గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

10, ఏప్రిల్ 2025, గురువారం

శ్రీ విశ్వావసు నామ సంవత్సర తెలుగు యుగాదిని,పురస్కరించుకొని.....రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి,

0 comments

 జైశ్రీరామ్.

1.కం;-సూతుడు శౌనికుల కనియె!
         నీతులు స్వార్ధార్ధ భద్ర నింగిని డాయన్!
        మేతయు వశు తుల్యంబవ!
        ఘాతుకముల్గల్గు కలిని!కట్డడి వశమే!

2.కం:-శివ నామము తలపోయగ!
         భవ బంధ విమోచనంపు భాగ్యం బమరున్!
        భవి సుఖ జీవన మలరున్!
        నివహంబులు నిండు శోభ!నేర్మిన్ కూర్మిన్!

3.కం:-జాతులు కులములు మతములు
         పాతుక పడు పూర్వ విభవ భాగ్యోదయమున్!
        నీతిని తత్కుల ప్రాప్తికి
       భూత దయం జయ ప్రపూర్ణ పూర్ణత మలరున్!

4.కం:-ఈవియు లేనటి జన్మము
         తావకమా!కాదు కాధు!దర్పం బలరున్!
        పోవును సిరులవి చరములు
        రా వవి వెనువెంట దెలిసి రాజిలు జీవా!

5.ఉ:-ఆలన పాలనం గనక!హాయి నెరుంగని భారతా వనిన్!
       చాలని తిండి!దోషచర!సంతతి క్రోధి వికార చేష్టలన్!
      నాలుక ప్రేలనం జగము!నాశ వినాశ ప్రకాశ వంతమై!
     చేలము లూడ దీసె!మను జీవన దుస్తితి!బాధలంటగన్!

6.ఉ:-క్రోధియు కొంప ముంచె గద!కూరిమి నామడ గానరాకిలన్!
        చేదు నిజంబు నెర్గవలె!చింత వికార ఋణాంతకం బయెన్!
        కాదన శేషునిం దరమె! గౌరవ కీర్తి ప్ర కీర్తు లారెనే!
       ఆదరమొప్ప శ్రీ హరియు!హాయిని గూర్ప మనంబు నెంచి తా!

7.ఉ:-బాలురు వృద్ధులుం మదిని ప్రార్ధిల దైవము నెట్టకేలకున్!
        చాలిక పొమ్మనం గదలె!సత్కృప క్రోధి జనాళి గాంచితా!
       మేలొనరం గతంపు గతి!మిక్కిలి కీర్తి ఘటింప జేయగన్!
       సాలు రమాభి రామమన!చక్కున నూతన సాలు వచ్చెనే!

8 కం:-స్వార్ధము నిండినక్రోధియె!
         పార్ధివమై దేశ ప్రగతి భంగుర పరపన్!
        పార్ధుని సారధి పంపగ
       సార్ధత విశ్వావసువను సాలది వచ్చెన్!

9.కం:-విశ్వావసు వత్సరమును
         విశ్వాసము నింపి  జగతి విస్తృత ఫణితిన్!
        పశ్యంతీతి వసు ప్రదత
       దృశ్యంబై!గాచు గాత!దీపిల ధాత్రిన్!

జైహింద్.

శ్రీరాముడు - సీతమ్మవారు..ఎవరు గొప్ప..? వేదపండితుల మధ్య ఆసక్తికర చర్చ #se...

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

9, ఏప్రిల్ 2025, బుధవారం

ఒక కందంలో అష్టదిక్పాలక, దశావతారాల నామ స్మరణ..... కవి.. భట్టుమూర్తిసరికొండ లక్ష్మీనర సింహ రాజు. తిరుపతివేంకట కవుల పద్యం కూడా. సేకరణ సమర్పణ. శ్రీ వైద్యం వేంకటేశ్వరాచార్యులు.

0 comments

 జైశ్రీరామ్.

భట్టుమూర్తిసరికొండ లక్ష్మీనర సింహ రాజు అనే కవివర్యుడు 

ఒక కందంలో అష్టదిక్పాలక, దశావతారాల నామ స్మరణ చేయటం విశేషం.

ఆ కందం----

క.  హరి శిఖి యమ దనుజ వరుణ

హరి రాజేశ్వరులు మఱియు-అండజ ఢులి సూ

కర నృహరి వటు సుభార్గవ

నరవర బల బౌద్ధ కలికి-నాములు బ్రోవున్.

అష్టదిక్పతులు

1హరి =ఇంద్రుడు ,    

2శిఖి= అగ్ని,

3యమ=యమధర్మ రాజు,

4దనుజ=నైరుతి,

5వరుణ=వరుణదేవ

6హరి=వాయువు,

7రాజా=కుబేరుడు,

8ఈశ్వర=ఈశాన్యుడు


అవతారాలు                       

1అండజ= మత్స్య ,

2ఢులి=కూర్మ,

3సూకర=వరాహ,

4నృహరి=నరసింహ,

5వటు=వామన,

6సుభార్గవ=పరశురామ,

7నరవర=రామ,

8బల=బలరామ,

9బౌద్ధ=బుద్ధ,

10కలికి=కల్కి

అటులనే

తిరుపతి వేంకటకవులు వినుకొండలో అష్టావధానంలో చెప్పిన 

మరొక పద్యం

క.  జలచర ఢులి కిరి నరహరి

కలిత వటు త్రివిధ రామ కల్కులు బుద్ధుం

డిల తిరుపతి వేంకటశా

స్త్రులను పరబ్రహ్మశాస్త్రిఁ జూతురు పేర్మిన్.

తిరుపతి వేంకటకవులు వినుకొండలో అష్టావధానంలో చెప్పిన పద్యం ఇది.

