గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

30, ఆగస్టు 2012, గురువారం

మా మంచి మాష్టారు. రచన: శ్రీమతి తటవర్తి జ్ఞాన ప్రసూనగారు

0 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! నమస్సులు.
"మా మంచి మాష్టారు" అనే అంశంపై శ్రీమతి తటవర్తి జ్ఞాన ప్రసూన గారి అభిప్రాయం చూడండి.
ఆర్యులారా!
అన్నిటికన్నా మిన్న ఆచార్యుడు ,గురువు, ఉపాధ్యాయుడు,  పంతులు,  అయ్యవారు ఒజ్జ   ఇలా ఎన్నెన్నో పేర్లతో పిలువబడే గురువు .  ప్రతి వారి జీవితంతోనూ ముడిపడి ఉంటాడు. ఆయన వేష భాషలు  ,నడక విద్యార్ధి    మనస్సులో చెరగని ముద్ర వేస్తాయి.   కీ శే    చిర్రావూరి    సుబ్రహ్మణ్యం గారు మాకు హిందీ చెప్పేవారు.ఏలూరు రోడ్డులో  వుండే దక్షిణ భారత హిందీ ప్రచార సభలో    విశారద, ప్రవీణ చదువుకొన్నాము. తూరుపురేకలు
ఆరక ముందే  తయారయి పుస్తకాలు మోసుకు వెళ్ళేవాళ్ళం.  మా గురువుగారు   ఎర్రగా    ,పొట్టిగా,   ఒత్తరిగా వుండేవారు. బ్రహ్మ చారి,  మితభాషి . ప్రచార సభ లోనే   ఆయన   ఒక గదిలో వుండేవారు.  చిన్న కుంపటి మీద కాఫీ కాచుకొని తాగి   క్లాసుకు వచ్చేవారు.  అన్నిపనులు స్వయంగా  చేసుకొనే వారు. ఎప్పుడూ ఒక పొల్లు మాట   ఆయన నోటి వెంట మేము వినలేదు.  విద్యార్ధుల వెంట గుర్రుగా  చూడటం,  ఏదన్న అడిగితే విసుక్కోవడం  అలాటి లక్షణాలేవీ లేవు.స్థిత ప్రజ్నులై    ప్రసన్న వదనంతో    "ఎవరేమి అడుగుతారా?  చెపుదాము."అని ఆశిస్తూ వుండేవారు. ఆయన పాఠం వింటే అరటి పండు ఒలిచి చేతులో పెట్టినట్లు వుండేది. విద్యార్ధుల్ని  చాలా ప్రోత్సహించేవారు. ఒక విషయం  చెప్పినపుడు దానికి సంబంధించిన  పుస్తకాలు,పాఠ్య ప్రణాళికలో లేనివి   మమ్మల్ని చదవ మని   ఆదేశించేవారు.  అప్పుడు మేము నాటక లక్షణాల గురించి చదివాము. ఒకసారి ఇలాగే    ఫలానా పుస్తకాలు చదవండి  అని ఆదేశించారు.  లైబ్రరీలో తెచ్చుకు చదివాము.  క్లాసు మొదలవగానే  "హటాత్తుగా ఫలానా వారు, ఫలానా   పుస్తకం గురించి   వివరిస్తారు అనేవారు.  ముందు తయారు కాకుండా   అలా క్లాసులో చెప్పాలంటే నోరెండిపోయి, గొంతు పెగిలేది కాదు. "ఫరవా లేదు   ఎంత తెలిస్తే   అంటే చెప్పండి ."మెల్లగా హెచ్చరించేవారు. అప్పటినుంచీ మేము ఏపుస్తకం చదివినా   దాని సారాంశ ము  బుర్రలో ఒక పక్క తయారుగా పెట్టుకొనే వాళ్లము. చదువు పూర్తి అయి బయటికి వచ్చాక కూడా   గురువుగారిని కలుసుకొంటు వుండేవాళ్ళము. "ఏమి చేస్తున్నారు?   ఏదో ఒకటి చెయ్యండి.సొంత రచనలో, అనువాదాలో   చేస్తూ వుండండి, కాలం వృధా చెయ్యొద్దు.  "అనిచెప్పి వారు కొత్తగా చేసిన రచనలుంటే చదవమని ఇచ్చేవారు. పూజ్యులు  ఉషశ్రీ గారు ఆయన ప్రాణ స్నేహితులు.  వీరిద్దరికీ   శ్రీ విశ్వనాథ సత్యనారాయణగారి రచనలు, ముఖ్యంగా శ్రీ    రామాయణ కల్ప వృక్షం అంటే ఎంతో ఇష్టం.  ఇద్దరు కలిసి రోజుల తరబడి   చర్చలు చేసేవారు. కొట్టి,తిట్టి , మొహం చించుకొని, గావు కేకలు పెట్టి, చీత్కారం చేసి, నువ్వు ఎందుకూ పనికి రాని ---వ్విరా! నీకు బుర్రలో ఉన్నదంతా మట్టె, అని  జీవితం అంటే విరక్తి పుట్టేలా  శాపాలు పెట్టడం  గురుత్వ లక్షణం కాదు. తను నియమ పాలన చేస్తూ, మౌనంగా ఆదేశిస్తూ, సక్రమ  మార్గం లో ముందడుగు వేస్తూ, భక్తి, గౌరవ ప్రపత్తులతో శిష్య పరమాణు వులని తన వెనక నడిపిమ్పగాలవాడే    గురువు. మంచి గురువు దొరకడం మహద్భాగ్యం.  
చూచారు కదండీ శ్రీమతి జ్ఞాన ప్రసూనగారి మా మంచి ఉపాధ్యాయులను.
సరే మీరు కూడా మీకుస్ఫూర్తిప్రదాతయైన గురువును గూర్చి వ్రాసి పంపండి.
జైహింద్.

