గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

30, జూన్ 2020, మంగళవారం

తెలుగు విలువ తెలిసికోరచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

0 comments

జైశ్రీరామ్.
తెలుగు విలువ తెలిసికోరచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.
                         
1.మ:-అవధానంబుల కాటపట్టు తెలుగై!హాయిం సదా గూర్పగన్!
వ్యవధానంబిక లేదు కీర్తి కిలలోన్!వాగ్దేవతా!శారదా!
స్థవ నీయంబగు నీదు ప్రజ్ఞ కిహమున్!శాశించు!సర్వార్థముల్!
జవ సత్వంబులు గూర్చగా వలె!కవుల్!చాతుర్యతం!నిత్యమున్!

2,చం:-పదిలములేదు!చూడనిల!భాసుర లీల పరార్థ వాంఛతన్!
వదలిరి పూర్తిగా తెలుగు! వాడుక మానిరి పాప మేమిటో?
పదపడి తెన్గు సౌరుచులు!పట్టుగ తేజరిలంగ జేయగన్!
కదలుడు దీక్ష బూని!మన కమ్మని తెల్గును నింపు డిద్ధరన్!

3.చం:-గురుతర బోధ నాదరణ!కుంటుపడెన్ జగదైక లక్ష్యమున్!
తరిమిరి నీతి నావలకు!తారక మంత్రము కాసు లాశిలెన్!
చరచిరి తెన్గు భాష నిల !చార వశంబున దిక్కు మాలెనే!
వరదులు మేథ పెంచవలె!వారణ జేయుడి అన్య సంస్కృతుల్!

4.ఉ:-అక్షర జ్ఞాన హీనులకు!అక్షయ పాత్రము దక్కె నెంచగా!
వక్షమునందు లక్ష్మి గల వారలె!తంత్రము జేయుచుండగన్!
కుక్షులు నిండు నెట్టు లయ?కూడుకు నోచని బీద సాదకున్!
దక్షులు పుట్టగా వలెను!ధర్మము నిల్పగ భూ తలంబునన్!

5.ఉ:-రక్షణ పేర భక్షణము!రాజస మోపును కీర్తి మాపుచున్!
దక్షులు కండి!మానవత!తామస మేలను?మానవాళినిన్
శిక్షిల మాని స్నేహమున!జీవన ముక్తిని గాంచ మేలు!య
ప్పక్షమునందు దైవమిల!పట్టును గూర్చియు రక్షయౌ గదే?

6.చం:-ఒకరికి మేలు చేయుటన!నొడ్లకు కీడును జేయుటే!సుమా!
సకలము నొక్కటన్నిలుప!సాధ్యము గాదిది!మాన వాళినిన్
వికటపు టూహ నిష్ఫలము!విశ్వస నీయము గాదు!నెంచగన్!
కక విక లాపి చేతనగు!కార్యము లెంచుడి!దైవ సాక్షిగన్!

7.ఉ:-పరమ పవిత్ర భావమున!భాసుర లీల తెనుంగు మాతకున్!
వరదులు పుట్టి నారిలను!వాసి గడించిన శాస్త్ర వేత్తలున్!
తరగని కీర్తి పెన్నిధులు!ధర్మ ప్రబోధకు లెంద రెందరో?
చరితను నిల్చు కార్యముల!సర్వము బ్రోచుడి!శాంత చిత్తతన్!

8.చం:-కులమత వేష భాషలను!కూడిన సంస్కృతి భారతంబునన్!
వెలగల దీక్ష తత్పరత!వెల్గు డుదారత మాన్య జీవమున్!
బలిమిని తెల్సి కూల్చకుడు!పట్టును దప్పును రూక లాశలన్!
చెలిమిని సాంప్రదాయమును!చాటుడు లోకమునందు మేటులై!

9,చం:-నిరుపమ కీర్తి కాంక్షలను!నెయ్యము కోరుడి సాను కూల్యతన్!
పరమత వేష భాషణలు!పాడొనరించును!రుగ్మతం సదా!
తరగని తెల్గు కీర్తులను!తప్పగ నిల్పుడి!భావి మేలుకున్!
కరటు తనంబు దోషమగు!కల్మష మేర్చును శక్తి మాపుచున్!

స్వస్తి
మూర్తి.జుత్తాడ.
జైహింద్.

29, జూన్ 2020, సోమవారం

పీ.వీ. మన ఠీవి.శత పద్య సమర్చన.....నిర్వహణ...శ్రీ అవుశుల భానుప్రకాశ్.

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

28, జూన్ 2020, ఆదివారం

మన మాజీ ప్రథాని పీ.వీ.నరసింహారావుగారి శతజయంతి సందర్భముగా దర్శనం పత్రిక నిర్వహించినకవితా నీరాజనమ్.

0 comments

జైశ్రీరామ్.
మన మాజీ ప్రథాని పీ.వీ.నరసింహారావుగారి శతజయంతి సందర్భముగా
దర్శనం పత్రిక నిర్వహించినకవితా నీరాజనమ్.

స్థితప్రజ్ఞులు భారతదేశ మాజీ ప్రథాని  పీవీ నరసింహారావుగారి శతజయంతి సందర్భముగా వారిని స్మరిస్తూ సమర్పిస్తున్న నా పద్య నివాళి.
౧. ఉ.  శ్రీమహనీయ వంశజులు, చెన్నుగ నీతని తల్లి దండ్రులా
ధీమతి రుక్నయున్ మరియు ధీమహితుండగు రామరావు కాన్.
పాములపర్తి వంశమున వర్ధిలు రుక్మిణి రంగరావులన్
ధీమహితుండు చేరెనట తీరుగ దత్తత పేర పీవియే.

౨. శా.  ప్రఖ్యాతంబుగ న్యాయశాస్త్రమును తా భాసిల్లగా నేర్చి స
ద్విఖ్యాతిన్ మహనీయ మార్గచరుఁడై విశ్వంబునన్ గాంచగా
ముఖ్యుల్ కాంగ్రెసునందు చేర్చిరితనిన్ పూజ్యుండు రాణించగా
వ్యాఖ్యానించెను లోకమీతని ప్రభన్ బ్రహ్మాండమంచున్ భళీ!

౩. ఉ.  క్లేశమటంచెరింగియు విలేఖరిగా జయ మారుపేరుతో
నాశలు తీర న్యాయమును హాయిగ వ్రాయుచు కాకతీయమం
దాశిరుఁడయ్యె లోకమునకాప్తుఁడయెన్ మన పీవి. దానితో
దేశము కోరె నీతనిని దిక్కయి నిల్వగ పాలనంబుకై.

౪. సీ.  ఆంధ్రరాష్ట్రమునకు నసమాన నేతయై ముఖ్యమంత్రిగ నయి పూజ్యుఁడయ్యె,
సంస్కరణంబులు చక్కగా నెలకొల్పి నయమార్గవర్తియై నడిపె ప్రజను.
భూసంస్కరణములన్ బూర్తిగా తెచ్చి సద్ భావనన్ జగతిని పాదుకొలిపె.
కాంగ్రెస్సు నందునన్ గౌరవ పదవులన్ దక్కించుకొని కేంద్ర దక్షుఁడయ్యె.
గీ.  కేంద్రమందున గలయట్టి  కీలక పద  వులనుచేఁబట్టి నడిపి దేవుఁడుగ నిలిచె
ఎదను చేపట్టినట్టి యే పదవికైన  ఘనతఁ గొలిపి తా చణకుఁడన్ ఘనతఁ గాంచె.

౫. ఉ.  దేశ ప్రథాన మంత్రిగ విదేశములేగుచు వారి భాషలో
లేశముకూడ దోషమది లేని విధంబుగ మాటలాడి సం
దేశములిచ్చి వారి మది దివ్యునిగా చిరకీర్తి గాంచుచున్,
శ్రీశుని సత్కృపామహిమచే పరిపాలన చేసె చక్కగా.

౬. సీ. పదునేడు భాషలు ముదమార నేర్చిన ప్రఖ్యాత పురుషుడు భవ్య పీ.వి.
స్పానిష్షు భాషలో చక్కగా మాటాడి క్యూబాప్రథానికే కొలిపె వింత.
విశ్వనాథులవారి వేయిపడగలు స హస్రఫణ్ పేరున ఖ్యాతి వ్రాసి
అల మరాఠీనుండి యబల జీవితమను యనువాదమును చేసి యలరె పీ.వి.
గీ.  వ్రాసి యిన్సైడరు నవల వాసిగాంచె గొల్లరామవ్వకథ వ్రాసె గొప్పగాను..
పెక్కు రచనలు బహుమతుల్ దక్కఁజేసె. శతజయంత్యుత్సవమువేళ సన్నుతింతు.

క. పీవీ నరసింహుని మది
భావించుచు స్ఫూర్తి గాంచి వరలగవలయున్,
జీవితమంతయు మహితులు.
నే వానికిప్రాంజలింతు నిర్మల మతినై..
నమస్కారం.
జైహింద్.

27, జూన్ 2020, శనివారం

హాలాహలభక్షణమ్....శ్రీ ముత్యంపేట గౌరీశంకర్ అవధాని.

0 comments

జైశ్రీరామ్.
 జైహింద్.

26, జూన్ 2020, శుక్రవారం

"-శ్రీ లలితా చంద్ర మౌళీశ్వర"-శతక కర్తకు అభినందన మందారము....రచన...శ్రీవల్లభ

0 comments

జైశ్రీరామ్.
బ్రహ్మశ్రీ,చింతా రామ కృష్ణ రావు గారు రచించిన"-శ్రీ లలితా చంద్ర మౌళీశ్వర"-శతకము నామూలాగ్రము పఠించి,సమర్పించు,సాదరాభిమాన. పూర్వక గర్భ కవితామందారము.ర
చన:-వల్లభవవఝ అప్పల నరసింహ మూర్తి.  జుత్తాడ.

        అభినందన మందారము.
       
మత్త రజినీ ద్వయ,ముకుంద,రసారవింద,ఉల్లాసినీ ద్వయ,రారయా!ద్వయ,!రజినీకర ప్రియ,కర్మణీగర్భ"-అనంత"- వృత్తము.

