జైశ్రీరామ్.
6. శా. నిన్నుం గాంచిరి ధీనిధుల్ జగమునన్ నిత్యాత్ముఁగా నేర్పుతోన్
గన్నుల్ వేయిగ, కాళ్ళు వేయి, శిరముల్ గాంచంగ వేయుండుటన్,
సున్నాయౌ పరి పూర్ణమందు నిను దాసుల్గాంచినారయ్య! శ్రీ
మన్నారాయణ! చూతునన్నిట నినున్ మన్నించి నిన్ గాంచనీ.
భావము.
ఓ శ్రీమన్నారాయణా! ధీ నిధులు నిన్ను నిత్యాత్మునిగా లోకములో
వేయి కన్నులుగ, పాదములువేయిగా వేయి శిరములుగా నీకు ఉండుట.
శూన్యమయిన ఆకారములో పరిపూర్ణ స్వరూపుడుగా నీదాసులు నిన్ను
నైపుణ్యముతో చూడఁగలిగిరి. నిన్ను నేను అన్నింటియందును చూతును.
నన్నుమన్నించి నిన్ను చూడనిమ్ము.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.