జైశ్రీరామ్.
సంస్కృతంలో పుష్పాల పేర్లు:
జైశ్రీరామ్.
సంస్కృతంలో పుష్పాల పేర్లు:
జైశ్రీరామ్.
జైశ్రీరామ్.
|| 16-19 ||
శ్లో. తానహం ద్విషతః క్రురాన్సంసారేషు నరాధమాన్|
క్షిపామ్యజస్రమశుభానాసురీష్వేవ యోనిషు.
తే.గీ. నన్ను దూషించు కౄరులన్, నాదుభక్తు
ల నిల ద్వేషించునామూర్ఖులన్ గణించి
యాసురీయోనులన్ బుట్ట నమరజేసి
శిక్షగొలుపుదు శిష్టుల రక్షణకని.
భావము.
ఇలా నన్ను ద్వేషించే కౄరులు, దుష్టులు, నరాధములను నిత్యమూ
నేను అసురీ యోనుల్లోకి విసిరేస్తాను.
|| 16-20 ||
శ్లో. ఆసురీం యోనిమాపన్నా మూఢా జన్మని జన్మని|
మామప్రాప్యైవ కౌన్తేయ తతో యాన్త్యధమాం గతిమ్.
తే.గీ. ఆసురీయోనిజుల్ నన్ను నరయ లేక
జన్మజన్మలకును నీచ జన్మలెత్తు,
పాపపంకిల జన్ములై పాపకూప
ముననె కృంగుచునుందురు వినుము పార్థ!
భావము.
అర్జునా! అసురీ జన్మను పొందిన మూర్ఖులు ప్రతి జన్మలోను నన్ను
చేరకుండానే ఇంకా అధోగతికి పోతారు.
జైహింద్.
జైశ్రీరామ్
|| 16-17 ||
శ్లో. ఆత్మసమ్భావితాః స్తబ్ధా ధనమానమదాన్వితాః|
యజన్తే నామయజ్ఞైస్తే దమ్భేనావిధిపూర్వకమ్.
తే.గీ. యసురులాత్మస్తుతులు మూర్ఖు లసమదృష్టు
లరయదంబ,ధనమదాంధులనవరతము
నామమాత్రపు యజ్ఞ ముల్ భూమిజేయు
చుందు రనుపమ మూర్ఖులై మందభతులు.
భావము.
తమని తాము మెచ్చుకునే వాళ్ళు, మొండి వారు ధన మాన మదాలతో
కూడుకుని, గుడ్డి వాళ్ళై దంభం కోసం శాస్త్ర పద్ధతిని వర్ణించి నామమాత్రంగా
యజ్ఞాలు చేస్తారు.
|| 16-18 ||
శ్లో. అహంకారం బలం దర్పం కామం క్రోధం చ సంశ్రితాః|
మామాత్మపరదేహేషు ప్రద్విషన్తోऽభ్యసూయకాః.
తే.గీ. దర్ప బలముల నహమును, ధాత్రి క్రోధ
కామముల నాశ్రయించి, గర్వమొంది,
యంతటన్గలనన్ దిట్టు నట్టివాని
ఆసురంబగు యోనుల నమర విడుతు.
భావము.
అహంకారాన్ని, బలాన్ని, దర్పాన్ని, కామ క్రోధాలను ఆశ్రయించుకొని,
తమలోను, ఇతరులలోను ఉన్న నన్ను ద్వేషించే కౄరులు, దుష్టులు
నరాధములను నేను నిత్యము అసురీ యోనుల్లోకి విసిరేస్తాను.
జైహింద్.
జైశ్రీరామ్.
|| 16-15 ||
శ్లో. ఆఢ్యోభిజనవానస్మి కోన్యోస్తి సదృశో మయా|
యక్ష్యే దాస్యామి మోదిష్య ఇత్యజ్ఞానవిమోహితాః.