ఒకసారి తిరుపతి వేంకటకవులు వినుకొండలో అష్టావధానం చేస్తుండగా వర్ణన 

అనే ఒక అంశంలో భాగంగా ఒకాయన  'అయ్యా, దశావతారాలను గురించి 

వర్ణించండి'.ఆ పద్యంలో మా అధ్యక్షుడు పరబ్రహ్మ శాస్త్రిగారి పేరు కూడా 

ఉండాలి.'  దాన్లో మీ ఇద్దరి పేర్లు కూడా ఉండాలి' అని అడుగగా చెప్పిన పద్యం.

జలచర ౧

ఢులి ౧

కిరి ౧

నరహరి౧

కలిత వటు ౧

త్రివిధ రామ ౩

కల్కులు ౧

బుద్ధుం౧

తిరుపతి 

వేంకటశాస్త్రులను 

పరబ్రహ్మశాస్త్రి

సేకరణ సమర్పణ. శ్రీ వైద్యం వేంకటేశ్వరాచార్యులు.

జైహింద్.

8, ఏప్రిల్ 2025, మంగళవారం

పీత్వా కర్దమపానీయం. ... మేలిమిబంగారం మన సంస్కృతి.

0 comments

 జైశ్రీరామ్.

శ్లో.  పీత్వా కర్దమపానీయం   -  భేకో రటరటాయతే!

పక్వం చూతరసం పీత్వా   -  గర్వం నాయాతి కోకిలః!!

తే.గీ.  బురదలోనీరు త్రాగుచున్ పొగరుతోడ

బెకబెకంచును వాగును వింత యిదియె,

పక్వచూతఫలరసము వరలఁ గొనియు

కూయు కోకిల, గర్వంబు కూడదిలను.

భావము.  బురదలో నీరు తాగి కూడా కప్ప పొగరుతో బెకబెకమంటుంది. 

బాగాపండిన మామిడి రసం తాగి కూడా కోకిల గర్వాన్ని పొందదు. 

మనం ఎప్పుడు గర్వాన్ని పొందకూడదు అని భావము.

జైహింద్.

న నరస్య నరో దాసో ... మేలిమిబంగారం మన సంస్కృతి.

0 comments

 జైశ్రీరామ్

శ్లో.  న నరస్య నరో దాసో  -  దాసస్త్యర్థస్య భూపతే |

గౌరవం లాఘవం వాపి  -  ధనాధననిబంధనమ్ || (హితోపదేశం)

తే.గీ.  నరుఁడు దాసుడు కాడిల నరులకెన్న,

ధనమునకుమాత్రమే యగు దాసునిగను,

సుగుణధము సద్ధనమౌను చూడగాను,

గౌరవాగౌరవములబ్బు కలిమిఁ బట్టి. 

భావము.  మనిషికి మనిషి దాసుడు కాదు, అతను ధనానికి దాసుడు. 

గౌరవం ఉండటం, లేకపోవటం అనేవి మనిషి వద్ద ఉన్న ధనంపై 

ఆధారపడి ఉంటాయి.

జైహింద్.

యువభారతి 6 వ సమావేశం.... అవధాని సుసర్ల సుధన్వ (M.B.M.B.S)అష్టావధానం.

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

మరణాన్ని జయించిన నచికేతుడి కథ తెలుసుకుందాం. డా. వేదుల శ్రీరామశర్మ్. !#manrobo

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

7, ఏప్రిల్ 2025, సోమవారం

కాంతిమండలవర్ణన..... వివరణ....శ్రీ క్రొవ్విడి వేంకట రాజారావు.

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

6, ఏప్రిల్ 2025, ఆదివారం

రేపు జరగబోయే సీతారామ కల్యాణం సందర్భంగా ఈరోజు నాంపల్లి సమీపంలో జరిగిన ఎదురుకోలు కార్యక్రమం. తే. 05 - 4 - 2025 Yedurukolu 2025 SRBS 1937 is live

0 comments

జైశ్రీరామ్.
ఎదురుకోళ్ళులో ప్రారంభంలోనే
రామునిపక్షమువారు చదివే మొదటి పద్యం.
👇🏻
జై శ్రీరామ్.🙏🏻
ఆర్యులారా అందరికీ శ్రీరామజయం.
👇🏻
శా.  శ్రీరాముండు వరూత్తముండగుటచే సీతామహాసాధ్వినే
 
మా రాముండు వివాహమాడదలచెన్ మాకన్నిటన్ సమ్మతం

బీ రమ్యాత్మనొసంగి పెండ్లి త్వరితంబే చేయుడీ మీర లో

పేరున్గాంచిన జ్ఞానులార! శుభముల్ విఖ్యాతి మీకందెడున్.🙏🏻
౧. సీత తరపున ప్రశ్న.
౧. ఓం శ్రీసీతాయై నమః | 
శా.  శ్రీమన్మంగళ గణ్య దేవతయె మా సీతా మహాసాధ్వి, మీ
రాముండంతటి వాఁడె కోరుకొనె మా రమ్యాత్మయౌ జానకిన్, 
ధీమంతుల్ జనకాత్మజన్ కొలుతురే దేదీప్యమానంబుగా,
నేమాత్రంబగు నీడు రాముఁడిలపై నీసాధ్వికిన్? జెప్పుడీ!
1. రాముని తరపున సమాధానము.
1. ఓం శ్రీ రామాయ నమః.
శా.  శ్రీరాముండిల వీరుఁడై నిలిచె నీ పృథ్విన్, మహాకార్ముకం
బీ రాముండె దళించి, సీతమదిలో హృద్యంబుగా నిల్చుటన్
మీ రామామణికొప్పు రాఘవుఁడె, స్వామిన్ సద్వరూత్తంసుగా
మీరేలన్ గ్రహియింపకుండిరకటా? మీదేమి పాండిత్యమో?

