గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

30, సెప్టెంబర్ 2013, సోమవారం

నేటి మేటి పద్యములు.13.

0 comments

జైశ్రీరామ్.
ప్రియ సహోదరీ సహోదరులారా!  మన ఆంధ్ర మాత కడుపార గన్న ముద్దు బిడ్డ యైన అభినవ వేమన మన నండూరి రామ కృష్ణమాచార్యుల వారు. వారి పద్యాలు సజ్జనులకు హృద్యాలు. సత్ కవి జన వేద్యాలు. పిల్లలకివి బోధ్యాలు.
మనం రోజుకొక్క పద్యమైనా చదివి కంఠస్థం చేయగలిగితే లోకజ్ఞానము, వివేకము తప్పక కలుగుతుందికాబట్టి  మనం రోజూ కొన్ని పద్యాలైనా నేర్చుకుంటే బాగుంటుందని మీముందు  ఉంచే ప్రయత్నం చేస్తున్నాను. నా అభిప్రాయమును మన్నించ గలరని ఆశిస్తున్నాను.
నేటి మేటి పద్యములు 13.
(సశేషం)
జైహింద్.

29, సెప్టెంబర్ 2013, ఆదివారం

నేటి మేటి పద్యములు. 12.

0 comments

జైశ్రీరామ్.
ప్రియ సహోదరీ సహోదరులారా!  మన ఆంధ్ర మాత కడుపార గన్న ముద్దు బిడ్డ యైన అభినవ వేమన మన నండూరి రామ కృష్ణమాచార్యుల వారు. వారి పద్యాలు సజ్జనులకు హృద్యాలు. సత్ కవి జన వేద్యాలు. పిల్లలకివి బోధ్యాలు.
మనం రోజుకొక్క పద్యమైనా చదివి కంఠస్థం చేయగలిగితే లోకజ్ఞానము, వివేకము తప్పక కలుగుతుందికాబట్టి  మనం రోజూ కొన్ని పద్యాలైనా నేర్చుకుంటే బాగుంటుందని మీముందు  ఉంచే ప్రయత్నం చేస్తున్నాను. నా అభిప్రాయమును మన్నించ గలరని ఆశిస్తున్నాను.
నేటి మేటి పద్యములు. 12.
(సశేషం)
జైహింద్.

28, సెప్టెంబర్ 2013, శనివారం

నేటి మేటి పద్యములు. 11.

0 comments

జైశ్రీరామ్.
ప్రియ సహోదరీ సహోదరులారా!  మన ఆంధ్ర మాత కడుపార గన్న ముద్దు బిడ్డ యైన అభినవ వేమన మన నండూరి రామ కృష్ణమాచార్యుల వారు. వారి పద్యాలు సజ్జనులకు హృద్యాలు. సత్ కవి జన వేద్యాలు. పిల్లలకివి బోధ్యాలు.
మనం రోజుకొక్క పద్యమైనా చదివి కంఠస్థం చేయగలిగితే లోకజ్ఞానము, వివేకము తప్పక కలుగుతుందికాబట్టి  మనం రోజూ కొన్ని పద్యాలైనా నేర్చుకుంటే బాగుంటుందని మీముందు  ఉంచే ప్రయత్నం చేస్తున్నాను. నా అభిప్రాయమును మన్నించ గలరని ఆశిస్తున్నాను.
నేటి మేటి పద్యములు. 11.
(సశేషం)
జైహింద్.

27, సెప్టెంబర్ 2013, శుక్రవారం

శ్రీ రాళ్ళబండి కవితా ప్రసాద్ కవితలో వారి స్నిగ్ధ సుకుమార హృదయావిష్కరణ.

2 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! డా. రాళ్ళబండి కవితా ప్రసాద్ సుకుమార సుందర సల్లలిత హృదయం వారి రచనలో మనకు గోచరమగుచుండుట గమనించగలరు.

కలుపు మొక్కలన్ని కలసి తీర్మానించె 
కలసి యుంద మంచు పొలము లోన 
ఒప్పుకున్న రైతు ముప్పుల పాలాయె 
కలతపడకు మిదియె కలియుగమ్ము!

నమ్మ బోకు నవ్వు ! నమ్మకు ఏడుపు ?
నమ్మబోకు మెపుడు నరుని మాట ! 
నటన జీవ లక్షణమ్మురా మనిషికి !
కలతపడకు మిదియెకలియుగమ్ము!