తే.గీ. నేను ధనికుడనుకులీను నేనె ఘనుడ,
యజ్ఞ ముల్జేయుదున్, దానమాచరింతు
ననుచు మూర్ఖుడై పతనంబు గనునతండు
రాక్షసములక్షణంబిది, శిక్షితుడగు.
భావము.
నేను ధనవంతుణ్ణి, కులమున్న వాడిని, నాకు సమానులు ఎవరున్నారు?
యజ్ఞం చేస్తాను. దానాలిస్తాను, సంతోషిస్తాను ఇలా అజ్ఞానంతో
భ్రాంతి చెందుతారు.
|| 16-16 ||
శ్లో. అనేకచిత్తవిభ్రాన్తా మోహజాలసమావృతాః|
ప్రసక్తాః కామభోగేషు పతన్తి నరకేऽశుచౌ.
తే.గీ. అంతు లేని తలపులతో, భ్రాంత చిత్తు
లగుచు నజ్ఞానమున జిక్కి, యంతులేని
కామభోగాలచే నరకమునబడుచు
హేయముగ నాసురులు భువి మాయదగులు.
భావము.
అనేక రకాల ఆలోచనలతో భ్రాంత చిత్తులై అజ్ఞానపు వలలో చిక్కుకొని,
కామభోగాలలో మరులుగొని అపవిత్రమైన నరకంలో పడతారు.
జైహింద్.
జైశ్రీరామ్.
|| 16-13 ||
శ్లో. ఇదమద్య మయా లబ్ధమిమం ప్రాప్స్యే మనోరథమ్|
ఇదమస్తీదమపి మే భవిష్యతి పునర్ధనమ్.
తే.గీ. పెరుగుచున్నట్టి కోర్కెలన్ పెచ్చురేగి
పాపముల్జేయుచుందురు భ్రష్టులగుచు,
దుష్టసంపాదనాసక్తితోడ చెడుచు
రాక్షసంబునన్ నశియింత్రు రక్ష లేక.
భావము.
ఈ రోజు ఇంత సంపద నాకు లభించింది. ఈ కోరికలని తీర్చుకుంటాను.
ఇంత ధనం నాకుంది. ఇక ముందు ఇంకా ఇంత ధనం వస్తుంది.
|| 16-14 ||
శ్లో. అసౌ మయా హతః శత్రుర్హనిష్యే చాపరానపి|
ఈశ్వరోహమహం భోగీ సిద్ధోహం బలవాన్సుఖీ.
తే.గీ. శత్రువులజంపినాడను,చంపుదన్యు
లనిలనింక దైవంబేనె, యని రహింతు
రన్నియున్ నేనె యని ఖలులెన్ని గనుచు
పాపవర్తులై చెడుదురు పాండు తనయ!
భావము.
ఈ శత్రువు నాచే చంపబడినాడు, ఇతరులను కూడా చంపేస్తాను. నేను
ఈశ్వరుణ్ణి, భోగిని, సిద్ధుణ్ణి, బలవంతుణ్ణి, సుఖిని.
జైహింద్.
జైశ్రీరామ్.
|| 16-11 ||
శ్లో. చిన్తామపరిమేయాం చ ప్రలయాన్తాముపాశ్రితాః|
కామోపభోగపరమా ఏతావదితి నిశ్చితాః.
తే.గీ. కామభోగంబులవధిగా కలుగువారు,
జన్మకడదాక పాపులై జగతిమెలగి
నరకమును చేరుచుందురాసురగుణులిల
నీవు గ్రహియింపుమర్జునా నేర్పు మీర.
భావము.
వాళ్ళు మరణించే వరకు అపరిమితములైన యోచనలలో మునిగి తేలుతూ,
కామ భోగాలు తప్ప జీవితానికి వేరే లక్ష్యం లేదని నిశ్ఛయించుకున్న వాళ్ళు.
|| 16-12 ||
శ్లో. ఆశాపాశశతైర్బద్ధాః కామక్రోధపరాయణాః|
ఈహన్తే కామభోగార్థమన్యాయేనార్థసఞ్చయాన్.