౨. సీత తరపున ప్రశ్న.
౨. ఓం జానక్యై నమః | 
జ్ఞానికి మాత్రమే తెలియు జానకి జన్మరహస్య మెన్నగా,
మౌనముతోడ నాత్మలను  మా జనకాత్మజ స్తుత్యనామమున్
ధ్యానము చేసి పొంగుచును ధన్యతగాంతురు మౌనులే భువిన్,
ఈ నయవర్తి కీడగునె యింపుగ మీ రఘురాముఁడిద్ధరన్? 
2. రాముని తరపున సమాధానము.
2. ఓం రామభద్రాయ నమః
ఉ. భద్రతఁ గొల్పు నేర్పుననె వర్ధిలె శ్రీరఘురామ భద్రుఁడై,
సద్రసరమ్య వాఙ్మహిత సారము శ్రీరఘురామ నామమే,
భద్రముగా నిరంతరము భార్యగ సీతను పొంది చూచు, సం
పద్రమణీ లలామ కిల వాసిగ నీతఁడె యీడు జోడగున్.

౩. సీత తరపున ప్రశ్న.
౩. ఓం దేవ్యె నమః | 
ఏ దేవి శుభనామమే దారి యగుచుండు నిహపరంబులు కనన్ మహిని ప్రజకు,
ఏ దేవి రూపంబు నెద నెంచి ప్రార్థింప నిట్టులే పనులౌను సృష్టి లోన,
ఏ దేవి జనకుండె యిహపరంబులు గనన్ నీ తల్లినే పెంచె నింపుగాను,
ఏ దేవి మూలమో యీ సృష్టికంతకు నాదేవియే సీత, యనుపమ సతి,
తే.గీ.  అట్టి  యా దేవితో సరి యెట్టులగును
రామచంద్రుండు చెప్పడీ ! రామ రామ,
భూమిజాతకు నతఁడెట్లు పోలికగును?
సీత సరి జోడు లేరింక భూతలమున?
3. రాముని తరపున సమాధానము.
3. ఓం రాజీవలోచనాయై నమః.
సీ.  రాజీవ నేత్రుండు రాజేంద్రుఁడీ రఘు రాముండు ధరణిపై రమ్య గుణుఁడు,
జిత శత్రు వర్గుండు, నుత వాఙ్మి, మితభాషి, స్మితవక్త్రుఁ డనుపమ శ్రీకరుండు,
వేదాంత సారుండు, వేదాత్మ రూపుండు, విశ్వ విఖ్యాతుండు, విశ్వవిభుఁడు,
సత్యవ్రతుండును, సత్యవిక్రముఁడును, శివధనుర్భంగుండు, ప్రవరుఁడితఁడు,
తే.గీ. అట్టి శ్రీరామచంద్రునే యెట్టులిటుల
జోడు కాదంద్రు సీతకు? పాడిఁ దలచి
వరునిగా మీరు గుర్తించి, వాసిగనుఁడు,
రామచంద్రుండు సీతకున్ ప్రాణమగును.

౪. సీత తరపున ప్రశ్న.
౪. ఓం రమాయై నమః |
చం.  రమయన మాత సీత, గుణరమ్య సమావృత, రమ్య భాతి, మా
రమ యసమాన నేత్రి, కనరారు జగాన రమాసమానులే, 
రమకు సమానమై వెలుగ రామయటంచు పేరు కల్గినన్
రమకిలసాటియౌనె తమ రాముఁడు? రమ్య గుణాభిరాముఁడా?
4. రాముని తరపున సమాధానము.
4. రమ్యగుణాభిరామాయై నమః.
ఉ. రమ్యగుణాభిరాముడిల రాముఁడు, సత్యము, నిత్యుఁడాతఁడే,
సౌమ్య సుతత్త్వుఁడున్, సుగుణసారము రాముఁడు సీతపోలికన్,
గమ్యము చూపు భక్తులకు, కంజదళాక్షుఁడు, సృష్టి లోపలన్
రమ్యగుణాలవాలమగు రాముఁడె సీతకు ఈడుజోడగున్.

౫. సీత తరపున ప్రశ్న.
౫. ఓం రామాయై నమః.
ఉ.  ఒప్పిదమై రహించుటనె యొప్పుగ రామ యనంద్రు సీతనే,
గొప్పలు చెప్పుకో మరిగి కుంభినిపై నుత రామ నామమున్
చెప్పుకొనంగనౌనె? అది సిగ్గుగ లేదొకొ మీకు, వారికిన్?
ఇప్పుడు సీతకౌనె సరి? యేమని చెప్పుదు రయ్య? చెప్పుడీ!
5. రాముని తరపున సమాధానము.
5. ఓం రమాలంపట మానసాయ నమః |
ఉ. ఒప్పుగ పుట్టు సీత యని, యొప్పును రాముఁడు సీతకంచునే
గొప్పగ రామనామమును కూర్మిని ముందుగ పెట్టియుండుటన్,
ని ప్పనఁదగ్గ సీతకు మనీషులుమెచ్చెడి జోడు రాముఁడే,
యిప్పటికైన నమ్ముడయ, యీశ్వరి సీత, రమేశుఁ డీతఁడే.

౬. సీత తరపున అంగీకారము.
౬. ఓం మంగళాంగ్యై నమః.
ఉ.  స్వాగతమయ్య మీకు గుణసన్నుత రాముని కిత్తుమయ్య మా
శ్రీ గుణగణ్య సీత, నిక చేకొన శ్రీరఘురామచంద్రునిన్
వేగమె పెండ్లివేదికకు వేడుకగా గొనిపోదుమయ్య, సద్
యోగము లోకమంతటికి, నొప్పుగఁ గల్గఁగఁజేయ నిత్తరిన్.
6. రాముని తరపున సంతోషము.
6. ఓం మంగళస్వరూపాయ నమః.
ఉ.  సంతసమయ్యె మాకు, గుణసన్నుత సీతకు రామమూర్తికిన్
పంతులు మంత్రముల్ చదువ భక్తిగ నిప్పుడె పెండ్లి కార్యమున్
శాంతిగ లోకముల్ వెలుగ చక్కగ జేసెదమయ్య, రండయా!
చింతలు తీరుగాక, వరసిద్ధిని  మంగళమౌ ధరిత్రికిన్.  
స్వస్తి.
అమ్మ దయతో
చింతా రామకృష్ణారావు.
05 – 4 – 2025.
జైహింద్.