మనిషికన్నపెద్ద మాయామృగము లేదు 
ప్రేమ కన్న గాఢ విషము లేదు 
పెళ్ళి కన్న పెద్ద పెనులంపటము లేదు 
కలతపడకు మిదియె కలియుగమ్ము 

పక్షి యొకటి తనను పజరమ్ము న నుండి 
వెలికి పంపు మంచు వేడు కొనియె 
రెక్క విరిచి తలుపు రెక్కను తెరిచిరే !
కలతపడకు మిదియె కలియుగమ్ము !
శ్రీ రాళ్ళబండి కవితా ప్రసాద్

రాళ్ళబండి  కవిత రసరమ్య హృజ్జనిత
సత్య దివ్య తేజ సౌమ్య కలిత.
కనులఁ గట్ట వ్రాయు కవితా ప్రసాధనుం
డీ యుగాన నరుని మాయ తెలిపె

జైహింద్

నేటి మేటి పద్యములు. 10.

0 comments

జైశ్రీరామ్.
ప్రియ సహోదరీ సహోదరులారా!  మన ఆంధ్ర మాత కడుపార గన్న ముద్దు బిడ్డ యైన అభినవ వేమన మన నండూరి రామ కృష్ణమాచార్యుల వారు. వారి పద్యాలు సజ్జనులకు హృద్యాలు. సత్ కవి జన వేద్యాలు. పిల్లలకివి బోధ్యాలు.
మనం రోజుకొక్క పద్యమైనా చదివి కంఠస్థం చేయగలిగితే లోకజ్ఞానము, వివేకము తప్పక కలుగుతుందికాబట్టి  మనం రోజూ కొన్ని పద్యాలైనా నేర్చుకుంటే బాగుంటుందని మీముందు  ఉంచే ప్రయత్నం చేస్తున్నాను. నా అభిప్రాయమును మన్నించ గలరని ఆశిస్తున్నాను.
నేటి మేటి పద్యములు. 10.
(సశేషం)
జైహింద్.

26, సెప్టెంబర్ 2013, గురువారం

కవితావాల్లభ్యం (శ్రీ వల్లభవఝల వారి చిత్రబంధములపై అవధాన శారద అభిప్రాయం)

0 comments

జైశ్రీరామ్.
తెలుగు భాషామతల్లి ముద్దు బిడ్డలారా! శ్రీ వల్లభ లేబిల్ తో శ్రీ వల్లభవఝల అప్పల నరసింహమూర్తి కవి కృత చిత్ర బంధ కవితలు ప్రచురితమై ఉన్నాయి. ఈ కవితలపై అవధానశారద బిరుదాంకితులైన శ్రీ భద్రం వేణుగోపాలాచార్యులవారి అమూల్యమైన అభిప్రాయాన్ని ఇచ్చి యున్నారు. తిలకించండి.
శ్రీ వల్లభ లేబుల్ లో గల మన శ్రీ వల్లభవఝల వారి చిత్ర బంధ కవితలు తిలకించి మీ అమూల్యమైన అభిప్రాయాలను వ్యాఖ్యల ద్వారా మీరు పంప గలిగితే ముద్రణార్హమైన మీ అభిప్రాయాలను కూడా ఈ కవి ప్రచురింపబోవుచున్న పుస్థకములో ముద్రింప గలరని మనవి చేయుచున్నాను.
జైహింద్.

నేటి మేటి పద్యములు. 9.

0 comments

జైశ్రీరామ్.
ప్రియ సహోదరీ సహోదరులారా!  మన ఆంధ్ర మాత కడుపార గన్న ముద్దు బిడ్డ యైన అభినవ వేమన మన నండూరి రామ కృష్ణమాచార్యుల వారు. వారి పద్యాలు సజ్జనులకు హృద్యాలు. సత్ కవి జన వేద్యాలు. పిల్లలకివి బోధ్యాలు.
మనం రోజుకొక్క పద్యమైనా చదివి కంఠస్థం చేయగలిగితే లోకజ్ఞానము, వివేకము తప్పక కలుగుతుందికాబట్టి  మనం రోజూ కొన్ని పద్యాలైనా నేర్చుకుంటే బాగుంటుందని మీముందు  ఉంచే ప్రయత్నం చేస్తున్నాను. నా అభిప్రాయమును మన్నించ గలరని ఆశిస్తున్నాను.
నేటి మేటి పద్యములు. 9.

(సశేషం)
జైహింద్.

25, సెప్టెంబర్ 2013, బుధవారం

నేటి మేటి పద్యములు. 8.

3 comments

జైశ్రీరామ్.
ప్రియ సహోదరీ సహోదరులారా!  మన ఆంధ్ర మాత కడుపార గన్న ముద్దు బిడ్డ యైన అభినవ వేమన మన నండూరి రామ కృష్ణమాచార్యుల వారు. వారి పద్యాలు సజ్జనులకు హృద్యాలు. సత్ కవి జన వేద్యాలు. పిల్లలకివి బోధ్యాలు.
మనం రోజుకొక్క పద్యమైనా చదివి కంఠస్థం చేయగలిగితే లోకజ్ఞానము, వివేకము తప్పక కలుగుతుందికాబట్టి  మనం రోజూ కొన్ని పద్యాలైనా నేర్చుకుంటే బాగుంటుందని మీముందు  ఉంచే ప్రయత్నం చేస్తున్నాను. నా అభిప్రాయమును మన్నించ గలరని ఆశిస్తున్నాను.
నేటి మేటి పద్యములు. 8.
(సశేషం)
జైహింద్.

