గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, సెప్టెంబర్ 2023, బుధవారం

అష్టోత్తరశత సతీ అశ్వధాటి (సతీ శతకము). 84వ పద్యము. రచన. చింతా రామకృష్ణారావు. గానము ... శ్రీ కుమార సూర్యనారాయణ.

 జైశ్రీరామ్.

84. కష్టంబులేలనిల నష్టంబులేల పరి పుష్టేల మేము గనమో.

దృష్టిన్ సదా నిలిపి యిష్టంబుతోడ నిను పుష్టిం గనన్ గొలిచినన్

కష్టంబులే తొలఁగు నష్టంబులుండవిల దృష్టంబిదేను జననీ.

ఇష్టంబుతో మదిని సృష్టించుమీవిధము. కష్టంబు బాపెడి సతీ!

భావము.

కష్టమును పోకొట్టెడి ఓ సతీ మాతా! మాకు ఈకష్టములెందులకు? ఈ 

నష్టములెందులకు? పరిపుష్టిని మేము ఎందుచేత పొందలేకపోవుచుంటి 

మమ్మా? ఇష్టముతో నిన్ను పుష్టిగా చూడనెంచి దృష్టి నీపై నిలిపి సేవించినచో 

మా కష్టములు తొలగిపోవునుకదా తల్లీ! మాకు నష్టములే ఉండవు కదా. ఇది 

దృష్టము తల్లీ! ఓ జననీ! నీవు ఇష్టాపూర్వకముగా ఈ నేను చెప్పిన విధముగా 

మేము కలిగి ఉండునట్లు సృష్టించమమ్మా.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.