నిన్న ఒక గ్రంథావిష్కరణ సభలో

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

 

ఆంధ్రామృత పాఠకులకు భక్తజనాళికి హైందవానువర్తులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు.

0 comments

 జైశ్రీరామ్.

శ్రీ రామచంద్ర శ్రితపారిజాత

సమస్త కళ్యాణ గుణాభిరామ

సీతా ముఖాంభోరుహ చంచరీకో

నిరంతరం మంగళ మాతనోతు.

ఆంధ్రామృత పాఠకులకు భక్తజనాళికి హైందవానువర్తులకు 

శ్రీరామ నవమి శుభాకాంక్షలు.

జైహింద్.


5, ఏప్రిల్ 2025, శనివారం

లక్ష్మీ సహస్రనామములలో 610వ నామము. గానము... శ్రీ ఏ. అప్పల నాయుడు గారు.

0 comments

 

జైశ్రీరామ్.
అత్యద్భుతముగా గానం చేసిన శ్రీ ఏ. అప్పలనాయుడు గారికి ధన్యవాదములు.

610. ఓం శక్వర్యై నమః🙏🏼
శ్రీ లక్ష్మీసహస్ర నామములలో 610వ నామము.

నామ వివరణ. 
శక్వరీవృత్తము అమ్మయే.

తే.గీ.  శక్వరీ! శుభ మంజీర నిక్వణములు
నీదు పాదోద్భవంబయి యాదుకొనును
చెవులఁబడినంతనే మమున్ చిద్వరముగ,
వినెడి భాగ్యంబు కలిగించు విశ్వ జనని.
🙏🏼
రచన .. చింతా రామకృష్ణారావు.
జైహింద్.



పురాణాలు - ఆధునిక శాస్త్ర విజ్ఞానం. Puraṇalu Adhunika Sastra Vijnanam | Bhagavat Puranam 05.03.2025, 7.0...

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

దత్తానువాదము. శ్లోకానికి పద్యం. శ్రీ మరుమాముల దత్తాత్రేయావధాని.

0 comments

 జైశ్రీరామ్.

శ్లో.  చిత్రం దేవి విదేహరాజనగరే ధాత్రీ తలాత్ కన్యకాః 

జనయంతే కిల సంప్రతి ప్రభు మయా చిత్రాతి చిత్రం శ్రుతమ్

సాకేతేఖలు పాయసాన్న కబలా త్ప్రాదుర్భవంత్యర్భకాః 

సీతారామ మనోజ్ఞ భాషణమిదం పాయాదపాయా జ్జగత్

ఉ.  భూమిని దున్నుచో పుడమి పుట్టిరి బిడ్డలటంచు వింటిమే?

భామిని చిత్రమే, యనెడు ప్రాణవిభున్ గని సీత యిట్లనెన్

స్వామి యదేమి చిత్ర మిల పాయస భక్షణ జేసినంతనే

శ్రీమదయోధ్యరాణులకు చెన్నుగ పూరుషులుద్భవించిరే?

రాముఁడు సీత పల్కు చతురంబగు పల్కులు మిమ్ము గాచెడున్!

జైహింద్.

4, ఏప్రిల్ 2025, శుక్రవారం

పద్యవైభవం గ్రంథావిష్కరణ. పద్య సారస్వతపీఠం ఆహ్వానం.

0 comments

 

జైశ్రీరామ్.
https://maps.app.goo.gl/JbAzdWk5E5gQxi967?g_st=aw
జైహింద్.


*లిపిడ్ ప్రొఫైల్*

0 comments

జైశ్రీరామ్. 

*లిపిడ్ ప్రొఫైల్*  

అద్భుతంగా వివరించబడింది  

ఒక ప్రముఖ వైద్యుడు లిపిడ్ ప్రొఫైల్‌ను ఒక ప్రత్యేక మార్గంలో వివరించేందుకు ఒక అందమైన కథను పంచుకున్నారు.  

*మన శరీరాన్ని ఒక చిన్న పట్టణంగా ఊహించుకోండి.* ఈ పట్టణంలోని ప్రధాన ఇబ్బంది కలిగించేవారు కొలెస్ట్రాల్. వారికి కొన్ని సహాయకులూ ఉన్నారు. ప్రధాన సహచరుడు ట్రైగ్లిసరైడ్. వారి పని ఏమిటంటే, రోడ్లపై తిరుగాడి గందరగోళాన్ని సృష్టించడం, మార్గాలను అడ్డుకోవడం.  

హృదయం ఈ పట్టణం యొక్క సిటీ సెంటర్. అన్ని రోడ్లు హృదయానికి దారితీస్తాయి. ఇబ్బంది కలిగించేవారి సంఖ్య పెరిగినప్పుడు ఏమి జరుగుతుందో మీకు తెలుసు. వారు హృదయం యొక్క పనితనాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తారు.  

కానీ మన శరీర-పట్టణానికి ఒక పోలీస్ ఫోర్స్ కూడా ఉంది.  

HDL మంచి పోలీస్, ఇబ్బంది కలిగించేవారిని అరెస్ట్ చేసి జైలులో (కాలేయం) ఉంచుతాడు. కాలేయం వారిని శరీరం నుండి డ్రైనేజ్ సిస్టమ్ ద్వారా బయటకు తోసేస్తుంది.  

అయితే, ఒక చెడ్డ పోలీస్ కూడా ఉన్నాడు, LDL, అతను శక్తి కోసం ఆశించేవాడు.  

LDL ఇబ్బంది కలిగించేవారిని జైలు నుండి విడుదల చేసి తిరిగి రోడ్లపైకి పంపుతాడు.  

మంచి పోలీస్ HDL కంటే చెడ్డవారు ఎక్కువగా ఉన్నప్పుడు, పట్టణం గందరగోళంగా మారుతుంది. అలాంటి పట్టణంలో ఎవరు ఉండాలనుకుంటారు?  