"-అనంత"-వృత్తము.
(ఉత్కృతిఛందము.ర.జ.ర.ర.ర.య.జ.ర.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.)
సా రసా!రసార విందమా!సౌరుచుల్!చంద్ర మౌళనన్!సారి సారి గొల్తు లెల్లరున్!
పారమార్ధ మెంచి కూర్చితే!పౌరులం దీర్చి ముక్తినిన్!పారద్రోల దుష్కృతం బులున్!
తారకుండవైతి!సత్కవీ!ధారలన్,శయ్య,పాకతన్!దారి జూపు ధార్మి కత్వతన్!
మేర లేని సాగరున్బలెన్?మీర రెవ్వారు మీ కనన్?మీరు మీరె!కాచు    సాంబుడున్!
                                                                     

-------------పైకృతికర్త విరచిత శతక"-మామూలాగ్రము,మంచిశయ్యతో,
కదళీ పాకముతో,మంచిధారా యుతమై,మేరలేని సాగరమున్బలెన్=
అంతులేని సాగరమువలె,అపార పారావారమనునట్లుగా,మీరరెవ్వారు
మీకనన్=మిమ్ము నతిశయించువారు లే రనునట్ల,మీరు మీరె=మీకుసాటి
మీరే!వేరొకరు కారు.సౌ రుచుల్=మంచి కాంతులు----------
             ===================

1.గర్భగత"-మత్తరజినీ ద్వయ వృత్తములు.
బృహతీఛందము.ర.జ.ర.గణములు.వృ.సం.171.
ప్రాసనియమము కలదు.
1.సా రసా రసారవిందమా!                   2.సారి సారి గొల్తు లెల్లరున్!
  పారమార్ధ చింత గూర్చితే!                      పారద్రోల దుష్కృతంబులున్!
  తారకుండ వైతి సత్కవీ!                        దారి జూపు ధార్మి కత్వతన్!
మేర లేని సాగరున్బలెన్?                       మీరు మీరె?కాచు సాంబుడున్!

2.గర్భగత"-ముకుంద"-వృత్తము.
అనుష్టుప్ఛందము.ర.ర.లగ.గణములు.వృ.సం.83.
ప్రాసనియమము కలదు.
సౌరుచుల్!చంద్ర మౌళనన్!
పౌరులం దీర్చి ముక్తినిన్!
ధారలన్,శయ్య,పాకతన్!
మీర రెవ్వారు?మీకనన్!

3.గర్భగత"-రసారవింద"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.ర.ర.ర.లగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
సా రసా రసార విందమా!సౌ రుచుల్!చంద్ర మౌళనన్?
పారమార్ధ చింత గూర్చితే?పౌరులం దీర్చి ముక్తినిన్!
తారకుండ వైతి!సత్కవీ!ధారలన్,శయ్య ,పాకతన్!
మేర లేని సాగరున్బలెన్?మీర రెవ్వారు?మీకనన్!

4.గర్భగత"-ఉల్లాసినీ ద్వయ"-వృత్తములు.
అత్యష్టీఛందము.ర.ర.య.జ.ర.లగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
1.సౌ రుచుల్!చంద్ర మౌళనన్?సారి సారి గొల్తు లెల్లరున్!
   పౌరులం దీర్చి ముక్తినిన్!పారద్రోల దుష్కృతంబులున్!
   ధారలన్,శయ్య పాకతన్!దారి జూపు ధార్మి కత్వతన్!
   మీర రెవ్వారు?మీకనన్!మీరు మీరె!కాచు సాంబుడున్!

2.సౌ రుచుల్!చంద్ర మౌళనన్.సారసా రసార విందమా!
   పౌరులం దీర్చి ముక్తినిన్!పారమార్ధ చింత కూర్చితే!
   ధారలన్,శయ్య ,పాకతన్!తారకుండ వైతి!సత్కవీ!
   మీర రెవ్వారు?మీకనన్!మేర లేని!సాగరున్బలెన్?

5.గర్భగత"-రా రయా"ద్వయ వృత్తములు.
ఉత్కృతి ఛందము.ర.ర.య.జ.ర.య.జ.ర.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
సౌరుచుల్ చంద్ర మౌళనన్?సారి సారి గొల్తు రెల్లరున్!సారసా రసార   విందమా!
పౌరులం దీర్చి ముక్తినిన్!పార ద్రోల దుష్కృతంబులున్!పారమార్ధ చింత గూర్చితే?
ధారలన్!శయ్య పాకతన్!దారి జూపు ధార్మి కత్వతన్!తారకుండ వైతి!సత్కవీ!
మీర రెవ్వారు?మీకికన్!మీరు మీరె! కాచు సాంబుడున్!మేర లేని!సాగరున్బలెన్?
                                                                 
2.
సౌరుచుల్!చంద్ర మౌళనన్?సారసా రసార విందమాాసారి సారి గొల్తు  రెల్లరున్!
పౌరులం దీర్చి ముక్తినిన్!పారమార్ధ చింత గూర్చితే?పార ద్రోల దుష్కృ తంబులున్!
ధారలన్,శయ్య పాకతన్!తారకుండ వైతి!సత్కవీ!దారి జూపు ధార్మి  కత్వతన్?        
మీర రెవ్వారు?మీ కనన్!మేర లేని సాగరున్బలెన్?మీరు మీరె!కాచు సాంబుడున్!
                                                               
6.గర్భగత"-రజినీకర ప్రియ"-వృత్తము.
ధృతిఛందము.ర.జ.ర.ర.జ.ర.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
సారి సారి గొల్తు రెల్లరున్!సారసా రసార విందమా!
పారమార్ధ చింత గూర్చితే?పార ద్రోల దుష్కృతంబులున్!
దారి జూపు ధార్మి కత్వతన్?తారకుండ వైతి!సత్కవీ!
మీరు మీరె!కాచు సాంబుడున్!మేర లేని సాగరుంబలెన్?

7.గర్భగత"-కర్మణీ"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.ర.జ.ర.ర.ర.లగ.గణములు.యతులు.10,19.
ప్రాసనియమము కలదు.వృ.సం.
సారి సారి గొల్తు రెల్లరున్!సారసా రసార విందమా!సౌరుచుల్!చంద్ర  మౌళనన్?                          
పారమార్ధ చింత గూర్చితే?పార ద్రోల దుష్కృతంబులున్?పౌరులం దీర్చి  ముక్తినిన్!            
దారి జూపు ధార్మి కత్వతన్?తారకుండ వైతి!సత్కవీ!ధారలన్,శయ్య పాక తన్!
మీరు మీరె!కాచు సాంబుడున్!మేర లేని సాగరు న్బలెన్?మీర రెవ్వారు?మీకనన్!
స్వస్తి                                          
విద్వజ్జన విధేయుడు.
వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.విశ్రాంతోపాధ్యాయుడు. చోడవరము(మం).విశాఖ పట్టణము (జి),
ఆంధ్ర ప్రదేశ్.
తేదీ:-8-6-2020.
జైహింద్.

25, జూన్ 2020, గురువారం

"- జుత్తాడపుర వివరణ"- రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

0 comments

 జైశ్రీరామ్.
అతిపురాతన"-బ్రహ్మసూత్ర శ్వేతవర్ణ లింగ--మల్లేశ్వర స్వామి దేవళము.జుత్తాడ గ్రామము,చోడవర(మం).విశాఖ పట్టణము(జిల్లా). అతిపురాతన"-బ్రహ్మసూత్ర శ్వేతవర్ణ లింగ--మల్లేశ్వర స్వామి దేవళము.జుత్తాడ గ్రామము,చోడవర(మం).విశాఖ పట్టణము(జిల్లా).
"- జుత్తాడపుర వివరణ"- రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

కం:-శ్రీమంతంబౌ వసుధన్
నీమాశ్రిత ప్రోలనంగ నేర్మిన్!కూర్మిన్!
రామామృత వాగ్ఝరులచె!
దామంబై భక్త వరులు తగనొప్ప నిటన్!

తే.గీ:-పురము జుత్తాడ పూజ్యమై పుడమి వెలసె!
గురుతరంబగు"-మల్లేశు గుడియు నొకటి!
దవళ లింగంబు!భక్తులు తనియు నటుల!
బ్రహ్మసూత్ర విలిఖితమై భాసిలె నిట!

తే.గీ:-మదిని కోర్కెలు దీర్చెడి మల్లి విభుడు
పలు శతాబ్దుల ముందర పరగె నిచట!
వర తపో నిష్ట ఋషి సీమ వాసిగాంచె!
పరమ శారద వర వారి పారె నిచట!

తే.గీ:-పాడి పంటల తులతూగు భాగ్య సీమ!
పట్టమాంబిక నిచ్చోట పట్టు గొమ్మ!
ప్రభుడు మల్లేశు డలరారు ప్రాంత మిదియె!
భక్త రక్షణ పూర్ణతం భాసిలెండు!

ఆ.వె:-సంకటాప హరుడు వేంకటేశు డిచట!
జాగు మాని సిరుల సరగ బ్రోచి!
ప్రగతి మార్గమెంచి పద్ధతి పాటింప!
జనుల తీర్చి దిద్దె!చతురి మాన!

తే.గీ:-అట్టి జుత్తాడ జన్మించి నట్టి వారు
పట్టు గొమ్మలు నీతికి దిట్ట లనగ!
దాన ధర్మాల ముందుండు దాత లనగ!
వాసి కెక్కిరి మల్లేశు భక్తి పరగ!

తే.గీ:-వేద మంత్రాలు కడునిష్ట వినుచు భక్తి!
దివ మహంబులు దైవంబె దిక్కటంచు!
పరము నెద నిల్పి వర్తిలు ప్రజను కనగ!
కరము సంతోష సౌభాగ్య వరము కాదె?

8.తే,గీ:-స్థల మహాత్మ్యము వర్ణింప తరము కాదు!
పాడిపంటల నెలవైన భాగ్య సీమ!
కళల కాణాచి జుత్తాడ గ్రామ మెపుడు?
నిరుపమంబైన భక్తికి నెలవు సుమ్మి!

