జైశ్రీరామ్.
మా యింటికి వచ్చి మా గృహాన్ని పావనం చేసిన శ్రీలక్ష్మీనరసింహార్చకస్వామి శ్రీ దీవి శ్రీనివాసాచార్యులవారు
జైశ్రీరామ్.
మా యింటికి వచ్చి మా గృహాన్ని పావనం చేసిన శ్రీలక్ష్మీనరసింహార్చకస్వామి శ్రీ దీవి శ్రీనివాసాచార్యులవారు
శ్రీరామ్.
శ్లో. కర్తవ్యంచైవ కర్తవ్యం ప్రాణైః కంఠ గతైరపి;
అకర్తవ్యం న కర్తవ్యం ప్రాణైః కంఠ గతైరపి.
తే.గీ. చేయవలసిన పనులను చేయవలయు
ప్రాణములు దేహమందున వరలు వరకు,
చేయకూడని పనులను చేయరాదు
ప్రాణములుపోవుచుండినన్, భావ్యమదియె.
భావము.
ప్రాణాలు పోయే వరకూ మనం ధర్మమే పాటించాలి.చేయకూడని పని
చేయకూడదు.
జైహింద్.
జైశ్రీరామ్.
"ఆశీస్సులు" ప్రభావంను... పద్యం లో వ్రాయoడి
ఉ. వందన మాచరించు తరి బ్రహ్మము నెన్నుచు చేయు వారికిన్
వందన మందువార లది బ్రహ్మకునర్పణ చేసి, పిమ్మటన్
బంధుర రీతి దీవనలు పల్క ననంత మహత్వ సత్ఫలం
బందగ జేయు నిక్కమిది, యాత్మను శ్రీహరి దల్చి పల్కుటన్.
జైహింద్.
జైశ్రీరామ్.
శ్లో. రాగీ కర్మఫలప్రేప్సుర్లుబ్ధో హింసాత్మకోऽశుచిః|
హర్షశోకాన్వితః కర్తా రాజసః పరికీర్తితః. || 18-27 ||
తే.గీ. రాగి, లోభి, ఫలాపేక్ష గ్రాలువాడు,
హింసచేసెడివాడు, మహినశుచియు,
దుఃఖసుఖములకుకలగు దుస్స్వభావి,
రాజసికుడని యెరుగుము, రాజపుత్ర.
భావము.
రాగంతో కూడి ఫలం కోరుతూ, పిసినిగొట్టు తనమూ, హింసా స్వభావం కలిగి, అశుచి అయి,
సుఖదుఃఖాలకు లోనయ్యే కర్త --రాజసికుడని చెప్ప బడుతుంది.
శ్లో. అయుక్తః ప్రాకృతః స్తబ్ధః శఠో నైష్కృతికోऽలసః|
విషాదీ దీర్ఘసూత్రీ చ కర్తా తామస ఉచ్యతే. || 18-28 ||
తే.గీ. నిగ్రహము లేని, పామరుని, మొరటును, వి
షాదపూర్ణు, సంకుచితమౌ ఖేదగుణుని,
బద్ధకస్తుని, మొండిని, ప్రబల మోస
గానినిల కాల యాపకున్, గాంచ తామ
సికులుగా జెప్ఫనొప్పును
స్థిరగుణాఢ్య!
భావము.
ఎలాటి నిగ్రహం లేని వాడు, పామరుడు, సంకుచిత స్వభావం కలవాడు, మొండివాడు,
మోసగాడు బద్ధకస్తుడు, విషాదంలో ఉండి ప్రతి దానికి కాలయాపన చేసే కర్త,
తామసికుడని చెప్ప బడతాడు.
జైహింద్.
జైశ్రీరామ్.
శ్లో. అనుబన్ధం క్షయం హింసా మనపేక్ష్య చ పౌరుషమ్|
మోహాదారభ్యతే కర్మ యత్తత్తామసముచ్యతే. || 18-25 ||
తే.గీ. క్షయము ననుబంధమున్ హింస, శక్తి గనక
మించి చేయుట మోహమున్ మించి మొదలు
పెట్టుటివి తామసికమగు విజయ! నిజము
నీవు గ్రహియింపుమీ భువి నేర్పు మీర.
భావము.
బంధనంలో ఇరికించేది, నాశనాన్ని హింసను కలుగచేసేది శక్తి సామర్ధ్యాలు
లెక్కించకుండా చేసేది, మోహంతో ఆరంభించబడినదీ అయిన కర్మ
తామసిక కర్మ అని చెప్ప బడుతుంది.
శ్లో. ముక్తసఙ్గోనహంవాదీ
ధృత్యుత్సాహసమన్వితః|
సిద్ధ్యసిద్ధ్యోర్నిర్వికారః కర్తా సాత్త్విక ఉచ్యతే. || 18-26 ||
తే.గీ. సంగముక్తు డహము లేక సదయనొప్పి,
పట్టుదల దీక్ష నొప్పుచు బరగువాడు,
నిరతముత్సహియై, జయ ధరనపజయ
ములకచలచిత్తుడేసాత్వికుడరయుమిది.
(ల-డ.లకుప్రాసయతి)
భావము.
సంగభావం నుండి ముక్తుడైన వాడు, అహంకారం లేని వాడు, పట్టుదల
ఉత్సాహం ఉన్నవాడు, జయాపజయాల వలన చలించని వాడు అయిన కర్త
సాత్వికుడని చెప్పబడతాడు.
జైహింద్.