గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

10, సెప్టెంబర్ 2010, శుక్రవారం

గణపతి పప్పా మోరియా !!!అశ్వధాటి:-
శ్రీవిఘ్ననాయకుని; నా విఘ్న ఘాతకుని;   భావింతు నాదు మదిలో;
నేవిఘ్నముల్ గనక; సేవా ధురంధత  గావింపఁ జేయ కృతులన్; 
యావేశముల్; దురిత కావేశముల్ విడిచి; భావామృతంబు తొలకన్
జీవింపఁ జేయమని; సేవింపఁ జేయుమని; దేవీ సుతున్ గొలిచెదన్.
భావము:-
నాకు "సంభవించే విఘ్న వినాశకుఁ"డైన; మంగళ మూర్తి యైన విఘ్నేశ్వరుని  " నేను సేవా ధురంధరుఁడనై ఎట్టి విఘ్నములూ ఎదుర్కొనకుండా కృతులను గావింపఁ జేయ వలసినదిగా చేయుట కొఱకు "  నా మనస్సులో స్మరింతును. చెడ్డవైన ఆవేశ కావేశములు నా హృదయము నుండి విడిచిపెట్టి;  భావామృతము తొణికిసలాడు విధముగా జీవింపఁ జేయుమని ఆ పార్వతీదేవి సుతుడైన వినాయకుని కొలిచెదను. 
" భాద్రపద శుద్ధ చతుర్థి నాడు వినాయక చవితి సందర్భముగా " ఆంధ్రామృత పాఠకులందరికీ; సహృదయ భారతీయులందరికీ; నా హృదయ పూర్వక శుభాకాంక్షలు.
జైగణేశా!
జైహింద్. 
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.