9.తే.గీ:-కలి వికారంబు జూపించి కదము త్రొక్క!
మలిన మొక కొంత వ్యాపించి మహిమ చెరచె!
కొంత వరకును దిగు వాయె!కోర్కె లలమ!
కాని! ధర్మంబు తరగక కడకు నిలిచె!

తే,గీ:-కృత యుగంబున ధర్మంబు స్మృతి వరంబు!
నాల్గు పాదాల నడయాడె స్వేచ్ఛ నాడు!
పరగె త్రేతాయుగంబున పట్టు సడలి
పాద త్రయమందు వర్తించె!ప్రగణితముగ!

తే.గీ:-ద్వాపరంబున సగమాయె!బక్కచిక్కి!
కృష్ణ వైవిద్య మార్భటి!కిల్భిష మతి!
నేడు కలి ప్రభావాన తా నేక పదము
నడుచు చున్నది ధర్మంబు నరుల నడుమ!

తే.గీ:-స్వార్థ చింతన మిన్నంటి జగము వెల్గె!
పరము నెంచెడి సమయంబు ప్రజలు గనక!
ధనము సర్వార్ధ సాధక తన్మయాన!
కనులు పొర గ్రమ్మె!నేడిల కన రదేమొ?

తే.గీ:-వేద విధు లను దూషించి విధిని తప్పి!
కామ మగ్నత చరియించి కఠిను లగుచు!
తల్లి భారతి కీర్తులు దలప మాని!
సాదు రక్షణ కరువాయె!సర్వ జగతి!
           
తే.గీ:-మానవాళిలొ ధర్మంబు మాధవుండు
మగుడ నిలుప జన్మబడయు!సుగమ మవగ!
జన్మ నెత్తిన కలిదోష చరము నగును!
ధర్మ మదినాల్గు పాదాల తగ నెసంగు!

తే.గీ:-మితిని మీరెను!గతిదప్పె!మితము గనక!
గతిని కనరాని తీరాయె!కల్మ షాన!
స్థితి లయంబుల హరి హరుల్!చేవ జూప!
జగపు ధర్మంబు నిల్చును!సరిసమాన!

తే.గీ:-మనుజు లందున దైవంబు గనుచు నరుడు!
చెడును విడనాడి సాగిన!స్థిరము సుఖము!
పరము నందెడు రీతిని బ్రతుక వలెను!
ధర్మ రక్షణమది సుమా! దలచి చూడ!!
స్వస్తి
మూర్తి. జుత్తాడ.
  జైహింద్

24, జూన్ 2020, బుధవారం

వినయశా,శమా,భాసుథీ,నుతిగను,గనునుతి,చతురిమా,స్తుతిదము,మతి నుతి,మెతక,ప్రకాశికా,గర్భ"-మితమతి"-వృత్తమురచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.

0 comments

జైశ్రీరామ్.
వినయశా,శమా,భాసుథీ,నుతిగను,గనునుతి,చతురిమా,స్తుతిదము,మతి నుతి,మెతక,ప్రకాశికా,గర్భ"-మితమతి"-వృత్తమురచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.
                         
"- మితమతి"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.న.స.న.న.న.న.జ.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
మిత మతి నుతి గనుమా!మెతకగ బ్రతుకకు!మెరియుమి!ప్రకాశమునన్!
చతురిమ గను జగతిన్!జత గురు నుత మవ!సరళత మెలంగ వలెన్!
కతిపయ దినములలోన్!గతి సుగమ మగును!కరమరుదు నౌ!చరితన్!
స్తుతి వరదము లలరున్!స్తుత మతి వగుదువు!సురవరులు మేలొసగన్!
1.గర్భగత"-వినయశా"-వృత్తము.
బృహతీఛందము.న.న.స.గణములు.వృ.సం.256.
ప్రాసనియమము కలదు.
మితమతి నుతి గనుమా!
చతురిమ గను జగతిన్!
కతిపయ దినములలోన్!
స్తుతి వరదము లలరున్!
2.గర్భగత"-శమా"-వృత్తము.
అనుష్టుప్ఛందము.న.న.లగ.గణములు.వృ.సం.128.
ప్రాసనియమభు కలదు.
మెతకగ బ్రతుకకు!
జత గురునుత మవ!
గతి సుగమ మగును!
స్తుత మతి వగుదువు!
3.గర్భగత"-భానుథీ"-వృత్తము.
బృహతీఛందము.భ.స.స.గణములు.వృ.సం.223.
ప్రాసనియమము కలదు.
మెరియుమి!ప్రకాశమునన్!
సరళత మెలంగవలెన్!
కరమరుదు నౌ చరితన్!
సురవరులు మేలొసగన్!
4.గర్భగత"-నుతిగను"-వృత్తము.
అత్యష్టీఛందము.న.న.స.న.న.లల.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
మితమతి నుతి గనుమా!మెతకగ బ్రతుకకు!
చతురిమ గను జగతిన్!జత గురు నుత మవ!
కతిపయ దినముల లోన్!గతి సుగమ మగును!
స్తుతి వరదము లలరున్!స్తుత మతి వగుదువు!
5.గర్భగత"గనునుతి"-వృత్తము.
అత్యష్టీఛందము.న.న.స.న.జ.లగ.గణములు.యతి9,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
మెతకగ బ్రతుకకు!మెరియుమి ప్రకాశమునన్!
జత గురు నుత మవ!సరళత మెలంగ వలెన్!
గతి సుగమ మగును!కరమరుదునౌ!చరితన్!
స్తుతమతి వగుదువు!సురవరులు మేలొసగన్!
6.గర్భగత"-చతురిమా"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.న.స.న.జ.న.న.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
మెతకగ బ్రతుకకు!మెరియుమి ప్రకాశమునన్!మితమతి నుతి గనుమా!
జత గురు నుత మవ!సరళత మెలంగ వలెన్!చతురిమ గను జగతిన్!
గతి సుగమ మగును!కరమరుదునౌ చరితన్!కతిపయ దినములలోన్!
స్తుతమతి వగుదువు!సురవరులు మేలొసగన్!స్తుతి వరదము లలరున్!
7.గర్భగత"-స్తుతిద"-వృత్తము.
ధృతిఛందము.భ.స.స.న.న.స.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము గలదు.వృ.సం.
మెరియుమి ప్రకాశమునన్!మితమతి నుతి గనుమా!
సరళత మెలంగ వలెన్!చతురిమ గను జగతిన్!
కర మరుదునౌ చరితన్!కతిపయ దినములలోన్!
సురవరులు మేలొసగన్!స్తుతి వరదము లలరున్!
8.గర్భగత"-మతినుతి "-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.స.స.న.న.స.న.న.లల.గణములు.యతులు.10,19.
ప్రాసనియమము కలదు.వృ.సం.
మెరియుమి ప్రకాశమునన్!మితమతి నుతిగనుమా!మెతగక బ్రతుకకు!
సరళత మెలంగ వలెన్!చతురిమ గను జగతిన్!జత గురు నుత మవ!
కర మరుదునౌ  చరితన్!కతిపయ దినములలోన్!గతి సుగమమగును!
సురవరులు మేలొసగన్!స్తుతి వరదము లలరున్!స్తుతమతి వగుదువు!
9.గర్భగత"-మెతక"-వృత్తము.
అత్యష్టీఛందము.న.న.న.న.న.లగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
మెతకగ బ్రతుకకు!మితమతి నుతి గనుమా!
జత గురు నుత మవ!చతురిమ గను జగతిన్!
గతి సుగమముగును!కతిపయ దినములలోన్!
స్తుత మతి వగుదువు!స్తుతి వరదము లలరున్!
10,గర్భగత"-ప్రకాశిక"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.న.న.న.న.య.న.జ.లగ.గణములు.యతులు9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
మెతకగ బ్రతుకకు!మితమతి నుతి గనుమా!మెరియుమి ప్రకాశమునన్!
జత గురునుత మవ!చతురిమ గను జగతిన్!సరళత మెలంగ వలెన్!
గతి సుగమ మగును!కతిపయ దినములలోన్!కరమరుదునౌ!చరితన్!
స్తుత మతి వగుదువు!స్తుతి వరదము లలరున్!సురవరులు మేలొసగన్!
 స్వస్తి
మూర్తి.జుత్తాడ.
జైహింద్.

23, జూన్ 2020, మంగళవారం

శ్రీ దొరవేటి అవధానం.....నిర్వహణ శ్రీ అవుసుల భానుప్రకాశ్.

0 comments

జైశ్రీరామ్.
 జైహింద్

22, జూన్ 2020, సోమవారం

భద్రకా,ప్రమాణీ,మత్తరజినీ,భేదిలు,జారయా,చరచారయా,విస్తులా,కోటికాంతిదా,అంబుజాసి,అస్తి నాస్తీతి,"-గర్భ"-పరాశక్తి"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

0 comments

జైశ్రీరామ్.
భద్రకా,ప్రమాణీ,మత్తరజినీ,భేదిలు,జారయా,చరచారయా,విస్తులా,కోటికాంతిదా,అంబుజాసి,అస్తి నాస్తీతి,"-గర్భ"-పరాశక్తి"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.
                       
