గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

27, అక్టోబర్ 2016, గురువారం

9 సంఖ్య ప్రాముఖ్యం . . . శ్రీరామకవచం సుబ్రహ్మణ్యం

జైశ్రీరామ్.
సంఖ్య 9 ప్రాముఖ్యం ::
8 +1 = 9
7 + 2 = 9
6 + 3 = 9
5 + 4 = 9
9 + 8 + 7 + 6 + 5 + 4 + 3 + 2 + 1 = 45. 4 + 5 = 9
మహాభారతంలో 18 సంఖ్యకు చాలా ప్రాముఖ్యం ఉన్నది. వ్యాస భగవానునికి 18వ సంఖ్య ప్రీతికరమైనది. భారతంలో కాకుండా రామాయణంలో కూడా 18 కాండములు ఉన్నాయి.
9వ సంఖ్య ప్రాముఖ్యం
9 సంఖ్యకు జోతిషశాస్త్రంలో ప్రాముఖ్యం కనిపిస్తున్నది. నక్షత్రములు 27 అనగా 2 + 9 = 9.
ప్రతి నక్షత్రానికి అధిదేవతలు ఆయా నక్షత్రాలు అనుసరించి చెప్పబడ్డాయి.
27 నక్షత్రములకు - 27 అధిదేవతలు.
27 నక్షత్రములు - 27 ఆకృతులు - 27 వర్ణాలు.
ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలుగా విభజించడం వలన 27 నక్షత్రాలకు 108 పాదాలు. ఒక్కొక్క పాద ప్రమాణం 3 డిగ్రీల 20 నిమిషాలు. 27 నక్షత్రాలు - 108 పాదాలు. 12 రాశులు. ఒక్కోరాశి ప్రమాణం 30 డిగ్రీలు. 12 రాశుల మొత్తం ప్రమాణం 360 దిగ్రీలుగా చెప్పాలి. 3 + 6 = 9గా వస్తుంది.
1 + 8 = 9
10 + 8 = 18 = 9
1 + 8 = 9
2 + 7 = 9
ఒక్కొక్కరాశికి 9 పాదాలు - 12 రాశులకు 12 క్ష్ 9 = 108. 108 = 1 + 8 = 9.
కాన్పుకు నవ మాసాలు నిండాలి.
నవ బ్రాహ్మలు, నవగోప్యములు, నవకావ్యగుణములు, నవ ఆత్మ గుణములు. నవవిధభక్తి, నవ ఖండములు, నవ ఆత్మలు, నవ కర్మసాక్షులు, నవచక్రములు, నవతారా శుభాశుబ ఫలములు, నవ ద్వీపములు, నవధాతువులు, నవధాన్యములు, నవనాడులు, నవవిదులు, నవ ప్రజాపతులు, నవభాక్తులు, నవగ్రహ దేవతలు, నవ మహారత్నములు, నవరత్నములు, నవరసములు, నవవిధ అవస్థలు, నవవిధ దుఃఖములు, నవవిధధర్మములు, నివవిష(ము) స్థానములు, నవ శరీర రంథ్రములు, నవసంచార నిషిద్ధ స్థలములు, నవసంబంధములు, మొ.నవి.
మహాభారతములో 18 స్కంధములు : 1 + 8 = 9
వ్యాసపురాణములు : 18 = 1 + 8 = 9
ఉపపురాణములు: 18 = 1 + 8 = 9
స్మృతులు: 18 = 1 + 8 = 9
భగవద్గీతలోని అధ్యాయములు: 18 = 1 + 8 = 9
మహాభారతములోని పర్వములు: 18 = 1 + 8 = 9
యద్ధం జరిగిన రోజులు: 18 = 1 + 8 = 9
పోరాడిన అక్షౌహిణుల సంఖ్య: 18 = 1 + 8 = 9
ప్రతి అక్షౌహిణులో కాల్బలము సంఖ్య: 109350 - 1 + 0 + 9 + 3 + 5 + 0 = 18 = 1 + 8 = 9
గుఱ్ఱములు: 65610 - 6 + 5 + 6 + 1 + 0 = 1 + 9 = 9
రథములు 21870 - 2 + 1 + 8 + 7 + 0 = 1 + 8 = 9
ఏనుగులు: 2187 - 2 + 1 + 8 + 7 = 1 + 8 = 9
అంతా 18 మయమే
కృతయుగం = 17,28,000 వేలు - 1 + 7 + 2 + 8 = 18 = 1 + 8 = 9
త్రేతాయుగం = 12,96,000 - 1 + 2 + 9 + 6 = 18 = 1 + 8 = 9
ద్వాపరయుగం = 8,64,000 - 8 + 6 + 4 = 18 = 1 + 8 = 9
కలియుగం = 4,32,000 సంవత్సరములు - 4 + 3 + 2 = 9
కలియుగం కన్నా ద్వాపరయుగం రెండురెట్లు, త్రేతాయుగం మూడు రెట్లు, కృతయుగం నాలుగు రెట్లు. నాలుగు యుగముల మొత్తం:
17,28,000 + 12,96,000 + 8,64,000 + 4,32,000 = మొత్తం 43,200,000 = 4 + 3 + 2 = 9
అయ్యప్ప గుడి మెట్లు 18.
శక్తి క్షేత్రాలు 18
మహాభారతా యుద్ధాన్ని పరిశీలిస్తే పోరాడిన 18 అక్షౌహిణుల సేన 50 లక్షల సైనికు, 12 లక్షల అశ్వాలు, 4 లక్షల ఏనుగులు. కాని కౌరవ సేన 11 అక్షౌహిణులుగా, పాండవసేన 7 అక్షౌహిణులు. యుద్ధము జరిగిన రోజులు 18. భీష్ముడు - 10 రోజులు, ద్రోణుడు 10 నుండి 15వ రోజు వరకు (5), కర్ణుడు - 17 నుండి 17వ రోజు వరకు (2), శల్యుడు - 17 నుంది 1/2 రోజు (1/2), సుయోధనుడు - 1/2 రోజు. మొత్తము 18 రోజులలో యుద్ధము ముగిసినది.
(సంక్షిప్తంగా శ్రీరామకవచం సుబ్రహ్మణ్యం గారి రచన "సంఖ్యలు అవతరణ - ప్రాముఖ్యం", ఋషిపీఠం విశిష్ట సంచిక 2014 నుండి)
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
తొమ్మిది యొక్క విశిష్టతను అద్భుతముగా వివరించి నందులకు ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.