28, ఆగస్టు 2012, మంగళవారం

నేడు తెలుగు భాషా దినోత్సవము సందర్భముగా ఆదర్శ తెలుగు ఉపాధ్యాయ శ్రీ కంది శంకరయ్య గారికి అభినందన మందారాలు.

4 comments

శ్రీరస్తు         శుభమస్తు       అవిఘ్నమస్తు
నేడు తెలుగు భాషా దినోత్సవము సందర్భముగా,
రానున్న ఉపాధ్యాయ దినోత్సవము సందర్భముగా " శంకరాభరణము" బ్లాగ్ నిర్వాహకులు 
శ్రీ కంది శంకరయ్యకు
అభినందన మందార మాల.
శ్రీ కంది శంకరయ్య. విశ్రాంత ఆంధ్రోపాధ్యాయులు.

కం:- శ్రీ కంది వంశ చంద్రమ! 
మీ కవితా మార్గమున సుమేరు సుకవులన్
లోకంబున కందించిన  
శ్రీ కందిగ పేరు గనిరి చిన్మయ రూపా!

సీ:- ఉత్తమోపాధ్యాయ వృత్తిని చేపట్టి  -  స్ఫూర్తిని కొలిపి సద్వర్తనముల,.
నిర్మల భావనా ధర్మము నెఱనమ్మి  -  ధర్మవర్తనులను ధరను నిలిపి,
సత్య బోధన చేసి, స్తుత్యసన్మార్గమ్ము  -  నత్యంత స్తుత్యమై యలర వేసి,
జీవన సద్గతి భావనాపటిమతో  -  విద్యార్థులకు మప్పి వెలయఁ జేసి,
గీ:- చెదరి పోనట్టి నగవులు జిందు మోము 
సరస సద్భావనా సుధల్ దొరలు పలుకు,
కరుణ  గాంభీర్యతలు చూపు కన్ను దోయి 
పొంకమున నొప్పుదే! కంది శంకరార్య!

శా:- మీ సద్వర్తన సత్య సంధత, సదా మేల్గోరు మీ బుద్ధియున్,
ధ్యాసన్ జూపుచు చేయు బోధనలు, మీ ధన్యాత్మయున్, ప్రేమయున్,
భాషాటోపముఁ జూపనట్టి కవితా పాండిత్యమున్ జూచినన్
మీసాదృశ్యుల నెన్న లేరుగద!స్వామీ! శంకరార్యా! ధరన్.

గీ:-శంకరాభరణము మీరె.శంకరయ్య!  
జంకు గొంకులు లేనట్టి సహృదయ మణి!
యింక పై మిము శుభములే యేలు నిజము. 
శంకరుండిల మిము బ్రోచు శాంతి గొలిపి.

గీ:- మంగళంబులు మీకిల మంగళములు. 
మంగళంబులు కవులకు మంగళములు.
మంగళంబులు బుధులకు మంగళములు.  
మంగళంబులు హరికి సన్ మంగళములు.

మంగళం                       మహత్                        శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ

26, ఆగస్టు 2012, ఆదివారం

అబ్రహం లింకన్ లేఖ ఉపాధ్యాయులకు దిశానిర్దేశం చేస్తోందా? చూడండి?