"-పరాశక్తి"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.త.ర.జ.ర.య.జ.ర.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
ఆది పరాశక్తి"-కాళికా!అనంతకోటి కాంతిదా!అస్తి నాస్తి ధర్మ సత్యముల్!
పాదు కొనెం దుర్మదంబిలన్!వనాంబు జాసనెంచుచున్!పస్తు పెట్టె న్యాయ     దేవతన్!                                           భేదిలె!సత్సంగ చర్యలున్!వినాశ హేతువాదమై!విస్తు కర్తృ భీత చేతనన్!
వేదిల లోకంబు మారణన్!పెనంగె!జీవనాశృలన్!విస్తరించె మృత్యు     ఘోషలున్!
1.గర్భగత"-భద్రకా"-వృత్తము.
బృహతీఛందము.భ.త.ర.గణములు.వృ.సం.167.
ప్రాసనియమము కలదు.
ఆది పరాశక్తి కాళికా!
పాదుకొనెం!దుర్మదంబిలన్!
భేదిలె!సత్సంగ చర్యలున్!
వేదిల లోకంబు మారణన్!
2.గర్భగత"-ప్రమాణీ"-వృత్తము.
అనుష్టుప్ఛందము.జ.ర.లగ.గణములు.వృ.సం.86.
ప్రాసనియమము కలదు.
అనంతకోటి కాంతిదా!
వనాంబు జాస నెంచుచున్!
వినాశ హేతు వాదమై!
పెనంగె!జీవనాశృలన్!
3.గర్భగత"-మత్తరజినీ"-వృత్తము.
బృహతీఛందము.ర.జ.ర.గణములు.వృ.సం.171.
ప్రాసనియమము కలదు.
అస్తి నాస్తి ధర్మ సత్యముల్!
పస్తుపెట్టె న్యాయ దేవతన్!
విస్తు కర్తృ భీత చేతనన్!
విస్తరించె!మృత్యు ఘోషలున్!
4.గర్భగత"-భేదిలు"-వృత్తము.
అత్యష్టీఛందము.భ.త.ర.జ.ర.లగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
ఆది పరాశక్తి కాళికా!అనంత కోటి కాంతిదా!
పాదుకొనెం దుర్మదం బిలన్!వనాంబుజాస నెంచుచున్?
భేదిలె!సత్సంగ చర్యలున్!వినాశ హేతు వాదమై!
వేదిల లోకంబు మారణన్!విస్తరించె!మృత్యు ఘోషలున్!
5.గర్భగత"-జారయా"-వృత్తము.
అత్యష్టీఛందము.జ.ర.య.జ.ర.లగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
అనంత కోటి కాంతిదా!అస్తి నాస్తి ధర్మ సత్యముల్!
వనాంబు జాసనెంచుచున్!పస్తు పెట్టె!న్యాయ దేవతన్!
వినాశ హేతు వాదమై!విస్తు కర్తృ భీత చేతనన్?
పెనంగె!జీవనాశృలన్!విస్తరించె!మృత్యు ఘోషలున్!
6.గర్భగత"-చర చారయా"-వృత్తము.
ఉత్కృతిఛందము.జ.ర.య.జ.ర.య.స.ర.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
అనంత కోటి కాంతిదా!అస్తి నాస్తి ధర్మ సత్యముల్!ఆది పరాశక్తి కాళికా!
వనాంబుజాస నెంచుచున్!పస్తుపెట్టె న్యాయ దేవతన్!పాదుకొనెం దు   ర్మదంబిలన్?
వినాశ హేతువాదమై!విస్తు కర్తృ భీత చేతనన్!భేదిలె!సత్సంగ చర్యలున్!
పెనంగె!జీవనాశృలన్!విస్తరించె!మృత్యు ఘోషలున్!వేదిల లోకంబు    మారణన్!
7.గర్భగత"-విస్తులా"-వృత్తము.
ధృతిఛందము.ర.జ.ర.భ.త.ర.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాస నియమము కలదు.వృ.సం.
అస్తి నాస్తి ధర్మ సత్యముల్!ఆది పరాశక్తి కాళికా!
పస్తు పెట్టె న్యాయ దేవతన్!పాదుకొనెం దుర్మదంబిలన్?
విస్తు కర్తృ భీత చేతనన్!భేదిలె!సత్సంగ చర్యలున్!
విస్తరించె మృత్యు ఘోషలున్!వేదిల లోకంబు మారణన్!
8.గర్భగత"-కోటికాంతిదా"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.భ.త.ర.జ.ర.లగ.గణములు.యతులు.10,19.
ప్రాసనియమము కలదు.వృ.సం.
అస్తి నాస్తి ధర్మ సత్యముల్!ఆది పరాశక్తి కాళికా!అనంత కోటి కాంతిదా!
పస్తుపెట్టె న్యాయ దేవతన్!పాదుకొనెం దుర్మదంబిలన్?వనాంబుజాస     నెంచుచున్!                                             విస్తు కర్తృ భీత చేతనన్!భేదిలె!సత్సంగ చర్యలున్!వినాశ హేతువాదమై!
విస్తరించె!మృత్యు ఘోషలున్!వేదిల లోకంబు మారణన్!పెనంగె జీవ  నాశృలన్!        
9.గర్భగత"-అంబుజాసనీ"-వృత్తము.
అత్యష్టీఛందము.జ.ర.య.స.ర.లగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
అనంతకోటి కాంతిదా!ఆది పరాశక్తి కాళికా!
వనాంబుజాస నెంచుచున్!పాదు కొనెం దుర్మదంబిలన్?
వినాశహేతు వాదమై!భేదిలె!సత్సంగ చర్యలున్!
పెనంగె!జీవనాశృలన్!వేదిల లోకంబు మారణన్!
10,గర్భగత"-అస్తి నాస్తీతి"-వృత్తము.
ఉత్కృతిఛందము.జ.ర.య.స.ర.య.జ.ర.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
అనంతకోటి కాంతి దా!ఆది పరాశక్తి కాళికా!అస్తి నాస్తి ధర్మ సత్యముల్!
వనాంబు జాసనెంచుచున్!పాదుకొనెం దుర్మదంబిలన్?పస్తుపెట్టె న్యాయ   దేవతన్!
వినాశహేతు వాదమై!భేదిలె సత్సంగ చర్యలున్!విస్తు కర్తృ భీత చేతనన్!
పెనంగె!జీవనాశృలన్!వేదిల  లోకంబు మారణన్!విస్తరించె!మృత్యుఘోషలున్!                                                     స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
 జైహింద్.

21, జూన్ 2020, ఆదివారం

ప్రాచీన,తరంగ,మత్తరజినీ,జంఝాజ,సజావు,ప్రయోగినీ,పసందు,విథివ్రాలు,జంభారీ,తజ్జభా,గర్భ"-శ్రవంతీ"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

0 comments

 జైశ్రీరామ్.
ప్రాచీన,తరంగ,మత్తరజినీ,జంఝాజ,సజావు,ప్రయోగినీ,పసందు,విథివ్రాలు,జంభారీ,తజ్జభా,గర్భ"-శ్రవంతీ"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.
                       
"-శ్రవంతీ"-వృత్తము.
ఉత్కృతిఛందము.జ.జ.ర.ర.జ.ర.జ.ర.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
పసందైన నూత్న ఛందముల్!ప్రయోగింప నిచ్ఛ లేదు!పాత బాణి వీడరేలనో?
రసాస్వాదనంబు లేదిలన్!రయంబే!మనోహరంబు!వ్రాతమార్ప!బ్రహ్మశక్యమే!
ప్రశాంతంబు లేదు భూతలిన్!వయో గౌరవంబు లేదు!పాతరేల? దుష్ప్ర  చారమున్!
నిశీథిం జరించు వారలై!నియోగంపు కార్య లేమి!నీతి నంత మేర్చు చుండిరే!

1.గర్భగత"-ప్రాచీన"-వృత్తము.
బృహతీఛందము.జ.జ.ర.గణములు.వృ.సం.174.
ప్రాసనియమము కలదు.
పసందైన నూత్న ఛందముల్!
రసాస్వాదనంబు లేదిలన్!
ప్రశాంతంబు లేదు భూ తలిన్!
నిశీథిం జరించు వారలై!
2.గర్భగత"-తరంగ"-వృత్తము.
అనుష్టుప్ఛందము.త.జ.గల.గణములు.వృ.సం.173.
ప్రాసనియమము కలదు.
ప్రయోగింప నిచ్ఛ లేదు!
రయంబే మనోహరంబు!
వయో గౌరవంబు లేదు!
నియోగంపు కార్య లేమి!
3.గర్భగత"-మత్తరజినీ"-వృత్తము.
బృహతీఛందము.ర.జ.ర.గణములు.వృ.సం.171.
ప్రాసనియమము కలదు.
పాత బాణి వీడ రేలన్?
వ్రాత మార్ప బ్రహ్మ శక్యమే!
పాత రేల?దు ష్ప్రచారమున్!
నీతి నంతమేర్చు చుండిరే!
4.గర్భగత"-జంఝాట"-వృత్తము.
అత్య ష్టీఛందము.జ.జ.ర.త.జ.గల.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
పసందైన నూత్న ఛందముల్!ప్రయోగింప నిచ్ఛ లేదు!
రసా స్వాదనంబు లేదిలన్!రయంబే!మనోహరంబు!
ప్రశాంతంబు లేదు భూ తలిన్!వయో గౌరవంబు లేదు!
నిశీథిన్జరించు వారలై!నియోగంపు కార్య లేమి!
5.గర్భగత"-సజావు"-వృత్తము.
అత్యష్టీఛందము.య.జ.ర.జ.ర.లగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
ప్రయోగింప నిచ్ఛ లేదు!పాత బాణి వీడ లేదు!
రయంబే!మనోహరంబు!వ్రాత మార్ప బ్రహ్మ శక్యమే?
వయో గౌరవంబు లేదు!పాత రేల?దుష్ప్రచారమున్!
నియోగంపు కార్య లేమి!నీతి నంత మేర్చు చుండిరే!
6.గర్భగత"-ప్రయోగినీ"-వృత్తము.
ఉత్కృతిఛందము.య.జ.ర.జ.ర.జ.త.ర.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
ప్రయోగింప నిచ్ఛ లేదు!పాతబాణి వీడరేలనో?పసందైన నూత్న ఛందముల్!
రయంబే మనోహరంబు!వ్రాత మార్ప బ్రహ్మ శక్యమే?రసాస్వాదనంబు లేదిలన్!
వయోగౌరవంబు లేదు!పాత రేల?దుష్ప్రచారమున్!ప్రశాంతంబు లేదు భూ తలిన్!
నియోగంపు కార్య లేమి!నీతి నంత మేర్చు చుండిరే!నిశీథిం జరించు వారలై!
                                                                                 
