గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

15, సెప్టెంబర్ 2023, శుక్రవారం

ఉన్నావీవు హృదంతరాళమున .... శ్రీమన్నారాయణ శతకము .9వ పద్యము. రచన చింతా రామ కృష్ణారావు. గానం శ్రీమతి దోర్బల బాల సుజాత

జైశ్రీరామ్.

9. శా. ఉన్నావీవు హృదంతరాళమున స్నేహోదార సంపత్ప్రభన్,

బిన్నన్, నేఁ గనఁ జాలనయ్య నిను గోపీనాథ! యంతర్ముఖుం

డెన్నంజాలు నినున్, శుభాస్పదుఁడ! నీవే నాకు కన్పించు. శ్రీ

మన్నారాయణ పూజ్య పాద జలజా! మాం పాహి. సర్వేశ్వరా!

భావము.

శ్రీమన్నారాయణా! నీవు నా హృదంతరాళమున 

స్నేహోదార సంపత్ప్రభతో కొలువై యున్నావు.

నేను  చిన్నవాడిని. నిన్ను విధముగనూ నిన్ను చూచుటకు సరిపోను. 

అంతర్ముఖుఁడైనావాడి నిన్ను గుర్తించగలడు. శుభాస్పదుఁడా

నీవే నాకు కన్పించుము. పూజ్య పాదపద్మములుకలవాడా! సర్వేశ్వరా

నన్ను రక్షించుము

జైహింద్. 

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.