గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

16, జూన్ 2022, గురువారం

రెండు పాదములలో ధకారము, మరిరెండు పాదములలో థ కారము ప్రాస వేయుటకు ప్రమాణముగా స్వీకరింప నగును.

జైశ్రీరామ్.
ఆర్యులారా! థ..ధ లకు, ద..ధ లకు ల.డలకు, ల ళ లకు ప్రాసమైత్రియున్నందున వాడబడుచున్ననూ, కొందరు ఒక్క పాదములోనే మైత్రి ఉన్న వర్ణము వాడవలెనని కొందరనుట విని యుంటిని.
భారతములో ద్రోణ పర్వములో ప్రయోగము చూచినచో ఆ సందేహము నివృత్తి యగును.
ఈ విధముగా మను చరిత్రలో కూడా ప్రయోగములున్నవి.
జైహింద్.

 

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.