7.గర్భగత"-పసందు"-వృత్తము.
ధృతిఛందము.ర.జ.ర.జ.జ.ర.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
పాత బాణి వీడరేలనో?పసందైన నూత్న ఛందముల్!
వ్రాత మార్ప బ్రహ్మ శక్యమే?రసా స్వాదనంబు లేదిలన్?
పాత రేల?దుష్ప్రచారమున్!ప్రశాంతంబు లేదు భూతలిన్!
నీతి నంత మేర్చు చుండిరే!నిశీథిం జరించు వారలై!
8.గర్భగత"విథి వ్రాలు"-వృత్తము
ఉత్కృతిఛందము.ర.జ.ర.జ.జ.ర.త.జ.గల.గణములు.యతులు.10,19.
ప్రాసనియమము కలదు.వృ.సం.
పాత బాణి వీడరేలనో?పసందైన నూత్న ఛందముల్!ప్రయోగింప నిచ్ఛలేదు!
వ్రాత మార్ప బ్రహ్మ శక్యమే?రసాస్వాదనంబు లేదిలన్!రయంబే!మనో హరంబు!
                                                                               
పాత రేల?దుష్ప్రచారమున్!ప్రశాంతంబు లేదు భూతలిన్!వయో గౌరవంబు లేదు!
                                                                                 
నీతి నంత మేర్చు చుండిరే!నిశీథిం జరించు వారలై!నియోగంపు కార్య లేమి!
                                                                                 
9.గర్భగత"-జంభరీ"-వృత్తము.
అత్యష్టీఛందము.త.జ.భ.త.ర.లగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
ప్రయోగింప నిచ్ఛ లేదు!పసందైన నూత్న ఛందముల్!
రయంబే మనోహరంబు!రసా స్వాదనంబు లేదిలన్!
వయోగౌరవంబు లేదు!ప్రశాంతంబు లేదు భూతలిన్!
నియోగంపు కార్య లేమి!నిశీథిం జరించు వారలై!
10,గర్భగత"-తజ్జభా"-వృత్తము.
ఉత్కృతిఛందము.త.జ.భ.త.ర.య.జ.ర.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
ప్రయోగింప నిచ్ఛ లేదు!పసందైన నూత్న ఛందముల్!పాత బాణి వీడ రేలనో?
రయంబే మనోహరంబు!రసాస్వాదనంబు లేదిలన్?వ్రాత మార్ప బ్రహ్మ శక్యమే?
వయోగౌరవంబు లేదు!ప్రశాంతంబు లేదు భూతలిన్!పాత రేల?దుష్ప్ర చారమున్!.
నియోగంపు కార్యలేమి!నిశీథిం జరించు వారలై!నీతి నంతమేర్చు చుండిరే!
                     
స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
 జైహింద్.

20, జూన్ 2020, శనివారం

మెట్టపల్లి శ్రీ లలితా చంద్రమౌళీశ్వర దేవా;అయ నవమ వార్షికోత్సవం సందర్భముగా అష్టావధానము.

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

19, జూన్ 2020, శుక్రవారం

గోదారోళ్ళమండీ..నూజిళ్ళశ్రీనివాస్ పాట ఆనందం అంబరమైతే అనే చలనచిత్రంలో చిత్రీకరణ జరిగింది.

0 comments

జైశ్రీరామ్.
 జైహింద్.

18, జూన్ 2020, గురువారం

కరోనా వీడియో శతకము. నిర్వహణ శ్రీ అవుశుల భానుప్రకాశ్....మెతుకుసీమ సాహితీ సంస్థ.

0 comments

జైశ్రీరామ్.
కరోనా వీడియో శతకము.
నిర్వహణ శ్రీ అవుశుల భానుప్రకాశ్....మెతుకుసీమ సాహితీ సంస్థ.
 జైహింద్.

17, జూన్ 2020, బుధవారం

శ్రీ నంది శ్రీనివాస్ గారి అవ్యాజమైన కరుణామితం చిలికించి నన్ను నా కవిత్వమును ప్రకాశింప జేసిన సందర్భము

0 comments

జైశ్రీరామ్.
 శ్రీ నంది శ్రీనివాస్ గారి అవ్యాజమైన కరుణామితం చిలికించి నన్ను  నా కవిత్వమును ప్రకాశింప జేసిన సందర్భముగా
వారికి నా హృదయపూర్వక ధన్యవాదములు..
జైహింద్.

16, జూన్ 2020, మంగళవారం

భక్తి అసాధనమ్...లో శ్రీ ముద్దురాజయ్యావధాని అవధానము.

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

15, జూన్ 2020, సోమవారం

నిదర్శనా,తరంగ,భద్రకా,గొప్పమాపు,కూర్మి,వెనుదర్ము,బాధిత,ఒప్పనితీరు,తప్పిద,ధర్మాత్మనీ,గర్భ"-తప్పనొప్పు"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

0 comments

జైశ్రీరామ్.
నిదర్శనా,తరంగ,భద్రకా,గొప్పమాపు,కూర్మి,వెనుదర్ము,బాధిత,ఒప్పనితీరు,తప్పిద,ధర్మాత్మనీ,గర్భ"-తప్పనొప్పు"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.
                       
"-తప్పు నొప్పు"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.భ.భ.త.జ.ర.స.ర.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
తప్పులు కుప్పలు జేయుచు!ధర్మాత్ముడటంచు బల్క!తారకు డౌనే?రసా తలిన్!
                                                                                       
నిప్పును నేనని మెల్గగ!నేర్మిం దలపోయ నౌనె?నీరసుడౌ గాదె?రాను రాన్!
ఒప్పని తీరగు చర్యలు!ఓర్మిం వెనుదర్ము నయ్య!ఊరికి దూరంబగున్తుదిన్!
గొప్పలు మాపును సర్వము!కూర్మిం జెడు లోకమందు!ఘోరతమంబౌ? తమంబునన్!
                                                                           
1.గర్భగత"-నిదర్శనా"-వృత్తము.
బృహతీఛందము.భ.భ.భ.గణములు.వృ.సం.439.
ప్రాసనియమము కలదు.
తప్పులు కుప్పలు జేయుచు!
నిప్పును నేనని మెల్గగ!
ఒప్పని తీరగు చర్యలు!
గొప్పలు మాపును సర్వము!
2.గర్భగత"-తరంగ"-వృత్తము.
అనుష్టుప్ఛందము.త.జ.గల.గణములు.వృ.సం.173.
ప్రాసనియమము కలదు.
ధర్మాత్ముడటంచు బల్క!
నేర్మిం దలపోయ నౌనె?
ఓర్మిన్వెను దర్ము నయ్య!
కూర్మిం జెడు లోకమందు!
3.గర్భగత"-భద్రకా"-వృత్తము.
బృహతీఛందము.భ.త.ర.గణములు.వృ.సం.167.
ప్రాసనియమము కలదు.
తారకు డౌనే?రసా తలిన్!
నీరసుడౌ గాదె?రాను రాన్!
ఊరికి దూరంబగు న్తుదిన్!
ఘోర తమంబౌ?తమంబునన్!
4.గర్భగత"-గొప్పమాపు"-వృత్తము.
అత్యష్టీఛందము.భ.భ.భ.త.జ.గల.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
తప్పులు కుప్పలు జేయుచు!ధర్మాత్ము డటంచు బల్క!
నిప్పును నే నని మెల్గగ!నేర్మిం దలపోయ నౌనె?
ఒప్పని తీరగు చర్యలు!ఓర్మి న్వెను దర్ము నయ్య!
గొప్పలు మాపును సర్వము!కూర్మిం జెడు లోకమందు!
5.గర్భగత"-కూర్మి"-వృత్తము.
అత్యష్టీఛందము.త.జ.ర.స.ర.లగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
ధర్మాత్ము డటంచు బల్క!తారకు డౌనే?రసాతలిన్!
నేర్మిం దలపోయ నౌనె?నీరసుడౌ గాదే?రాను రాన్!
ఓర్మిన్వెను దర్ము నయ్య!ఊరికి దూరంబగు న్తుదిన్!
కూర్మింజెడు!లోకమందు!ఘోర తమంబౌ!తమంబునన్!
6.గర్భగత"-వెనుదర్ము"-వృత్తము.
ఉత్కృతిఛందము.త.జ.ర.స.ర.య.స.స.లల.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
ధర్మాత్ము డటంచు బల్క!తారకు డౌనే?రసా తలిన్!తప్పులు కుప్పలు  జేయుచు!
నేర్మిం దలపోయ నౌనె?నీరసుడౌ గాదే?రాను రాన్!నిప్పును నే నని మెల్గగ!
ఓర్మిన్వెను దర్ము నయ్య!ఊరికి దూరంబగు న్తుదిన్!ఒప్పని తీరగు చర్యలు!
కూర్మి న్జెడు లోకమందు!ఘోర తమంబౌ!తమంబునన్! గొప్పలు మాపును సర్వము!
7.గర్భగత"-బాధిత"-వృత్తము.
ధృతిఛందము.భ.త.ర.భ.భ.భ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
తారకు డౌనే?రసాతలిన్!తప్పులు కుప్పలు జేయుచు!
నీరసుడౌ గాదే?రాను రాన్!నిప్పును నేనని మెల్గగ!
ఊరికి దూరంబగు న్తుదిన్!ఒప్పని తీరగు చర్యలు!
ఘోర తమంబౌ!తమంబునం!గొప్పలు మాపును సర్వము!
8.గర్భగత"-ఒప్పని తీరు"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.త.ర.భ.భ.భ.త.జ.గల.గణములు.యతులు.10,19.
ప్రాసనియమము కలదు.వృ.సం.
తారకు డౌనే?రసాతలిన్!తప్పులు కుప్పలు జేయుచు!ధర్మాత్ముడటంచు బల్క!
నీరసుడౌ గాదే?రాను రాన్!నిప్పును నే నని మెల్గగ!నేర్మిం దలపోయ నౌనె?
ఊరికి దూరంబగు న్తుదిన్!ఒప్పని తీరగు చర్యలు!ఓర్మి న్వెను దర్ము నయ్య!
ఘోర తమంబౌ!తమంబునన్!గొప్పలు మాపును సర్వము!కూర్మిం జెడు! లోకమందు!                                         9.గర్భగత"-తప్పిద"-వృత్తము.
అత్యష్టీఛందము.త.జ.ర.స.స.లగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
ధర్మాత్ము డటంచు బల్క!తప్పులు కుప్పలు జేయుచు!
నేర్మిం దలపోయ నౌనె?నిప్పును నే నని మెల్గగ!
ఓర్మి న్వెను దర్ము నయ్య!ఒప్పని తీరగు చర్యలు!
కూర్మిం జెడు!లోకమందు!గొప్పలు మాపును సర్వము!
10,గర్భగత"-ధర్మాత్మనీ"-వృత్తము.
ఉత్కృతిఛందము.త.జ.ర.స.స.య.స.ర.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
ధర్మాత్ము డటంచు బల్క!తప్పులు కుప్పలు జేయుచు!తారకు డౌనే? రసాతలిన్!
నేర్మిం దలపోయ నౌనె?నిప్పును నే నని మెల్గగ!నీరసుడౌ గాదే? రాను రాన్!
ఓర్మి న్వెను దర్ము! నయ్య!ఒప్పని తీరగు చర్యలు!ఊరికి దూరంబగున్!  తుదిన్!                
కూర్మింజెడు!లోకమందు!గొప్పలు మాపును సర్వము! ఘోర తమంబౌ! తమంబునన్!
స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
 జైహింద్.