మీరు ఇబ్బంది కలిగించేవారిని తగ్గించి, మంచి పోలీసులను పెంచాలనుకుంటున్నారా?  

*నడవడం ప్రారంభించండి!* ప్రతి అడుగుతో, మంచి పోలీసులు HDL పెరుగుతారు, మరియు ఇబ్బంది కలిగించేవారు కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్, మరియు LDL తగ్గుతారు.  

మీ పట్టణం (శరీరం) తిరిగి దీప్తిని పొందుతుంది. మీ హృదయం, సిటీ సెంటర్, ఇబ్బంది కలిగించేవారి బ్లాకేడ్‌లు (హృదయ బ్లాక్) నుండి సురక్షితంగా ఉంటుంది. మరియు మీ హృదయం ఆరోగ్యంగా ఉన్నప్పుడు, మీరు కూడా ఆరోగ్యంగా ఉంటారు.  

కాబట్టి, మీకు అవకాశం దొరికినప్పుడల్లా నడవడం ప్రారంభించండి!  

ఆరోగ్యంగా ఉండండి... మరియు  

మంచి ఆరోగ్యాన్ని పొందండి  

ఇది మంచి HDL ను పెంచడానికి మరియు చెడ్డ LDL ను తగ్గించడానికి ప్రధానంగా నడక ద్వారా సాధించే ఒక మంచి వ్యాసం. ప్రతి నడక అడుగు HDL ను పెంచుతుంది. అందువల్ల, నడవండి, నడవండి మరియు నడవండి.  

సుఖంగా ఉండే సీనియర్ సిటిజన్స్ వీక్  

### *తగ్గించాల్సినవి:*  

1. ఉప్పు  

2. చక్కెర  

3. బ్లీచ్ చేసిన పిండి  

4. పాల ఉత్పత్తులు  

5. ప్రాసెస్ చేసిన ఉత్పత్తులు  

### *కావలసిన ఆహారాలు:*  

1. కూరగాయలు  

2. పప్పులు  

3. బీన్స్  

4. గింజలు  

5. గుడ్లు  

6. కోల్డ్ ప్రెస్డ్ నూనె (ఆలివ్, కొబ్బరి, ...)  

7. పండ్లు  

### *మరచిపోయేందుకు ప్రయత్నించాల్సిన మూడు విషయాలు:*  

1. మీ వయస్సు  

2. మీ గతం  

3. మీ ఫిర్యాదులు  

### *ప్రాముఖ్యమైనవి మరియు ప్రియమైనవి:*  

1. మీ కుటుంబం  

2. మీ స్నేహితులు  

3. మీ సానుకూల ఆలోచనలు  

4. శుభ్రమైన మరియు ఆహ్లాదకరమైన ఇల్లు  

### *అవలంబించాల్సిన మూడు ప్రాథమిక విషయాలు:*  

1. ఎప్పుడూ నవ్వండి / చిరునవ్వు  

2. మీ స్వంత వేగంతో క్రమం తప్పకుండా శారీరక కార్యకలాపాలు చేయండి  

3. మీ బరువును తనిఖీ చేసి నియంత్రించండి  

### *అభ్యసించాల్సిన ఆరు ముఖ్యమైన జీవనశైలులు:*  

1. దాహం వేసినప్పుడు మాత్రమే నీరు తాగడానికి వేచి ఉండకండి  

2. అలసిపోయినప్పుడు మాత్రమే విశ్రాంతి తీసుకోవడానికి వేచి ఉండకండి  

3. అనారోగ్యం వచ్చినప్పుడు మాత్రమే వైద్య పరీక్షలు చేయించుకోవడానికి వేచి ఉండకండి  

4. అద్భుతాల కోసం దేవుడిని నమ్మడానికి వేచి ఉండకండి  

5. మీలోని ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడూ కోల్పోకండి  

6. సానుకూలంగా ఉండి, ఎల్లప్పుడూ మంచి రేపటి కోసం ఆశించండి  

 మీ వాసవి చాటబుల్ ట్రస్ట్ ప్రాజెక్ట్ చైర్మన్ గందె రామకృష్ణ.

జైహింద్.

సమన్వయ సరస్వతితో సంతోష్ ఘనపాఠీ #Hindudharmakshetram #SantoshGhanapathi

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

ఇక్ష్వాకు వంశంలో శ్రీరామచరిత్ర...... శ్రీ క్రొవ్విడి వేంకట రాజారావు.

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

3, ఏప్రిల్ 2025, గురువారం

నాదనీరాజనం.‘.....‘సూర్యశ్రీ’’ 30.03.2025.

0 comments

            

జైశ్రీరామ్.

 సీ|| ప్రాణికోటి మదిని పరమాత్మయై వెల్గు., 

                         తేజంబు నీవెగా తిరుమలేశ!

సకలంబు భ్రమయైన సంసారబంధాల., 

                      తీరుమార్చగగల్గు తిరుమలేశ!

కాలగమనరీతి కనిపింప నీయని., 

                        చిద్విలాసపు హాస! శ్రీనివాస!

భక్తి తత్త్వపు నిజభావనల్ జూపిన., 

                అభయంబు నిచ్చెడి యమలతేజ!

తే.గీ. స్వామి! సప్తగిరీశ! “విశ్వావసు”వన.,

         నీవె, ఎన్నిజన్మలకైన నిర్ణయాత్మ

         కుండవు మహితమూర్తి! వైకుంఠవాస! ., 

         జగతి గావుమయ్య సతముప్రగతిజూపి..1.


సీ|| ఏడేడు లోకాల నెచ్చట జూచినన్.,

           కలిమాయ తప్పించు ఘనుడవీవె.

      అలమేలు మంగమ్మ యలుకలు దీర్చుచు., 

                 నవ్వించి కవ్వించు నటుడవీవె.