తే.గీ. అంతులేనట్టి యాశలనలమటింత్రు,
కామమునకును వశులయి భూమిపైన
ధనము కామాదులకునయి తగలబెట్టు
చుందుర్జునా! లేకయే ముందుచూపు.
భావము.
వాళ్ళు వందలాది ఆశా పాశాలతో కట్టుబడి, కామక్రోధాలకు వశులై
తమ కామభోగానికిగాను, అన్యాయంగానైనా సరే సంపదలను
సమకూర్చుకోవాలని అనుకుంటారు.
జైహింద్.
జైశ్రీరామ్
|| 16-9 ||
శ్లో. ఏతాం దృష్టిమవష్టభ్య నష్టాత్మానోల్పబుద్ధయః|
ప్రభవన్త్యుగ్రకర్మాణః క్షయాయ జగతోऽహితాః.
తే.గీ. ఇట్టి దుర్భావపూర్ణులై కౄరగతిని
ధర్మదూరులై పాపులై ధరణిపైన
మంచినణచుచు వంచనన్ మసలుచుందు
రాసురంబున చెడుచుంద్రు ధీసమేత!
భావము.
ఈ దృష్టినే పట్టుకుని వేలాడుతూ వీళ్ళు ధర్మ భ్రష్టులై సంకుచిత బుద్ధులై,
ప్రపంచానికి శత్రువులై, కౄరకర్ములై లోక నాశనం కోసం పుడతారు.
|| 16-10 ||
శ్లో. కామమాశ్రిత్య దుష్పూరం దమ్భమానమదాన్వితాః|
మోహాద్గృహీత్వాసద్గ్రాహాన్ప్రవర్తన్తేశుచివ్రతాః.
తే.గీ. తృప్తిచెందనం తాశలో తేలుచుంద్రు
దంభ, మాన, మదంబులన్, దారి తప్పి
సత్యదూరమౌ మిధ్యపై సతము మసలి
పాపవర్తులై చెడుదురు లోపమదియె.
భావము.
వాళ్ళుతృప్తి పరచడానికి వీలులేనంత కోరికలను పెట్టుకొని దంభ, మాన,
మదాలతో నిండి, భ్రాంతి వలన అసత్యమైన వాటి వెంట అనాచారంగా
ప్రవర్తిస్తారు.
జైహింద్.
జైశ్రీరామ్.
|| 16-7 ||
శ్లో. ప్రవృత్తిం చ నివృత్తిం చ జనా న విదురాసురాః|
న శౌచం నాపి చాచారో న సత్యం తేషు విద్యతే.
తే.గీ. నిజమిది ప్రవృత్తిని నివృత్తిని నసురగుణు
లెరుగ, రిల శౌచమాచార మెరుగబోరు,
సత్యదూరులై యుందురు సతతమిలను,
నీవు గ్రహియింపుమర్జునా! నేర్పు మీర.
భావము.
అసుర స్వభావం కలవారు ప్రవృత్తిని కాని నివృత్తిని గాని ఎరుగరు. వాళ్ళలో
శౌచమూ, ఆచారమూ, సత్యమూ ఉండవు.
|| 16-8 ||
శ్లో. అసత్యమప్రతిష్ఠం తే జగదాహురనీశ్వరమ్|
అపరస్పరసమ్భూతం కిమన్యత్కామహైతుకమ్.
తే.గీ. జగతి మిధ్యని యిది సహజంబటంచు,
కామమే సృష్టిమూలమై కలిగెననుచు,
పాపపుణ్యధర్మంబులే వరలవనుచు
నసుభావులు తలచెదరనుమముగ.
భావము.
జగత్తు మిధ్య అనీ, దానికి ధర్మా ధర్మాలు ఆధారము ఉండవని, ఈశ్వరుడే
లేడనీ ఈ ప్రపంచములోని ప్రాణులు స్త్రీ పురుషుల కలయిక వలననే
పుట్టినదనీ వారు అంటారు. అందుచేత ఈ జగత్తుకి కారణం కామమే
అంటారు అసుర జనులు.