24, సెప్టెంబర్ 2013, మంగళవారం

నేటి మేటి పద్యములు. 7.

1 comments

జైశ్రీరామ్.
ప్రియ సహోదరీ సహోదరులారా!  మన ఆంధ్ర మాత కడుపార గన్న ముద్దు బిడ్డ యైన అభినవ వేమన మన నండూరి రామ కృష్ణమాచార్యుల వారు. వారి పద్యాలు సజ్జనులకు హృద్యాలు. సత్ కవి జన వేద్యాలు. పిల్లలకివి బోధ్యాలు.
మనం రోజుకొక్క పద్యమైనా చదివి కంఠస్థం చేయగలిగితే లోకజ్ఞానము, వివేకము తప్పక కలుగుతుందికాబట్టి  మనం రోజూ కొన్ని పద్యాలైనా నేర్చుకుంటే బాగుంటుందని మీముందు  ఉంచే ప్రయత్నం చేస్తున్నాను. నా అభిప్రాయమును మన్నించ గలరని ఆశిస్తున్నాను.
నేటి మేటి పద్యములు. 7.
(సశేషం)
జైహింద్.

23, సెప్టెంబర్ 2013, సోమవారం

నేటి మేటి పద్యములు. 6.

1 comments

జైశ్రీరామ్.
ప్రియ సహోదరీ సహోదరులారా!  మన ఆంధ్ర మాత కడుపార గన్న ముద్దు బిడ్డ యైన అభినవ వేమన మన నండూరి రామ కృష్ణమాచార్యుల వారు. వారి పద్యాలు సజ్జనులకు హృద్యాలు. సత్ కవి జన వేద్యాలు. పిల్లలకివి బోధ్యాలు.
మనం రోజుకొక్క పద్యమైనా చదివి కంఠస్థం చేయగలిగితే లోకజ్ఞానము, వివేకము తప్పక కలుగుతుందికాబట్టి  మనం రోజూ కొన్ని పద్యాలైనా నేర్చుకుంటే బాగుంటుందని మీముందు  ఉంచే ప్రయత్నం చేస్తున్నాను. నా అభిప్రాయమును మన్నించ గలరని ఆశిస్తున్నాను.
నేటి మేటి పద్యములు. 6.
(సశేషం)
జైహింద్.

22, సెప్టెంబర్ 2013, ఆదివారం

నేటి మేటి పద్యములు. 5.

1 comments

జైశ్రీరామ్.
ప్రియ సహోదరీ సహోదరులారా!  మన ఆంధ్ర మాత కడుపార గన్న ముద్దు బిడ్డ యైన అభినవ వేమన మన నండూరి రామ కృష్ణమాచార్యుల వారు. వారి పద్యాలు సజ్జనులకు హృద్యాలు. సత్ కవి జన వేద్యాలు. పిల్లలకివి బోధ్యాలు.
మనం రోజుకొక్క పద్యమైనా చదివి కంఠస్థం చేయగలిగితే లోకజ్ఞానము, వివేకము తప్పక కలుగుతుందికాబట్టి  మనం రోజూ కొన్ని పద్యాలైనా నేర్చుకుంటే బాగుంటుందని మీముందు  ఉంచే ప్రయత్నం చేస్తున్నాను. నా అభిప్రాయమును మన్నించ గలరని ఆశిస్తున్నాను.
నేటి మేటి పద్యములు. 5.
(సశేషం)
జైహింద్.

21, సెప్టెంబర్ 2013, శనివారం

నేటి మేటి పద్యములు.4.

1 comments

జైశ్రీరామ్.
ప్రియ సహోదరీ సహోదరులారా!  మన ఆంధ్ర మాత కడుపార గన్న ముద్దు బిడ్డ యైన అభినవ వేమన మన నండూరి రామ కృష్ణమాచార్యుల వారు. వారి పద్యాలు సజ్జనులకు హృద్యాలు. సత్ కవి జన వేద్యాలు. పిల్లలకివి బోధ్యాలు.
మనం రోజుకొక్క పద్యమైనా చదివి కంఠస్థం చేయగలిగితే లోకజ్ఞానము, వివేకము తప్పక కలుగుతుందికాబట్టి  మనం రోజూ కొన్ని పద్యాలైనా నేర్చుకుంటే బాగుంటుందని మీముందు  ఉంచే ప్రయత్నం చేస్తున్నాను. నా అభిప్రాయమును మన్నించ గలరని ఆశిస్తున్నాను.
నేటి మేటి పద్యములు. 4.
(సశేషం)
జైహింద్.

