గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

26, జూన్ 2011, ఆదివారం

ENV రవి కృత తిలక బంధ ఆట వెలది తిలకిద్దామా?

ఆ. వె ||

వేంకటేశ! శరణు! రమా వినుత! శుభద!
వేంకటేశ! శమము గూర్పు విబుధవరద!
వేంకటేశ! సురభి రూప వేద వేద్య!
వేంకటేశ! సురభిరూప వేద వేద్య!

లక్షణం ఇలా ఉందండి. (తెలుగులో చిత్రకవిత - గాదె ధర్మేశ్వరరావు గారు పేజి 456)

మధ్యే శ్లిష్టం పదం జ్ఞేయం పార్శ్వయోశ్చ పదద్వయమ్ |
కోణయో రక్షరం శ్లిష్టం తిలకం బన్ధసున్దరమ్ ||


చాలా గొప్ప ప్రయత్నం కదండీ. చాలా బాగుందికదండీ? 
చిరంజీవి రవికి నా అభినందనలు.
జై శ్రీరాం.
జైహింద్.
Print this post

2 comments:

Praveen Mandangi చెప్పారు...

ఇక్కడ అడ్వర్టైజ్ చేస్తున్నందుకు క్షమించాలి. తెలుగు వెబ్ మీడియా వారు ప్రారంభించిన వీడియో చానెల్‌కి నిర్మాతలు కావలెను. మా వీడియో చానెల్ URL http://videos.teluguwebmedia.in మీరు కాంటేసియా స్టూడియో లేదా సైబర్‌లింక్ పవర్ డైరెక్టర్ ద్వారా వీడియోలు రూపొందించి మాకు పంపవలెను. వీడియో యొక్క ఫైల్‌ని మెయిల్‌లో అటాచ్ చేసి ఈ అడ్రెస్‌లకి పంపవలెను telugu-videos[at]posterous.com , praveensarma[at]teluguwebmedia.in

రవి చెప్పారు...

బొమ్మ సరిగ్గా లేదండి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.