గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

17, డిసెంబర్ 2010, శుక్రవారం

పుట్టపర్తి బాబాజీ అవ్యాజానురాగం పొందిన నరసింహ మూర్తి కవి.

భక్త బాంధవులారా! 
వికృతి నామ సంవత్సర మార్గశీర్ష శుద్ధ ఏకాదశీ భృగువారం ఏకాదశీ పర్వదినము; ఈ ముక్కోటి ఏకాదశి; గీతా జయంతి సందర్భంగా ఆ శ్రీకృష్ణ పరమాత్మ కృపామృత పాన లోలురగు మీ అందరికీ నా వందన పూర్వక అభినందనలు.
ఈ పుణ్యప్రదమైన రోజున మీకు అపురూపమైన సంఘటనకు మూలమైన చక్కని సన్నివేశాన్ని మీముందుంచుచున్నందుకు ఆనందంగా ఉంది.
మీకిదివరకే మన బ్లాగు ద్వారా సుపరిచితులైన సుప్రసిద్ధ జ్యీతిశ్శాస్త్ర పడితులైనట్టి; సుప్రసిద్ధ కవి వరులైనట్టి శ్రీమాన్ "వల్లభ వఝల నరసింహ మూర్తి" రచించిన భగవాన్ శ్రీ సత్య సాయి శతకము తే.28 - 11 - 2010 దీని "అవధాన పంచానన బిరుదాంకితులగు అష్టావధాని శ్రీ భద్రం వేణు గోపాలాచార్యు వారి చేతి మీదుగా ఆవిష్కరింపఁ బడింది.
ఈ కార్యక్రమానికి పెక్కుమంది ప్రముఖులు పాల్గొన్నారు. గ్రంథావిష్కరణానంతరం శతక రచయితను సభికులు సత్కరించారు. 
ఇక్కడే చోటు చేసుకున్న ఒక అపురూపమైన సంఘ్సటనను మీకు వివరించడానికే ఈ టపా పెట్టడం జరిగింది. అదేమిటో తెలుసుకోవా లనుకొంటున్నారా?
చెప్పుతున్నాను వినండి.
సన్మానాలు దరిదాపు పూర్తౌతున్న సందర్భంగా కవిగారి సెల్ కి ఒక కాల్ వచ్చింది. 
ఆ ఫోన్ చేసిన వ్యక్తి " నాయనా! నా పేర శతకం వ్రాశావు. ఆవిష్కరణకై ఎంతో ఉబలాటం పడ్డావు. పూర్తైపోయింది. నీకు సంతోషంగా ఉందా?" అంటూ చాలా తక్కువ స్వరంతో మాటాడారు.   కవిగారు నాముఖంవైపు చూశారు. నేనొక చిఱునవ్వే సమాధానంగా విసిరాను. చాలా సేపు కవిగారికి ఎవరు ఫోన్ చేసారా అన్న విషయం స్ఫురించ లేదు. నేనన్నాను. ఆ ఫోన్ ఎక్కడి నుండోచ్చిందో చూడమని. అప్పుడు చూస్తే ఇంకేముంది ఆ ఫోన్ పుట్టపర్తి నుండి వచ్చిందని కోడ్ ను బట్టి తెలుసుకొన్నారు. అప్పుడు కవిగారి మనసులోస్ఫురించింది. ఆ ఫోన్ భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారే స్వయంగా చేసారని. అంతే వారికి ఆనంద పారవశ్యంలో  స్రవించిన కన్నీటి ధారకి అంతే లేదు. అది చూచిన మేమంతా ముగ్ధులమయాము.
ఆ బాబాజీ అవ్యాజానురాగామృతాన్ని అపారంగా గ్రోలిన ఆ కవివరులకు పాదాభివందనం చేసి ఆనందం పొందాము. 
ఆ కార్యక్రమమునకు సంబంధించిన నాకందుబాటులోగల చిత్రములను మీముందుంచుతున్నాను.


ఆవిష్కరణ సభకు నన్నాహ్వానిస్తున్న చిత్రం.
శతకావిష్కరణానంతరం కవిగారిని నేనభినందిస్తున్న చిత్రం.

శతకాన్నిముద్రింపించిన దాత కవిని సన్మానిస్తున్న చిత్రం.
కవిగారి చిన్న నాటి మిత్రులు శ్రీ శాస్త్రిగారు తన బాల్యమిత్రుడైన కవిని అభినందిస్తున్న చిత్రం.
శతకావిష్కరణ సందర్భంగా చోడవరం శ్రీ అన్నమాచార్య పీఠంతరపున శ్రీ రామయ్యరెడ్డి కచేరీ చేస్తున్నచిత్రం. 
కార్యక్రమానంతరం అవధాని శ్రీ భద్రం వేణు గోపాలాచార్యులను; నన్నూ కవి ఆదరిస్తున్న దృశ్యం.
చూచారు కదండీ! అతి త్వరలో ఆ శతకాన్ని మీ ముందుంచాలనే ఆశ పడుతున్నాను. మీరు ఆంధ్రామృతంగ్రోలుతూ నాపై చూపుతున్న ఆదరాభిమానాలకు ధన్యవాదాలు తెలుపుకొంటున్నాను.
జైశ్రీరామ్.
జైహింద్.
Print this post

2 comments:

durgeswara చెప్పారు...

మాహాత్ముల అనుగ్రహం ఇలానే ఉంటుంది. ఆ సుకవి జన్మ ధన్యము .వారికి నా నమస్కారములు తెలుపండి

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

సరస్వతీ పుత్రులకు నమస్కారములు.
ముక్కోటి ఏకాదశి పర్వదినాన " భగవంతుడు శ్రీ సత్యసాయి ఆదరాభి మానాలను పొందిన " " శ్రీమాన్ వల్లభ వఝుల నరసిం హ మూర్తి గారికి శిరసు వంచి పాదాభి వందనములు.కార్య క్రమ చిత్రాలను చూసి ఆనందించ గల అదృష్టాన్ని కలిగించిన {తమ్ముడు ] చింతా వారు శ్లాఘ నీయులు.వారికి ధన్య వాదములు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.