జైశ్రీరామ్.
77. ఓం సర్వతంత్రాత్మకాయ నమః.
కలరవ వృత్త గర్భ సీసము.
సుందరాంగుఁడ నినుఁజూచుచును మనిన - ప్రభ పెఱుగున్ గదా! వారిజాక్ష!
కాంచుచు మముఁ గనిపించుమిఁకను కరు - ణను శుభదాక్షరా! నయ విభాస!
చిత్తమున్ గని మనఁ జేయుమయ సుమ శ - ర జనకుఁడా! నాకు రక్షఁ గొల్పు.
నా చిత్తమున నిను నమ్మితినయ నిరు - పమ నృహరీ! మహత్ పావనాంఘ్రి!
గీ. కలరవంబయి వినిపించు కన్న తండ్రి! - కనుమ *సర్వతంత్రాత్మకా*! గారవమున.
భక్త జన పోష! భవశోష! పాపనాశ! - శ్రితజనోద్భాస! యాదాద్రి శ్రీనృసింహ!
77వ సీస గర్భస్థ కలరవ వృత్తము. (స న న న లగ .. యతి 8)
నినుఁ జూచుచును మనిన ప్రభ పెఱుగున్. - గనిపించుమికను కరుణను శుభదా!
మనఁ జేయుమయ సుమశర జనకుఁడా! - నిను నమ్మితినయ నిరుపమ నృహరీ!
భావము.
భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా!
ఆశ్రిత జనమున
ప్రకాశించువాఁడా!
ఓ యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! ఓ వారిజాక్షుఁడా! ఓ సుందరాంగుఁడా! నిన్ను చూచుచు
బ్రతుకుచున్నచో మాలో ప్రభ పెరుగును. శుభములనొసగు అక్షరుఁడా! ఓ నయ విభాసా! మమ్ములను నీవు చూచుచు
మాకు కనిపించుము. ఓ మన్మధ జనకా! నా మనసు చూచి నన్ను మనఁ జేయుము. నాకు రక్ష నీవే కదా. మహత్
పావనాంఘ్రివైన ఓ నృహరీ! నా మనసున నిన్నే నమ్మితిని. కలరవమయి వినిపించెడి ఓ కన్న తండ్రీ! ఓ సర్వ
తంత్రాత్మకా! నన్ను గారవమున చూడుము.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.