గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

19, మార్చి 2011, శనివారం

సంపత్కుమారాచార్య కలం నుండి జాలువారిన మాతృహృదయ సౌకుమార్యం.


కోవెల సంపత్కుమారాచార్య
26 జూన్ 1933 - 6 ఆగస్ట్ 2010

సంపత్కుమారాచార్యులు పండితుడు, పరిశోధకుడు మాత్రమే కాదు, కవి కూడ.  యశోద అనే ఖండికలోని మొదటి పద్యము మాతృహృదయాన్ని ఎంత చక్కగానో చిత్రించింది. మీరూ చూడండి.

  1. ఈ చలిగాలిలో బయట కేగకురా పసితండ్రి! ఇంత ఈ
    కాచిన ఆవుపాలను చకాచక త్రాగి, మనింటిలోనె నీ
    తోచిన ఆటలాడు. మరి దుందుడుకుందన మిన్ని నాళ్లుగా
    సైచితిఁ గాని, చూడుమిక సైచను సుంతయు నింక మీదటన్!

Print this post

1 comments:

అజ్ఞాత చెప్పారు...

అయ్యా , చింతా రామకృష్ణారావుగారు
మీరు రాసే పోస్ట్లు నాకు update కావడం లేదు
మీ బ్లాగ్ ని సంకలిని లో చూపించాలని అనుకుంటున్నాను

డాష్ బోర్డ్ లో సెట్టింగ్స్ లో సైట్ ఫీడ్ లో
"Allow Blog feeds " అనే చోట None అని ఉన్నట్లుంది
అందుకే ఫీడ్స్ update కావడం లేదు
ఒకసారి సరిచూడగలరు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.