20, సెప్టెంబర్ 2013, శుక్రవారం

నేటి మేటి పద్యములు.3.

1 comments

జైశ్రీరామ్.
ప్రియ సహోదరీ సహోదరులారా!  మన ఆంధ్ర మాత కడుపార గన్న ముద్దు బిడ్డ యైన అభినవ వేమన మన నండూరి రామ కృష్ణమాచార్యుల వారు. వారి పద్యాలు సజ్జనులకు హృద్యాలు. సత్ కవి జన వేద్యాలు. పిల్లలకివి బోధ్యాలు.
మనం రోజుకొక్క పద్యమైనా చదివి కంఠస్థం చేయగలిగితే లోకజ్ఞానము, వివేకము తప్పక కలుగుతుందికాబట్టి  మనం రోజూ కొన్ని పద్యాలైనా నేర్చుకుంటే బాగుంటుందని మీముందు  ఉంచే ప్రయత్నం చేస్తున్నాను. నా అభిప్రాయమును మన్నించ గలరని ఆశిస్తున్నాను.
నేటి మేటి పద్యములు.3.

(సశేషం)
జైహింద్.

19, సెప్టెంబర్ 2013, గురువారం

నేటి మేటి పద్యములు.2.

1 comments

జైశ్రీరామ్.
ప్రియ సహోదరీ సహోదరులారా!  మన ఆంధ్ర మాత కడుపార గన్న ముద్దు బిడ్డ యైన అభినవ వేమన మన నండూరి రామ కృష్ణమాచార్యుల వారు. 
వారి పద్యాలు సజ్జనులకు హృద్యాలు. సత్ కవి జన వేద్యాలు. పిల్లలకివి బోధ్యాలు.
మనం రోజుకొక్క పద్యమైనా చదివి కంఠస్థం చేయగలిగితే లోకజ్ఞానము, వివేకము తప్పక కలుగుతుందికాబట్టి మనం రోజూ కొన్ని పద్యాలైనా నేర్చుకుంటే బాగుంటుందని మీముందు  ఉంచే ప్రయత్నం చేస్తున్నాను. నా అభిప్రాయమును మన్నించ గలరని ఆశిస్తున్నాను.

నేటి మేటి పద్యములు.2.

6) అరసి వేయ దగును అపరాధ సుంకమ్ము  -  పావు గంట దాటు వక్తపైన.
ధనమునపహరించు మనుజుడే దొంగయా?  -  కాన రాని దొంగ కాల హర్త.

7) అసలు నిజము చెప్పి అది కల్పనా కథ  -  యనెడు భ్రాంతిగొల్పునతడు సుకవి.
అసలు సత్యమాడి అఎది నిజమ్మను భ్రాంతి  -  గొలుప గలుగు వాడు గొప్ప నటుడు.

8) అందమైన పూల ఆయుస్సు అల్పంబు  -  ఉండు శాశ్వితముగ బండ రాళ్ళు  
సృష్టి కర్త కూడ సిద్ధ హస్తుడు కాదు  -  విశ్వ శిల్పమందు వెలితి గలదు.

9) అచ్చమైన సత్య మాశ్చర్యమును గొల్పు.  -  కలల కంటె కట్టు కథల కంటె.
జంక కుండ నగ్న సత్యమ్ము వచియింప  -  అద్భుతమనిపించు అవనికెల్ల.

10) అస్తమించు సూర్యుడడిగె దర్పమ్ముతో  -  ఎవ్వరింక వెలుగునిచ్చెదరని.
ఓపినంత వరకుఉన్నాననెను ప్రమిద  -  రమ్య హాస లోల రామ కృష్ణ. 

(సశేషం)
జైహింద్.

18, సెప్టెంబర్ 2013, బుధవారం

నేటి మేటి పద్యములు.1.

2 comments

జైశ్రీరామ్.
ప్రియ సహోదరీ సహోదరులారా!  మన ఆంధ్ర మాత కడుపార గన్న ముద్దు బిడ్డ యైన అభినవ వేమన మన నండూరి రామ కృష్ణమాచార్యుల వారు. 
వారి పద్యాలు సజ్జనులకు హృద్యాలు. సత్ కవి జన వేద్యాలు. పిల్లలకివి బోధ్యాలు.
మనం రోజుకొక్క పద్యమైనా చదివి కంఠస్థం చేయగలిగితే లోకజ్ఞానము, వివేకము తప్పక కలుగుతుందికాబట్టి .
మనం రోజూ కొన్ని పద్యాలైనా నేర్చుకుంటే బాగుంటుందని మీముందు  ఉంచే ప్రయత్నం చేస్తున్నాను. నా అభిప్రాయమును మన్నించ గలరని ఆశిస్తున్నాను.

నేటి మేటి పద్యములు.1.