      భక్తుల హృదయాలు పండించి నిండించి., 

                         పరవశించెడు ఘనపాఠివీవె.

       లడ్డుకంబులనిచ్చి లాలస జూపించి.,

                     దరిజేర్చు కొనునట్టి హరివి నీవె.

తే.గీ. క్రొత్త పంచాంగ మందున కూర్మితోడ .,

        నీదు కరుణనుజూపించి నిర్మలాత్మ!

        అన్ని రాసుల వారికి తిన్ననైన., 

        కనకవర్షంబు గురియించు కమలనాభ! 2.


సీ|| కొండలలోన పుంస్కోకిలంబులతతి ., 

               చైత్రమాసపుసౌరు చాటుచుండె

    తుమ్మెద రాగాల తోషణ గానాల .,

                    మల్లెతోటలలోన మారుమ్రోగె

     చిత్తజు పదునైన మెత్తని బాణముల్ .,

              గుండె లోతులలోన గ్రుచ్చుకొనియె

      వాసంత లక్ష్మియే వయ్యారముల్ జూపి .,

                      చిలిపిప్రకృతితోడ చేయిగలిపె

తే.గీ. ఈ ‘‘యుగాది’’ని నిట్లుగా నీశ్వరయ్య! .,

        మార్చివేయుట కీవెగా మంచిగురువు

        పరమకారుణ్య సౌజన్య! వరద! మాకు .,‘‘

        విశ్వవసువు’’న శుభముల విసరుమయ్య 3.


సీ|| వేంగమాంబాదేవి విష్ణుభక్తికిమెచ్చి ., 

                 అన్నదానమిచట నమలు పరచ

      వృద్ధులు పంగులు వికలాంగులెల్లరు .,

                శీఘ్ర దర్శనములు చేయుచుండ

     గోసేవ జేయుచు గోవులనన్నిటన్ .,

                  తనివార ప్రేమను దనుపుచుండ

     తిరుమల క్షేత్రంబు దేదీప్యమానమై .,

                     ఘనపు టుగాదిగా కాంతులీనె

తే.గీ. నిత్యకల్యాణమిచ్చట నిర్మలాంగ., 

        పచ్చతోరణమైచను పరమపురుష!

        నీదుపాదంబులే సాక్షి నిజము నిజము ., 

       ధన్యమాయెను మాజన్మ ధరణినాథ!  4.


సీ|| షడ్రసో పేతమై సకలజ నాళికి ., 

             పలురుచుల్ చూపించు పండుగిదియ

      క్రొత్తవస్త్రాలతో కోలాహలమునిండి., 

                 ప్రతియింట వనలక్ష్మి వరలుచుండ

      పంచాంగ పఠనాన భావిని దలచుచు ., 

                         కష్టసుఖంబులు కలలుగనుట

       ఆదాయ వ్యయములు సాదాగనుండుటన్ .,

                              జీర్ణించుకొనలేని జీవితాలు

 తే.గీ. మానసికమైన దైహిక మార్పులన్ని ., 

         నీదు కరుణాంత రంగమే నిశ్చయముగ

         నిజము కదటయ్య లోకేశ! నీరజాక్ష! ., 

         కాక, రుచులును ప్రతిభలు కలుగుటెట్లు?5.


   సీ|| నాదనీరాజన వేదసమర్చనల్ .,

                  నిత్యసంపూజిత నెలవు మీకు

         భక్తదర్శనములు పల్లాండు దీవనల్ 

                  పరవశంబునుగొల్పుప్రభలు మీకు

         మాడవీధులద్రిప్పు మానితసేవలే 

                    నిత్యకల్యాణముల్ నీకునెపుడు

          తిరుమల గడపిన దివ్యక్షణంబులే., 

                   వైకుంఠమునుజేరు వరుసమెట్లు

 తే.గీ. మాకు దక్కిన భాగ్యంబు మదనజనక! .,

         కలియుగంబున వెలసిన కైటభారి

         ఏడుకొండల మా సామి వేడుకొందు., 

         పాదపద్మములంటుచు ప్రతిదినంబు..6.


   సీ|| ఆదిశేషునిపేర యమితకీర్తినిగాంచి., 

                     “శేషాద్రి”యయ్యెను సేవ కొరకు

         నీలాంబరీ దేవి నీలాలనిచ్చుటన్., 

                        “నీలాద్రి”యైనిల్చె నిన్నుగొల్వ

         అంజనాదేవియె ఆత్మనిన్ దలచుచు., 

                 “అంజనాద్రి”యనగ యలరెనాడు

        వృషభాసురుని గర్వ విచ్ఛిత్తి జేయుటన్.,

                   “వృషాద్రి”యైచనె వినయమొప్ప

         నారాయణాఖ్యుడన్ నవవిధ భక్తుడే., 

                  “నారాయణాద్రి”యై నభముదాకె

          గరుడవాహనమది కంజాక్షుసేవింప .,

            “గరుడాద్రి”యయ్యెను ఘనముగాను

          వివిధపాపంబులన్ వీగగ జేయుటన్.,

                 “వేంకటాద్రి”గ మారె విభవమొప్ప

తే.గీ. నామజపముల శక్తిమై నడక తోడ ., 

        ఏడుకొండలు భక్తితోనెక్కి వచ్చి

       నిన్ను దర్శించు నరునకు నీరజాక్ష!.,

       సప్తజన్మల పాపాలు సమసిపోవు..7


సీ|| తీర్థయాత్రనుజేయ తిరుమలనెంచుటే.,

                   పూర్వజన్మలలోని పుణ్యఫలము

      తలనీలములనిచ్చు ధర్మంబుపాటింప., 

                        దర్పహీనుండైన దాసుడనుట

       కోనేటినీటను గ్రుంకులాడుటయన్న.,

                    జాహ్నవీతటిలోన స్నానమగును

       బాలాజి చెంగటన్ భక్తినుగాదికై.,

                          అక్షరార్చనసల్ప మోక్షదంబు

తే.గీ. అన్నిగ్రహముల కరుణకు నంజలించి., 

         ప్రకృతిశోభకు నిలువెల్ల పరవశించి

         మానితావకాశ మిడిన మాన్యులకును., 

         వందనమ్ములు శ్రీకర చందనములు..8.


