా! భవ నుత వర నిను వని గను దివిజుల్!
దేవీ! దుర్గా దేవత 
ధీవై, దివిజుగ ననుగను తిరముగ తెలియన్.
3. సరసిజ వృత్త గర్భిత కందము(2)
నీ వానిన్, నే నీవెగ! 
నీవే నివసన మొసగుమ నిరుపమ. కవితై
కావన్ వచ్చే కావలి 
కావా? కవిగను నిలుపుమ కరుణను భువిపై.
4. సరసిజ వృత్త గర్భిత కందము(3)
భవ నుత వర నిను వని గను 
దివిజుల్! తెరవున ననుగను తిరముగ తెలివిన్.
నివసన మొసగుమ నిరుపమ. 
కవితై ఘనతను గొలుపుమ కరుణను భువిపై.
5. సరసిజ వృత్త గర్భిత మణిగణనికర (శశికళా) వృత్తము[న---- గణములు.యతి:1-9]
భవ నుత వర నిను వని గను దివిజుల్! 
దివిజుగ ననుగను తిరముగ తెలియన్.
నివసన మొసగుమ నిరుపమ. కవితై 
కవిగను నిలుపుమ కరుణను భువిపై. 
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
వివిధ వృత్తముల పలు ఛందస్సులతో బంధింప బడిన పాండితీ స్రష్ట సోదరుల ప్రతిభకు జోహార్లు .అభినందన మందారములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.