1) అచ్చమైన కవిత ఆచు వేయక ముందె  -  నాట్యమాడు ప్రజల నాల్కలందు.
ఘన కవనము తరచు గ్రంథాలయాలలో  -  గాఢ నిద్ర పోవు కనులు మూసి.

2) అచ్చమైన ప్రతిభ అవకాశములు లేక  -  రక్తి కట్టబోదు బ్రతుకు లోన.
అడవి వెన్నెల సిరి, అబ్దిలో రత్నాలు  -  ఎవరి కుపకరించు అవని లోన.

3) అరసి ఎవడు చేయు ఆర్త రోగికి సేవ?  -  ఎవడు దానమిచ్చు ఎఱిగి పాత్రు?
సత్య మెవడు చాటు సాక్షియై తెగువతో  -  ధరణి మీద అతడు ధార్మికుండు.

4) అరుగుదెంచె సభకు అధిక పాఠము వోలె  -  అతని పేరు లేదు అచ్చులోన.
గ్రంథ కర్తమీద గౌరవంబది హెచ్చె  -  వచ్చె శోభ అతని వలన సభకు.

5) అందగత్తెయైన అమ్మాయి గావచ్చు.  -  అద్దమొక్కటామె కవసరంబు.
తెలివితేటలున్న తేజస్వి కావచ్చు  -  ఉండవలెను స్నేహితుం డొకండు. 

(సశేషం)
జైహింద్.

17, సెప్టెంబర్ 2013, మంగళవారం

శ్రీ వల్లభవఝల వారి కుండలి నాగ బంధ వనమంజరి.

1 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్రీ వల్లభ వఝల కవి కృత కుండలి నాగ బంధ వనమంజరిని తిలకించండి.
చిత్రకవికి అభినందనలు.
జైహింద్.

9, సెప్టెంబర్ 2013, సోమవారం

శ్రీ దువ్వూరి సుబ్బారావు గారు గణపతికి చేసిన కవితామృతాభిషేకం7.

3 comments

జైశ్రీరామ్.
భగవద్బంధువులారా! వినాయక చతుర్హి సందర్భముగా మీ అందరికీ నా శుభాకాంక్షలు.
మన మిత్రులు శ్రీ దువ్వూరి సుబ్బారావుగారు గణపతికి చేసిన కవితామృతాభిషేకం తిలకించండి.

శ్రీ విఘ్నేశ! వినాయకా! గజముఖా! శ్రీ పార్వతీనందనా! 
భావింపందగు నన్ని కార్యములలో ప్రారంభమందున్ నినున్!
రావే విఘ్నము లెందునన్, కొలువ దూర్వారమ్ములన్, నిత్యమున్,
భావిన్ మంచి శుభమ్ము, కీర్తి గలుగున్ ప్రార్థించ నిన్ భక్తితో.

భాద్రపదమ్మున చవితిని
భద్రేభముఖున్ భజింప భక్తిని సర్వుల్
భద్రంబగు, రావు దరి యు-
పద్రవములు విఘ్ననాధు పటుతర కృపచే.

కొల్తును నే గజవక్త్రుని,
కొల్తును నే గౌరిసుతుని, కొల్తును దంతున్,
కొల్తును నే విఘ్నేశ్వరు,
కొల్తును నే భక్తితోడ కొల్తును సతమున్.

వరములనిమ్మా గణపతి!
కరిముఖ! గౌరీకుమార! కల్పోక్త విధిన్
కరమొప్ప భక్తి మనమున
వరదా యని పూజ సేతు పత్రిని, పూలన్.

గణనాథున్ భజియింపరే సతతమున్ గల్గున్ గదా సంపదల్!
వణకున్ విఘ్నము లెల్ల విఘ్నపతిఁ సంభావింపగా, దేవతా
గణముల్, యక్షులు, రాక్షసప్రభృతు లేకార్యమ్ము చేపట్టినన్
ప్రణతుల్ జేతురు దొల్త దంతిముఖునిన్ ప్రార్థించి సఛ్ఛ్రీలకై.

ఆర్యులకు ప్రణామములతో:
మిస్సన్న.

శ్రీ దువ్వూరి కులాబ్ధి చంద్రులగు యీ శ్రీ సుబ్బ రావిట్లు స
మ్మోదంబున్ ప్రకటించి పద్య తతితో ముద్దార నీ ధ్యానమున్
బోధన్ పెంచిరి భక్త పాళి కెదలన్. పుణ్యాత్ము నీ సత్కవిన్
నీ ధాతృత్వము తోడ కావుము సదా! నిర్విఘ్నకర్తా!కృపన్.

శ్రీ మిస్సన్న గారికి అభినందనలు, వినాయక చతుర్థి శుభాకాంక్షలు, ధన్యవాదములు.
జైహింద్.

