గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

4, జూన్ 2011, శనివారం

యది హాஉస్తి తదన్యత్ర, యన్నేహాஉస్తి న తత్ క్వచిత్!

పాఠకావతంసులారా!
మహాభారత ప్రాశస్త్యమును భారతమున కవి వివరించి యున్నారు. 
మీరూ పరికింపుఁడు.
శ్లో:- 
ధర్మేచాஉర్థేచ కామేచ మోక్షేచ భరతర్షభ!
యది హాஉస్తి తదన్యత్ర, యన్నేహాஉస్తి న తత్ క్వచిత్!! (మహా భారతం)
క:-
ధర్మార్థ కామ మోక్షము
లర్మిలి భారతము చెప్పె నవియే కనగా
పేర్మిని పేర్కొని రితరులు.
ధర్మము లిట లేని వెచట తలపఁగ లేవోయ్!
భావము:-
ఓ భరత  శ్రేష్ఠుఁడా! ధర్మ, అర్థ, కామ, మోక్షములనే చతుర్విధ పురుషార్థములను బోధించే వచనములు ఏవి యీ భారతమున ఉన్నవో అవే సమస్తమైన ఇతర గ్రంథములలోను ఉన్నవి. ఇందు లేనివి మరెచ్చటను లేవు. 
చూచారు కదా!
జీవితంలో ఒక్కసారైనా సంస్కృత భారమగు జయమును కాని, కవిత్రయ భారతమును కాని, కడకు మూలానువాదమగు తెలుగు  వచన భారతమును కాని చదివి, పైన చెప్పిన విషయమునందలి ఔచిత్యమును గ్రహింతుము గాక.
జైశ్రీరాం.
జైహింద్.


Print this post

5 comments:

కథా మంజరి చెప్పారు...

మంచి సూచన. మహా భారతం ఏ రూపంలోనయినా చదవాలి. శ్లోకం, పద్యం లేదా కనీసం వచనం. అనే మీ సూచన చక్కగా ఉంది.
ఎందుంటే, శ్లోకంలో పేర్కొన్నట్టగా అందులో ఉన్నవే అంతటా ఉన్నాయి. అందులో లేనిది ఎక్కడా లేదు. ఎంత పరమ సత్యం !

Pandita Nemani చెప్పారు...

ayyaa! mee krishi prasamsaneeyamu. inkaa enno enno ituvamti slokaalanu coodaalani umdi. meeku maa abhinandanalu. itlu sanyaasirao nemani

గన్నవరపు నరసింహమూర్తి చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
గన్నవరపు నరసింహమూర్తి చెప్పారు...

ఆంధ్ర భాష యందు నాది కవితఁ జెప్ప
భారతంబు నాంధ్ర భాగ్య మయ్యె !
నన్నపార్యు వాక్కు నవకీర్తి సమకూర్ప
రాజరాజు ఘనత రమ్యమయ్యె !!

సంస్కృత భాష లోని జయ చదివే సామర్ధ్యము కొద్ది మందికే ఉంటొంది. తిరుమల తిరుమతి దేవస్థానము వారు టీకా తాత్పర్యములతో ప్రచురించిన కవిత్రయ భారతము నా బోటి వారలకు చాలా ఉపయుక్తముగా ఉంది. చక్కని శ్లోకమును అందమైన కందముగా మలిచారు. మీకు కృతజ్ఞతాంజలులు.

చంద్రశేఖర్ చెప్పారు...

ఇక్కడ వ్యాసుల వారు, "యది హా~స్తి..." అని చెప్పిన విధానం చూస్తే, mathematical logic లో Proof by double negation concept గుర్తుకొస్తుంది. ఈ రకమైన ప్రూఫ్ universally true statements కి మాత్రమే చేయగలము. చూడండి, మన ఋషులు యెంతటి మేధా సంపత్తి ఆనాడే మనకు సమకూర్చారో. చింతా వారు మహా భారత మధనం కొనసాగిస్తారని ఆశిస్తూ...

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.