4 comments

జైశ్రీరామ్.
సుజ్ఞాన సంపన్నులారా! అబ్రహం లింకన్ తన కుమారుని పాఠశాలలో చేర్చుతూ, ఆ బాలునికి విద్య గరపు విషయంలో ఎటువంటి మెలకువలు అవసరమో ఉపాధ్యాయులకు లేఖారూపంలో తెలియజేసారు. ఆ లేఖ చదివినట్లైతే ఒక ఉత్తమ ఉపాధ్యాయునకుండవలసిన నైపుణ్యమును సూచిస్తున్నట్టుగా ఉందండి. మీరూ చదివి మీ మనోగతాన్ని తెలియజేయండి. రాబోతున్న సెప్టెంబరు 5వ తేదీన ఉపాద్యాయ దినోత్సవం సందర్భంగా  ఉత్తమ ఉపాధ్యాయులందరూ అభినందనీయులు కావున ఉత్తమ ఉపాధ్యాయ లక్షణ గ్రహణ కొఱకు తగు సూచనలు మీ నుండి వారికి అందుతాయని ఆశిస్తున్నాను.
ఇక చదవండి.
అబ్రహం లింకన్
ఈరోజు నుండి నాకొడుకుకి విద్యాలయంలో విద్యాబ్యాసం మొదలు.
కొంత కాలం వాడికి అక్కడి పరిస్థితులు అన్ని కొత్తగా వింతగా అనిపిస్తాయి, వాడిని సున్నితంగా చూసుకుంటారనే భావిస్తున్నాను.
ఈరోజు వాడికి ఒక సాహసం వంటిది, ఈసాహాసం వాడికి ఖండఖండాంతరాలు తిరిగే అవకాశం ఇవ్వచ్చును.
చరిత్రలో సాహసాలు రాజ్యాలనీ, యుద్ధాలనీ , వేదననీ మాత్రమే మిగిల్చాయి.
కానీ, జీవితం మీద సాహసం చెయ్యటానికి, ఒక మంచి మనిషిగా మిగలటానికి వాడికి నమ్మకం, ప్రేమ, దైర్యం అవసరం.
ప్రియమైన ఉపాధ్యయులారా ! నా కొడుకుని మీ చేతులలోకి తీసుకుని వాడికి అవసరమైనవన్నినేర్పండి, కానీ సున్నితంగా వాడి మనసుకి అర్థమయ్యేలా.
మనుష్యులు అందరూ నీతిమంతులు కారనీ
మనుష్యులు అందరూ సత్యవాదులు కారనీ
వాడు నేర్వాలని నాకు తెలుసు.
కానీ ప్రతి నీచుడికి ఒక ఉత్తముడు కూడా ఉంటాడని
ప్రతి స్వార్ధ రాజకీయనాయకుడికి ఒక నిబద్ధ నాయకుడు కూడా ఉంటాడని వాడికి భోదించండి.
ప్రతి శత్రువుకి ఒక మిత్రుడు కూడా ఉంటాడని వాడికి తెలియపరచండి.
ఈర్ష్యకు వాడిని దూరం చెయ్యండి.
మాట్లాడే మాట మీద నియంత్రణ, మాటల్లో గొప్పతనం వాడికి నేర్పండి.
ఎదుటివారి మీద ఆధారపడి బ్రతకటం కన్నా, సొంత కాళ్ళ మీద నిలబడటం గౌరవం అని భోదించండి.
మీవల్లనయితే నిశబ్దపు నవ్వులో రహస్యాన్ని విప్పండి.
సాద్యమైతే పుస్తకాలు, వాటి గొప్పతనం వాడు తెలుసుకునేలా చేయండి.
అయితే అదే సమయంలో "
ఆకాశంలోని  పక్షులలో, ఎండలోని తేనటీగల్లో, పచ్చని కొండల్లోని పువ్వులలో, 
ఎడతెగని మర్మాన్ని గ్రహించేటంత నిశబ్ద ఖాళీ సమయాన్ని కూడా వాడికి ఇవ్వండి.

ప్రకృతిని వాడు ఆరాదించి, ఆస్వాదించే మనస్సుని పెంచండి
వంచనకన్న ఓటమి మంచిదని, గొప్పగా ఉంటుందని మీ పాఠశాలలో భోదించండి.
దొరికిన 100 రూపాయల కన్నా సంపాదించిన 10 రూపాయలు  విలువ ఎక్కువని వాడికి చెప్పండి.
వాడికి వచ్చే సొంత మంచి ఆలోచనలపై నమ్మకాన్ని కలిగి ఉండటం నేర్పించండి.
వాడి ఆలోచనలు తప్పు అని అందరూ అంటున్నా సరే
సున్నితస్తులతో సున్నితంగా, మొండివాళ్ళతో మొండిగా ఎలా ఉండాలో నేర్పించండి.
అందరూ వేలంవెర్రిగా ఒకే మందలో చేరి పోతునప్పుడు 
గుడ్డిగా అనుసరించక, ప్రకక్కు నిలబడ గలిగి, నిర్ణయించుకోగల సామర్ద్యాన్ని నాకొడుక్కి ఇవ్వండి.

ఎవరు ఏది చెప్పిన, వినడాన్నిభోదించండి. 
అయితే విన్న అన్నిటిని, సత్యపు జల్లెడలో వడకట్టి, పైన నిలిచే మంచి మాత్రమే గ్రహించటాన్ని నేర్పించండి.

మీవల్లనయితే విషాదంలో నవ్వటం ఎలానో భోదించండి.
ఓటమిని-గెలుపుని, సుఖాన్ని-ధుఃఖాన్నికూడా సమానంగా ఎలా స్వీకరించి ఆనందించాలో భోదించండి.
కన్నీరు లజ్జాకరం కాదని భోదించండి.
వాడిదగ్గర ఉన్నది నలుగురికి పంచటం నేర్పించండి.
అలాగే అతి చనువు పట్ల జాగురూకత భోదించండి.
అలాగే బలాన్ని బుద్దిని అత్యధిక ధరకు అమ్ముకోవటం భోదించండి.
కానీ వాడి హృదయంపైన, అత్మపైన అమ్మకపు ధర అతికించుకోవద్దు అని చెప్పండి.
సత్యం తనవైపు ఉన్నదని తెలిసినప్పుడు 
లోకుల మూకుమ్మడి కేకలను పట్టించుకోకుండా, దైర్యంగా నిలబడటాన్ని, పోరాడటాన్నిభోదించండి.

వాడికి అన్ని నెమ్మదిగా నేర్పించండి, సున్నితంగా ప్రవర్తించండి, అలా అని గారాబము, ఎత్తుకు తిప్పటము  చేయకండి.
వాడికి తప్పు అంటే భయం నేర్పండి, వీటితోపాటు ఎంత కష్టానికైనా దైర్యంగా నిలబడే సహనాన్ని భోదించండి. 
ఎందుకంటే నిప్పులో కాలినాకే నిజమైన బంగారం బయటకి వస్తుంది.

