జైశ్రీరామ్.
82. ఓం శరణాగత వత్సలాయ నమః.
నాందీముఖి వృత్త గర్భ సీసము.
ఘన శుభకర విజయ! ననుఁ గావన్ విశ్వ - విఖ్యాత! రారా! సువేదివగుచు,
ప్రముదితులగు ప్రజల మదులందున్ శ్రద్ధ - వీవే సుధీరా! ప్రవృద్ధి నిమ్ము.
నయ నిధానమ! సుజన హృదయాబ్జా! శుద్ధ - వాగ్రూప! రారా! కృపాపయోధి.
అమర వినుత విజయ పథ భాసా! విశ్వ - నేతా! నృసింహాఖ్య! నీవె దిక్కు.
గీ. విమల నాందీముఖీ శుభ వృత్త భాస! - అనుపమ *శరణాగత వత్సలా*! నరహరి!
భక్త జన పోష! భవశోష! పాపనాశ! - శ్రితజనోద్భాస! యాదాద్రి శ్రీనృసింహ!
82వ సీస గర్భస్థ నాందీముఖి వృత్తము. (న స త త గగ .. యతి 8)
విజయ! ననుఁ గావన్ విశ్వవిఖ్యాత! రారా!
ప్రజల మదులందున్ శ్రద్ధ వీవే సుధీరా!
సుజన హృదయాబ్జా! శుద్ధ వాగ్రూప! రారా!
విజయ పథ భాసా! విశ్వనేతా నృసింహా!
భావము.
భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా!
ఆశ్రిత జనమున
ప్రకాశించువాఁడా!
ఓ యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! గొప్ప శుభములు కలిగించు ఓ విజయుఁడా!
విశ్వమున
ప్రఖ్యాతిగా
వ్యక్తమగువాడా! నన్ను కాపాడ రమ్ము. నిరంత రానంద కలితులందు శ్రద్ధవు నీవే సుమా.
అభివృద్ధిని ప్రసాదించుము. ఓ నయ నిధానమా! ఓ కృపాపయోధీ! ఓ సుజన హృదయా! శుద్ధ వాగ్రూపా! రమ్ము. ఓ దేవతా
వినుత విజయపథ భాసా! ఓ విశ్వ నేతా! నాందీముఖీవృత్త భాసా! అనుపమ శరణాగత వత్సలా! నీవే నాకు దిక్కు.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.