జైశ్రీరామ్.
57. ఓం వనమాలినే నమః
ద్విరదగతి రగడ ద్వయ గర్భ సీసము.
నరసింహ! పరమాత్మ! ననుఁ గావఁగా రావ? - యాదాద్రి వాసా! జయంబు నీవ.
నరహరీ! నన్ గృపన్ నడిపింపఁగాలేవ? - నారాయణా! నీవె నన్నుఁ గనవ?
కరుణార్ద్ర హృదయ! నన్ గాపాడఁగాలేవ? - ధరనేలు తండ్రివే దయను కనవ?
భరమొకో ననుఁ గావ వరద చిన్మయ దేవ? - సాష్టాంగ ప్రణుతులు సత్యదేవ!
గీ. రగడ గర్భిత సీస పరంతపుండ! - రార *వనమాలి*! సత్కృతిన్ జేర రమ్ము.
భక్త జన పోష! భవశోష! పాపనాశ! - శ్రితజనోద్భాస! యాదాద్రి శ్రీనృసింహ!
57వ సీస గర్భస్థ ద్విరదగతి రగడ ద్వయము. (ద్విరదగతి రగడ - 2 పాదములు. ప్రాస, అంత్య
ప్రాస నియమం కలదు. ప్రతి పాదమునందు 5 మాత్రలు గణములు 4 ఉండును.
యతి 3వ గణము 1వఅక్షరము)
1.నరసింహ! పరమాత్మ ననుఁగావఁగా రావ?
నరహరీ! నన్ గృపన్ నడిపింపఁగాలేవ?
2.కరుణార్ద్ర హృదయ! నన్ గాపాడఁగాలేవ?
భరమొకో ననుఁ గావ వరద చిన్మయ దేవ?
భావము.
భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా!
ఆశ్రిత జనమున
ప్రకాశించువాఁడా!
ఓ యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా ! నన్ను కాపాడుటకు రావా? నీవు విజయ స్వరూపుడవే కదా,
నన్ను నడపలేవా? ఓ నారాయణా నన్ను చూడవా? ఓ కరుణాంరతంగా! నన్ను కాపాడలేవా నీవు? ఈ ధరనే పాలించు
తండ్రివి కదా, నన్ను దయతో చూడలేవా? ఓ వరప్రదుఁడా! నన్ను కాపాడుట నీకు భారమా? నీకు సాష్టాంగ
ప్రణామములు.. రగడను గర్భమునందు కలిగిన సీస పద్యముననుండు పరంతపా! ఓ వనమాలీ కృపతో ఈ కృతిని
వసింప రమ్ము.?
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.