వాడిమీద వాడికి ఉత్కృష్టమైన విశ్వాసాన్ని పెంచండి. అది వాడికి సమస్త మానవాళిమీద అదే విశ్వాసాన్ని పెంచుతుంది. ఇవన్నీ వాడు తెలుసుకున్ననాడు వాడు మనుష్యులలో ఉత్తముడిగా మిగులుతాడు.
ఇదంతా పెద్ద పట్టికే, తండ్రిగా వాడు అలా ఉండాలని నా కోరిక. అలా తయారుచేయటానికి నా ప్రయత్నం నేను చేస్తాను. కానీ మీవల్లనేమవుతుందో అది మీరు చేయండి. వాడు ఒక పసిపిల్లవాడు, మనం ఎలా మలుస్తామో అలా పెరుగుతాడు జాగ్రత్తగా చూసుకోండి.   
చూచారు కదండీ?
మరి మీ అభిప్రాయాన్ని వ్యాఖ్యగా వ్రాయటానికి ఆలస్యమెందుకు?
జైహింద్.

17, ఆగస్టు 2012, శుక్రవారం

ఉపాధ్యాయులకుండవలసిన లక్షణాల విషయమై మీ అమూల్యమైన అభిప్రాయాలను తప్పక తెలియజేస్తారా?

0 comments

జైశ్రీరామ్.
తమ శిష్యులని సచ్ఛీలవంతులుగను, అవధానులుగను తీర్చిదిద్ధిన 
అభినవ మల్లినాథ బిరుదాంకితులైన శ్రీ ధూళిపాళి మహాదేవమణి.
ప్రియమైన భారతీయ సోదరీ సోదరులారా! సహృదయులైన మీకు నా నమస్కృతులు.
సెప్టెంబర్ ఐదవ తేదీ డా. సర్వేపల్లి రాధా కృష్ణ గారి జన్మదినం సందర్భంగా యావత్ ఉపాధ్యాయ వర్గమే గౌరవింప బడుతుండడం అత్యంత ముదావహం.
ఉపాధ్యాయోత్తము లందరికీ నా కైమోడ్పులు.
ప్రియ మిత్రులారా! నాదో మనవి. దయ చేసి స్పందించి నా మనవినాలకించి నా కోరిక నెరవేర్చ గలరా? ఐతే వినండి.
అన్ని వృత్తుల లోను తల్లిదండ్రుల తరువాత గౌరవింపఁబడే ఉపాధ్యాయ వృత్తి అత్యంత గౌరవప్రదమైనదని  "ఆచార్య దేవోభవ" అన్నవాక్యమే తెలియజేస్తోంది. అట్టి గౌరవప్రదమైన ఆచార్య వృత్తి జీవితంలో లభించడం పూర్వ జన్మ పుణ్య ఫలంగా చెప్పుకున్నా అతిశయోక్తి కానేరదు.
సమాజం ఇంతటి మహోన్నత స్థానం కల్పించిన ఉపాధ్యాయ వృత్తిని చేపట్టిన వారు ఏ మహనీయత కలిగి ఉండడం ద్వారా ఈ గౌరవానికి అర్హులౌతున్నారు?
SCHOOL అన్న పదం ఎంతో మహోన్నత ఆశయంతో నెలకొల్పఁబడినది.
S = సేక్రిఫైజేషన్ = త్యాగనిరతి.
C = కేరక్టర్ = సత్శీలత.
H = హానెష్టీ = హుందాతనము.
O = ఒబీడియన్సీ = అణకువ.
O = ఆర్గనైజేషన్ = కార్య నిర్వహణ సామర్ధ్యము.
L = లీడర్షిప్ = నాయకత్వ లక్షణములు.
ఈ విధమైనవి పాఠశాలలో చేరిన పిల్లలకు పాఠశాల చదువు పూర్తయేసరికి అలవడి ఉండాలి. అలా అలవడేలాగ ఆ SCHOOL లో విద్యను బోధించే ఉపాధ్యాయులు శిక్షణను ఇవ్వాలి.

ఇట్టి విధంగా శిక్షణను ఇవ్వడానికి  యదార్థమైన ఉపాధ్యాయుఁడు కలిగి యుండ వలసిన పరిపూర్ణమైన లక్షణాలు ఏమిటేమిటి?
ఉపాధ్యాయ వృత్తిని చేపట్టిన వ్యక్తి తన వృత్తికి పరి పూర్ణమైన న్యాయం చేకూర్చడానికి ఏమి చేయాలి?
ఒక ఉత్తమ ఉపాధ్యాయుని సత్ ప్రవృత్తి  విద్యార్థులపై ఎంతటి మహోన్నత ప్రభావం చూపుతుంది?

ఒకవేళ ఉపాధ్యాయుఁడే దుష్ప్రవృత్తి కలిగి ఉన్ననాడు సమాజం ఏదిశగా పయనిస్తుంది?
మీరు శ్రమగా భావించకపోతే కొంచెం ఓపికగా మీ అమూల్యమైన అభిప్రాయాలను వ్యాఖ్య ద్వారా తెలియజేసినట్లైతే భావితరాలకు మేల్తరమైన సూచన చేసినవారౌతారు.
మీరు తెలియఁ జేసిన మేలైన అభిప్రాయాలను ప్రభుత్వం గుర్తించ వచ్చును. వాటిని ఉపాధ్యాయలోకానికి అందజేయ వచ్చును.మహోన్నత భావి భారతావని నిర్మాణానికే మీ సూచనలు మార్గదర్శకం కావచ్చును.
మీ అభిప్రాయం మీ పేరుతో సహా పంపండి. మీకు అభ్యంతరం లేకపోతే మీ పేరుతో ప్రకటిస్తాను. కానినాడు మీ సూచన ననుసరిస్తాను. అత్యంత విలువైన భావిభారతపౌరులనిర్మాణాన్ని బాధ్యతగా స్వీకరించు ఉపాధ్యాయులకు మీ సూచనలు శిరోధార్యాలుగా నిలుస్తాయి.
దయచేసి తెలియ జేస్తారు కదూ?
నమస్తే.
జైహింద్. 