జైహింద్.
జైశ్రీరామ్
|| 16-5 ||
శ్లో. దైవీ సమ్పద్విమోక్షాయ నిబన్ధాయాసురీ మతా|
మా శుచః సమ్పదం దైవీమభిజాతోऽసి పాణ్డవ.
తే.గీ. మోక్షమిచ్చు దైవీయము పూర్తిగాను,
మహిత సంసార బంధంబు మహిని యసుర
మునను కల్గును మనలకు, వినుము పార్థ!
నీవు దైవాంశజుండవే, నిజము కనుమ.
భావము.
దైవీ సంపద మోక్షానికి, అసుర సంపద సంసార బంధానికి కారణం. అర్జునా!
విచారించకు, నీవు దైవీ సంపదతోనే పుట్టావు
|| 16-6 ||
శ్లో. ద్వౌ భూతసర్గౌ లోకేస్మిన్దైవ ఆసుర ఏవ చ|
దైవో విస్తరశః ప్రోక్త ఆసురం పార్థ మే శృణు.
తే.గీ. దైవమాసురమన్రెండు జీవకోటి
వరలు, దైవమున్ దెల్పితి, పరగు నసుర
విషయమరయుము తెలిపెద విపులగతిని.
యరసి వర్తింపుమా తగన్ నిరుపమాన!
భావము.
ఈ లోకంలో దైవం, అసురం అని ప్రాణుల సృష్టి రెండు రకాలు. దైవసృష్టిని
గురించి విస్తారంగా చెప్పబడినది. అర్జునా! అసుర సృష్టి గురించివిను.
జైహింద్.
జైశ్రీరామ్.
దర్శనాభినందనము.
🍁🍁🍁🍁🍁🍁
సీ. మరుమాములాన్వయమాణిక్యతేజమ్ము
దర్శనమ్మై నేడు ధరణి వెలిగె
వేంకటరమణుని విద్వత్ప్రభాదీప్తి
ధార్మికపథముగ దనరుచుండె
తత్త్వదర్శకులు విద్వత్కవీశ్వరులెల్ల
రచనలనందింప రాణకెక్కె
భారతీయాత్మను భాసిల్లజేసెడి
కార్యక్రమమ్ముల కాంతులీనె
తే.గీ. ఇద్దిరా 'దర్శన'మ్మన నిల జనముల
కేది యావశ్యకము దాని ప్రోదిజేసి
పత్రికారూపమున దీర్చి వరలు ధర్మ
దర్శి వేంకటరమణుడు ధన్యజీవి !
అభినందనలతో.....
డా.అయాచితం నటేశ్వరశర్మ.
🍁🍁🍁🍁🍁🍁🍁
జైహింద్.
జైశ్రీరామ్.
|| 16-3 ||
శ్లో.తేజః క్షమా ధృతిః శౌచమద్రోహో నాతిమానితా|
భవన్తి సమ్పదం దైవీమభిజాతస్య భారత.
తే.గీ. తేజమోర్మియు దీక్షయు, దివ్య శుచియు,
ద్రోహచింతవిదూరత, మోహదూర
తయును, ద్వేషరాగవిదూరతయును, దైవ
లక్షణములు పార్థ! గ్రహించు, లక్ష్యమరసి.
భావము.
తేజస్సు, ఓర్మి, పట్టుదల, శుచిత్వం, ద్రోహచింతన లేకపోవడం,
అభిమాన రాహిత్యం. . . అర్జునా! ఇవి దైవీ సంపదతో పుట్టిన
వానికి కలుగుతాయి.
|| 16-4 ||
శ్లో. దమ్భో దర్పోభిమానశ్చ క్రోధః పారుష్యమేవ చ|
అజ్ఞానం చాభిజాతస్య పార్థ సమ్పదమాసురీమ్.
తే.గీ. దంభమభిమాన క్రోధముల్, దర్పము పరు
షతయు, నజ్ఞానమసుర, సహజలక్ష
ణములు, గ్రహియింపు మర్జునా! నయనిధాన!
