జైశ్రీరామ్.
106. ఓం సర్వాత్మనే నమః.
పంక్తి వృత్త గర్భ సీసము.
శ్రీనరసింహుఁడ! చిత్తములోపలన్ - చిత్ప్రకాశమ్ముగా చెలఁగుటకును
జ్ఞానముఁ గొల్పగ కల్గుమికన్, నినున్ - భావనఁ జేయుచు పరవశించి
ధ్యానముతోడ నహర్నిశలున్ మధు - రార్ద్రతతోడను నమలినమతిఁ
బ్రాణముగా కని వర్ధిలుదున్. దయ - చూడుమ నా మది శోభిలుమయ.
గీ. పంక్తి గర్భ సుసీసస్థ! పావనాంఘ్రి! - రామ కృష్ణుండ *సర్వాత్మ*! రక్షవీవె.
భక్త జన పోష! భవశోష! పాపనాశ! - శ్రితజనోద్భాస! యాదాద్రి శ్రీనృసింహ!
106వ సీస గర్భస్థ పంక్తి. (భ భ భ గ .. యతి 7)
శ్రీనరసింహుఁడ! చిత్తములో - జ్ఞానముఁ గొల్పగ కల్గుమికన్
ధ్యానముతోడ నహర్నిశలున్ - బ్రాణముగా కని వర్ధిలుదున్.
భావము.
భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా!
ఆశ్రిత జనమున
ప్రకాశించువాఁడా!
ఓ యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! చిత్తములో చిత్తేజముతో చెలగుట కొఱకుమాకు జ్ఞానము
ప్రసాదించుటకై నీవు మాకు కలుగుము. నిన్ను భావించుచు, పరవశించుచు, రాత్రింబవళ్ళు ధ్యానముతో తీయనైన
ఆర్ద్రమనస్సుతో
నిన్ను ప్రాణప్రదముగా కని వర్ధిల్లుదును. .దయచూడుము!. నా మదిని శోభిల్లుము. పంక్తివృత్తగర్భ
సీసపద్యమునప్రకాశించువాఁడా! ఓ సర్వాత్మా! నేను చింతా రామకృష్ణారావును. నాకు రక్ష నీవే సుమా.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.