15, ఆగస్టు 2012, బుధవారం

యావద్భారత జాతికీ 66 వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

0 comments

జైశ్రీరామ్.
యావద్భారతీయ సోదరీ సోదరులారా! భారత దేశ 66 వ 
స్వాతంత్ర్య దినోత్సవము సందర్భముగా శుభాకాంక్షలు.
ఎందరో మహనీయుల మహనీయమైన ధన మాన ప్రాణ 
త్యాగ ఫలంగా  సంపాదించిన స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తూ 
ఉన్న మనం మన హక్కులతో పాటు బాధ్యతలను కూడా 
మనసులో ఉంచుకొని సమాజంలో మెలగుదాం. తద్వారా 

ఏ ఒక్కరి స్వేచ్ఛకు మనం ఆటంకం కలిగించకుండా మెలకువతో ప్రవర్తిద్దాం. ఉత్తమ భారతీయులుగా జీవనం సాగిద్దాం.
జైహింద్.

14, ఆగస్టు 2012, మంగళవారం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్యులు మన్య మహోదయ శ్రీ గంటా శ్రీనివాసరావుకు సమర్పించుకొను చున్న మందార మకరందాలు.

0 comments

శ్రీరస్తు                       శుభమస్తు                  అవిఘ్నమస్తు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్యులు మన్య మహోదయ శ్రీ గంటా శ్రీనివాసరావుకు
చోడవరం ప్రాంత ప్రజలు గౌరవ పురస్సరముగా సమర్పించుకొను చున్న
మందార మకరందాలు
రచన :- చింతా రామ కృష్ణా రావు.

:- శ్రీ కమనీయ భాషణుని, శ్రేయము గొల్పెడి సత్ వరేణ్యు, గం
టా కపురంపు వంశజుఁని, న్యాయ విధేయుని, శ్రీనివాసునిన్
ప్రాకట మొప్ప చోడవర ప్రాంత ప్రజావళి సత్కరించు నో
శ్రీకర! వేంకటేశ్వరుఁడ! ప్రీతిని గూర్చుమ సత్శుభావళిన్. 1.

శా :- గంటా వంశజ శ్రీనివాస! విలసత్ గాంభీర్య ! సన్మాన్య! మీ
కంటెన్ ప్రాజ్ఞులు కల్గిరే జనుల సౌఖ్యాదుల్ కనన్? నేడు మా
పంటై ప్రీతి రహించు చుండిరికదా!భవ్యా! అమాత్యత్వమే
వెంటన్ వచ్చెను మిమ్ము కోరి. సుమహద్విఖ్యాతినార్జింపగా ! 2.

:- పెట్టుబడుల్ , ప్రజావళికి పెంపున మౌలికమైన సంపదల్,
బిట్టుగ నౌక మార్గముల పెంచ రవాణ, విమాన యానమున్,
పట్టుగ నిర్వహించి మన భారత మాతకు కీర్తిఁ గొల్ప చే
పట్టిన మంత్రి వర్య! మిము వర్ధిలఁ జేయుత ! దైవమెన్నడున్. 3.

సీ:- ప్రజల సంక్షేమమై పథకాలు విరచించి, - నిజమైన కలవైన ప్రజల మనిషి!
నీటిబోరింగులన్ దీటుగా నెలగొల్పి - సాటియే లేనట్టి సత్య వర్తి!
వృక్షమ్ములను పెంచి, విఖ్యాతిగా నున్న - యువతకు సదుపాధి నొనరఁ గొల్పి,
నీటికటకటను నెనరు వాహనముల - నందించి తీర్చిన సుగుణ తేజ!
గీ:- ఆటవస్తువులనొసంగి, యంబులెన్సు
సేవలందించి, మండపాల్ సిద్ధ పరచి,
బస్సు షెల్టర్లు నిర్మించి, ప్రజల మదిని
పాదుకొనిపోయినావయా! భవ్య మూర్తి! 4.

గీ :- మంగళములయ్య ! శ్రీనివాస్! మంగళములు!
మంగళము లౌత ప్రజలకు మంగళములు.!
మంగళములౌత భారతీ! మంగళములు.
మంగళంబులు శ్రీ హరీ! మంగళములు. 5.

చోడవరం,
తేదీ: 14 – 8 – 2012.
మంగళం                           మహత్                         శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ

13, ఆగస్టు 2012, సోమవారం

పూజామందిరంలో ప్రవేశించే ముందు....? ఆసనముపై కూర్చొనే ముందు...?