14, జూన్ 2020, ఆదివారం

సంక్షిప్త రుక్మిణీకల్యాణం....భక్తి సాధనమ్.నిర్వాహకులు...శ్రీ పండరి రాధాకృష్ణ.

0 comments

జైశ్రీరామ్.
సంక్షిప్త రుక్మిణీకల్యాణం....భక్తి సాధనమ్.నిర్వాహకులు...శ్రీ పండరి రాధాకృష్ణ.
 జైహింద్.

13, జూన్ 2020, శనివారం

0 comments

జైశ్రీరామ్.
మత్తరజినీద్వయ,సమానీ,రజోరజ,మింటినంటు ద్వయ,రజినీకర ప్రియ,జ్ఞాపికా,గర్భ"-శంఖారావ"-వృత్తము.రచన;-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.
                           
"-శంఖారావ"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.ర.జ.య.జ.ర.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
ధర్మ గ్లాని సంభవించెనా?త్రాత సృష్టి ఛేదనమా?తాళ లేని నీతి దోషమా!
కర్మ రోగ మంత రింపదా?ఘాతి నింపు ధోరణియా?కాళమౌ!కరోన కాటుయా?
మర్మరీకు లెంచు చర్యలా!మాత కీర్తి నాస్తి యనన్!మౌళికాలు గూర్చు లోపమా?
వర్మణీయ జాత్యహంబొకో?వాత రోగ మార్భటియా!ఫాలననేత్ర చూడ వేమయా?
                                       .                                        
మర్మరీకులు=దుర్మార్గులు,వర్మణీయ=కవచము,
భావము:- ప్రస్తుతము విజృంభించి మానవాళిని లక్షల సంఖ్యలో పొట్టను
పెట్టు కొనుచున్న కరోన మారి నవలోకించి చూడగా!
ధర్మమునకు గ్లాని యేర్పడెనా?బ్రహ్మ సృష్టి రహస్యాన్వేషణ ఫలితమా!
కలిని నిలువజాలని నీతి తప్పిదమా!చేయుకర్మలు చెడు ఫలిత సారమా!
పరార్థ మెంచని పొట్ట నింపుడు ధోరణియా!విష నాగు వంటి కరోనా కాటు
నైజమా!దుర్మార్గపు చైదముల భూమాత కీర్తిని కించ పరచు వారి చర్యలా!
మౌళిక వనరులు సమ కూర్చుటలో తారతమ్య భావమా!జాతి మత నామక
కవచ నిర్మిత యహం భావమా!గాలి రూపమున శరీరమును ప్రవేశించి
గొప్పను చాటుకొను కరోనా లక్షణమా!నుదుటి భాగమున వహ్ని నేత్రము
గల పరమేశ్వరా!జగత్పితా!మానవ లోకము వైపు చూడ వెందులకు?
చెడును భస్మమీపటలము గావించి!మమ్ములను చల్లగా కాపాడుము.

1.గర్భగత"-మత్తరజినీద్వయ"-వృత్తములు.
బృహతీఛందము.ర.జ.ర.గణములు.వృ.సం.171.
ప్రాసనియమము కలదు.
1.ధర్మ గ్లాని సంభవించెనా?                2.తాళ లేని!నీతి దోషమా?
   కర్మ రోగ మంతరింపదా?                    కాళమౌ!కరోన కాటుయా?
  మర్మరీకు లెంచు చర్యలా!                   మౌళికాలు గూర్చు లోపమా!
వర్మణీయ జాత్యహంబొకో?                 ఫాలనేత్ర చూడ వేమయా?
2.గర్భగత"-సమానీ"-వృత్తము.
అనుష్టుప్ఛందము.ర.జ.లగ.గణములు.వృ.సం.107.
ప్రాసనియమము కలదు.
త్రాత సృష్టి ఛేదనమా?
ఘాతి నింపు ధోరణియా?
మాత కీర్తి నాస్తి యనన్?
వాత రోగ మార్భటియా?
3.గర్భగత"-రజోరజ"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.ర.ర.జ.లగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
ధర్మ గ్లాని సంభవించెనా?త్రాత సృష్టి ఛేదనమా?
కర్మ రోగ మంత రింపదా?ఘాతి నింపు ధోరణియా?
మర్మరీకు లెంచు చర్యలా!మాత కీర్తి నాస్తి యనన్?
వర్మణీయ జాత్యహంబొకో?వాత రోగ మార్భటియా?
4.గర్భగత"-మింటినంటు ద్వయ"-వృత్తములు.
అత్యష్టీఛందము.ర.జ.య.జ.ర.లగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
1.త్రాత సృష్టీ ఛేదనమా?తాళ లేని నీతి దోషమా?
   ఘాతి నింపు ధోరణియా?కాళమౌ!కరోన కాటుయా?
  మాత కీర్తి నాస్తి యనన్?మౌళికాలు గూర్చు లోపమా?
  వాత రోగ మార్భటియా?ఫాలనేత్ర చూడ వేమయా?
2.త్రాత సృష్టి ఛేదనమా?ధర్మ గ్లాని సంభవించెనా?
   ఘాతి నింపు ధోరణియా?  కర్మ రోగ మంతరింపదా?
  మాత కీర్తి నాస్తి యనన్?మర్మరీకు లెంచు చర్యలా?
  వాత రోగ మార్భటియా? వర్మణీయ జాత్యహంబొకో?
5.గర్భగత"-మర్మరీక"-ద్వయ వృత్తములు.
ఉత్కృతిఛందము.ర.జ.య.జ.ర.య.జ.ర.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
1.
త్రాత సృష్టి ఛేదనమా?తాళ లేని నీతి దోషమా?ధర్మ గ్లాని సంభవించెనా?
ఘాతి నింపు ధోరణియా?కాళమౌ!కరోన కాటుయా?కర్మ రోగ మంతరింపదా?
మాత కీర్తి నాస్తి యనన్?మౌళికాలు గూర్చు లోపమా?మర్మ రీకు లెంచు చర్యలా
వాత రోగ మార్భటియా?ఫాల నేత్ర చూడ వేమయా?వర్మణీయ జాత్య  హంబొకో?
2.
త్రాత సృష్టి ఛేదనమా?ధర్మ గ్లాని సంభవించెనా?తాళలేని!నీతి దోషమా?
ఘాతినింపు ధోరణియా?కర్మ రోగ మంతరింపదా?కాళమౌ!కరోన కాటుయా?
మాత కీర్తి నాస్తి యనన్?మర్మరీకు లెంచు చర్యలా?మౌళికాలు గూర్చు లోపమా?
వాతరోగ మార్భటియా?వర్మణీయ జాత్యహంబొకో?ఫాల నేత్ర చూడ వేమయా?
6.గర్భగత"-రజినీకర ప్రియ వృత్తము.
ధృతిఛందము.ర.జ.ర.ర.జ.ర.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
తాళ లేని నీతి దోషమా?ధర్మ గ్లాని సంభవించెనా?
కాళమౌ!కరోన కాటుయా?కర్మ రోగ మంతరింపదా?
మౌళికాలు గూర్చు లోపమా?మర్మరీకు లెంచు చర్యలా?
ఫాల నేత్ర చూడ వేమయా?వర్మణీయ జాత్యహంబొకో?
7.గర్భగత"-జ్ఞాపికా"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.ర.జ.ర.ర.జ.లగ.గణములు.యతులు.10,19.
ప్రాసనియమము కలదు.వృ.సం.
తాళ లేని నీతి దోషమా?ధర్మ గ్లాని సంభవించెనా?త్రాత సృష్టిఛేదనమా?
కాళమౌ!కరోన కాటుయా?కర్మరోగ మంతరింపదా?ఘాతినింపు ధోరణియా?
మౌళికాలు గూర్చు లోపమా?మర్మరీకు లెంచు చర్యలా?మాత కీర్తి నాస్తియనన్?
ఫాల నేత్ర చూడ వేమయా?వర్మణీయ జాత్యహంబొకో?వాత రోగ   మార్భటియా?                                      
 స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.
                     

భక్తిసాధనం నిర్వహించిన వర్ణన.

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

12, జూన్ 2020, శుక్రవారం

చర్విణీ,మృదుమానస,మత్తరజినీ,భూగణాల,దొసగొనర,బుసనాగ,తూజప,భాగ్యశా,దుష్కరి,దుష్కర్మ,గర్భ"-అవభృద,వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

0 comments

జైశ్రీరామ్
చర్విణీ,మృదుమానస,మత్తరజినీ,భూగణాల,దొసగొనర,బుసనాగ,తూజప,భాగ్యశా,దుష్కరి,దుష్కర్మ,గర్భ"-అవభృద,వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.
                 