సీ.:    శ్రీదేవి తో నీవు చిద్విలాసుడవౌచు

            భువియంత దిరుగాడ పులకరించు

         పంచబాణుని గురి బ్రహ్మాస్త్రమై తోచి

                   అనురాగ రాగాలనలర జేయు

          పాదపంబులు పూర్ణ పల్లవ శోభలన్

                    పచ్చదనంబును బరచుకొనును

         శృంగార భావముల్ చిత్తాన మొలకెత్తి

                     సౌంజ్ఞల సరసాల సాగుచుండు

  తే.గీ: ఆదిపురుషా ! కమలనాభ! యమలచరిత!

          చేతనత్వము నీదివ్య సృష్టి యనుచు

         చేసిచూపితివయ్యరో!శ్రీనివాస! 

         కాలచక్రంపుటాకు నుగాదియనగ..9


సీ:    వేపపూతయు నుప్పుబెల్లంబు కారముల్

                      పులుపు వగరు లెల్ల పొందుపరచి

        గా జులచేతితో ఘనమైన ప్రేమతో

                నోర్పుగా నొకటిగా నూరినూరి

        నళిననేత్రుని ముందు నైవేద్యమిడకున్న

              రుచియురాదు మరియు శుచియులేదు

 తే.గీ: భక్తి తాత్పర్యభావముల్ రక్తిదనర

         వింతలేహ్యంబు విష్ణు నైవేద్యమిడిన

        అమృతతుల్యంబు రుచులు మహత్తరములు

        శ్రీనివాసుడ!నీలీల చెప్పదరమె?..10


                                          నమస్సులతో....‘‘సూర్యశ్రీ’’

జైహింద్.

"యువత-భవిత"

0 comments

 

శ్రీరస్తు               శుభమస్తు               అవిఘ్నమస్తు

విషయము…..‘ శ్రీవిశ్వావసు వత్సర ఉగాది పద్య రచనల పోటీ

"యువత-భవిత"

 

౧.శా.  శ్రీమన్మంగళ భారతావని సదా శ్రేయోభిరామమ్ముగా

భూమిన్ వెల్గఁగ హేతు వీ యువత, తా పూజ్యప్రవృత్తిన్ లసత్

ప్రేమోదారసుధాస్రవంతియన సద్విఖ్యాతితో సృష్టిలో

క్షేమంబున్ సహవాసులన్ గనెడి సచ్ఛ్రీమార్గమందొప్పుతన్. 

 

౨.చ.  యువత శుభాస్పదంబయిన నుజ్వల దివ్యమనోజ్ఞమైన సద్

భవితను గాంచనెంచవలె, వర్ధిలు మార్గము లెంచి, యుక్తమౌ

ప్రవర పథంబులో నడచి, భద్రతనొప్పెడి భావి నిప్పుడే

కువలయమందు నెంచుకొని కోరిన రీతి గ్రహింగాఁదగున్.

 

౩.ఉ.  బాల్యమునుండి పిల్లలకు భక్తియు, యుక్తియు, శక్తిఁ గొల్పుచున్,

లౌల్యము చేరనీక మదులన్ స్థిరనిర్ణయమొప్ప నేర్పు చా

కుల్యత లేని గొప్ప కుదురైన మనంబును కల్గఁ జేసి, ప్రా

బల్యము పెంపు చేసుకొను పాఠములన్ వచియింప యుక్తమౌన్.

 

౪.శా.  స్వాధీనుండయి, నిశ్చితాత్ముఁడగుచున్ సంపాదనా శక్తి తా

మేధా శక్తిని పొంది, సంఘమునకున్ మేల్జేయు సుజ్ఞానిగా

బోధన్ గొల్పు విధంబుగా నడచుచున్ పూజ్యుండటంచంతటన్

సాధింపన్ వలె, కీర్తి నట్టి ఘనుఁడే సాధించునౌన్నత్యమున్.

 

౫.మ.  పిననాడే పర సంపదన్ బ్రతుకుటన్, వేధించి సాధించుటన్,

గొనుటన్ పేదల సొమ్మునూరకనె, సాకుల్ జెప్పుచున్ కాలయా

పనమున్ జేయుట, నేరనట్టి గతిలో పాఠంబులన్ జెప్పుచో

మన నేర్చున్ తన కాళ్ళపై యువత క్షేమంబొప్పగా భావిలోన్.  

 

౬.చ.  ఉచితము లొందుచుండుటను నోపరు కష్టము చేయనెవ్వరున్,

సుచరితులై స్వతంత్రముగ శోభిలఁ జాలరు బద్ధకస్తులై,

పచనము చేసిపెట్టునెడ వండుటకేల మనంబు వచ్చు? సా

గుచునిటులుండ, భావిని యగోచరమంచు గ్రహింపనెట్టులౌన్?

 

౭.చ.  చదువులు నేర్పునప్పు డటు సంపద గూర్చు స్వశక్తి గొల్పగా

దికినినెక్కు పాఠములు మన్ననతో వివరింపగావలెన్,

పదునగు మేధఁ గొల్పవలె భాగ్యము సృష్టిని చేయునట్లుగన్,

పదువురి కో యుపాధినిడు భావన పెంచిన వర్ధమానుఁడౌన్.

 

౮.మత్త.  వృత్తివిద్యల శిక్షణంబిడ పృథ్విపైనెటనుండినన్

జిత్తశుద్ధిని సంపదల్ గని క్షేమమొప్పఁగ జీవనం

బెత్తరిన్ సుఖమొప్పగా నడిపింపగానగు శక్తితోన్,

మత్తువీడిన శక్తియే వరమౌ ధరన్ యువతాకృతిన్. 