3 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! మనము పూజామందిరమున అత్యంత భక్తిశ్రద్ధలతో పూజాదికములు నిర్వహిస్తూ ఉంటాము కదా! ఐతే మనము పూజా మందిరమునకు ప్రవేశించే సమయంలో ఏమి చెయ్యాలో, ఆసనమును ఏ విధముగా సిద్ధము చేసుకోవాలో మహానుభావులైన పూర్వీకులు వివరించి యున్నారు. 
పరిశీలించండి.
శ్లో:- అతి తీక్ష్ణ మహాకాయ కల్పాంత దహనోపమ
భైరవాయ నమస్తుభ్యం అనుజ్ఞాం దాతుమర్హసి.
ఈ శ్లోకము పూజా మందిరము లోనికి ప్రవేశము చేయక మునుపు భైరవుని దగ్గర అనుమతి తీసుకొని, జప స్థలమును 12 సార్లు ప్రణవమును ఉచ్చరించుచూ ఉదకముతో సంప్రోక్షించి, ఆ స్థలము పై కూర్మ యంత్రమును లిఖించ వలయును. దానిపై ఆసనము వేయవలెను.
పూజామందిరమున అమర్చుకొన వలసిన ఆసనము.
ఆసనము:- ఆసనము మీద క్రమముగా ధర్భాసనము, కృష్ణాజీనము, చిత్ర కంబళం, వస్త్రమును పరచుకొని దానిపై కూర్చుండవలెను. కూర్చుండుటకు ముందు ఆసనము పూజ చేయ వలెను.
ఓం ఆధార శక్త్యై నమః , కూర్మాయ నమః , అనంతాయ నమః, వరహాయ నమః, పృధివ్యై నమః  అని అంటూ పూజ  చేయ వలెను.  ఆ పై జప సాధన చేయ వలెను.  
తెలియనివి తెలుసుకోవటం, తెలుసుకొనిన మంచివాటిని అనుసరించటం అనేవి మనం నిత్యం చేస్తూనే ఉంటాము కాబట్టి ఈ పై విషయాలను కూడా అవగాహన చేసుకొని అనుసరిద్దామా?
జైహింద్.

12, ఆగస్టు 2012, ఆదివారం

ఏవి హరి సేవకు యోగ్యమైన పూజా పుష్పాలు ?

3 comments

జైశ్రీరామ్.
పుష్పాణి పూజయామి.
శ్లో:-
అహింసా ప్రధమం పుష్పం, పుష్ప మింద్రియ నిగ్రహః
సర్వ భూత దయా పుష్పం, క్షమా పుష్పం విశేషతః
శాంతి:పుష్పం, తపః పుష్పం, ధ్యానం పుష్పం తధైవచ
సత్యమష్ట విధం పుష్పం విష్ణో:ప్రీతికరం భవేత్ .
భావము:-
అహింస
ఇంద్రియ నిగ్రహము
సర్వ భూత దయ
ఓర్పు
శాంతి
పరమాత్మకై తపించుట
పరమాత్మ ధ్యానము
సత్యనిరతి
అనే ఎనిమిది విధములైన పుష్పములతో హరిని ఆరాధిస్తే చాలా సంతోషిస్తాఁడు హరి.
జైహింద్.

10, ఆగస్టు 2012, శుక్రవారం

పాఠక జన పాళికి శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు.

1 comments

నమో భగవతే వాసుదేవాయ,
పాఠక జన పాళికి శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు.
చూడండి మన కృష్ణయ్య తాను చేసిన యీ  సృష్టి రహస్యాన్ని, అది గ్రహించ గల వారిని, అట్టి వారిని తాను కాపాడే విధానాన్నీ ఎలా చెప్పుతున్నాడో .
నా తలపుల్ మహా ప్రణవ నాద లసజ్ఝరి వార్ధి యయ్యె తద్
భాతిజ మీ మహా చలిత బ్రహ్మశుభాండము సద్భవంబు యీ
భూ తల మెన్నగా. కలిత పుణ్యులు కొందరు గాంతురిద్ది యు
ద్భూతముఁగా. శుభాచరణ పూజలు చేసిన చక్క గాతు నే.
ఎంత దయామయుడో చూచారా మన కృష్ణయ్య? గీతా సారాన్ని, అలకందాన్ని  ఒక్క పద్యంలో ఎంత అద్భుతంగా వివరించి మన కన్నులు తెరిపించాడో చూచారా! 
నిజంగా మనం అదృష్టవంతులం. ఆ పరమాత్మ దయాపాత్రులమయ్యాము. ఈ సందర్భంగా మరొక్క పర్యాయం అందరికీ నా అభినందనలు తెలియ జేస్తున్నాను.
జైశ్రీరామ్.
జైహింద్.

8, ఆగస్టు 2012, బుధవారం

ఘనంగా జరిగిన శ్రీ కృష్ణ దేవరాయలు 503 వ పట్టాభిషేక దినోత్సవ వేడుకలు.

3 comments

జైశ్రీరామ్.
ప్రియ సాహితీ మిత్రులారా! శ్రీ గుత్తి (జోళదరాశి) చంద్రశేఖర రెడ్డిగారు అత్యంత ఆసక్తితో చేయ తలపెట్టిన శ్రీ కృష్ణ దేవరాయలు యొక్క 503 వ పట్టాభిషేక దినోత్సవ వేడుక అత్యంత ఘనంగా జరిగింది.
వివిధ ప్రాంతాల నుండి సాహితీవేత్తలు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసారు.
సభలో శ్రీ కృష్ణ దేవరాయలుపైన అలనాటి సాహిత్యంపైన కృషి చేసిన రాయల వీరాభిమానులను ఎనిమిది మందిని శ్రీ చంద్రశేఖర రెడ్డిగారు అత్యంత ఘనంగా సత్కరించారు.