వినాయక చతుర్హి సందర్భముగా ఆంధ్రామృత పాఠకు లందరికీ శుభాకాంక్షలు.

1 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! పుణ్య సంపన్నులారా! అపురూపమైన శ్రీ వరసిద్ధి వినాయక చతుర్థి మన ముంగిళ్ళకు ఆ మూషిక వాహనుని తీసుకు వచ్చిన శుభ దినమీనాడు. ఎంతటి ఆనంద ప్రదమీ పండుగ మనకు! ఇట్టి మహోత్కృష్టమైన  యీ పండుగ సందర్భముగా యావజ్జనావళికి శుభాకాంక్షలు. ఆ గణపతి అపురూపమైన శుభాశీస్సులు మీ అందరికీ లభించు గాక అని మనసారా ఆ స్వామిని ప్రార్థించుచున్నాను.
పరమ దయాపరా! శుభద! పార్వతి నందన! విఘ్న నాయకా.
కరుణను కావుమయ్య, వర కామ్యద! భక్తుల నెల్ల వేళలన్.
ధరణికి భారమైన దురితత్వము బాపుమ దుష్ట సంహతిన్
మరలిచి మంచిగా, సుగుణ మాన్యుల జేసి, శుభంబు కూర్చుమా.
నిను గని, పూజ చేసి, యను నిత్యము సమ్మతి మెల్గు భక్తులన్
కనుమయ. సన్మహోన్నతిని గాంచగ చేయుమ. విఘ్న రాజ! స
ద్వినయము తోడ మ్రొక్కెదను. దివ్య కవిత్వ పటుత్వ మిచ్చి, స
జ్జనులకు మేలు చేయు కృతి చక్కగ వ్రాయగ జేయుమా కృపన్.
గుణ గణులైన పెద్దలకు, కోవిద పాళికి, కమ్మనైన స
న్మనమున నొప్పు తల్లులకు, మంజులవాఙ్మహనీయ సాధు స
ద్గుణమణులెల్లవారలకు, తోడుగ నుండుమ విఘ్న రాజ! మా
కనయము  నీడగా నిలిచి, హాయిగ వర్ధిల జేయ వేడెదన్.
వినాయక చతుర్థి శుభాకాంక్షలతో
చింతా రామ కృష్ణా రావు.
జైహింద్.

8, సెప్టెంబర్ 2013, ఆదివారం

డా. అనిల్ కుమార్ గారు గణపతికి చేసిన కవితామృతాభిషేకం6.

2 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! డా.మాడుగుల అనిల్ కుమార్ గారు గణపతికి చేసిన కవితామృతాభిషేకం (శ్రీ మహాగణేశ పంచ రత్నములు)తిలకించండి. పఠించి పులకించండి.

కం. బొజ్జంతయు విద్యలయి జ
గజ్జననికి పుత్రుడౌచు గణముల పతియై 
సజ్జనులనేలుచుండెడు 
గుజ్జగు రూపుని వినాయకుని ప్రార్థింతున్ II

కం. భగవంతుండొక్కండే
జగమన్నదియొక్కటే ప్రశస్తంబెన్నన్.
తగవులవేలా వేర్పడ 
నగజాసుత ! అవధరించి యార్పుము పగలన్ II

కం. వినదగునని పెద్ద చెవుల 
ననదగదని తొండమందునణచిన నోటన్ 
కొనియాడ సూక్ష్మ దృక్కుల 
ఘనముగ దాల్చిన వినాయకా నిను గొల్తున్ II

కం. ఘ్రాణేంద్రియమోంకారము
రాణింపగ పార్వతీశ్వర వినుత సుతుడై 
ప్రాణప్రదుడైన జగత్ 
త్రాణున్ భగవంతునేకదంతుని గొలుతున్ II 

కం. కొమ్మా పార్వతినందన ! 
సమ్మతమగు భక్తియుక్త సంస్తుతులన్ నీ 
విమ్మగు విద్యలనిమ్మా 
రమ్మా బెణకయ్య కావ ప్రార్థింప నినున్ II

ఓం తత్సత్
అష్టావధాని డా.మాడుగుల అనిల్ కుమార్. తిరుపతి.

కం. సుందరమగు మాడ్గుల కృత
కందంబులనందుమయ్య! గణ నాయక! హృ
న్మందిరమున వసియించుచు
ముందుకు నడిపింపుమితని పూజ్య పథమునన్.

డా. మాడుగుల అనిల్ కుమార్ అవధాని శేఖరులకు అభినందన పూర్వక ధన్యవాదములు.
జైహింద్.

7, సెప్టెంబర్ 2013, శనివారం

శ్రీ టీ.శ్యామల రావు గారు గణపతికి చేసిన కవితామృతాభిషేకం 5.

2 comments

జైశ్రీరామ్.

