గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

15, సెప్టెంబర్ 2023, శుక్రవారం

కన్నారన్ గనఁబోవ నిన్నుఁ, శ్రీమన్నారాయణ శతకము 96వ పద్యము .. రచన .. చింతా రామకృష్ణారావు. గానము .. శ్రీ దాసుగారు.

 

జైశ్రీరామ్.

96. శా. కన్నారన్ గనఁబోవ నిన్నుఁ, గలుగున్ గన్నీరు మున్నీరునై,

యన్నన్నా కనుటెట్లు నిన్ను? మహనీయానందమెట్లబ్బు? నీ

కన్నన్ గాంచగనెవ్వడుండు జగతిన్? గాంక్షింతు నిన్గాంచ. శ్రీ

మన్నారాయణ! కన్నులన్ వెలుగుమా. మా మానసంబెంచుమా.

భావము.

ఓ శ్రీమన్నారాయణా! నిన్ను కనుల నిండుగా చూడబోవ 

కన్నీరు మున్నీరగునుఅయ్యయ్యో. నిన్ను

మరి యే విధముగా చూడనగును

నిన్ను చూచుట వలన కలిగెడిమహదానందమేవిధముగా

లభించును? సృష్టిలో చూడదగువారు నీకన్నా ఎవరుందురు?

నిన్ను చూడ వలెననికోరుకొందును. మా మనసు గ్రహించుము

మా కన్నులలోవెలుగుము.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.