జైశ్రీరామ్.
2. శా. నిన్నున్నే ధర నెంచఁగాఁ దగుదునా? నీరేజపత్రేక్షణా!
పున్నామాదులనుండి కాచెదవుగా, పూజ్యుండ! నన్నెంచుచున్.
మన్నింతున్ మది నిన్ను నేను. గనుమా మర్యాదనే నిల్పి, శ్రీ
మన్నారాయణ! కావుమీజగతిఁ బ్రేమన్ మీ రమాసాధ్వితోన్.
భావము.
ఓ శ్రీమన్నారాయణా! ఓ పద్మనేత్రుఁడా! భూమిపై నిన్ను నేను
ఎంచుటకు సరిపోదునా? ఓ పూజ్యుఁడా! నన్ను గుర్తించుచు పున్నామాది
నరకముల నుండి మమ్ము కాపాడుదువు కదా. నిన్ను గుర్తించి నేను
గౌరవింతును. నామర్యాద నిలిపుచు, లోకమున ప్రేమతో కూడిన
దైవ గాథలతో నన్నుకాపాడుము.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.