గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

16, సెప్టెంబర్ 2023, శనివారం

శ్రీ బండకాడ అంజయ్యావధాని ఆలపించిన నా రచన... లలితా శ్రీ చంద్రమౌళీశ్వరా శతకము.

 

జైశ్రీరామ్.

ఎంతో భక్తి భావంతో నేను ఒక్కరోజులో వ్రాసిన 
లలితాశ్రీచంద్రమౌళీశ్వరా శతకమును 
అరగంటలో ఏకధాటిని పఠించిన 
అవధానివరేణ్యుఁడు శ్రీ బండకాడ అంజయ్యకు 
నా సంతోషాన్ని తెలియఁజేస్తున్నాను.

ఉ.  అంజనిపుత్ర! కావుమిల నద్భుత భక్త వరేణ్యు బండకా
డంజయ సద్వధానివరు నద్భుత గాత్రుని, ప్రేమతోడ నీ
కంజలి చేసెదన్, వరమహాకవి పాడిరి పద్యమాల, దు
ర్భంజన! నీవె సంతతము భక్తులఁ గాచెడి దైవమిద్ధరన్.

జైహింద్.


 

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.