శ్రీ మన్మహనీయ భావనా పటిమా ప్రకాశితులైన సహృదయ శిరో మణు లైన ఆంధ్ర పాఠక మహాశయులకు, తెలుగు భాషాభిమానులకు, ఆంధ్రామృతాస్వాదనాభిలాషులకు
" తె లు గు భా షా ది నో త్స వ శు భా కాం క్ష లు "
ఉ:- శారద, సర్వ సద్గుణ విశారదగా మన తెల్గు భాషలో
కోరుచు కావ్య రూపమున కూర్మిని దర్శన మిచ్చుఁ గాదె! యె
వ్వారలు గాంచ కుండెదరు? వాఙ్మయ రాశిగ నాంధ్ర మాతయై
చేరువయై తెనుంగులకుఁ క్షేమముఁ గూర్చెడు నెల్ల వేళలన్.
చ:- తెలుగు కవిత్వమన్న యల తేనెల సోనయటంచు మెచ్చగా,
సలలిత భావగుంభనల సత్ కవి కావ్య మనోజ్ఞ రూప సం
కలిత కవిత్వ తత్వ గుణ గణ్యముగా మదులందు వెల్గుచున్
తెలుగు పఠించు వారలకు తేనెల వాగయి సంతసంబిడున్.
ఉ:- తేనెల తెల్గు భాషకును, దివ్యుల బోలు తెలుంగు వారికిన్,
జాలము నందు కావ్య గుణ జాలము చాలగ చూపు వారికిన్,
మేలగు తెల్గు వెల్గులను మెచ్చుచు వ్రాసెడి పాఠకాళికిన్,
మేలగుఁ గాత! తెల్గుల కమేయ మహోద్ధతి కల్గుఁ గావుతన్.
జైహింద్.