గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

14, సెప్టెంబర్ 2023, గురువారం

శ్రీ యాదాద్రి లక్ష్మీనృసింహ శతకము 38వ పద్యము .... రచన. చింతా రామకృష్ణారావు. గానం. శ్రీ కుమార సూర్యనారాయణ.

 జైశ్రీరామ్.

38. ఓం మహాభద్రాయ నమః.

ఉత్సాహ వృత్త గర్భ సీసము.

నారసింహ కనుమ నన్ను నయముఁ గొల్పు - చున్, సదా నియతిని శోభిలు మది.

చేర వచ్చెదనయ కోరి శ్రీహసనము - చిన్మయాకృతిఁ జూచి తన్మయమవ.

చేరి, పాదయుగళి సేవఁ చేయుదును - రీ! సదా భక్తితో శ్రీశ! కొనుమ.

కోరుకొందు సతము, కూర్మిఁ గొనుమ నన్ను - శ్రీపతీ! నిలుము నా చేతనమయి.

గీ. అసమ నుత *మహాభద్రా*ద్రి యాద గిరియె - వసుధ రాజిల్లె నీకు నివాసమగుచు.

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

38 సీస గర్భస్థ ఉత్సాహ వృత్తము. (7 సూర్య గణములు 1 గురువు ,,

                                             యతి 5 గణము 1 అక్షరము)

నారసింహ కనుమ నన్ను నయముఁ గొల్పుచున్ సదా.

చేర వచ్చు జనులు కోరు శ్రీహసనము చిన్మయా!

చేరి, పాదయుగళి సేవఁ చేయుదును హరీ! సదా.

కోరుకొందు సతము, కూర్మిఁ గొనుమ నన్ను శ్రీపతీ!

భావము.

భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత జనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! నాలో నయమార్గమును నిలుపుచు నన్ను చూడుము.

ఎల్లప్పుడూ నియమముతో నానో శోభించుము. నీ యొక్క మంగళప్రదమైన నవ్వు, చిన్మయ స్వరూపమును చూచుచు

ఉప్పొంగుటకు నిన్ను చేరుటకై వచ్చెదను.   లక్ష్మీ పతీ! భక్తితో నీ పాద సేవ చేయుదును నీవు స్వీకరింపుము.

నేనెప్పుడూ కోరుకొందును, నన్ను ప్రేమతో స్వాకరింపుము. నా చైతన్య స్వరూపమై నాలోనే ఉండుము. పొగడబడెడి

స్వామీ! యాదాద్రి మహా భద్రగిరియే నీ నివేశమై రాజిల్లుచున్నది.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.