"-అవభృద"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.భ.ర.స.నసయ,జ.ర.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
రాజకీయావభృదంబునన్!రస దుష్కృత కర్తలై!రాగ భోగ భాగ్య మాశిలన్?
భోజులై యుందురె?దాతృతన్!బుస నాగుల్దలంపగన్!భూ గణాల పెంపు  నెంతురే?                                              
తూ జపం బెంతు రిహంబునన్!దొసగంటన్?గణింపరే!తూగు చుండ్రు!కోట్ల మేటులై!                                              
వాజినం బేల?దలంతురే!పస జూప న్వదాన్యతన్?బాగు నెంచి వర్తిలం  వలెన్?                                                       అర్ధములు:-
వాజినంబు=బలము,శౌర్యము,
1.గర్భగత"-"-చర్విణీ"-వృత్తము.
బృహతీఛందము.ర.భ.ర.గణములు.వృ.సం.179.
ప్రాసనియమము కలదు.
రాజకీయావ భృదంబునన్?
భోజులై  యుందురె?దాతృతన్!
తూ జపం బెంతు రిహంబునన్!
వాజినం బేల?దలంతురే!
2.గర్భగత"-మృదు మానస"-వృత్తము.
అనుష్టుప్ఛందము.ర.స.లగ.గణములు.వృ.సం.91.
ప్రాసనియమము కలదు.
రస దుష్కృత కర్తలై!
బుస నాగు ల్దలంపగన్!
దొసగంటన్!గణింపరే!
పస జూపం!వదాన్యతన్!
3.గర్భగత"-మత్తరజినీ"-వృత్తము.
బృహతీఛందము.ర.జ.ర.గణములు.వృ.సం.171.
ప్రాసనియమము కలదు.
రాగ భోగ భాగ్య మాశిలన్!
భూ గణాల పెంపు నెంతురే?
తూగు చుండ్రు కోట్ల మేటులై!
బాగు నెంచి వర్తిల వలెన్!
4.గర్భగత"-భూగణాల"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.భ.ర.స.స.లగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
రాజకీ యావ భృదంబునన్?రస దుష్కృత కర్తలై!
భోజులై యుందురె?దాతృతన్!బుస నాగుల్దలంపగన్?
తూ జపం బెంతు రిహంబునన్!దొస గంటన్!గణింపరే?
వాజినం బేల?మనంబులన్!పస జూప న్వదాన్యతన్!
5.గర్భగత"-దొసగొనరు"-వృత్తము.
అత్యష్టీఛందము.స.స.య.జ.ర.లగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
రస దుష్కృత కర్తలై!రాగ భోగ భాగ్య మాశిలన్?
బుస నాగుల్దలంపగన్?భూ గణాల పెంపు నేర్తురే?
దొస గంటన్!గణింపరే?తూగు చుండ్రు కోట్ల మేటులై!
పస జూపన్వదాన్యతన్!బాగు నెంచి వర్తిలన్వలెన్?
6.గర్భగత"-బుసనాగు"-వృత్తము.
ఉత్కృతిఛందము.స.స.య.జ.ర.య.జ.స.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
రస దుష్కృత కర్తలై!రాగ భోగ భాగ్య మాశిలన్?రాజకీయావ భృదంబునన్?
బుసనాగుల్దలంపగన్?భూగణాల పెంపు నెంతురే?భోజులై యుందురె? దాతృతన్!                                                
దొసగంటన్గణింపరే?తూగు చుండ్రు కోట్ల మేటులై!తూజపం బెంతు రిహంబునన్!                                                   పస జూపన్వ దాన్యతన్!బాగు నెంచి వర్తిలం వలెన్?వాజినం బేల? మనంబులన్!                                                   7.గర్భగత"-తూజపం"-వృత్తము.
ధృతిఛందము.ర.జ.ర.ర.భ.ర.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
రాగ భోగ భాగ్య మాశిలన్?రాజకీయావ భృదంబునన్?
భూ గణాల పెంపు నెంతురే?భోజులై! యుందురె?ధాతృతన్!
తూగు చుండ్రు!కోట్ల మేటులై!తూ జపం బెంతు రిహంబునన్!
బాగు నెంచి వర్తిలం వలెన్?వాజినం బేల? మనంబులన్!
8.గర్భగత"-భాగ్యాశ"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.ర.భ.ర.స.స.లగ.గణములు.యతులు.10,19.
ప్రాసనియమము కలదు.వృ.సం.
రాగ భోగ భాగ్య మాశిలన్?రాజకీయావ భృదంబునన్?రస దుష్కృత కర్తలై!
భూ గణాల పెంపు నెంతురే?భోజులై యుందురె?ధాతృతన్ !బుస నాగు  ల్దలంపగన్!                                               తూగు చుండ్రు కోట్ల మేటులై!తూ జపం బెంతు రిహంబునన్!దొస గంటం గణింపరే?                                               బాగు నెంచి వర్తిలం వలెన్?వాజినం బేల? మనంబులన్!పస జూపం  వదాన్యతన్?                                                 9.గర్భగత"-దుష్కరి"-వృత్తము.
అత్యష్టీఛందము.స.స.య.జ.స.లగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
రస దుష్కృత కర్తలై!రాజకీయావ భృదంబునన్?
బుస నాగు ల్దలంపగన్!భోజులై యుందురె?ధాతృతన్!
దొస గంటం గణింపరే?తూ జపం బెంతు రిహంబునన్!
పస జూపం వదాన్యతన్!వాజినం బేల?మనంబులన్!
10,గర్భగత"-దుష్కర్మ"-వృత్తము.
ఉత్కృతిఛందము.స.స.య.జ.స.య.జ.ర.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
రస దుష్కృత కర్తలై!రాజకీయావ భృదంబునన్?రాగ భోగ భాగ్య మాశిలన్?
బుస నాగు ల్దలంపగన్!భోజులై యుందురె?ధాతృతన్!భూ గణాల పెంపు నెంతురే?                                                 దొస గంటం గణింపరే?తూ జపం బెంతు రిహంబునన్!తూగు చుండ్రు కోట్ల  మేటులై!                                               పస జూపం వదాన్యతన్!వాజినం బేల?మనంబులన్?బాగు నెంచి  వర్తిలంనెంతురే                                              
స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.

11, జూన్ 2020, గురువారం

గతికా,ముముక్షు,మత్తరజినీ,గతి గమిత,సజావు,ఇచ్ఛాను సారి,సు నీతినీ,నిరతి,దహిత,చరిత,గర్భ"-ప్రజాజీవనా"-వృత్తము. రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

0 comments

జైశ్రీరామ్.
గతికా,ముముక్షు,మత్తరజినీ,గతి గమిత,సజావు,ఇచ్ఛాను సారి,సు నీతినీ,నిరతి,దహిత,చరిత,గర్భ"-ప్రజాజీవనా"-వృత్తము.
రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.
                         

ప్రజాజీవనా"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.ర.జ.య.జ.ర.జ.ర.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
పరశు రామ ప్రీతి జేసి!ప్రజా జీవనాల నెల్ల!పాతకీ!కరోన రక్కసీ!
చరతి మంచి మార్గమంచు!సజావేమి లేక జేసి!జాతకాలు మార్చి తేలనే?
పరమునైన లెక్క మాని!వజీరంచు త్రుళ్ళె దేల?వాత రోగమంటు నీకికన్!
నిరతి వీడి సాగె దేల?నిజేచ్ఛ న్జరింప బోకు!నేతనంచు పొంగ బోకుమా!

1.గర్భగత"-గతికా"-వృత్తము.
బృహతీఛందము.న.ర.జ.గణములు.వృ.సం.344.
ప్రాసనియమము కలదు.
పరశు రామ ప్రీతి జేసి!
చరతి మంచి మార్గమంచు!
పరము నైన లెక్క మాని!
నిరతి వీడి సాగె దేల?
2.గర్భగత"-ముముక్షు వృత్తము.
అనుష్టుప్ఛందము.య.జ.గల.గణములు.వృ.సం.110,
ప్రాసనియమము కలదు.
ప్రజా జీవనాల నెల్ల!
సజా వేమి లేక జేసి!
వజీరంచు త్రుళ్ళె దేల?
నిజేచ్ఛన్జరింప బోకు!
3.గర్భగత"-మత్తరజినీ వృత్తము.
బృహతీఛందము.ర.జ.ర.గణములు.వృ.సం.171.
ప్రాస నియమము కలదు.
పాతకీ!కరోన రక్కసీ!
జాతకాలు మార్చి తేలనె?
వాత రోగమంటు  నీ కికన్!
నేత నంచు పొంగ బోకుమా!
4.గర్భగత"-గతి గమిత"-వృత్తము.
అత్యష్టీఛందము.న.ర.జ.య.జ.గల.గణములు.యతి.10,వ.యక్షరము
ప్రాసనియమము కలదు.వృ.సం.
పరశురామ ప్రీతి జేసి!ప్రజా జీవనాల నెల్ల!
చరతి మంచి మార్గమంచు!సజావేమి లేక జేసి!
పరము నైన లెక్క మాని!వజీరంచు త్రుళ్ళె దేల?
నిరతి వీడి సాగె దేల?నిజేచ్ఛ న్జరింప బోకు!
5.గర్భగత"-సజావు"-వృత్తము.
అత్యష్టీఛందము.య.జ.ర.జ.ర.లగ.యతి.9,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
ప్రజా జీవనాల నెల్ల!పాతకీ కరోన రక్కసీ!
సజావేమి లేక జేసి! జాతకాలు మార్చి తేలనే?
వజీరంచు త్రుళ్ళె దేల?వాతరోగ మంటు నీకికన్!
నిజేచ్ఛం జరింప బోకు!నేత నంచు పొంగ బోకుమా!
6.గర్భగత"-ఇచ్ఛానుసారి"-వృత్తము.
ఉత్కృతిఛందము.య.జ.ర.జ.ర.జ.స.జ.గల.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.
ప్రజా జీవనాల నెల్ల!పాతకీ కరోన రక్కసీ!పరశురాము ప్రీతి జేసి!
సజావేమి లేక జేసి!జాతకాలు మార్చి తేలనే?చరతి మంచి మార్గ మంచు!
వజీరంచు త్రుళ్ళె దేల?వాత రోగ మంటు నీ కికన్!పరము నైన లెక్క మాని! నిజేచ్ఛ చరింప బోకు!నేతనంచు పొంగ బోకుమా!నిరతి వీడి సాగె దేల?
7.గర్భగత"-సు నీతినీ"-వృత్తము.
ధృతిఛందము.ర.జ.ర.న.ర.జ.గణములు.యతి,10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
పాతకీ!కరోన"రక్కసీ!వరశు రాము ప్రీతి జేసి!
జాతకాలు మార్చి తేలనే?చరతి మంచి మార్గమంచు!
వాత రోగ మంటు నీకికన్!పరము నైన లెక్క మాని!
నేతనంచు పొంగ బోకుమా!నిరతి వీడి సాగె దేల?
8.గర్భగత"-నిరతి"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.న.ర.జ.య.జ.గల.గణములు.యతులు.10,19.
ప్రాసనియమభు కలదు.వృ.సం.
పాతకీ!కరోన రక్కసీ!పరశురాము ప్రీతిజేసి!ప్రజా జీవనాల నెల్ల!
జాతకాలు మార్చి తేలనే?చరతి మంచి మార్గమంచు!సజావేమి!లేక జేసి!
వాత రోగ మంటు నీకాకన్!పరమునైన లెక్క మాని!వజీరంచు త్రుళ్ళెదేల?
నేతనంచు పొంగ బోకుమా!నిరతి వీడి సాగెదేల?నిజేచ్ఛ చరింపబోకు!
9.గర్భగత"-దహిత"-వృత్తము.
అత్యష్టీఛందము.య.జ.భ.స.జ.గల.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
ప్రజా జీవనాల నెల్ల!పరశురాము ప్రీతి జేసి!
చరతి మంచి మార్గమంచు!సజావేమి లేక జేసి!
పరమునైన లెక్క మాని!వజీరంచు త్రుళ్ళె దేల?
నిరతి వీడి సాగె దేల?నిజేచ్ఛ చరింప బోకు!
10,గర్భగత"-చరతి"-వృత్తము.
ఉత్కృతిఛందము.య.జ.భ.స.జ.ర.జ.ర.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
ప్రజా జీవనాల నెల్ల!పరశురాము ప్రీతి జేసి!పాతకీ!కరోన రక్కసీ!
చరతి మంచి మార్గమంచు!సజావేమి!లేక జేసి!జాతకాలు మార్చి తేలనే?
పరమునైన లెక్క మాని!వజీరంచు త్రుళ్ళెదేల?వాత రోగమంటు నీకికన్!
నిరతి వీడి సాగె దేల?నిజేచ్ఛ చరింప బోకు!నేత నంచు పొంగ బోకుమా!
స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.