 

౯.చ.  యువతకుఁ గొల్ప సద్భవిత నొప్పుగ ధర్మ విశుద్ధ చిత్తులై,

కువలయమందుఁ జూచి యనుకూల పరిశ్రమలన్ రచించుచున్,

ప్రవిమల శిక్షణంబులిడి, భావిని మేలుగ వాడు వస్తువుల్

ప్రవరముగా సృజించునటు భవ్యముగా నొనరింపగా వలెన్.

 

౧౦.ఉ.  భిక్షకు చేయి చాపుటను, భీరువుగా తలయొంచి యుండుటన్,

రాక్షసబుద్ధి నుంటను, భరంబుగనన్యులపైన మన్కి,

ల్లక్షణ దూర వర్తనము లక్ష్యముతో నెడబాపి, చక్కనౌ

శిక్షణ నీయగా వలెను చిన్నతనంబునే శుభార్థులై.

 

౧౧.శా.  నిర్లిప్తంబగు జీవనంబు విడుచున్, నిస్తంద్రతన్ మెల్గుచున్,

స్వర్లోకాద్భుత హర్మ్య భర్మముల త్రోవన్ వీడి స్వప్నంబులన్

దోర్లీలన్ సృజియించు వాని గనుచున్, దుర్నీతులన్ వీడుచున్,

స్వర్లోకంబుగ భారతావనిని ధ్యాసన్ జేయుతన్ ధీనిధుల్.

 

౧౨.గుప్త పంచమ పాద గోమూత్రికాబంధ ఉత్పలమాల.

భావంబందలి వెల్గు నేర్పు నుత సేవాసక్తి, నుత్పాద్యతన్,

భావిన్ భారతి వెల్గు నీ యువత సేవన్ భాతి నత్యున్నతి(న్),

న్భావ స్వేచ్ఛ, గణింపుచున్ యువత లోనన్ యోగ్య  సంపత్ప్రభన్

భావిన్ స్వచ్ఛత తోడ వెల్గు వసుధన్ భాసింప సంస్కారముల్.

 

౧౩.అనేక ద్వివిధ కంద గీత గర్భ చంపక మాల.

వర నుతమేదినిన్ నిధుల భారత దేశము నిండుకుండరా,

పర హితమౌశుభాకరము భక్తితరంగపు కల్పవల్లి, ధీ

వర ధృతిచేతనే యువత భాగ్య తలంబిది యుచ్ఛఁ గొల్పుగా,

పర గతియౌమహా సుగతి భారతి భావికి శోభఁ గూర్చురా!

 

౧౪. శివలింగ బంధ భావ గోపనచిత్ర ఉత్పలమాల.

శ్రీయుత భావ! భారత ప్రసిద్ధి  నృపాలకులంతరాత్మలన్

జేయఁగ నౌను చింతనను, చేసి యపార క్షుధార్తి బాధితుల్

మాయ,కొలాలు చూపుచును మాడు జనంబుల ప్రేమ వీడరా

దేయని దేహియంచననిదీనులె యుండని తీరు నేలుతన్.

 

౧౫.శుద్ధ నిరోష్ట్య తేటగీతి(ఉ ఊ ఒ ఓ ప ఫ బ భ మ వ/వర్ణ నిషేధము)

తైజ సాకృతి నెనలేని ధారణ, నిజ

శక్తి నెన్నగ తనరిట చాలినంత

కీర్తి గని, జననేతలీ క్షితిని సహజ

శ్రీశ! కాంతిని దనరిన శ్రీనిధిదియె.

 

౧౬.మణిప్రవాళ మాలిని.

యువత భవిత దేఖో, యుద్ధతే నాఽస్తి కించిత్,

ప్రవణ గరిమ గ్రేటే, వర్ధనంబెన్న డౌటే,

నవత గనఁగ ఫారన్ నప్పునంచున్ చలంతి,

ప్రవరవరులు, హేరామ్! వారలన్ గావు మాల్వేజ్!

 

౧౭.శ్రీచక్రబంధ తేటగీతి.

కనఁగ మీశక్తి శ్రీమాత కాంతి చేత,

లక్ష్యమీడేరు సుశ్రీ యువాళి బ్రతుక,

సిరుల భారతీ శ్రీమాత మిమ్ము బ్రోచు,

కమల వాసిని తప్పక కాంచునింక.

 

౧౮.చ`తురంగ స్వస్తిక్ బంధ లఘు కందము.

(గుఱ్ఱపుటెత్తులలో వచ్చు పదములు యువతకు - భవితను - ప్రజలిల - కొలుపుత,)

 

జననుత ప్రభువులు యువతకు

ఘనమగు ధృతియు నిలుపుత, సుకర వర! కొలువుల్

ఘన తకు సులలితముగ మన

ను నిజ బృతికి భవితకు ప్రభను గొనవలెనిలన్.

 

౧౯.చ.  త్రికరణ శుద్ధితో యువత ప్రేమను కోరెడి పాలకోత్తముల్

ప్రకటనలిచ్చుచుండవలె భన్యపు జీవన వృత్తులిచ్చుటన్,

ముకుళిత హస్తులై విధులు పొంది మహత్తర సేవఁ జేయుచున్

సకలజగంబునన్ యువత చక్కగ కీర్తిని పొందగా వలెన్.

 

౨౦.ఉ.  మంగళమౌత భారతికి, మంగళమౌ యువసజ్జనాళికిన్,

మంగళమౌత శాంభవికి, మంగళమౌగురుదేవపాళికిన్,

మంగళమౌత సత్కవుల మంగళ సత్కవితాసుధారకున్,

మంగళమౌత మీకు, పరమాత్మునకెల్లెడమంగళంబగున్.

 

స్వస్తి.

చిత్ర బంధ పద్యముల వివరణ.

14 శివలింగబంధ ఉత్పలమాల.



17. శ్రీచక్ర బంధ తేటగీతి
౧౮.చ`తురంగ స్వస్తిక్ బంధ లఘు కందము.


జైహింద్.