ఆర్యులారా! శ్రీ టీ.శ్యామల రావు గారు  విఘ్నేశ్వరునుద్దేశించి చేసిన సరసపద సంకీర్తనం చూడండి

( సరసపద పద్య లక్షణాలు )

శ్రీవిఘ్నరాజ రావయ్య నీకు చేసెదము మంచి పూజ
సర్వజ్ఞ నిన్ను నమ్మి యున్నాము స్వాగతమ్మో మహాత్మ

చంద్రేంద్రవిష్ణువంద్యప్రభావ సర్వార్తినాశచరణ
సంతోషపూర్ణ సోమార్కఘంట సద్భక్తలోకవరద

ప్రమధగణనాథ భక్తజనపాల పాపసంతాపనచణ
విఘ్నాంధకారభాస్వంత సకలవిద్యాప్రదాననిపుణ

ఓ వారణాస్య ఓ యేకదంత ఓ శశివిరోధి రావె
ఓ బొజ్జదేవరా సూర్యతేజ ఓ గణపతయ్య రావె

మారేడు పత్రి నెలవంక పత్రి నేరేడు పత్రి దెచ్చి
అశ్వత్థ పత్రి కరవీర పత్రి యని చాల పత్రి దెచ్చి

పత్రంబు లేక వింశతిని తెచ్చి పరమోత్సవముగ నిన్ను
పూజించుకొనగ వేచితిమి శంభుపుత్ర విచ్చేయ వయ్య

కస్తూరి గంధములు దెచ్చి నాము కరివదన వేగ రావె
పూజింప నిన్ను వివిధంబు లైన పూవులును దెచ్చి నాము

జిల్లేడుకాయ లుండ్రాళ్ళు నీకు కొల్లలుగ నిత్తు మయ్య
బెల్లంబు పాలతాలికలు చాల పెట్టెదము గణపతయ్య

ఈ ముద్దపప్పు ఈ మంచి నెయ్యి ఈ గడ్డపెరుగు చూడు
ఇవియెల్ల నీకు నైవేద్యమయ్య ఇక జాగు చేయ కయ్య

ఖర్జూర ద్రాక్ష దానిమ్మ పనస కదళీ ఫలంబు లివిగొ
హాయిగా వచ్చి విందారగించి ఆశీర్వదించ వయ్య

ఆనందపడుచు అమితప్రభావ హారతుల నిచ్చి నిన్ను
వేనోళ్ళ పొగడు భాగ్యమ్ము కొఱకు వేచితిమి నేడు తండ్రి.

టీ.శ్యామల రావు.

శ్యామల రావు సత్కవి ప్రశస్తముగా పద కీర్తనంబుతో
ప్రేమగ నిన్నుఁ గొల్చెనయ! ప్రీతిగ బ్రోచెడి మా గణాధిపా!
ధీ మహిత్ముఁడౌ సుగుణ తేజుని, శ్యామ రావుసత్ కవిన్
ప్రేమను జూచి బ్రోవుమయ శ్రీ శివ మానస పుత్రుఁడా! సదా.
శ్రీశ్యామలరావు కవీ! ధన్యవాదములు.
జైహింద్.

శ్రీ గొర్తి బాలసుబ్రహ్మణ్యం గారు గణపతికి చేసిన కవితామృతాభిషేకం4

0 comments

జైశ్రీరామ్.
గుణ శేఖరులారా! శ్రీ గొర్తి బాలసుబ్రహ్మణ్యం (చార్టెడ్ ఆక్కౌంటెంట్) వ్రాసిన “ గణపతి” గణపా! మకుట శతకమునందలి నవ కంద ప్రసూన సౌరభమునాఘ్రాణించండి.

౧. శ్రీకర! శుభకర మూర్తీ!
ప్రాకటముగ విద్యలిచ్చి పదవుల నిడుమా!
వేకువ నిన్నెద గొలుతును
చేకొని దీవింపుమయ్య శివనుత గణపా!

౨. విద్యల నేర్పుట నేర్చిన
విద్యల కిలవేల్పు! దేవ! విహిత పథమ్మునన్
హృద్యముగా నివసించుచు
సద్యోజాతాది రూప! సాకుము గణపా!

౩. వ్రాసెద కైతలు ముదమున
భాసిల్లెడి భవుకతను భారతి కృప, నా
ధ్యాసను నిరతము గల్గగ
న్యాసమునన్ నన్నుగూడి నడుపుము గణపా!

౪. కర్మల సలుపుచు ధరణిని 
శర్మదమౌ నీదు చరణ సంస్తుతి జేయన్
మర్మము నీవే చెప్పుము
నిర్మలమౌ యెదను గూర్చి నిత్యము గణపా!

౫. బ్రాహ్మీ సుముహూర్తంబున
బ్రహ్మీభూతంపు శక్తి ప్రార్థన జేయన్
బ్రహ్మీ భావము నెలకొన 
బ్రాహ్మీ రూపంబునిమ్ము పాయక గణపా!