10, జూన్ 2020, బుధవారం

మత్తరజినీ ద్వయ,సమాశ్రీ,వసుగంథి,యిర్నవ సుగంథిద్వయ, కొంగు బంగరుద్వయ,రజినీకరప్రియ,పసందగు,గర్భ"-కల్పద్రుమ"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.

0 comments

 జైశ్రీరామ్.
మత్తరజినీ ద్వయ,సమాశ్రీ,వసుగంథి,యిర్నవ సుగంథిద్వయ, కొంగు బంగరుద్వయ,రజినీకరప్రియ,పసందగు,గర్భ"-కల్పద్రుమ"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.     
                           
"-కల్పద్రుమ"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.ర.జ.ర.జ.ర.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
తొంగి జూచి వంగి వాలరే!తొల్లి కోర్కె కాంక్ష దీర!తూలు చుంద్రు మోహ   భ్రాంతినిన్ !
భంగపాటు లెక్క సేయరే!వల్లెయంచు చేర రెంచ!వాలకంబు స్వార్థ  చింతనన్!
జంగమయ్య జోలికేగరే!జల్లెడందు నీటితీరు!జాల మేల ముందు నుందురే!
సంగతింతె!కల్యుగంబునన్!జల్లు లేని పంటయట్లు!చాలతెల్విదర్శ  నీయతన్!
                                                                       
1.గర్భగత"- మత్తరజినీద్వయ"-వృత్తములు
బృహతీఛందము.ర.జ.ర,గణములు.వృ.సం.171.
ప్రాసనియమము కలదు.
తొంగి జూచి వంగి వాలరే!           తూలుచుంద్రు మోహ భ్రాంతినిన్!
భంగ పాటు లెక్క సేయరే!         వాల కంబు స్వార్థ చింతనన్!
జంగమయ్య జోలి కేగరే!            జాల మేల ముందు నుందురే!
సంగతింతె!కల్యుగంబునన్!       చాల తెల్వి దర్శ నీయతన్!
2.గర్భగత"-సమాశ్రీ"-వృత్తము.
అనుష్టుప్ఛందము.ర.జ.గల.గణములు.వృ.సం.171.
ప్రాసనియమము కలదు.
తొల్లి కోర్కె కాంక్ష దీర!
వల్లెయంచు చేర రెంచ!
జల్లెడందు నీటి తీరు!
జల్లు లేని పంట యట్టు!
3.గర్భగత"-వసుగంథి"-వృతము.
అత్యష్టీఛందము.ర.జ.ర.ర.జ.గల.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
తొంగిజూచి వంగి వాలరే!తొల్లి కోర్కె వాంఛ దీర!
భంగపాటు లెక్క చేయరే!వల్లెయంచు చేర రెంచ!
జంగమయ్య జోలి కేగరే!జల్లెడందు నీరు తీరు!
సంగతింతె!కల్యుగంబునన్!జల్లు లేనిపంట యట్లు!
4.గర్భగత"-యతిర్నవసుగంథి"-వృత్తములు
అత్యష్టీఛందము.ర.జ.ర.జ.ర.లగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
తొల్లి కోర్కె కాంక్ష దీర!తూలు చుంద్రు మోహ భ్రాంతినిన్!
వల్లెయంచు చేర రెంచ!వాలకంబు స్వార్ధ చింతనన్!
జల్లెడందు నీటి తీరు!జాలమేల ముందు నుందురే!
జల్లు లేని పంట యట్లు!చాల తెల్వి దర్శనీయతన్!

తొల్లి కోర్కె కాంక్ష దీర!తొంగి జూచి వంగి వాలరే!
వల్లెయంచు చేర రెంచ!భంగపాటు లెక్క సేయరే!
జల్లెడందు నీటితీరు!జంగమయ్య జోలి కేగరే!
జల్లు లేని పంట యట్లు!సంగతింతె!కల్యుగంబునన్!
5.గర్భగత"-కొంగుబంగరు ద్వయ"-వృత్తములు.
ఉత్కృతిఛందము.ర.జ.ర.జ.ర.య.జ.ర.లగ.గణములు.యతులు.9,18
ప్రాసనియమము కలదు.వృ.సం.
తొల్లి కోర్కె కొంత దీర!తూలు చుంద్రు మోహ భ్రాంతినిన్!తొంగిజూచివంగి వాలరే!                            
వల్లె యంచు చేర రెంచ!వాలకంబు స్వార్థ చింతనన్!భంగ పాటు లెక్క సేయరే!
జల్లె డందు నీటి తీరు!జాల మేల ముందు నుందురే!జంగ మయ్య జోలి కేగరే!
జల్లు లేని పంట యట్లు!చాల తెల్వి దర్శ నీయతన్!సంగ తింతె!కల్యు గంబునన్!                                                                                
తొల్లి కోర్కె వాంఛ దీర!తొంగి జూచి వంగి వాలరే!తూలు చుంద్రు మోహ భ్రాంతినిన్!
వల్లె యంచు చేర రెంచ!భంగ పాటు లెక్క సేయరే!వాలకంబు స్వార్థ చింతనన్!
జల్లె డందు నీటి తీరు!జంగ మయ్య జోలి కేగరే!జాలమేల ముందు  నుందురే!
జల్లు లేని పంట యట్లు!సంగ తింతె కల్యు గంబునన్!చాల తెల్వి దర్శ నీయతన్!
                                                                             
6.గర్భగత"-రజినీకరప్రియ"-వృత్తము.
ధృతిఛందము.ర.జ.ర.ర.జ.ర.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
తూలు చుంద్రు మోహ భ్రాంతినిన్!తొంగి జూచి వంగి వాలరే!
వాల కంబు స్వార్థ చింతనన్!భంగపాటు లెక్క సేయకన్!
జాల మేల ముందు నుందురే!జంగమయ్య జోలి కేగరే!
చాల తెల్వి దర్శ నీయతన్!సంగతింతె!కల్యుగంబునన్!
7.గర్భగత"-పసందగు"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.ర.జ.ర.ర.జ.గల.గణములు.యతులు.10,19.
ప్రాసనియమము కలదు.వృ.సం.
తూలు చుంద్రు మోహ భ్రాంతినిన్!తొంగి జూచి వంగి వాలరే!తొల్లి కోర్కె వాంఛ దీర!
వాల కంబు స్వార్థ చింతనన్!. భంగ పాటు లెక్క సేయకన్!వల్లె యంచు చేర రెంచ!
జాల మేల ముందు నుందురే!జంగ మయ్య జోలి కేగరే?జల్లె డందు  నీటి తీరు!
చాల తెల్వి దర్శ నీయతన్!సంగ తెంచి కల్యుగంబునన్!జల్లు లేని పంట యట్టు!
                                                                       
స్వస్తి
మూర్తి.జుత్తాడ.
 జైహింద్.

9, జూన్ 2020, మంగళవారం

భక్తి సాధనమ్ లో శ్రీ మైలవరపు మురళీకృష్ణ అంతర్జాల అవధానము.

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

8, జూన్ 2020, సోమవారం

భక్తిసాధనమ్.... సమస్యాపూరణం.

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

7, జూన్ 2020, ఆదివారం

భక్తి సాధనమ్....చ్యుత దత్తాక్షరి.

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

6, జూన్ 2020, శనివారం

ఇద్దరు శతావధానుల అంత్యాక్షరి. నిర్వహణ భక్తిసాధనమ్.

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

5, జూన్ 2020, శుక్రవారం

భక్తిసాధనమ్ వారు అంతర్జాలంలో నిర్వహించిన అవధానము.

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

4, జూన్ 2020, గురువారం

గరికిపాటి మేడసాని..ఇద్దరూ ఇద్దరే.

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

3, జూన్ 2020, బుధవారం

తెలుఁగుబిడ్డ శతకము.....కవిశ్రీ సత్తిబాబు.

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

2, జూన్ 2020, మంగళవారం

భక్తిసాధనమ్....లో సమస్యాపూరణము

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

1, జూన్ 2020, సోమవారం

దృశ్య శ్రవణ అష్టావధానము.....శ్రీ దొరవేటి. అవధాని.

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.