గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

25, నవంబర్ 2011, శుక్రవారం

కార్తీక బహుళ అమావాస్య గీతా జయంతి సందర్భంగా పాఠక మహాశయులందరికీ శుభాకాంక్షలు.

కార్తీక బహుళ అమావాస్య  గీతా జయంతి సందర్భంగా పాఠక మహాశయులందరికీ శుభాకాంక్షలు.
ఆ గీతాచార్యుల కృప మీకు అపారముగా ప్రాప్తించుగాక.
ఇదేమిటి ఈ రోజు గీతా జయంతి అంటున్నారు అని ఆశ్చర్యపోతున్నారా? మన సుప్రసిద్ధ సిద్ధాంతి శ్రీమాన్ గార్గేయ గారు సప్రమాణికంగా నిరూపిస్తూ ప్రకటించారు. మీరూ సప్రమాణికంగా దీనిని గూర్చి తెలుసుకొనే ప్రయత్నం చేయగలరు.
జై శ్రీమన్నారాయణ.
జైహింద్.
Print this post

4 comments:

అజ్ఞాత చెప్పారు...

Amavasyaki, pournaniki bahula shuddha ani tagilinchadam compulsoryna? Avi prati nela okkasarega vastayi.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

మీరన్నది నిజమే. అమావాశ్య, పౌర్ణమి నెలలో ఒక్కొక్కసారే వస్తాయి.
ఐతే మనం ఇక్కడ ఒకటి గ్రహించాలి.
పాడ్యమీ మొదలగు తిథులు నెలకు రెండు పర్యాయములు వస్తున్నందున కాల చక్రంలో నెలలో చంద్రుడు వృద్ధి పొందే పదునైదు దినములూ శుద్ధముగాను, క్షీణత పొందు పదినైదు దినములూ బహుళముగాను వ్యవహరిస్తూ ఉంటున్నందున శుద్ధములో వస్తున్న కారణముగా పౌర్ణమిని శుద్ధ పౌర్ణమి అనీ, బహుళములో వచ్చే అమావాశ్యను బహుళ అమావాశ్య అనీ వ్యవహరించడం అనుశ్రుతంగా వస్తోంది.

కేవలం పౌర్ణమి అని, అమావాశ్య అనీ అనడంలో తప్పేమీ లేదు.

శ్రీపతిశాస్త్రి చెప్పారు...

శ్రీగురుభ్యోనమ:

వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్ధనం
దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం

గురువుగారూ జగద్గురువు అయిన శ్రీకృస్ణపరమాత్ముని గీతా వాక్యములు నిత్య పఠనీయములు,ఆచరణీయములు.భగవద్గీత వైభవమును గూర్చి ఒక చిన్నపాటలో బృహత్ద్విసహస్రావధాని శ్రీమాన్ శ్రీ మాడుగుల నాగఫణిశర్మగారు వినిపించిన పాట నాకు బాగా నచ్చినది.

భగవద్గీత ఇది భగవద్గీత
భగవద్గీత ఇది భగవద్గీత
వినరావో శ్రోతా ఇది పుణ్యపునీత
వినరావో శ్రోతా ఇది పుణ్యపునీత
జ్ఞాన గంగలో పుట్టిన రసపరిమళ పారిజాత
భగవద్గీత ఇది భగవద్గీత
భగవద్గీతా

పార్థునికై స్వ్యముగా శ్రీకృష్ణుడు చెప్పినది
అజ్ఞానాంధ్యము తొలగగ ధృతరాష్ట్రుడు అడిగినది
రంజితమతి సంజయుడటు విజ్ఞత వినిపించినది
ప్రతి పదమూ మన మనుగడకే అనిపించునదీ
భక్తులపై పొరలి పొంగు భగవంతుని కరుణా నది
భగవద్గీత ఇది భగవద్గీత
బగవద్గీత ఇది భగవద్గీత
భగవద్గీతా...

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

అమవాస్య అనే అజ్ఞానములో నున్న నరున(ల)కు నారాయణుడు అందించిన కార్తీక దీపమనే జ్ఞానదీపం భగవద్గీత.
కృష్ణం వందే జగద్గురుం.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.