  డా.మునిపల్లె రాజు గారు, ఛీఫ్ ఇంజనియర్(నివృత్త)పీ. సత్య నారాయణ గారు, కోదండ రామయ్య గారు, పుల్లారెడ్డిగారు, మిసిమి సంపాదకులు అశ్వినీ కుమార్ గారు, నేను, గోపాల రెడ్డి గారు, సత్య నారాయణ రెడ్డి గారు, రంగనాథ రామ చంద్ర త్రావు, శాఖమూరి రామ గోపాల్, నాగప్ప, ప్రముఖ రచయిత్రి శ్రీమతి వేదవతి గారు, శ్రీమతి శారద గా,చివుకుల రామ మోహన్, సైదులు గుప్త, కోటేశ్వర రావుగారు, ఏ. బసిరెడ్డిగారు, మున్నగువారు పాల్గొన్నారు. ఆ సభలో కృష్ణ రాయకు పూజాదికాలు నిర్వహించి, అష్ట దిగ్గజ సన్మానము చేయడం జరిగింది.
సన్మానితులు దివంగత కొత్త వేంకటేశ్వర రావుగారి అర్థాంగి శ్రీమతి రంగమాంబ గారు, ప్రముఖ కన్నడ రచయిత డా. గోపాల కృష్ణారావు, ఆముక్త మాల్యదను ఆంగ్లానువాదము చేసిన డా. యస్. శ్రీనివాస్, డా. సంగన భట్ల నరసయ్య గారు, ముత్తేవి  రవీంద్ర నాథ్, ప్రముఖ రచయిత వాడ్రేవు చిన వీర భద్రుడు, గోపిని కరుణాకర్, డా. రవికృష్ణ గారు ఘనంగా సన్మానింప బడ్డారు. మన ప్రియ మిత్రులు, శ్యామలీయం బ్లాగరు శ్రీ టీ. శ్యామలరావుగారు కూడా ఈ సభకు విచ్చేసి తమ అమూల్యమైన సందేశాన్ని వినిపించారు. ఈ కార్యక్రమమునకు సంబంధించిన చిత్తరువులను పైన పొందుపరిచాను.
సభకు వచ్చిన వారిలో కొందరి వివరములు నాకు లభ్యమైనన్ని ఈ క్రింద పొందుపరుస్తున్నాను.
Sarva Sree
1. M. ravindranath
+919849131029

2. Srinivas Sistla
+919395345431

3. P. Kodanda Ramaiah
+919849662305

4. Dr. KR GopalaKrishna Rao

5. P Vishwanath Rao
com
+919491384480
6. C Vedavathi
+9193924677995

7. C Rama Mohan
+919491073532
040 27508020

8. Gatti Krishna Murthy
+919393939842

9. Sadhana narasimha Chary
+91 9440927200

10. P. Satyanarayana
+919603825907

11. M. Saradha
+919866188657

12. B. Naggappa
+91 9441012319

13. KaviRaju
+919989427356

14. Nageswara Rao K
+919290050229

15. Vallabhaneni Ashwini Kumar
+91 939346969

16. A. Satyanarayana Reddy
+919963440775

17. R. Venkatesam
+919618040015

18. M. Anjaiah Avadhani
+91 9849592494

19. T Shamala Rao
+919849626023

20. C. RamaKrishna Rao
+91 9247238537

21. Ramagopal
+919052563666

22. Sanganabhatla Narasiah
+919440073124

23. Aravapalli Sydulu Gupta
+919666244464

24. P. Gopal Reddy
040 23067806.

25. Chandrasekhara Reddy
gcreddy.hyd@gkail.com

ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా నిర్వహించిన శ్రీ చంద్రశేఖర రెడ్డిదారిని, వారికి సహాయ సహకారాలందించిన శ్రీ గంగా రామారావు గారిని, తదితర బంధు మిత్రులను హృదయ పూర్వకంగా అభినందిస్తున్నాను.
జైహింద్.

6, ఆగస్టు 2012, సోమవారం

శ్రీ కృష్ణ దేవరాయలు వారి 503 వ పట్టాభిషేక దినోత్సవానికి స్వాగతం.

4 comments

జైశ్రీరామ్.
సాహితీ సమరాంగణా సార్వభౌముఁడు శ్రీ కృష్ణ దేవరాయలు.
ప్రియ సాహియీ బంధువులారా! శుభమస్తు.
తేదీ 07 - 08 - 2012 న సహితీ సమరాంగణా సార్వభౌముఁడు శ్రీకృష్ణ దేవరాయలవారి 503 వ పట్టాభిషేక దినోత్సవము.
ఈ కార్యక్రమమును శ్రీ (జోళదరాశి) గుత్తి చంద్రశేఖర రెడ్డిగారి స్వగృహమున
తేదీ 07 - 08 - 2012 వ తేదీన సాయంత్రం 4 గంటలకు
జరిపించ తలపెట్టినారు.
కార్యక్రమము జరుగు చిఱునామా:-
శ్రీ (జోలదరాశి)గుత్తి చంద్రశేఖర రెడ్డి,
15, మొదటి దశ. (1St Phase)
జయప్రకాశ నారాయణ్ నగర్,
వయా మియాపూర్,
హైదరాబాదు,
500 049.
దూర వాణి. 9177945559.
సాహితీ ప్రియులందరికీ ఇదే మా ఆహ్వానం.
అనేకమంది పెద్దలు వక్తలుగా పలురాష్ట్రాలనుండి వచ్చుచున్నారని తెలుపుటకు సంతోషిస్తున్నాము.
బ్లాగ్ మిత్రులందరూ తప్పక విచ్చేసి కార్యక్రమమును జయప్రదము చేయ వలసినదిగా కోరు చున్నాను.
జై హింద్.