౬. శరణంటి యీశ నందన
శరణంటిని పాదమంటి శక్తి కుమారా!
శరణంటి కుమారానుజ!
శరణంటిని విఘ్నరాజ! సాకుము గణపా!

౭. మూలాధారాధిష్టిత!
శైలాధిప తనయ పుత్ర! సామజ వదనా!
లీలా కల్పిత వేషా!
వాలాయము నిన్ను గొల్చు వాడను గణపా!

౮. ఆగమ నియమాదులచే
యోగుల హృద్ధ్యానములను యోగీశ్వరుగా
వేగమె నుతులందెడి నిన్
సాగిలి నతులిడుచు గొల్వ జాలను గణపా!

౯. తరుణారుణ పద యుగళా!
కరుణామయ! విఘ్నరాజ! కామిత ఫలదా!
ధరణీధర పుత్రీ సుత!
కరి రాణ్ముఖ! కాంచుమయ్య కరుణను గణపా!.
గొర్తి బాలసుబ్రహ్మణ్యం.

నవ రత్నంబుల నర్ధి నిన్ను కొలిచెం ధన్యాత్ముఁడౌ గొర్తి సం
స్తవనీయుండగు పుణ్య మూర్తి. సుగుణాధారా! గణేశా! కృపన్
జవ సత్వంబులు, భవ్య సంపదలు, ధీశక్తిన్, మహద్భక్తియున్,
శివ పుత్రా! కలిగించి బ్రోవుమెపుడున్.  శ్రీపార్వతీ నందనా!
శ్రీ గొర్తి కవి వరునకు, ఈ పద్యములనందించిన తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారికి ధన్యవాదములు.
జైహింద్.

శ్ర్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారు గణపతికి చేసిన కవితామృతాభిషేకం.౩

0 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్ర్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గణపతికి చేసిన కవితామృతాభిషేకం తిలకించండి.
మహాక్కర.
పార్వతీ నందనా! హే గణేశా! కృపాకరా! మూషికవాహనా! హే
సర్వ దేవతా పూజిత ద్విదేహ శంకర తనయా! హజాననా! హే
సర్వ విఘ్న విదూర విఘ్నేశ్వరా! సకల పూజాదులన్ ప్రథమ పూజ్యా!
సర్వ కాలంబులన్ మమ్ము కావుమా! సకల విద్యాబుద్ధు లిడి బ్రోవుమా!
తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ.
తోపెల్ల వంశ సత్కవి
దీపించు మహాక్కరంబు దివ్యుఁడ! నీపై
నీపగిది వ్రాసి పంపిరి.
ప్రాపుగ నిలు మతని కీవు. భక్త సులభుఁడా.
తోపెల్ల సుకవికి ధన్యవాదములు.
జైహింద్.

శ్రీ వర ప్రసాద్ గారు గణపతికి చేసిన కవితామృతాభిషేకం 2

1 comments

జైశ్రీరామ్.

ఆర్యులారా! శ్రీ వర ప్రసాద్ గారు తన సహజ ధారా కవితామృతంతో మన వరసిద్ధి వినాయకుని అభిషేకించిన విధం చూడండి.

మూషిక వాహన!దేవ!మునిజన స్తుత్య సద్భావ!
ద్వేష రాగాది విహీన!దీవ్యద్వివేక నిధాన!

పోషిత పరిజన బృంద!పుణ్యైక కంద!సానంద!
దోష వినాశ!గణేశ!స్తోత్రమ్మొనర్తు విఘ్నేశ! 

అద్రిసుతాత్మజ!గణప!అనవద్య చరిత!విఘ్నేశ!
భద్ర గజానన!గణప!భవభయనాశ!విఘ్నేశ!
సద్రూప వైభవ!గణప!సద్భక్త వినుత! విఘ్నేశ!
భద్రగుణాకర!గణప!ప్రమథ గణేశ!విఘ్నేశ! 

అగ్రగణ్యా!మహాకాయ!ఆరోగ్యమిమ్ము విఘ్నేశ!
అగ్రపూజ్యా!మహానంద!ఆనందమిమ్ము విఘ్నేశ!
అగ్రనాయక!మహైశ్వర్య!ఐశ్వర్యమిమ్ము విఘ్నేశ!
అగ్రణీ!కవిలోక వంద్య!ఆశ్రిత రక్ష!విఘ్నేశ!

కరావలంబమిచ్చు దివ్య కాయ! ఓ వినాయకా!
వరప్రసాదు సత్ కవిత్వ  వర్ష మమృతంబుగా
స్వరాభిహేకమై తనర్చ సత్వరంబె చేసె. నీ
వరాళితో వరప్రసాదు వర్ధనంబు గొల్పుమా!
వరప్రసాదు గారికి ధన్యవాదములు.
జైహింద్.