దైవభావంబునన్ మెల్గ దగును మనము.
భావము.
అర్జునా! దంభం, దర్పం, అభిమానం, క్రోధం, పరుషత్వం, అజ్ఞానం. . .
ఈ లక్షణాలు అసుర సంపదతో పుట్టిన వానికి కలుగుతాయి.
జైహింద్.
జైశ్రీరామ్
అథ షోడశోధ్యాయః - దైవాసురసమ్పద్విభాగయోగః.
శ్రీభగవానువాచ|
భావము.
శ్రీ భగవానుడనుచున్నాడు.
|| 16-1 ||
శ్లో. అభయం సత్త్వసంశుద్ధిర్జ్ఞానయోగవ్యవస్థితిః|
దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవమ్.
తే.గీ.
సత్వసిధ్యభయంబులు జ్ఞాన యోగ
మందునిలకడ, విజితేంద్రియమును, తపసు,
యజ్ఞమునుమరి యిలను స్వాధ్యాయమొకటి
వరనిజాయితీ, దేవునిభాగ్యతతియె.
భావము.
అభయం సత్వసుద్ధి జ్ఞానయోగంలో నిలవడం, ఇంద్రియ నిగ్రహం,
యజ్ఞం, స్వాధ్యాయం, తపస్సు, నిజాయితీ(దైవీ పురుషుడికి కలుగుతాయి)
|| 16-2 ||
శ్లో. అహింసా సత్యమక్రోధస్త్యాగః శాన్తిరపైశునమ్|
దయా భూతేష్వలోలుప్త్వం మార్దవం హ్రీరచాపలమ్.
తే.గీ. శాంతమున్, సత్యమునహింస, చపల దూర
తయును, సిగ్గు, మృదుత్వమున్, ధరను కలుగు
టనుసులక్షణములుదైవమునకుకలుగు
నీవు గ్రహియాంపుమర్జునా నేర్పుమీర.
భావము.
అహింస, సత్యం, కోపము లేకపోవడం, మృదుస్వభావం, సిగ్గు, చాపల్యం లేకపోవడం.
జైహింద్.
జైశ్రీరామ్.
|| 15-19 ||
శ్లో. యో మామేవమసమ్మూఢో జానాతి పురుషోత్తమమ్|
స సర్వవిద్భజతి మాం సర్వభావేన భారత.
తే.గీ. అట్టి పురుషోత్తమునునన్నునరయువారు
కనగ సర్వజ్ఞులిద్ధరన్, కనుచు నన్ను
పొంది సేవింపుదురునన్ను పూజ్యమీగను.
నీవు గ్రహియింపుమర్జునా నేర్పు మీర.
భావము.
అర్జునా! పురుషోత్తముడిని అయిన నన్ను ఈ విధముగా ఏ జ్ఞాని
తెలుసుకుంటాడో, అతడు సర్వమూ తెలిసిన వాడై అన్ని విధములుగా నన్ను
సేవిస్తాడు(పొందుతాడు).
|| 15-20 ||
శ్లో. ఇతి గుహ్యతమం శాస్త్రమిదముక్తం మయానఘ|
ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్స్యాత్కృతకృత్యశ్చ భారత.
తే.గీ. గుహ్యతమమైన శాస్త్రంబు కోరి తెలిపి
యుంటి గ్రహియించు ధన్యులే యుత్తమోత్త
ములును కృతకృత్యులిద్ధర తెలియుమీవు,
చక్కనైనట్టి ములో జయముగనుము.
భావము.
భారతా! అలా గోప్యమైన ఈ శాస్తం నాచే చెప్ప బడినది. దీనిని అర్ధము
చేసుకుంటే బుద్ధిమంతుడు కృతకృత్యుడు.
ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు
బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే
పురుషోత్తమయోగో నామ పఞ్చదశోऽధ్యాయః22]
పురుషోత్తమప్రాప్తి యోగము.
జైహింద్.