4, ఆగస్టు 2012, శనివారం

మహా సంకట హర చతుర్థి 05 08 2012

1 comments

జైశ్రీరామ్.
ప్రతి మాసము కృష్ణ  పక్ష చతుర్థి సంకర హర చతుర్థిగ పాటిస్తే శ్రావణ మాస కృష్ణ పక్ష చతుర్థి మహా సంకట హర చతుర్థిగ ఆచరించ వలెను. సంకట హర చతుర్థి వ్రతం అనుష్టించాలనుకునేవారు యీ దినమునుండి ప్రారంభించి ఒక సంవత్సర పర్యంతము దంపతిసహితముగా అనుష్టించ వలెను. ఈ దినమందు ప్రొద్దున ఉపవాసము అనుష్టించి సాయంకాలము గణపతి పూజ షొడశోపచార పూజలతొ చేసి ఆవు పాలతో లెక చందనము కలిపిన శుద్ద జలముతో అర్ఘ్యము ఇవ్వవలెను.
అర్ఘ్య ప్రదానము నకు శ్లోకములు.
1. క్షీరసాగర సంభూత సుధా రూప నిశాకర గ్రుహాణార్ఘ్యం మయా దత్తం గణేశ ప్రీతి వర్ధన!
2, గణేశాయ నమస్తుభ్యం సర్వ సిద్ది ప్రదాయక. సంకష్టం హరమే దేవ గ్రుహాణార్గ్యం నమోస్తుతే!
3 కృష్ణ పక్షే చతుర్త్యాంతు పుజిత స్త్వం విధూదయే క్షిప్రం ప్రసాదితో  దేవ గ్రుహాణార్ఘ్యం నమోస్తుతే!
4. తిథీనాం ఉత్తమే దేవి గణేశ ప్రియ వల్లభే. సర్వ సంకష్ట నాశాయ చతుర్థ్యర్ఘ్యం నమోస్తుతే!
తర్వాత దంపతులుగా క్రింది మంత్రముతొ గణపతిని 444 మార్లు జపించవలెను.
ఓం నమో హేరంబ మద మోదిత మమ సర్వ సంకటం నివారయ నివారయ హుం ఫట్ట్ స్వాహా. తరువాత చెసిన మోదకములలొ 5 ఒక చిన్న బిడ్డకు ఇచ్చి తినిపించ వలెను. వెనుక చంద్ర దర్సనము చేసుకొని భోజనాదులు చెసుకొనవలెను. ఇలా పూజ చేయడము వల్ల అన్ని విధములయిన సంకటములు తొలగిపొవునని గణేశ పురాణమునందు చెప్పబడి ఉన్నది.
జైహింద్.

2, ఆగస్టు 2012, గురువారం

యజ్ఞోపవీత ధారణ విధానము.

3 comments

జై శ్రీరామ్.
యజ్ఞోపవీత ధారణ.
ప్రియ హైందవ సంప్రదాయానువర్తులారా! మీ అందరికీ జంధ్యాల పౌర్ణమి సందర్భంగా నా శుభాకాంక్షలు.
యజ్ఞోపవీత ధారణ క్రమము ఈ క్రింది చిత్రములలో గల విధానముననుసరించి గ్రహించ వచ్చును.
చూచారు కదండీ! వీటిలోని అక్షరాలు ఇంకా పెద్దవిగా కనిపించాలంటే ఆ చిత్తరువులమీద క్లిక్ చెయ్యండి.
శుభమస్తు.
జైహింద్.

రాకీ పూర్ణిమ సందర్భంగా సోదర సోదరీమణులందరికీ శుభాకాంక్షలు.

1 comments

జైశ్రీరామ్.
రాకీ పూర్ణిమ సందర్భంగా సోదర సోదరీమణులందరికీ శుభాకాంక్షలు.
అకళంక సోదర సోదరీ భావనా సంభరిత హృదయారవిందులైన భారతీయుల ఈ సత్ సంప్రదాయము నిష్కళంకమై కల కాలమూ విరాజిల్లుతూ ఉండు గాక. సోదరీ సోదరులు ఒకరికొకరు చేదోడు వాదోడుగా నిలుతురు గాక.
జైహింద్. 

1, ఆగస్టు 2012, బుధవారం

స్నాన సమయమున పఠించ వలసిన శ్లోకములు.

1 comments

జైశ్రీరామ్.
గంగా మాతా నమో నమః
స్నాన సమయమున పఠించ వలసిన శ్లోకములు
శ్లో:-
గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి  
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు.
క:-
గంగయు యమునయు కృష్ణయు
పొంగే గోదారి వాణి భువి నర్మదయున్
రంగుగ సింధూనదియును
హంగుగ కావేరి జలము లమరుత! నీటన్.
శ్లో:-
గంగా గంగేతి యో బృయాత్ యోజనానాం శతైరపి 
ముచ్యతే సర్వ పాపెభ్యో విష్ణులోకం స గచ్చతి.
క:-
గంగా గంగా యనుచును 
పొంగుచుపలికేటివారి పుణ్యము పండున్.
తుంగను కలియును పాపము
బంగరు హరి లోకమొదవు భరతావనిలో.
జైహింద్.