గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

14, సెప్టెంబర్ 2023, గురువారం

శ్రీ యాదాద్రి లక్ష్మీనృసింహ శతకము 43వ పద్యము .... రచన. చింతా రామకృష్ణారావు. గానం. శ్రీ కుమార సూర్యనారాయణ.

 జైశ్రీరామ్.

43. ఓం వికర్త్రే నమః.

వృంత వృత్త గర్భ సీసము

ఉపమాన రహిత! తిరుపతివగు మహదే - వా! రా! కృపన్ జూడవా! నృసింహ!

ఘనుఁడ! ముదమున తరుణమిదిర కన ధా - త్రీశా! దృగబ్జముల్ తెరచి చూడు.

కనఁగ వలచితి. చరణకమలములు చా - లంటిన్ గదా! కనుమొంటివాడ!

వరమిడ నికను పరమ పురుష నినుఁ బ్రా - ర్థింతున్. మదిం గననెంతునయ్య.

గీ. కర్తనౌదును నీవున్న కావ్య గతికి. - కావ్యకారక! నిజము *వికర్త*వీవె.    

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

43 సీస గర్భస్థ వృంత వృత్తము. ( గగ .. యతి 9)

తిరుపతివగు మహదేవా! రా! - తరుణమిదిర కన ధాత్రీశా!

చరణకమలములుచాలంటిన్ - బరమ పురుష నినుఁ బ్రార్థింతున్.

భావము.

భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత జనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! సరిపోలునది లేనివాడా! లక్ష్మీ పత్రివైన మహాదేవా!

నరసింహా! రమ్ము. నన్ను కృపతో చూడవా. ధాత్రీశా!  ప్రేమతో చూచుటకు ఇదే మంచి సమయము. . ఘనుఁడా! నీ

కనుపద్మములను తెరచి చూడుము..నేను చూడకోరుచుంటినయ్యా. అందులకు నీ చరణపద్మములే చాలునంటిని

కదా. .నేను ఒంటరి వాడను నన్ను చూడుము.పరమ పురుషా! నాకు వరమొసగుటకై నిన్ను వేడుదును.. మనసులో చూడఁ

గోరుదునయ్యా. నీవు రహించు కావ్యగతికి నేను కర్తగా అగుదును. ఓ కావ్యకారకుఁడా! వికర్తవీవేయనుట నిజము.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.